Sri Rama Krishna Paramahansa garu cheppina kathalu ( శ్రీ రామకృష్ణ పరమహంస గారు చెప్పిన కథలు )
Author Name:Malladi kailasanadh Spiritual Talks
Youtube Channel Url:https://www.youtube.com/@malladikailasanadhspiritua3637
Youtube Video URL:https://www.youtube.com/watch?v=oU-qsFXhGck
Transcript:
(00:01) శ్రీ గురుభ్యో నమః శ్రీరామకృష్ణ పరమహంస గారు మనలో మార్పును తీసుకువచ్చే ఎంతో గొప్ప ఆధ్యాత్మిక విషయాన్ని చిన్ని కథల ద్వారా మనకు ప్రసాదించారు. అటువంటి ఒక కథను ఈరోజు చెప్పుకుందాం. దక్షిణేశ్వర దేవాలయంలోని నహబత్ పైన ఉన్న ఒక గదిలో ఒక సాధువు కొంతకాలం నివసించాడు. అతడు ఎవ్వరితోనూ మాట్లాడేవాడు కాదు ఎల్లప్పుడూ భగవన్ నామ స్మరణలో మునిగి ఉండేవాడు ఒకరోజున అకస్మాత్తుగా ఒక నల్లటి మొబ్బు ఆకాశాన్ని పూర్తిగా కప్పి వేసింది.
(00:46) ఆ వెంటనే ఒక పెద్ద గాలి వచ్చి ఆ మొబ్బును తొలగించి వేసింది. మళ్ళీ సూర్యుడు ఎప్పటిలాగా ప్రకాశించసాగాడు. ఆ సాధువు అప్పుడు నహబత్త బయటకు వచ్చి బిగ్గరగా నవ్వుతూ నృత్యం చేయడం మొదలు పెట్టాడు. అప్పుడు గురుదేవులు శ్రీరామకృష్ణ పరమహంస గారు ఆయన దగ్గరికి వెళ్లి అయ్యా సాధారణంగా గదిలో నుండి బయటకి రాకుండా మీరు కాలం గడుపుతారు కదా ఈరోజు బయటకు వచ్చి ఆనందంతో నృత్యం చేస్తున్నారే ఎందుకు ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నారు అని అడిగారు ఆ సాధువు మాయ జీవితాన్ని ఎలా కప్పి ఉంచుతుందో ఈరోజు ఆకాశంలో చూశాను అన్నాడు అంటే మాయ ఈ మొబ్బు
(01:32) ఎట్లా అయితే వచ్చి అలా కప్పేసిందో అలానే మాయ కూడా జీవితాన్ని కప్పి ఉంచుతుందట అండి ఈ మొబ్బు మళ్ళీ వీడిపోతుంది కదండీ మొబ్బు ఏం శాశ్వతం కాదు కదా మళ్ళీ అటు ఇటు కదులుతుంది కదా అలానే ఈ మాయ జీవితాన్ని కప్పి ఉంచుతుంది మళ్ళీ ఈ మొబ్బు తొలగించి వేయబడుతుంది గురుదేవులు మాయా స్వభావాన్ని వివరిస్తూ పై సంఘటనను చెప్పి ఇంకా ఇలా అన్నారు.
(01:59) మొదట నిర్మలమైన ఆకాశం ఉంది అకస్మాత్తుగా ఒక మొబ్బు దాన్ని కప్పివేసింది. ఆ వెంటనే అది చెదిరిపోయి మళ్ళీ అన్ని యధాప్రకారంగా అయిపోయాయి. మాయ స్వభావం కూడా ఇదే విధంగా ఉంటుంది. మాయను ఎలా వదిలించుకోవాలో గురుదేవులు ఈ క్రింది కథ ద్వారా వివరించారు. తీవ్ర వైరాగ్యం అలవడినప్పుడు మనకు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. కామకాంచనాలే మాయ. కామము అంటే కోరిక అండి కాంచనము అంటే బంగారం అనే కాదు డబ్బులు అన్ని అనుకోవచ్చు మనం కామకాంచనాలు ఈ రెండు అదే మాయ మనం ఎప్పుడు ఈ విషయాన్ని తెలుసుకుంటామో అప్పుడు మాయ మనల్ని వదిలి పారిపోతుంది.
(02:47) ఒకడు పులితోలు కప్పుకొని మరొకడిని భయపెట్టడానికి ప్రయత్నించాడు అయితే వాడు బెదరకుండా ఒరే హరి నువ్వు ఎవరో నాకు తెలుసులేరా వేషం వేసినంత మాత్రాన నిన్ను కనిపెట్టలేనా అన్నాడు దానితో ఆ పులితోలు కప్పుకున్నవాడు నవ్వుతూ ఇంకొకడిని బెదిరించడానికి వెళ్ళిపోయాడు అని మాయను ఎలా వదిలించుకోవాలో గురుదేవులు వివరించారు అంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఇవి కలిగినప్పుడు మాయ మనల్ని వదిలి పారిపోతుందండి ఇప్పుడు ఆ పులితోలు కప్పుకున్న వాడిని వీడు ఏమన్నాడు నువ్వు ఎవరో నాకు తెలుసులేరా అన్నాడు కదండీ అప్పుడు ఇంక వాడు వెంటనే ఇంకొకడిని బెదిరించడానికి వెళ్ళిపోయాడట అలాగే అసలు నిజం ఏమిటో అసలు
(03:35) శాశ్వతం ఏమిటో అది మనం తెలుసుకుంటే అంటే భగవంతుని మనం తెలుసుకుంటే ఈ మాయ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అనిని మనకి చక్కటి కథ తెలియజేశారండి స్వస్తి వాసుదేవా
No comments:
Post a Comment