ఆత్మ జ్ఞానం అంటే ఏమిటి? – రమణ మహర్షి బోధ..
https://m.youtube.com/watch?v=9vRJfw9dAgM
[00:00:00] నేను ఎవరు రమణ మహర్షి చెప్పినది ఈ ప్రశ్న
[00:00:05] సాధారణమైంది అయితే కాదు జ్ఞానం కోసం అడిగే
[00:00:09] ప్రశ్న కూడా కాదు ఇది అహంకారాన్ని
[00:00:11] కాల్చేసే అగ్ని లాంటి ప్రశ్న నేను ఎవరు ఈ
[00:00:15] ప్రశ్నకి సమాధానం బయట ఎక్కడా దొరకదు
[00:00:19] పుస్తకాల్లో దొరకదు గురువుల మాటల్లో కూడా
[00:00:22] కాదు సమాధానం ఖచ్చితంగా మనమే
[00:00:24] తెలుసుకోవాల్సిందే అసలు నేను అనేది ఏంటి
[00:00:28] ప్రతి జీవరాశిలోనూ నేను అనేది ఉంటుంది.
[00:00:31] కానీ సాధారణంగా మనం ఏమనుకుంటాం నేను ఈ
[00:00:34] శరీరాన్ని నేను ఈ పేరు నేను ఈ ఆలోచనలు
[00:00:38] నేను ఈ భావాలు కానీ రమణ మహర్షి ఏమంటారు
[00:00:41] నీకు కనిపించేది నీవు కాదు కనిపించే
[00:00:44] దాన్ని చూసేవాడివి నువ్వు శరీరం
[00:00:47] కనిపిస్తుంది కానీ నువ్వు శరీరం కాదు మనసు
[00:00:51] మారిపోతోంది కానీ మనం మనసు కాదు ఆలోచనలు
[00:00:55] వస్తున్నాయి పోతున్నాయి కానీ మనం ఆలోచనలు
[00:00:57] కాదు అప్పుడు ఏం మిగులుతుంది అదే నేను
[00:01:01] ప్రతి ఆలోచన ముందుగా ఒక మాటతో మొదలవుతుంది
[00:01:05] నేను అని అంటే నేను బాధపడుతున్నాను నేను
[00:01:09] హ్యాపీగా ఉన్నాను నాకు కోపం వచ్చింది నాకు
[00:01:11] చిరాకు వచ్చింది అని ఈ నేను ఎక్కడి నుంచి
[00:01:14] వచ్చింది అనేది తెలుసుకోవడమే మన లైఫ్ రమణ
[00:01:18] మహర్షి విధానం ఇదే ఆలోచనని ఆపొద్దు ఆలోచన
[00:01:22] వచ్చినప్పుడు అడుగు ఈ ఆలోచన ఎవరికి
[00:01:25] వచ్చింది అని అప్పుడు సమాధానం వస్తుంది
[00:01:28] నాకు అని అప్పుడు మళ్ళీ అడుగు ఈ ఆలోచన
[00:01:31] ఎవరికి వచ్చింది అని ఆ నేనే ఎవరు ఇక్కడే
[00:01:34] నిజమైన సాధన మొదలవుతుంది.
[00:01:38] నేను ఎవరు అని లోతుగా తిరిగి తిరిగి
[00:01:40] అడిగితే మనసు సమాధానం ఇవ్వలేక మౌనంగా
[00:01:44] మారిపోతుంది. ఆ మౌనం ఖాళీ కాదు ఆ మౌనమే మన
[00:01:49] నిజ స్వరూపం. అక్కడ పేరు లేదు, ఊరు లేదు,
[00:01:53] రూపం లేదు, కాలం లేదు బాధ కూడా లేదు.
[00:01:56] అక్కడ నీవు నీవుగానే ఉన్నావు. నేను శరీరం
[00:02:01] అనే భావమే అహంకారం ఈ అహంకారమే అన్ని
[00:02:04] బాధలకి మూలం అహంకారాన్ని చంపకూడదు దాన్ని
[00:02:08] పరిశీలించాలి పరిశీలనలో అది కరిగిపోతుంది.
[00:02:11] ఎలా అంటే సూర్యుడు వస్తే చీకటి
[00:02:14] పారిపోతుంది కదా అలాగే మనకు ఆత్మజ్ఞానం
[00:02:17] వచ్చినప్పుడు అహంకారం తనంతట తానే
[00:02:19] కరిగిపోతుంది.
[00:02:21] ఇప్పుడు నువ్వు ఇలా అనుకుంటావు చేయడం లేదు
[00:02:24] ఆలోచించడం లేదు కావాలని ప్రశ్నించడం లేదు.
[00:02:27] కేవలం ఉండడం దాన్ని ఏమంటారు సాక్ష్య
[00:02:30] స్థితి లేదా సహజ స్థితి లేదా సహజ సమాధి
[00:02:34] నువ్వు పని చేస్తావ్ మాట్లాడతావు కానీ నీ
[00:02:37] లోపల నిశశబ్దం మాత్రం అలాగే ఉంటుంది. నీవు
[00:02:41] ఆనందాన్ని వెతుకుతున్నావా అయితే నువ్వే
[00:02:43] ఆనందం నీవు మోక్షాన్ని వెతుకుతున్నావా
[00:02:46] అయితే నీవే మోక్షం ప్రశ్నని వదలద్దు
[00:02:50] సమాధానాన్ని కూడా కాదు ప్రశ్న వేసేవాన్ని
[00:02:53] పట్టుకోవాలి అప్పుడు మిగిలేది ఒక్కటే
[00:02:56] నేనున్నాను అని
No comments:
Post a Comment