ఎన్నడూ వదలుకోకు
-------------------------------
మంచి చేసిన వ్యక్తులను
నమ్మకమైన మిత్రులను
ఎన్నడూ వదలుకోకు
జీవితంలో దైవమును
ప్రేమించే మనుషులను
బ్రతుకున తల్లిదండ్రులను
ఎన్నడూ వదలుకోకు
బుద్ధి నేర్పే గురువులను
మేలు చేసే తరువులను
అందమైన మొక్కలను
ఎన్నడూ వదలుకోకు
ఇల శ్రేయోభిలాషులను
శ్రేష్టమైన బంధాలను
విశ్వంలో అందాలను
ఎన్నడూ పాడు చేయకు
పచ్చని కాపురాలను
-గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
No comments:
Post a Comment