🫦SEX ని ఒక పాపంగా మార్చిందెవరు? దీని వెనకున్న అసలు కుట్ర ఇదే | Anukula Vedam || Telugu Podcast
https://m.youtube.com/watch?v=nh9QC6SvzAM
[00:00:04] మనిషికి ఒక అద్భుతమైన టాలెంట్ ఉంది. ఏమీ లేని చోట సమస్యను సృష్టించి, ఉన్న దాన్ని
[00:00:11] నరకంగా మార్చేసుకోవడం. మనకి దేవుడు ఒక సమస్య, ప్రేమ ఒక సమస్య,
[00:00:16] సమాజం ఒక సమస్య, సెక్స్ కూడా ఒక సమస్య. నువ్వు దేవుడ్ని సమస్య చేసావ్, వాడిని వెతకలేక.
[00:00:23] నువ్వు ప్రేమను సమస్య చేసావ్, దాన్ని పొందలేక. నువ్వు సెక్స్ ని సమస్య చేసావ్,
[00:00:28] దాన్ని అనుభవించలేక. అయితే అన్ని సమస్యల్లోకెల్లా ఒక్క సెక్స్ మాత్రమే
[00:00:34] ఎందుకు అంత పెద్ద సమస్యగా మారిందో తెలుసా? ఎందుకంటే మనిషిని బానిసగా మార్చాలంటే
[00:00:41] వాడిలో ఉన్న శక్తిని చంపేయాలి. మరి మనిషిలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఎనర్జీ
[00:00:46] ఏదో తెలుసా? సెక్స్ ఎనర్జీ. నువ్వు ఒక చెట్టుకున్న కొమ్మలు నరికితే అది మళ్ళీ
[00:00:52] పెరుగుతుంది. కానీ దాని వేరుల్లో విషం పోస్తే, ఆ చెట్టు చచ్చిపోతుంది లేదా
[00:00:58] వికృతంగా తయారవుతుంది. కొన్ని వేల సంవత్సరాలుగా నీ మతాలు, నీ సమాజం, నీ నీతి
[00:01:03] నియమాలు చేసింది ఇదే. వాళ్ళు నీ మూలాల్లో విషం పోసారు. నిన్ను పుట్టించిన
[00:01:09] ప్రక్రియనే పాపం అని నీ మెదడులో ముద్ర వేశారు. ఆలోచించు, నువ్వు పుట్టిందే సెక్స్
[00:01:16] వల్ల, కానీ సెక్స్ గురించి మాట్లాడడం తప్పు. సెక్స్ చేయడం తప్పు. అంటే నీ ఉనికి ఒక పాపం
[00:01:22] నుండి పుట్టిందా? నువ్వు ఒక పాపపు ఉత్పత్తివి అని నిన్ను
[00:01:27] నువ్వే అసహ్యించుకునేలా చేశారు. అందుకే అది నీకు ఒక పెద్ద సమస్యగా మారుతుంది. మనకి
[00:01:33] సెక్స్ అనేది అత్యున్నత ఆనందాన్ని ఇస్తుంది. క్షణకాలం పాటు నీ
[00:01:40] "నేను" అనే అహంకారాన్ని మాయం చేసి నిన్ను శూన్యంలో కలుపుతుంది. అండ్ సమాజానికి ఇది
[00:01:46] ఇష్టం లేదు. నీకు ఆనందం సెక్స్ లో దొరికేస్తే నువ్వు గుడికి ఎందుకు వెళ్తావు?
[00:01:50] నువ్వు సంతృప్తిగా ఉంటే మార్కెట్లో వస్తువులు ఎందుకు కొంటావు? నువ్వు ఆనందంగా
[00:01:53] ఉంటే రాజకీయ నాయకుడి మాట ఎందుకు వింటావు? నీ అసంతృప్తే వాళ్ళ పెట్టుబడి.
[00:02:00] Your Frustration is their Investment. అందుకే వాళ్ళు సెక్స్ ని ఒక దెయ్యంలా
[00:02:05] చూపించారు. ఇది ముట్టుకుంటే నరకానికి పోతావు అని భయపెట్టారు. అండ్ నువ్వు
[00:02:10] భయపడ్డావ్. అందుకే అది సమస్య అయింది. దీని గురించి నీ బుర్రకి ఎప్పుడూ తట్టని ఇంకో
[00:02:15] లాజిక్ ఏంటో చెప్పనా? నువ్వు దేన్నైతే బలవంతంగా అణచివేస్తావో అదే నీ మెదడుని
[00:02:21] ఆక్రమించేస్తుంది. సమాజం మనకి ఏం నేర్పింది? సెక్స్ తప్పు, అది పాపం, అది
[00:02:27] కేవలం పిల్లల్ని కనడానికి మాత్రమే అని చెప్పింది. వినడానికి చాలా గొప్పగా ఉంది
[00:02:32] కదా! కానీ నిజం చెప్పండి, మనమందరం పుట్టింది ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి ఊడిపడ్డామా?
[00:02:38] లేదు కదా. ఏ చర్యనైతే సమాజం అయ్యో తప్పు, అసహ్యం అని అంటుందో, అదే చర్య నుంచి నువ్వు,
[00:02:46] నేను, మనందరం పుట్టాం. కారణం అసహ్యమైనప్పుడు
[00:02:50] దాని నుంచి వచ్చిన ఫలితం మాత్రం పవిత్రం ఎలా అయిపోతుంది? ఎందుకంటే మనమంతా కూడా ఆ
[00:02:55] కారణం నుంచి వచ్చిన ఫలితాలమే కదా. మన ఉనికికి ఏదైతే కారణమో దాన్నే
[00:03:01] అసహ్యించుకుంటూ బ్రతకడం వల్ల మనిషి, లోపల రెండు ముక్కలు అయిపోయాడు. ఒకడు బయటకి
[00:03:07] కనిపించే నీతిమంతుడు, ఇంకొకడు లోపల రగిలిపోతున్న జంతువు. అసలు సెక్స్
[00:03:13] అనేదాన్ని ఒక ప్రాబ్లం గా ఎందుకు మార్చారో తెలుసా? సింపుల్, మిమ్మల్ని కంట్రోల్
[00:03:19] చేయడానికి. మనిషిలో ఉన్న అత్యంత పవర్ఫుల్ ఎనర్జీ సెక్స్ ఎనర్జీ. అది సృష్టికే మూలం.
[00:03:27] ఒకవేళ మనిషి ఆ ఎనర్జీని ఫ్రీగా నాచురల్ గా ఆనందంగా అనుభవించేస్తూ ఉంటే. వాడు ఇంక
[00:03:33] ఎవడి మాట వినకుండా సంతృప్తిగా బ్రతికేస్తాడు. కానీ మన సమాజానికి, మతాలకి,
[00:03:38] వ్యవస్థలకి నువ్వు సంతృప్తిగా ఉండడం ఇష్టం లేదు. నువ్వు గిల్టీగా ఉండాలి. అయ్యో నేను
[00:03:44] బయటికే చెప్పుకోలేనంత పెద్ద పాపం చేసేస్తున్నాను అనే భావన నీలో ఉంటేనే
[00:03:49] నువ్వు వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్తావ్. అందుకు మాత్రమే, దేవుడే క్రియేట్ చేసిన ఆ
[00:03:55] నాచురల్ ఆకలిని వీళ్ళు ఒక దెయ్యంలా మార్చేశారు. జంతువులని చూడండి, వాటికి
[00:04:01] సెక్స్ అనేది అసలు ఒక సమస్య కాదు. అది ఒక సీజన్ మాత్రమే. అది ఒక ప్రకృతి ధర్మం. కానీ
[00:04:07] మనిషికి? 24 గంటలు అదే ధ్యాస. ఎందుకు? ఎందుకంటే మనల్ని మనం మనుషులం కాదు,
[00:04:15] మహాత్ములం అని నమ్మించడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి..
No comments:
Post a Comment