SIGMA MALES The Fake Heroes Created by the Internet | Nietzsche Ubermensch | Anukula Vedam | Telu...
https://youtu.be/MDLEeI2_SmY?si=MTb-PemzQwG55ake
[0:05] ఈ ఆధునిక ప్రపంచంలో ఇంటర్నెట్ లో ఎక్కడ
[0:08] చూసినా ఒక పిచ్చి ట్రెండ్ నడుస్తుంది.
[0:11] అదేంటంటే
[0:13] సిగ్మా మేల్ నల్ల కలద్దలుేసుకొని చీకటి
[0:16] గదిలో కూర్చొని నాకు ఈ సమాజం అంటే లెక్క
[0:18] లేదు ఎవడి సర్టిఫికెట్ నాకు అవసరం లేదు
[0:20] అని ఫీల్ అయిపోతూ ఇంటర్నెట్ లో దొరికే
[0:22] రెండు మూడు చెత్త వీడియోలు చూసేసి తన్ని
[0:24] తాను ఒక సిగ్మా మేల్ అని ప్రకటించేసుకొని
[0:27] నీష చెప్పిన ఉబర్ మనిషిని నేనే అని ఒక
[0:30] భయంకరమైన భ్రమలో బ్రతికిస్తున్నాడు.
[0:33] ఫస్ట్ అఫ్ ఆల్ ఈ సిగ్మా మేల్ అని
[0:35] చెప్పుకుంటూ తిరుగుతున్న వీడి లక్షణాలు
[0:36] ఏంటి? వాడికి ఆడదాని మీద ఆసక్తి లేదట
[0:39] వాడికి డబ్బు సంపాదించడమే లక్ష్యం వాడు
[0:41] ఎవరిని పట్టించుకోడట ఎవరైనా వాడిని
[0:43] విమర్శిస్తే నవ్వి ఊరుకుంటాడట
[0:46] కానీ దీంట్లో దాగిన్న అతి పెద్ద హిపోక్రసీ
[0:49] ఏంటో తెలుసా ఒకడు నేను ఎవరిని
[0:52] పట్టించుకోను అని పదే పదే తన ప్రవర్తన
[0:55] ద్వారా ఎందుకు నిరూపించుకోవాలి
[0:56] అనుకుంటాడు. ఎందుకంటే వాడికి అందరి నుండి
[0:59] అటెన్షన్ కావాలి.
[1:01] నేను మీలాంటి వాడిని కాదు నేను చాలా
[1:03] డిఫరెంట్ అనిపి మందికి తెలిస్తేనే వాడి
[1:05] అహంకారం తృప్తి పడుతుంది. అయితే ఇక్కడే ఒక
[1:09] లాజిక్ ఉంది వాడు నేను సాధారణ మనుషుల
[1:12] మందలో ఒకడిని కాను అని ఫీల్ అవ్వడానికి
[1:14] మళ్ళీ ఆ మంద వైపేగా చూస్తున్నాడు.
[1:17] వాడి ఐడెంటిటీ ఆ మందకి వ్యతిరేకంగా
[1:20] ఉండటంలోనే బ్రతుకుతుంది. ఇది స్వేచ్ఛల
[1:22] అవుతుంది.
[1:25] ఎందుకంటే ఇది కూడా ఆ మంద మీద ఆధారపడి
[1:28] బ్రతుకుతున్న ఇంకో రకం బానిసత్వమే కదా.
[1:30] ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఇది ఒక మానసిక
[1:34] బలహీనత తనను ఎవరు గుర్తించరేమో అన్న
[1:38] తీవ్రమైన ఇన్సెక్యూరిటీ నుండి పుట్టిన ఒక
[1:40] ముసుగు వీడా నీషే చెప్పిన ఉబర్మంచ్
[1:44] నీషే తను రాసిన దస్ స్పోక్ జరాతుష్ట అనే
[1:48] పుస్తకంలో అసలైన ఉబర్మెంచ్ గురించి
[1:50] ఏమంటాడంటే మనిషి అనబడేవాడు జంతువుకి ఉబర్
[1:53] మంచికి మధ్య కట్టబడిన ఒక తాడు అంటే
[1:56] మనిషిగా పుట్టడం అనేది ముగింపు కాదు అదొక
[1:59] ప్రయాణం తనలోని జంతు లక్షణాలని
[2:02] పరిమితుల్ని భయాలను బలహీనతలను బద్దలు
[2:04] కొట్టుకొని కష్టాల కొలిమిలో కాలి ఒక
[2:06] అత్యున్నతమైన చైతన్య స్థాయికి చేరుకోవడమే
[2:09] ఉబ్బరి మంచి లక్ష్యం ఆ ప్రయాణంలో నెత్తురు
[2:11] వస్తది ప్రాణం పోయేంత నొప్పి కూడా ఉంటది.
[2:13] నీజే ఇంకో కాన్సెప్ట్ గురించి కూడా
[2:15] చెప్పాడు అదే ద లాస్ట్ మన్ చివరి మనిషి ఈ
[2:18] లాస్ట్ మన్ కి రిస్క్ అంటే భయం వాడికి
[2:21] ఎప్పుడు కంఫర్ట్ కావాలి. చుట్టూ ఉన్న
[2:23] వాళ్ళు తన్ని మెచ్చుకుంటూ ఉండాలి. ఎవరు
[2:24] తన్ని ప్రశ్నించకూడదు. తన అహాన్ని దెబ్బ
[2:26] తీసే వాస్తవాల నుండి వాడు ఎప్పుడు
[2:28] పారిపోతూనే ఉంటాడు. ఈరోజు ఇంటర్నెట్ లో
[2:30] సిగ్మా మెయిల్స్ అని తిరుగుతున్న వాళ్ళు
[2:32] ఎవరు అనుకుంటున్నారు? వీళ్లే ఆ లాస్ట్
[2:34] మెన్ వీళ్ళకి కష్టపడటం చేత కాదు వాస్తవ
[2:37] జీవితంలో ఎదురయ్యే అవమానాలని తట్టుకోవడం
[2:39] చేత కాదు కాబట్టే నాకు ఎమోషన్స్ లేవు ఐ
[2:42] డోంట్ కేర్ అనే ఒక ముసుగేసుకొని ఒక డార్క్
[2:44] రూమ్లో కూర్చొని తమని తాము గొప్పగా
[2:46] ఊహించేసుకుని ఉంటారు. అసలు ఈ సిగ్మా మేల్
[2:48] అనే కాన్సెప్ట్ ఎందుకు పుట్టింది. దీని
[2:51] వెనుక ఉన్న సైకలాజికల్ ట్రాప్ ఏంటో
[2:53] తెలుసా? దీన్ని అర్థం చేసుకోవాలంటే నీచే
[2:55] రాసిన ఆన్ ద జెనియాలజీ ఆఫ్ మొరాలిటీ అనే
[2:58] పుస్తకంలోకి వెళ్ళాలి. అందులో ఆయన
[2:59] ఏమంటాడంటే అడవిలో బ్రతికే సింహం
[3:02] వేటాడుతుంది. దాని దృష్టిలో అదే దానికి
[3:04] ఉన్న బలం అయితే దాని పక్కనే ఒక నక్క
[3:07] కూర్చునుంది. నక్కకి సింహంలా వేటాడే దమ్ము
[3:09] లేదు సింహాన్ని ఎదుర్కొనే ధైర్యం అంతకంటే
[3:11] లేదు. అప్పుడు ఆ నక్క ఏమంటదో తెలుసా
[3:13] వేటాడటం క్రూరంగా ఉండటం మహా పాపం ఇవన్నీ
[3:16] చేసే ఆ సింహం దుర్మార్గురాలు మరి నేను
[3:18] ఎవరిని వేటాడను చంపను కూడా కాబట్టి
[3:21] ఆటోమేటిక్ గా నేను చాలా పవిత్రమైన దాన్ని
[3:23] గొప్పదాన్ని అని అంటది. దీన్నే నీషే
[3:26] రిసెంటిమెంట్ అంటాడు. అంటే తనకంటే
[3:28] బలవంతుడిని చూసి పుట్టిన అసూయ ద్వేషం
[3:31] నిస్సహాయిత నుండి తన చేతకానితనాన్ని ఒక
[3:33] గొప్ప నైతిక విలువగా మార్చుకునే ఒక పచ్చి
[3:36] మోసం తనకి చేత కాదు కాబట్టి ఆ చేయగలిగే
[3:39] వాడిని విలన్ చేయడం. ఇప్పుడు చెప్పండి ఈ
[3:42] రోజుల్లో ఇంటర్నెట్ లో తిరుగుతున్న ఈ
[3:43] సిగ్మా మేల్స్ అందరూ ఎవరు వాళ్లే ఈ నక్కలు
[3:47] వాళ్లే ఈ బానిసలు సమాజంలో గెలిచే సత్త
[3:49] లేని వాడికి 10 మందిలో మాట్లాడాలంటే ఉనుకు
[3:52] మరి అప్పుడు వాడి అహంకారం బ్రతికిదలా
[3:53] కాబట్టి ఈ ఈగో ఒక బ్రహ్మాండమైన ముసుగుని
[3:56] సృష్టిస్తది. ఆ ముసుకే ఈ సిగ్మా వాడికి
[3:59] ఆడదానితో మాట్లాడే ధైర్యం లేకపోతే నాకు
[4:01] వాళ్ళంటే లెక్క లేదు అంటాడు. వాడికి 10
[4:03] మందిలో గుర్తింపు లేకపోతే సమాజం ఒక మాయ
[4:05] నేను లోన్ వోల్ఫ్ ని నేను ఒంటరిగా ఉంటాను
[4:08] అంటాడు. వాడికి పోటీ పడే సత్త లేకపోతే
[4:10] నేను ఆల్ఫా కాదు బీటా కాదు నా ప్రపంచం
[4:12] వేరు నా రూల్స్ే వేరు అంటాడు. ఎంత
[4:14] అద్భుతమైన ఆత్మవంచన చూసారా ఇది ఒక
[4:16] ఎస్కేపిజం ఇతరులతో పోటీ పడి ఓడిపోవడం
[4:19] ఇష్టం లేక తనకంటూ ఒక ఫేక్ కాంపిటీషన్ ని
[4:21] క్రియేట్ చేసుకొని అందులో తనకి తానే ఫస్ట్
[4:23] ర్యాంక్ ఇచ్చుకొని బ్రతికే ఒక దయనీయమైన
[4:25] బానిస బతుకు అది. మీకు ఇక్కడో ఎగ్జాంపుల్
[4:27] చెప్పాలి. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో
[4:30] విక్టర్ ఫ్రాంకిల్ అనే ఒక మానసిక
[4:32] వైద్యుడిని నాజీలు పట్టుకొని
[4:33] కాన్సంట్రేషన్ క్యాంపులో పడేశారు. అతని
[4:36] బట్టలు లాగేసుకున్నారు జుట్టు గురిగేశారు
[4:38] అతని కళ్ళ ముందే అతని గర్భిణి భార్యను
[4:40] తల్లిదండ్రులని చంపేశారు. రోజు చాకిరి
[4:43] తినడానికి కనీసం రొట్టె ముక్క కూడా లేని
[4:45] నరకం ఏ క్షణంలో గ్యాస్ చాంబర్లు వేసి
[4:47] చంపేస్తారో తెలియని పరిస్థితి. ఇప్పుడు ఒక
[4:49] ఫేక్ సిగ్మా అక్కడ ఉంటే ఏం చేస్తాడు?
[4:51] భయంతో ఏడుస్తాడు లేదా దేవుణని తిడతాడు
[4:53] లేదా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆత్మహత్య
[4:55] చేసుకుంటాడు. కానీ విక్టర్ ఫ్రాంకిల్ ఏం
[4:57] చేశడో తెలుసా ఈ నరకం లాంటి పరిస్థితికి
[4:59] నేను ఎలా స్పందించాలి అనే నా ఆలోచన
[5:02] విధానాన్ని నా మానసిక స్వేచ్ఛను వీళ్ళు
[5:03] లాక్కోలేరు. వీళ్ళు నా శరీరాన్ని
[5:05] బందించగలరు నా కుటుంబాన్ని చంపగలరు. కానీ
[5:08] ఈ నరకం లాంటి పరిస్థితికి నేను ఎలా
[5:10] స్పందించాలి అనే నా ఆలోచన విధానాన్ని నా
[5:12] మానసిక స్వేచ్ఛను వీళ్ళు లాక్కోలేరు. అని
[5:14] ఆ నరకాన్ని తన ఎదుగుదలకు వాడుకున్నాడు. ఆ
[5:17] నరకంలో కూడా అతను తన తోటి ఖైదీలకు మానసిక
[5:20] ధైర్యాన్ని ఇచ్చాడు. తన కష్టాన్ని తన
[5:22] ఎదుగుదలకు ఒక ప్రక్రియగా మార్చుకున్నాడు.
[5:25] ఆ కాన్సంట్రేషన్ క్యాంపు నుండి ప్రాణాలతో
[5:27] బయటపడి మన్స్ సెర్చ్ ఆఫ్ మీనింగ్ అనే
[5:29] అద్భుతమైన పుస్తకం రాశాడు. సమాజం మొత్తం
[5:32] క్రూరత్వంతో నిండిపోయినప్పుడు పారిపోకుండా
[5:34] అక్కడే నిలబడి తనకంటూ ఒక కొత్త అర్థాన్ని
[5:36] సృష్టించుకున్నాడు. అది అసలైన ఉబరిమనిషి
[5:39] అంటే అలాగే దాశరత్ మంజి బీహార్ లోని ఒక
[5:43] కుగ్రామం తన భార్యకు జబ్బు చేస్తే
[5:45] ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి మధ్యలో ఒక
[5:47] పెద్ద కొండ అటుగా ఉంది. దాన్ని చుట్టుకొని
[5:49] వెళ్ళేలోపు ఆమె చనిపోయింది. ఇక్కడ ఒక
[5:52] సాధారణ మనిషి ఉంటే ఏం చేస్తాడు ప్రభుత్వం
[5:54] మీద ఏడుస్తాడు సిస్టం ని తిడతాడు తాగుడికి
[5:56] బానిస అవుతాడు. కానీ మాంజి ఏం చేసాడో
[5:58] తెలుసా ఒక ఉలి ఒక సుత్తి పట్టుకొని ఆ కొండ
[6:01] దగ్గరికి వెళ్ళాడు. రోజులు కాదు నెలలు
[6:03] కాదు ఏకంగా 22 సంవత్సరాలు ఒంటరిగా ఆ కొండ
[6:07] మొత్తం పగలగొట్టి దారి వేశడు. కానీ ఇదంతా
[6:10] అతను ఎవరి కోసం చేశడు YouTube లో వీడియోలు
[6:12] పెట్టుకోవడానిక జనాలు అతని సిగ్మా మేల్
[6:14] అని పొగటానికా కాదు అతని సంకల్ప బలం ముందు
[6:17] ఆ కొండ తలవంచింది. తనలో దాక్కున్న బాధను
[6:20] దుఃఖాన్ని అసాధ్యం అనే భయాన్ని ముందుగా
[6:23] తనలో తాను చంపేసాడు. తనని తాను
[6:25] జయించుకోగలిగాడు కాబట్టే ఆ ప్రకృతిని కూడా
[6:28] జయించగలిగాడు. కానీ ఇదంతా విన్న తర్వాత
[6:30] కూడా లేదు లేదు మా సిగ్మా ఇంటర్నెట్
[6:33] గురువులు దేవుళ్ళు వాళ్ళు ఈ మాట్రిక్స్
[6:34] అనే మాయని దాటేశారు అని మీరు అనుకుంటే
[6:37] ఇప్పుడు నేను అడిగే లాజికల్ పాయింట్స్ కి
[6:39] సమాధానం చెప్పండి. మీ సిగ్మా గురువుల మాటల
[6:42] ప్రకారం వాళ్ళకి ఎవరు ఎప్పుడు వాళ్ళు
[6:44] అక్కర్లేదు. జనాల మెప్పు అసలే అక్కర్లేదు.
[6:46] పోనీ అదే నిజం అనుకుందాం. మరి అదే లాజిక్
[6:48] ప్రకారం చూస్తే రోజు వీడియోలు తీసుకుంటూ
[6:51] నా వీడియోకి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్
[6:53] చేయండి కామెంట్ చేయండి అని అడుక్కోకూడదు
[6:55] కదా సిగ్గు లేదా బిచ్చం అడుక్కోవడానికి
[6:56] ఎవడి అటెన్షన్ అక్కర్లేని వాడు ఇంటర్నెట్
[6:59] లో వ్యూస్ కోసం ఫాలోవర్స్ కోసం ఎందుకు
[7:01] వెంపర్లాడుతున్నాడు వాళ్ళ అలా వ్యూస్ కోసం
[7:02] వెంపర్లాడకుండా ప్రశాంతంగా ఉన్నారా లేరు
[7:05] వాళ్ళకి మీ వ్యూస్ కావాలి. అయ్యో వాళ్ళకి
[7:08] వ్యూస్ పిచ్చి లేదు కేవలం కుర్రాళ్ళను
[7:10] మేలుకొలపడానికి సమాజాన్ని బాగు చేయడం
[7:12] కోసమే వాళ్ళు ఈ వీడియోలు తీస్తున్నారు అని
[7:14] మీరు అనుకుంటే మరి ఆ లాజిక్ ప్రకారం
[7:16] వాళ్ళు మీకు నిజమైన ధైర్యాన్ని నూరిపోయాలి
[7:18] కదా మీలోని భయాలని పోగొట్టాలి కదా మరి
[7:20] వాళ్ళు అది చేస్తున్నారా లేరు ఆడవాళ్ళ మీద
[7:23] ఎలా ఆధిపత్యం చెలాయించాలి 10 మందిలో ఎలా
[7:25] బిల్డప్ ఇవ్వాలి అంటూ వాళ్ళు మీలో ఉన్న
[7:27] కోపాన్ని అభద్రతా భావాన్ని పని కట్టుకొని
[7:30] మరి రెచ్చకొట్టి చివర్లో నేను చెప్పినట్టు
[7:32] బ్రతకాలంటే నా దగ్గర ఒక సీక్రెట్ కోర్స్
[7:34] ఉంది 10వే కట్టి అందులో జాయిన్ అవ్వండి
[7:36] అని అమ్ముకుంటున్నారు సరే పోనీ కాసేపు అది
[7:39] కూడా కరెక్టే అనుకుందాం. ఆ కోర్స్ కొన్నాక
[7:41] లేదా వాళ్ళ వీడియోలు చూసాక మీరు ఒక
[7:43] స్వతంత్రమైన సిగ్మాలా మారిపోయి ఉండాలి కదా
[7:45] మీ జీవితం మీ కంట్రోల్ లోకి వచ్చి వాళ్ళ
[7:47] వీడియోలతో ఇక పని లేకుండా ఉండాలి కదా మీ
[7:49] జీవితం మీద మీకు పూర్తి కంట్రోల్ వచ్చేసి
[7:51] వాళ్ళ వీడియోలతో మీకు ఇంకా పని లేకుండా మీ
[7:54] లక్ష్యాల వైపు మీరు దూసుకుపోతూ ఉండాలి కదా
[7:56] అలా పూర్తి స్వతంత్రంగా ఎవరి మీద
[7:58] ఆధారపడకుండా ఉన్నారా లేరు మీరు ఒక విషయం
[8:00] గుర్తుపెట్టుకోండి పూర్తి స్వేచ్ఛ అనేది
[8:02] మీ స్వయం కృషి మీదే ఆధారపడుతుంది తప్ప
[8:05] ఎవడో చేసిన వీడియోల మీద కాదు సాయంత్రం
[8:08] అవ్వగానే వాడు ఏ వీడియో పెడతాడా ఫోన్
[8:10] పట్టుకొని కాపలా కాస్తున్నారు. ఆ వీడియోలు
[8:11] పెడుతున్నోడిని ఎవడైనా విమర్శిస్తే
[8:13] కామెంట్ సెక్షన్ లోకి వెళ్లి ఒక ఊర
[8:15] కుక్కలాగా వాడి తరుపుని మీరు
[8:17] మొరుకుతున్నారు. వాడికి ఒక ఫ్యాన్ పేజ్
[8:19] క్రియేట్ చేసి వాడికి ఉచితంగా మార్కెటింగ్
[8:20] చేసి పెడుతున్నారు. మీరు స్వతంత్రులు
[8:22] అవ్వడం పక్కన పెడితే వాడి ముందు మీరు
[8:24] మానసికంగా ఒక బానిసగా మారిపోయారు. కళ్ళు
[8:27] తెరిచి చూడండి. ఈ సిగ్మా మెయిల్స్ అని
[8:29] చెప్పుకుంటూ వీడియోలు చేస్తున్న వాళ్ళు
[8:30] ఎవ్వరు కూడా మ్యాట్రిక్స్ ని బ్రేక్ చేసిన
[8:32] యోధులు కారు. వాళ్ళు చాలా తెలివైన
[8:35] క్రూరమైన వ్యాపారవేత్తలు. మీలోని భయాన్ని
[8:38] మీ ఒంటరితనాన్ని సమాజం మీద మీకున్న
[8:40] ఫ్రస్ట్రేషన్ ని పెట్టుబడిగా పెట్టే మీ
[8:42] మెదడుతో ఆడుకుంటున్న పక్క వ్యాపారవేత్తలు
[8:44] మీరు సిగ్మాలు కాలేదు ఉబెరి మనిషి అంతకంటే
[8:47] కాలేదు మీరు కేవలం వాళ్ళ వ్యాపారానికి
[8:49] లాభాలు తెచ్చిపెట్టే కస్టమర్లు అయ్యారు.
[8:51] పచ్చిగా మన భాషలో చెప్పాలంటే అడ్డంగా బకరా
[8:55] అయ్యారు. అవతలవాడు నీ అహంకారానికి
[8:57] వంతపాడుతూ నీ చేతకనితనాన్ని ఒక గొప్పతనంగా
[8:59] కీర్తిస్తూ నీకు నచ్చిన అబద్ధాన్ని అందంగా
[9:02] చెబుతున్నాడు అంటే వాడు నిన్ను
[9:04] వాడుకుంటున్నాడు అని అర్థం. సమాజం మీద
[9:06] కోపం పెంచుకొని చీకటి గదిలో దాక్కోవడం
[9:08] కాదు ముందు మీకు భయం ఉందని ఒప్పుకోండి
[9:11] నలుగురితో కలవడం చేత కాదని అంగీకరించండి
[9:13] ఎప్పుడైతే మీ చేతకానితనాన్ని ఎవరికీ
[9:16] భయపడకుండా నగ్నంగా అంగీకరిస్తారో అప్పుడు
[9:19] మాత్రమే నీష చెప్పిన అసలైన ఉబర్ మంచి
[9:21] ప్రయాణం మొదలవుతుంది.
[9:24] మీకు ఇది జీర్ణం కాకపోయినా ఇదే నిజం.
No comments:
Post a Comment