తాడుని చూసి పాము అనుకుంటున్నారా | Reality vs Imagination Deep Insights | Satyagrahi
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=dILue-W4pyQ
Transcript:
(00:00) ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషికి బాధలు అనేవి సహజంగా ఉంటూనే ఉంటాయి. అది సహజం కూడా కాకపోతే మనుషులు ఊహించుకుని వాటిని క్రియేట్ చేసుకుని పడే బాధలు మాత్రం కొన్ని ఉంటాయి. చాలాసార్లు మనం ఒక చిన్న నిప్పు రవ్వను చూసి అది మొత్తం ఇంటిని తగలబెట్టేస్తుందేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటాం. ఆ నిప్పు ఇంకా చిన్నగానే ఉంటుంది. కానీ మన మనసులో మాత్రం ఆ చిన్న నిప్పు రవ్వ వల్ల ఇల్లు మొత్తం కాలిపోయినట్లు ఒక సినిమా కనిపిస్తూ ఉంటుంది.
(00:27) అసలు అలా మనక ఎందుకు కనిపిస్తుంది? చిన్న సమస్య కూడా మనకి పెద్ద సమస్యలా ఎందుకు అనిపిస్తూ ఉంటుంది మన మైండ్ ఎందుకు పాడైపోతుంది అనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాము చివరి వరకు చూడండి అస్సలు మిస్ అవ్వకండి. ఇక డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే మనందరికీ ఒక అలవాటు ఉంటుంది. ఏదైనా ఒక చిన్న సంఘటన జరగగానే దాని చుట్టూ వందల కథలు వల్లేస్తాం.
(00:47) అంటే జరిగే ప్రతి చిన్న విషయానికి ఒక పెద్ద విపత్తును ఊహించుకోవడం ఉదాహరణకి మీరు ఎవరికైనా ఫోన్ చేశారు అనుకుందాం. వాళ్ళు ఫోన్ ఎత్తలేదు. అక్కడ వాళ్ళు ఏదో పనిలో ఉండి ఉండొచ్చు లేదా ఫోన్ సైలెంట్ లో ఉండి కూడా ఉండొచ్చు. కానీ మన మనసు ఏం చెప్తుంది వాళ్ళు నన్ను కావాలని చెప్పేసి ఇగ్నోర్ చేస్తున్నారు. నా మీద వాళ్ళకి గౌరవం లేదు.
(01:04) బహుశా నా గురించి ఎవరో ఏదో నెగిటివ్ గా చెప్పిఉంటారు అని చెప్పేసి మన మైండ్ కంటిన్యూస్ గా ఆలోచిస్తూనే ఉంటుంది కొత్త కొత్త సినిమాలు రిలీజ్ చేస్తూనే ఉంటుంది. నిజం చెప్పాలంటే అక్కడ జరిగింది కేవలం ఒక మిస్డ్ కాల్ మాత్రమే కానీ మీ మనసులో మాత్రం ఒక పెద్ద గొడవే జరిగిపోయింది. నీమ్ కరోలిీ బాబా గారు ఒక మాట అనేవారు సమస్యలు అనేవి బయట ఉండవు.
(01:27) మన లోపల మనం పెంచుకునే అశాంతిలోనే ఉంటాయి అని. మనం ఎదుర్కుంటున్న అతి పెద్ద సమస్య ఏంటంటే మనం వాస్తవంలో బతకడం లేదు. మన ఊహల ప్రపంచంలో బతుకుతున్నాం. చీకట్లో పడి ఉన్న ఒక తాడును చూసి పాము అనుకొని వనికిపోతున్నాం. ఆ భయం వల్ల వచ్చే చెమటల నిజం ఆ వనుకు నిజం కానీ ఆ పాము మాత్రం అబద్ధం. ఇదే మన జీవితాల్లో జరుగుతున్న అతి పెద్ద ట్రాజిడీ.
(01:48) ఈ అతిగా ఊహించుకోవడం అనే జబ్బు మనక అసలు ఎందుకు వస్తుంది? దీనికి గల ప్రధాన కారణం మన మనసు ఖాళీగా ఉండటం. ఎంటీ మైండ్ ఈస్ ఏ డెవిల్స్ వర్క్ షాప్ అని చెప్పేసి ఊరికే అనలేదు. మనసుకి గనుక సరైన పని ఇవ్వకపోతే అది ఒక పాత సినిమా రీల్ లాగా లేనిపోని దృశ్యాలను క్రియేట్ చేస్తూనే ఉంటుంది. మరొక కారణం మనకున్న అభద్రత భావం మన మీద మనకి నమ్మకం లేనప్పుడు బయట జరిగే ప్రతి చిన్న మార్పు మనల్ని భయపెడుతుంది.
(02:13) బాబాగారు ఎప్పుడు తన దగ్గర వచ్చే భక్తులతో చాలా సరళంగా ఉండేవారు. ఆయనకు తెలుసు మనిషి తన అహంకారం వల్ల లేదా భయం వల్ల విషయాలను ఉన్నది ఉన్నట్లుగా చూడలేదని చెప్పేసి మనం ఒక విషయాన్ని చూసినప్పుడు దానికి మన పాత అనుభవాలను మన భయాల రంగులుగా పొలుగుతాం. మీరు ఎప్పుడైనా గమనించారా మనకి నచ్చని వ్యక్తి ఏదైనా మంచి మాట అన్నా అందులో ఏదో వెటకారం ఉందని చెప్పేసి వెతుకుతాం.
(02:36) అదే మనకు నచ్చిన వారు తప్పు చేసినా అది వాళ్ళు మంచి కోసమే చేశారని చెప్పేసి సమర్ధించుకుంటాం. అంటే మనం సత్యాన్ని చూడటం లేదు. మనకు కావాల్సిన వెర్షన్ ని మనం చూసేసుకుంటున్నాం. అంతే అంతకు మించి ఏమ లేదు. మన మైండ్ ప్రొజెక్షన్ వల్లే మనకి ఆందోళన ఒత్తిడి పెరుగుతున్నాయి. సరే ఇదంతా బాగానే ఉంది. మరి ఈ ఊహల సుడిగుండ నుంచి బయట పడటం ఎలా? దీనికి ఒకటే మార్గం దర్శనం.
(02:57) దర్శనం అంటే కేవలం చూడటం కాదు ఉన్నది ఉన్నట్లుగా చూడటం. ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక వ్యక్తి తన కడుపులో ఏదో పురుగు ఉందని అది లోపల తిరుగుతూ తన ప్రాణాలను తినేసుకుందని చెప్పేసి భయపడిపోయాడు. డాక్టర్లు ఎన్ని పరీక్షలు చేసినా ఏమి లేదని చెప్పారు. కానీ అతను నమ్మలేదు. చివరికి ఒక తెలివైన వైద్యుడు అతని మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నాడు.
(03:17) అతనికి ఒక మతు మందిచ్చి తను కళ్ళు తెరిచేసరికి ఆ పురుగుని పక్కన పెట్టి ఇదిగో నీ కడుపులో నుంచి తీసిన పురుగు అని చెప్పేసి చూపించాడు. దాంతో ఆయన ఎంతగానో ఆనందపడ్డాడు. అందులోన ఇప్పుడు తనకి ఎటువంటి ఫీలింగ్ లేదని ప్రశాంతంగా ఉందని చెప్పేసి డాక్టర్తో చెప్పాడు. సో ఇలాగే మనకు కూడా ఒక సైకలాజికల్ ట్రీట్మెంట్ అవసరం అన్నమాట. మనం మన ఊహాలను ఎంతగా నమ్ముతామ అంటే నిజం చెప్పే వాళ్ళు మనకి శత్రువులా కనిపిస్తారు.
(03:39) దీని నుంచి బయటపడాలంటే మీరు కర్మయోగం వైపు అడుగులు వేయాలి అంటే మీ చేతులకి మీ మెదడుకి పని చెప్పండి. మీరు ఏదైనా పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు మనసుకి కథలు అల్లే తీరిక ఉండకూడదు. నిమ్ కరోలి బాబా గారు చెప్పినట్లు అందరికీ సేవ చేయడం, అందరిని ప్రేమించడం, భగవంతుని స్మరించడం ఈ మూడు పనుల్లో మీరు బిజీగా ఉంటే మీ మనసులో ఇతరుల గురించి నెగిటివ్ ఊహలు రావడానికి కూడా చోటు ఉండదు.
(04:04) సేవ చేయడం వల్ల మీలో అహం తగ్గుతుంది. ప్రేమించడం వల్ల భయం పోతుంది. సరే ఇదంతా బాగానే ఉందండి నేను నా జీవితాన్ని ఎలా మార్చుకోవాలి అని చెప్పేసి మీరు అడిగితే మాత్రం ఫస్ట్ మన చూపును మార్చుకోవాలి. ఇప్పటి నుంచి మీరు ఒక చిన్న ప్రాక్టీస్ చేయండి ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేయకండి. మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి.
(04:24) ఇది నిజంగా జరుగుతుందా లేక నా మనసు చూపిస్తున్న సినిమానా అని చెప్పేసి జ్ఞానం అంటే ఏదో పెద్ద పెద్ద పుస్తకాలు చదవడం కాదు ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా గమనించడం. మీ జీవితంలో మీకు ఎదురయ్యే మనుషులను పరిస్థితులను జడ్జ్ చేయకండి. నీమ కరోలి బాబా గారి జీవితంలో ఆయన ఎంతో మందిని కలిశారు. కానీ ఆయన ఎవ్వరిని తక్కువగా చూడలేదు. ఆయన దృష్టిలో అందరూ సమానమే. ఆ క్లారిటీ అనేది మనిషికి రావాలి.
(04:45) ఊహ అనేది ఒక అద్భుతమైన వరం. ఎప్పుడు మీరు ఒక కవిత రాస్తున్నప్పుడు లేదా ఒక ఇల్లు కట్టాలని చెప్పేసి ప్లాన్ వేస్తున్నప్పుడు కానీ అదే ఊహ. మీ బంధాలను విచ్చిన్నం చేస్తుంటే మీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తే అది ఒక శాపం కదా. కాబట్టి ఊహ అనేది క్రియేటివ్ పనిలో ఓకే కానీ అసలు జరగని విషయాలు జరిగినట్లు ఊహించుకొని మీ బంధాలను మీరు నాశనం చేసుకుంటే అది శాపమే కదా సో నేటి నుంచి ఒక నిర్ణయం తీసుకోండి మీరు మీ మనసుకి బానిసగా ఉండబోరని మీ మనసే మీకు ఒక పనిముట్లుగా ఉండాలని చెప్పేసి నిర్ణయించుకోండి.
(05:15) వర్తమానంలో జీవించడం నేర్చుకోండి. నిన్నటి బాధలు రేపటి భయాలు అన్నీ కేవలం ఆలోచనలు మాత్రమే. ఇప్పుడు ఈ క్షణం మీరు పిలిచే గాలి మాత్రమే నిజం. సో చివరిగా ఒక మాట బాబాగారు ఎప్పుడు చెప్పేవారు అంతా ఒక్కటే అని మీరు వేరు మీ పక్కన ఉన్న వాళ్ళు వేరు కాదు మీ మనసులో ఇతరుల గురించి నెగిటివ్ ఊహలు వస్తున్నాయి అంటే మీరు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు అని అర్థం మీ మీద మీకు నమ్మకం పెంచుకోండి.
(05:41) అలా పెంచుకోవడం వల్ల ప్రపంచం ఆటోమేటిక్ గా అందంగా కనిపిస్తుంది. అలా కాకుండా కనిపించిన ప్రతి ఒక్కరిని జడ్జ్ చేసుకుంటూ వాడు వేసుకున్న బట్టలు చూస్తూ వీడు నా అంతటోడా కాదా అని చెప్పేసి చూస్తూ వాళ్ళు వాడే సెల్ ఫోన్ అవ్వచ్చు వాళ్ళు వేసుకున్న చెప్పులు కూడా అవ్వచ్చు వీటన్నిటిని చూసి మీరు జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తే మీలో మీ మనస్సాంతిని కోల్పోతారు.
(06:00) ఎందుకంటే ఎంతమందినని చెక్ చేస్తారు ఎంతమందినని చూస్తారు. ఒక మనిషి స్టేటస్ అనేది ఈరోజు పెరగొచ్చు రేపు తగ్గొచ్చు మళ్ళీ తర్వాత పెరగొచ్చు మళ్ళీ ఆ తర్వాత తగ్గొచ్చు. సో ఎప్పుడు తగ్గుతుంది ఎప్పుడు పెరుగుతుంది అని చెప్పేసి లిస్ట్ రాసుకొని అవతల వ్యక్తిని మనం గౌరవించలేం కదా కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండండి. ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కలు మీకు అద్భుతంగా కనిపిస్తారు.
(06:19) అందులో నేను చెప్పొచ్చేది ఏంటంటే సక్సెస్ అనేది ఈరోజు ఉంది కదా అని చెప్పేసి ఒక వ్యక్తి లైఫ్ లాంగ్ సక్సెస్ గా ఉంటాడని చెప్పేసి నమ్మకం లేదు. ఎందుకంటే తాను తీసుకునే తప్పుడు నిర్ణయం వల్లో లేకపోతే తాను చేసిన చిన్న మిస్టేక్ వల్లో తన జీవితం మళ్ళీ నార్మల్ స్థితికి రావచ్చు లేకపోతే ఇంకా ధనవంతుడు అవ్వచ్చు. కాబట్టి ఇలా మారిపోయే మనుషుల జీవితాల్ని మైండ్ లో పెట్టుకొని అవతలి వాళ్ళని జడ్జ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి కాబట్టి మీరు అవతలి వాళ్ళని జడ్జ్ చేయడం ఆపేయండి అందులోనూ మిమ్మల్ని మీరు గౌరవించుకోండి మిమ్మల్ని మీరు గౌరవించుకుంటే ప్రతి ఒక్క
(06:49) మనిషి మీకు ఒక మనిషిలా కనిపిస్తాడు అంతేగాని అతను సంపాదించే డబ్బులు అతను చేసే ఉద్యోగం వీటన్నిటిని మీరు క్యాలిక్యులేట్ చేయరు. అలా చేయకుండా అవతల మనిషితో మీరు మనస్ఫూర్తిగా మాట్లాడటం వల్ల మీ మీద సమాజంలో గౌరవం పెరుగుతుంది. అతను ఎంత అద్భుతంగా ప్రతి ఒక్కలతో మాట్లాడుతాడో చూడండి అని చెప్పేసి మిమ్మల్ని అందరూ ప్రత్యేకంగా చూస్తారు.
(07:10) సో మీరు సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు. కానీ మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టే మీ వ్యక్తిత్వాన్ని మీ మనస్తత్వాన్ని చుట్టూ ఉన్న వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎందుకంటే సక్సెస్ అనేది మనిషికి ఎంత ముఖ్యమో లేదో నాకు తెలియదు కానీ వ్యక్తిత్వం అనేది ప్రతి ఒక్క మనిషికి చాలా అవసరం. మనక ఏదైనా సమస్య కచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుంది.
(07:30) ఆ వచ్చిన రోజు మాత్రం మన చుట్టూ ఉన్నవాళ్ళు అయ్యో పాపం అని ఇలా ఉండాలి తప్ప వాడు ఇంతకుముందు ఎలా చేశడురా వాడికి అంతే కావాలని చెప్పేసి అందరూ మనల్ని తిట్టుకునేలా ఉండకూడదు. వాళ్ళ పాపాను ఓలిపోతారని చెప్పేసి మీరు వదిలేయండి ఎందుకంటే మీరు మంచిగా ఉన్నా కూడా అవతల వాళ్ళు మంచిగా ఉండాలని చెప్పేసి రూల్ లేదు.
(07:48) మిమ్మల్ని ఇబ్బంది పెడతారు మీరు వెళ్ళిపోయిన తర్వాత మాటలు అంటారు మిమ్మల్ని చూసి కుళ్లుకుంటారు కూడా కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే అవన్నీ పట్టించుకుంటే మీరు అక్కడే ఉంటారు వాటన్నిటిని వదిలేసి మీ పని మీరు చేసుకుంటూ ప్రతి ఒక్క మనిషిని మనిషిలా చూస్తే మాత్రం కచ్చితంగా మిమ్మల్ని చూసి కుళ్లుకున్న వాళ్ళు మీ గురించి తప్పుగా చెప్పిన వాళ్ళు కూడా మారిపోయి మీ గొప్పతనం తెలుసుకుంటారు కాబట్టి మనం ప్రపంచాన్ని మార్చాల్సిన అవసరం లేదు మనల్ని మనం మార్చుకుంటే చాలు కాకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది అవతల వాళ్ళు ఒక మాట అన్నా మన గురించి తప్పుగా చెప్పినా సరే బాధ అనిపిస్తుంది కానీ మనిషి అనుకుంటే ఏదైనా
(08:18) సాధించగలడు. ఎంతమందినైనా సరే మార్చగలడు. కాబట్టి మనం అందరిని మార్చడం కన్నా ఫస్ట్ మనల్ని మనం మార్చుకున్నాం. ఆ తర్వాత మనల్ని చూసి అందరూ మారుతారు. సో ఈ మాటలు విన్న తర్వాత ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. మీ మనసులో ఇన్ని రోజులుగా మీరు మోస్తున్న ఆ పురుగు లాంటి భారం ఏంటో గుర్తించండి. అది కేవలం మీ ఊహే అని అర్థం చేసుకోండి. ఆ భారాన్ని ఇక్కడే వదిలేయండి.
(08:38) ఈ రోజు నుంచి ఒక కొత్త మనిషిగా సృష్టమైన చూపుతో జీవితాన్ని ప్రారంభించండి. మీరు ఈ వీడియో ఇప్పుటిదాకా చూశారు కాబట్టి నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను మీ జీవితంలో కేవలం మీ ఊహల వల్ల మీరు దూరం చేసుకున్న ఒక మంచి వ్యక్తి లేదా ఒక గొప్ప అవకాశం గురించి ఎప్పుడైనా ఆలోచించారా ఆ రోజు గనుక మీరు వాస్తవాన్ని చూసి ఉంటే మీ జీవితం ఈరోజు ఎలా ఉండేది కింద కామెంట్స్ లో నాతో పాటు పంచుకోండి.
(09:02) మీ అనుభవం మరొకరికి పాఠం కావచ్చు. అంతేకాకుండా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక రెండు అద్భుతమైన వీడియోలు పిన్ చేసి పెట్టాను వాటిని కూడా చూడండి. ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్
No comments:
Post a Comment