Saturday, March 14, 2026

******The Secret of Alpha (01) 🕉️ 3 Minలో మీ Subconscious తో మాట్లాడండి | Mind Power Telugu #bairaagi

The Secret of Alpha (01) 🕉️ 3 Minలో మీ Subconscious తో మాట్లాడండి | Mind Power Telugu #bairaagi

Author Name:Jagamantha Kutumbam Naadi

Youtube Channel Url:https://www.youtube.com/@JagamanthaKutumbam369

Youtube Video URL:https://www.youtube.com/watch?v=hUq9u-6lHb4



Transcript:
(00:00) బాబా నీలో ఒక శక్తి మిస్ అవుతున్నావు తెలుసా దీని సీక్రెట్ తెలిస్తే పండగే నీకు విను హడావిడిలో నీ జేబులోంచి ఒక కీ రోడ్డు మీద పడిపోయింది. ఇంటికి వెళ్ళాక వెతికావు దొరకలేదు మరనాడు మెడిటేషన్ లో కూర్చున్నావు నీ జేబులోంచి నీ కీ రోడ్డు మీద పడిపోవడం కనిపించినట్లు అయింది నీకు వెంటనే వెళ్లి చూస్తే కీ సరిగ్గా అక్కడే ఉంది.
(00:26) కీ పడటం చూడలేదు కదా నువ్వు మరి ఎలా తెలిసింది ఇంకోటి ఇంట్లో అందరూ పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటున్నారు. నువ్వు పట్టించుకోవట్లేదు ఫోన్ లో ఉన్నావు వాళ్ళ మాటల్లో పన్నీర్ బటర్ మసాలా అనేది మాత్రం నీకు వినిపించింది. ఒకే క్షణం చాలా రోజులు అయింది అది తింటే బాగుండు అని నీకు అనిపించింది. రెండు రోజుల తర్వాత ఆఫీసులో నీ ఫ్రెండ్ పన్నీర్ బట్టర్ మసాలా తెచ్చి నీకు సర్వ్ చేశాడు.
(00:47) నువ్వేమీ అడగలేదు అసలు నీ మనసులో కోరిక తెలియకుండానే ఎలా తీర్చాడు నీ ఫ్రెండ్? నాన్న దీనికి సమాధానం ఈ వీడియో చూస్తున్న వేల మందికి టర్నింగ్ పాయింట్ అవ్వగలదు పూర్తిగా చూడు వీడియో అయితే మన సనాతన ఋషులు చెప్పారు మనసుకి అనుకున్నది నిజం చేసే శక్తి ఉంది అని పాశ్చాత్య సైన్స్ కూడా ఇదే నిరూపించింది మరి అంత పవర్ ఉంటే నాకేమి లాభాలు లేవేంటి అంతా ఉత్తుత్త మాటలే అయి ఉంటుంది మోటివేషన్ అనిపించాలి నీకు కానీ కాదు బాబా ఇది వాస్తవం దీని గురించి బైరాగి నోట విని తెలుసుకో ఇవాళ ఒకాయనను హిప్నోటైజ్ చేస్తున్నారు ఆయన కళ్ళు మూసుకొని ఉన్నాడు.
(01:23) నీ చేతి మీద ఎర్రగా కాలే కత్తెర పెడుతున్నాను అని ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన చల్లటి కత్తెర చేతి మీద పెట్టారు. అంతే ఒక్క క్షణంలో చేతి మీద బొబ్బలు వచ్చేసాయి బాబా. అంటే మైండ్ కు నీ శరీరం మీద అంత పవర్ ఉంటుంది. మరి అయితే నేను అనుకోగానే అన్ని జరిగిపోవాలి కదా అని అడుగు. సమాధానం నేను క్లియర్ గా చెప్తా. బాబా నువ్వు మేలుకొని ఉన్నప్పుడు పని చేసే మనసు ఒకటి.
(01:45) కాన్షయస్ మైండ్. పడుకున్నప్పుడు నిద్రలో కలలు కని మనసు మరొకటి. సబ్కాన్షియస్ మైండ్. రెండు నీలో ఉంటాయి. ఇక్కడ ట్విస్ట్ వస్తుంది. అదేంటంటే నువ్వు మేలుకొని ఉన్న సమయంలో కూడా నీకు తెలియకుండా నీ లోతుల్లోంచి నీ సబ్కాన్షియస్ మైండ్ కూడా పనిచేస్తుంది. ఇందాక కీ పారేసుకున్నావే అప్పుడు నీ కాన్షియస్ మైండ్ కి నీ జేబులోనుంచి పడడం తెలియనే తెలియదు కదా నువ్వు చూడలేదు కదా కానీ నీ సబ్కాన్షియస్ మైండ్ అంత చిన్న విషయం కూడా పసిగట్టి స్టోర్ చేసేసుకుంది లోపల సమయం చూసి నీకు కీ గురించి మెడిటేషన్ లో చెప్పింది.
(02:19) నాన్న సబ్కాన్షియస్ మైండ్ పవర్ ఎంతదో విను. కాన్షియస్ మైండ్ కేవలం 5% మాత్రమే నీ ప్రవర్తనను కంట్రోల్ చేస్తుంది. కానీ సబ్కాన్షియస్ మైండ్ కనపడకుండా 95% నీకు తెలియకుండా నిన్ను కంట్రోల్ చేస్తూ ఉండే మైండ్. విను నీ మెదడు ఒక కోటి 10 లక్షల బిట్స్ ప్రతి సెకండ్ ప్రాసెస్ చేస్తుంది. కానీ అందులో నీ కాన్షియస్ మైండ్ కేవలం ఒక సెకండ్లో 40 బిట్స్ మాత్రమే హ్యాండిల్ చేస్తుంది చేయగలదు.
(02:46) నీ జ్ఞాపకాలు అలవాట్లు మొత్తం నీ సబ్కాన్షియస్ లో ఉంటాయి. కాన్షియస్ లో ఏదో కొంత కొంత స్మృతి మాత్రమే ఉంటుంది. కాన్షియస్ మైండ్ ను ఐస్బర్గ్ కి టిప్పు లాగా అంటారు. ఇప్పుడో దిమ్మ తిరిగే విషయం చెప్పనా సబ్కాన్షియస్ మైండ్ కి మరికొన్ని విద్యలు కూడా ఉన్నాయి. ఇందాకటి నీ పన్నీర్ బటర్ మసాలా కోరికను రిజిస్టర్ చేసుకొని అది తీరేలా చేసింది కూడా సబ్కాన్షియస్ మైండే.
(03:08) అదిరిపోలేదు అలాంటివి కూడా ఉంటాయి దానికి. సబ్కాన్షియస్ మైండ్ తో నువ్వు పనులు చేయించుకోగలిగితే ఆ విద్య నీకు తెలిస్తే బాబా సమృద్ధి ఎలాగో వస్తుంది. సమస్యలు కూడా దూదిపింజల్లా ఎగిరిపోయేలా చేయగలదు అది ఆ వేల సంవత్సరాల క్రితమే మన సనాతన ఋషులు దీన్ని గురించి మార్గాలు కనిపెట్టారు. ఒక పాశ్చాత్యుడు ఓసే సిల్వ రాసిన మెంటల్ డైనమిక్స్ పుస్తకం కూడా నువ్వు చదవచ్చు కావాలంటే.
(03:32) సరే నీ సబ్కాన్షియస్ మైండ్ తో నువ్వు మాట్లాడే మార్గం నేను చెప్తే సంతోషిస్తావా మరి. చెప్తాను కానీ ఈ లోపల టర్నింగ్ పాయింట్ అని కామెంట్ లో రాయి నాన్న బాబా విను నీలో ఒక తలుపు ఉంది తలుపు దాన్ని తెరిస్తే ఆ తలుపు వెనకాల శక్తులు కలిగిన నీ సబ్కాన్షియస్ సామ్రాజ్యం ఉంది. ఆ తలుపు తెరవడం నేర్చుకున్న వారు ఈ భూలోకంలో లెజెండ్లు అయ్యారు లెజెండ్లు.
(03:54) కానీ బాబా జాగ్రత్తగా వాడాలి బాధ్యతగా వాడాలి. గౌరవంతో పరిమితుల్లో చేయాలి. ఎక్కువ చేసినా తప్పుగా వాడినా ఈ టెక్నిక్ పని చేయదు అని లాక్ పెడుతున్నాను. లాక్, బాబా ఈ తలుపు నిజానికి నీలో ఒక స్థితి, మేలుకొని ఉండే స్థితి, కలలు కనే స్థితి, లోతైన నిద్ర స్థితి. ఈ మూడు నీకు తెలుసు. ఈ మూడు కానిది ఆ స్థితి. దాన్ని తంధ్ర అన్నారు.
(04:16) హిప్నాటిక్ స్టేట్ అని పిలుస్తారు. నీ లోపల తెలియకుండా ఉన్న డోర్ అదే. ఏం జరుగుతుంది ఈ స్థితిలో? ఇటు పూర్తిగా మేల్కొని ఉండవు. అటు నిద్రలోనూ ఉండవు. అదే ఈ స్థితి. నీ మేల్కొని ఉన్న మనసుకు నీ నిద్రాణమై ఉన్న మనసుకు మధ్య ఒక బ్రిడ్జి లాగా ఏర్పడుతుంది ఈ స్థితిలో ఒక టెలిఫోన్ లైన్ లాగా అన్నమాట. ఈ రెండు సగం సగం మేల్కొని ఉన్న ఈ స్థితిలో కమ్యూనికేషన్ సాధ్యమవుతుంది.
(04:40) అప్పుడు నీ మేల్కొని ఉన్న మైండ్ సాయంతో నీ సబ్కాన్షియస్ మైండ్ కి నువ్వు ఏం కావాలో చెప్పవచ్చు. ముద్దొచ్చే విషయం ఏమిటంటే నువ్వు ఏం చెప్తే అది విని తూచా తప్పకుండా నీకు చేసి పెడుతుంది. అతి శక్తివంతమైన సూపర్ మ్యాన్ వంటి నీ సబ్కాన్షియస్ మైండ్. బాబా ఈ తలుపులు తెరవడానికి ఒక రహస్యమై పద్ధతి ఉంది. ఎలా పడితే అలా తెరవలేవు. ఆ పద్ధతి ఆల్ఫా బ్రెయిన్ స్థితి గుండా సాధ్యం.
(05:06) ఆల్ఫా స్థితి అంటే ఏంటి? మామూలుగా నువ్వు రోజువారి పనులు చేసుకుంటుంటే నీ బ్రెయిన్ నువ్వు ఇచ్చే ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ 13 నుంచి 30 సైకిల్స్ పర్ సెకండ్ లేదా హర్డ్స్ వేగంతో పని చేస్తుంది. సరేనా 13 నుండి 30 హర్డ్స్ దీన్ని బీటా అంటారు. దైనందిన పనులకి ఇది అవసరం నాన్న. 12 నుండి ఎనిమిది వరకు పనిచేసేదే ఆల్ఫా స్థితి. ఈ ఆల్ఫా స్థితిలో నీ మెదడు ఎనిమిది హర్డ్స్ కి నెమ్మదిస్తుంది.
(05:31) ఆ సమయంలో నీ సబ్కాన్షియస్ మైండ్ ఆక్టివ్ అవుతుంది. కాన్షియస్ మైండ్ కూడా కొంత యాక్టివ్ గానే ఉంటుంది. ఈ రెండు అప్పుడు మాట్లాడుకోవడానికి నీ స్థితి అనుకూలంగా తయారు అయి ఉంటుంది. నాన్న అటువంటి ఆల్ఫా స్థితికి తీసుకువెళ్లే హిప్నాటిస్టులు అలవాట్లను మార్చే సజెషన్లు ఇచ్చి అలవాట్లు పోగొట్టడం ఇలాంటి ప్రోగ్రామింగ్లు చేస్తుంటారు. ఆల్ఫా స్థితికి రావాలి.
(05:52) ఆ స్థితిలో నీ సబ్కాన్షియస్ కి నువ్వు ఏదైనా పని అప్పజెప్పాలి. అంతే నీకు అది పని చేసి పెడుతుంది. ఎలా రావాలి ఆల్ఫాలోకి నువ్వు నిద్రలో జారుకుంటూ కాస్త మెలుకువ కాస్త ఏదో కల వస్తున్నట్లుగా అనిపించడం వంటి స్థితి నీకు ప్రతి రాత్రి అనుభవంలోకి వస్తూనే ఉంటుంది. గుర్తు చేసుకో అదే ఆల్ఫా స్థితి నాన్న అటువంటి స్థితిలోకి వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక మాట రిపీట్ చేస్తూ పడుకున్నావ అనుకో అది నీ సబ్కాన్షియస్ మైండ్ లోకి డైరెక్ట్ గా వెళ్లి కూర్చుంటుంది.
(06:19) నాకు పొద్దున్నే 1000 రూపాయలు వచ్చేస్తాయి. నాకు పొద్దున్నే ₹1000 రూపాయలు వచ్చేస్తాయి అనుకుంటూ పడుకో లేదా నాకు 5:00 గంటల ఒక్క నిమిషం ఆరు సెకండ్లకు మెలుకువ వస్తుంది అనుకుంటూ పడుకో కచ్చితంగా అవి చేసి పెడుతుంది నీ సబ్ కాన్షియస్ మైండ్ కాన్ఫిడెన్స్ కోసం ఇవి ట్రై చేసి చూడు నీకు జరిగిన అనుభవం ఈ వీడియో కి తిరిగి వచ్చి కామెంట్లలో పెట్టు సరేనా ఇక రెండవ పద్ధతి నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆల్ఫా స్థితిలోకి వెళ్ళగలగడం.
(06:43) ఈ పద్ధతి చిన్నగా చెప్తాను ఇవాళ ఇంతకంటే వివరంగా నీకు కావాలంటే తదుపరి వీడియోలో పెడతాను నీకు ఆసక్తి ఉంటే అది కూడా కామెంట్లలో అడగొచ్చు నువ్వు క్లుప్తంగా సులువుగా ఆల్ఫా స్థితిలోకి రావాలంటే ఇలా చెయ్యి గొడవలు లేని ఎవరు డిస్టర్బ్ చేయని ఒక ప్రశాంతమైన చోట కులాసాగా కూర్చో కళ్ళు మూసుకో మూడు దీర్ఘ శ్వాసలు తీసుకో పొట్టతో తర్వాత కాళ్ళ నుండి తల వరకు శరీరంలోని ప్రతి భాగంలోకి దృష్టి పెట్టి ఆ ఆ భాగాలను రిలాక్స్ చేసుకుంటూ పైకి రా తల వరకు వచ్చేసరికి నీ శరీరం పూర్తిగా విశ్రాంతం అవుతుంది.
(07:17) మైండ్ లో ఆలోచనలు మెల్లిగా గ్యాప్స్ తో వస్తూ ఉంటాయి. నీ బ్రెయిన్ ఆల్ఫా లోకి వచ్చేసి ఉంటుంది అంతే అప్పుడు ఏం చేస్తావంటే ఒక అందమైన పగటి కలకను రంగులతో వాసనలతో డీటెయిల్స్ తో చక్కటి కలకను ఇలాంటి భవిష్యత్తు కావాలి నాకు అని మంచి భావనతో ఎక్సైటింగ్ గా ఫీల్ అవ్వు అదయ్యాక ఒకటి నుండి ఐదు వరకు లెక్కపెట్టి మామూలు స్థితికి వస్తున్నాను అని నీకు నువ్వు చెప్పుకో మెల్లిగా కదులుతూ ఒకటి నుండి ఐదు వరకు లెక్క పెట్టి అతి మెల్లిగా కళ్ళు తెరువు మొత్తం మూడు నిమిషాలు కూడా పట్టదు కానీ ముచ్చమటలు పట్టే అద్భుత తం చేసే విత్తనం నీ సబ్కాన్షియస్ మైండ్ లో నువ్వు నాటేసావు. చాలా ముఖ్యమైన సీక్రెట్
(07:53) గురువులు నీకు పంపించారు నాన్న ఇవాళ. ఇది ప్రాక్టీస్ తో బాగా వస్తుంది. బాబా ఆల్ఫా స్థితి మొదలైన వాటి సాధన జగమంత కుటుంబం నాది మెంబర్షిప్ ఏరియాలో ఉంటుంది. సీరియస్ సాధకులకు స్వాగతం. ఆల్ఫా స్టేట్ గురించి రాబోయే తురీయం మెడిటేషన్ ట్రైనింగ్ లో విస్తారంగా తెలుసుకోవచ్చు నువ్వు. ఇక నెక్స్ట్ నీకు కనిపిస్తుంది ఒక తంబ్నెయిల్ స్క్రీన్ మీద.
(08:15) ధ్యానం వల్ల సిద్ధులు నిజమేనా అనే ఈ వీడియో చూసే మరింత క్లారిటీ నీకు వస్తుంది. బైరాగిని గుర్తుపెట్టుకో యూనివర్స్ తల్లికి కృతజ్ఞతలు చెప్పు నాతో చెప్పు బాబా జై శ్రీరామ్ జై భారత్ జై గురుదేవదత్త

No comments:

Post a Comment