Saturday, May 23, 2026

 *_నేటి మాట_*

*భగవంతుడు సర్వాంతర్యామి అంటారు కదా - ఎలా??*

శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులనే పంచ గుణము లుండడంచేత భూమి చాలా భారంగా ఉన్నది. 

జలములో శబ్ద, స్పర్శ, రూప, రసాలున్నాయిగాని, గంధము లేదు, ఆ ఒక్క గుణము తగ్గిపోవడంతో దీనికి కదలిక వచ్చింది,
మూడవది అగ్ని... 
ఇందులో శబ్ద, స్పర్శ, రూపములున్నాయిగాని, రస గంధాలు లేవు, అందువల్ల ఇది పైకి పోతుంది. 

నాలుగవది వాయువు,
ఇందులో శబ్ద, స్పర్శ గుణాలు రెండు మాత్రమే ఉన్నాయి; రూప, రస, గంధములు లేవు. 
మూడు గుణాలు తగ్గేసరికి ఇది ఎంతో తేలికైపోయి సర్వత్రా సంచరిస్తూ ఉంటుంది. 

ఐదవది ఆకాశము,
దీనికి శబ్దమొక్కటే ఉన్నది; స్పర్శ, రూప, రస, గంధాదులు లేవు, కనుక, ఆకాశం ఎక్కడ చూసినా వుంటుంది. 
ఇది ఒకే గుణంతో ఉన్నది కనుక, అంతటా ఉన్నది. 

*భగవంతునికి ఆ ఒక్క గుణం కూడా లేదు కాబట్టి, అతడు సర్వాంతర్యామి*.

          *_🪻శుభమస్తు🪻_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

No comments:

Post a Comment