మనోధైర్యం గొప్పది
-------------------------------
కష్టాలు వచ్చినా
నష్టాలు తెచ్చినా
కోల్పోకు ధైర్యాన్ని
ఘనమైన నమ్మకాన్ని
తరమాలి కలవరాన్ని
చూపాలి కనికరాన్ని
కాస్త గుర్తించాలి
పేదోడి అవసరాన్ని
చేసిన సహాయాన్ని
చూపిన మమకారాన్ని
ఏమాత్రం మరువకు
కృతఘ్నతే చూపకు
కాసింత మంచితనము
అదేనోయ్! గొప్పతనము
పదే పదే శోధింప
అది ఘన దైవగుణము
-గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
No comments:
Post a Comment