Saturday, May 23, 2026

 *ఆచార్య సద్బోధన*
                  ➖➖➖✍️

*మనం చేసే దానం ఎలా ఉండాలంటే...*
*"దానం అనేది ఒక బాధ్యత! మంచి సమయంలో, మంచి ప్రదేశంలో, మంచి ఉద్దేశంతో, సరైన వాడికి తిరిగి ప్రతిఫలం ఆశించకుండా చేసిన దానాన్ని ‘సాత్విక దానం’ అంటారు!*
*ప్రతిఫలం ఆశించి, మళ్ళి తిరిగి రావాలనే భావంతో, బలవంతంతో, డంబము, పేరుకోసం మోహమాటంగా ఇష్టం లేకున్నా చేసే దానాన్ని ‘రాజసిక దానం’ అంటారు!*
*సందర్భమే లేకున్నా, అనువుకాని చోట, యోగ్యత లేని వారికి, అగౌరవంగా, అవమానకరంగా ఇచ్చే దానాన్ని ‘తామసిక దానం’ అంటారు.*
*ఈ కాలంలో చాలా మంది చేసేవి రాజసిక దానాలే! ఒకరికి సహాయం చేస్తే ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని తిరిగి మనకేమైనా రావాలి అనే భావంతో చేసేవే!*
*ఫలాపేక్ష లేకుండా దానం చేసే వాళ్ళు ఈ కాలంలో అరుదు!*
*ఇచ్చే దానం నేను ఇస్తున్నా అనే తలపు నుండి ఏది నాది? ఏది ఎవరిది? అనే ప్రశ్నల నుండి అంతా పరమాత్మునివే..*
*నేను, నాప్రాణం, నా ఆస్తి, నా కుటుంబం, నాది ఇలా అన్ని ఆ పరమాత్మునిలోవే, దేనికీ మనం యజమానులం కాదు అనే భావన పూర్తిగా వచ్చాక చేసే దానం చాలా గొప్పది!*
**అప్పుడు జీవితంలో కూడికలు ఉండవు! తీసివేతలు ఉండవు*🌹🙏 సర్వేజనాః సుఖినోభవంతు

No comments:

Post a Comment