మళ్ళీ మళ్ళీ రాని రోజులు
(మరువలేని అలనాటి బాల్యపు సంగతులు)
****************************
ఇంకా సామాన్యుని చేయి దాటకుండా
కార్పోరేట్ మకిలి ముట్టకుండా ఉండబెట్టేనేమో
బహుశా! వీటిని ఇంత సహజంగా...
ఇంత స్వచ్ఛమైన మనసుల దగ్గర చొరబడి...
నా పసితనపు జ్ఞాపకాల్ని
మనస్ఫూర్తిగా తీర్చుకోగలిగాను!!
ఒకనాడు కవుతరం చెక్ పోస్ట్(గుడివాడ-మచిలీపట్నం మార్గం @కృష్ణాజిల్లా) దగ్గర "ఈతకాయల్ని" కొంటూ
చిన్ననాటి ముచ్చట్లతో ఇలా ఒదిగిపోతూ...!
తీరా మా ఇంటికి వీటిని తీసుకెళ్లాక
మా అమ్మాయ తింటూ ఆస్వాదిస్తూ....
ఒహ్! వెరీ టేస్టీ....!
"వాట్ ఈజ్ దిస్?" అనే సరికీ!
ఓ ముప్పై సంవత్సరాల నాటి నా కథను చెప్పక తప్పలేదు!
బహుశా! ఈ ఈతకాయలతో పాటు నా కథ కూడా బాగా నచ్చినట్లు ఉంది...
"సో ఇంట్రస్టింగ్!" అని తన నోట రెండు ఇంగ్లీష్ ముక్కలు!
నా కంట రెండు కన్నీటి చుక్కలు!!
ఎందుకంటే...
ఏ.....
వేదనలూ
రోదనలు
బాధలూ
బంధనాలు
బాధ్యతలు
ఆటుపోట్లు
అలజడులు
అవధులు
అంతరాలు
కుళ్లు కుతంత్రాలు
కల్మషాలు లేని
చిన్ననాటి తీపి గుర్తులు మళ్ళీ రమ్మన్నా రావు గదా!
మై డియర్ మోడరన్ మమ్మీస్
వేర్ ఈజ్ మూన్? పిల్లలు అడిగితే...
చూపించాల్సింది మొబైల్ లో ఇమేజ్ ని కాదు
ఓ చల్లని పున్నమి వెన్నెల రాత్రిలో
వినీల ఆకాశం వైపుకు చూపిస్తూ...
అలా కొన్ని 'చందమామ' కథలు' చెప్పండి.
అప్పడప్పుడైనా ఇలా కొన్ని 'తెలుగు' కబుర్లు చెప్పండీ
మీకూ తెలియకుంటే నేర్చుకునైనా....
నేటి రోజుల్లో ఏదైనా నేర్చుకోడానికి...
సాంకేతికతకు కొదవేముంది
మనకే తీరిక,కోరిక ఉండాలి గాని!
****************************
మాధవరావు మోకా
(తెలుగు విభాగము)
@కడియాల రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
కాటరు,కృష్ణాజిల్లా
💐💐💐💐💐💐💐
No comments:
Post a Comment