🙏 What Is True Bhakti? 😨 The Secret Most Devotees Don’t Know! 🌼 | @gurupadesham
Author Name:Gurupadesham
Youtube Channel Url:https://www.youtube.com/@gurupadesham
Youtube Video URL:https://www.youtube.com/watch?v=PlTxMIQG_7Q
Transcript:
(00:00) ఓం శ్రీ గురు ఉపదేశం హాయ్ మనం చాలాసార్లు భక్తి అనే ఒక పదాన్ని భక్తుడు అనే ఒక పదాన్ని చాలా కేర్లెస్ గా వాడేస్తాం. ఇతను దేశభక్తుడు అతను గణపతి భక్తుడు ఇతను సాయిబాబా భక్తుడు వీళ్ళు చేస్తుంది భక్తి వాడికి భక్తి చాలా ఎక్కువ ఇలాంటి పదాలు మనం వాడతాం. అందులో అసల భక్తి అంటే ఏంటో మనం తాత్వికంగా మాధవ శర్మ గారి దగ్గర నుంచి తెలుసుకుందాం.
(00:30) నమస్కారం అండి నమస్తే భక్తి చాలా భక్తులు ఉన్నారు మన దగ్గర సో దేశభక్తుల దగ్గర నుంచి మన అన్య దేవతలు చాలామంది దేవతలు భక్తుల వరకు అందరినీ భక్తులని అంటాం. ఏం చేస్తున్నాడు వాడికి భక్తి చాలా ఎక్కువ అని మనం వాడతాం ఆ డైలాగ్ అసలు భక్తి అంటే ఏంటండి భక్తి అనే పదానికి అనేకమంది అనేక నిర్వచనాలు చెప్పారు. భక్తి అంటే రూపగోస్వామి వారు ఒక నిర్వచనం చెప్పారు.
(01:09) అన్యాభిలాషితా శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తి ఉత్తమ ఉత్తమమైన భక్తి అంటే ఏమిటి అంటే జ్ఞాన కర్మలతో కలిసి ఉన్నది కాకుండా ఏ రకమైన కోరికలు అంటే వ్యాపార ధోరణితో చేసేది కాదు భగవంతుడి నుంచి నాకు నేను ఎందుకు ప్రార్థిస్తాను అంటే నా ఈ కోరికలు తీరాలి కాబట్టి నేను ప్రార్థిస్తాను అలా అనుకోకుండా చేసేది ఏ రకమైన కర్మకాండలతో కానీ తర్వాత జ్ఞాన ప్రయాస తో కానీ కూడినది కాదు కాకుండా కృష్ణానుశీలనం కృష్ణుని చేరుకోవడానికి ఒక బాంధవ్యం తోటి చేసేది ఉత్తమ భక్తి ఉదాహరణకి ప్రహ్లాదుడు కూడా కృష్ణుని తలుచుకున్నాడు ఎప్పుడు శిశుపాలుడు కూడా కృష్ణుడిని తలుచుకున్నాడు
(01:50) కానీ శిశుపాలుడిది ఉత్తమ భక్తి కాదు అది వైరభక్తి అంటే వైర భావంతోటి భగవంతుని తలుచుకుంటున్నాడు ఈయన ప్రేమ భావంతోటి భగవంతుని తలుచుకుంటున్నాడు. కృష్ణానుశీలనం భక్తి వృత్తం ఏదైతే అనుకూలంగా ఆనుకూల్యైన కృష్ణానుశీలనం అలా తర్వాత రిషికేన ఋషికేశ సేవనం భక్తి రుచ్చతే అని శాస్త్రంలో చెప్పారు. అంటే ఋషికేశున్ని కృష్ణుని ఋషికేనములతోటి అంటే ఇంద్రియాలతోటి సేవించడం భక్తి అన్నారు.
(02:20) ఇలా అనేకమంది అనేక భక్తికి నిర్వచనం చెప్పారు నారద మహర్షి అలా తర్వాత శండిల్య మహర్షి వీళ్ళిద్దరు భక్తి సూత్రాలు రాశారు. నారద మహర్షి కొన్ని సూత్రాలు ఆ తర్వాత శండిల్య ఋషి కొన్ని సూత్రాలు రాశారు. వీటిని నారద భక్తి సూత్రాలు అంటారు వాటిల్ని శండిల్య భక్తి సూత్రాలు అంటారు. సహజంగా మన వైదిక సాంప్రదాయంలో ధర్మశాస్త్రమైన అర్థశాస్త్రమైన కామశాస్త్రం అయినా మోక్ష శాస్త్రం వేదాంత శాస్త్రమైన ఏవైనా సూత్రబద్ధంగా సూత్రాల రూపంలో రాయబడ్డాయి.
(02:46) అలాగే భక్తి కూడా ఇలా సూత్రాలుగా రాశారు ఆ రాసేటప్పుడు అనేకమంది చెప్పిన భక్తికి వాళ్ళు ఇలా చెప్పారు వీళ్ళు ఇది చెప్పారు వాళ్ళు అది చెప్పారు వాళ్ళంతా చెప్పిన తర్వాత వాళ్ళ సొంత అభిప్రాయం చెప్తారు అన్నమాట చివరికి నారదముని ఏం చెప్పారంటే భక్తి అంటే ఏమిటి అంటే యథా వ్రజగోపికానాం వ్రజగోపికలు చేసిందే భక్తి అన్నాడు ఆయన చూడండి ఆయన ఆజన్మ బ్రహ్మచారి మహాజనుడు సన్యాసి పరివ్రాజకుడు ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఆ వ్రజగోపికలు చేసిందే భక్తి బృందావనంలో ఉన్న గోపిక లు వాళ్ళు చేసిందే భక్తి అన్నారు అలాగే శ్రీ చైతన్య మహాప్రభువు వారు కూడా ఆయన కూడా చెప్పారు
(03:22) ఆరాధ్యో భగవాన్ వ్రజేశతనయః తద్ధామ వృందావనం రమ్యాకాచిదుపాసన వ్రజవధు వర్గేన యాకల్పిత అన్నాడు రమ్యాకాచిదుపాసన ఆ రమ్యమైన ఉపాసన అదే భక్తి వ్రజవధు వర్గేన యాకల్పిత ఏదైతే ఆ వ్రజవధువులు చేశారో ఆ వృందావనంలో గోపిక చేశారో అదే భక్తి ఈ మాటే అందరూ చెప్తున్నారు నారదముని భాగవతంలో కూడా చెప్పారు ఇంకా ఇతర చోట్ల చెప్పారు అనేకమంది భక్తికి అనేక నిర్వచనాలు చెప్పారు కానీ అన్నిటికంటే సర్వోత్కృష్టమైనది ఏమిటి అందరూ అంగీకరించేది ఏమిటంటే ప్రజగోపికలు చేసిందే భక్తి అన్నారు వాళ్ళు ఏం చేశారు సర్వకాల సర్వావస్థల్లో వాళ్ళు భగవంతున్నే తలుచుకునేవాళ్ళట వాళ్ళు
(04:10) పిల్లలకు వాళ్ళ బాగోగులు చూస్తున్నప్పుడు అన్నం వండేటప్పుడు పాలు పితికేటప్పుడు ఇల్లు ఊడిచేటప్పుడు ఏ సర్వకాల సర్వావస్థల్లో అన్ని సమయాల్లో కూడా ఆ భగవంతుే తలుచుకుంటున్నారు ఆయన్నే ప్రేమిస్తున్నారు అది భక్తి అంటే భక్తి అంటే ప్రేమ ప్రేమ పూర్వకమైన సేవ మనం ఎవరికైనా చెప్పా నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని ఎవరికైనా చెప్పామ అనుకోండి వాళ్ళ కోసం మనం ఏం ఖర్చు పెట్టాం వాళ్ళ కోసం ఏం చేయం అందులో సేవాభావం లేకపోతే అది ప్రేమ కాదు అది కామం కానీ భక్తి అంటే ఏమిటంటే ప్రేమ పూర్వక కమైన సేవ అది ఎలా ఉండాలి అంటే అహైతుకి అప్రతిహత అహైతుకి అంటే ఏమిటి అంటే కారణం లేనిది
(04:54) నిష్కారణమైనది అదేమిటి భక్తికి కారణం లేకపోవడం ఏమిటి అని ప్రశ్నిస్తారు. భక్తికి కారణం ఏమిటి అంటే చాలామంది భగవంతుడి కృప వల్ల భక్తి కలుగుతుంది కాబట్టి భగవంతుడి కృప కారణం అంటారు. కానీ భగవంతుడి కృప కారణం అయితే కొంతమందికి భక్తి ఉంది కొంతమందికి లేదు అలాంటప్పుడు భగవంతుడిలో వైశమ్యం ఉంది ఎందుకంటే వీళ్ళకి ఇస్తున్నాడు వాళ్ళకి ఇవ్వట్లేదు కాబట్టి భగవంతుడిలో వైశమ్యం లేదు కాబట్టి భగవంతుడి కృప కారణం కాదు కొంతమంది చెప్తారు భక్తుల కృప కారణం నిజమే కొంతవరకు భక్తుల కృప కారణం కానీ భక్తుల కృపలో భగవంతుని కృప అంతర్భాగం కొంతమంది చెప్తారు భక్తుల కృప
(05:31) కూడా కారణం కాదు భక్తుల సాంగత్యం వల్లే భక్తుల కృప కలుగుతుంది మనం సాంగత్యంలోకి వస్తే మనకు వాళ్ళు కృప చూపిస్తారు కాబట్టి భక్తుల సాంగత్యం భక్తికి కారణం అంటారు కొంతమంది అంటున్నారు అది కూడా కారణం కాదు ఎందుకంటే భక్తుల సాంగత్యం కూడా భక్తిలో భాగమే కాబట్టి భక్తికి భక్తియే కారణం భక్తి సంజాయతే భక్తిహి భక్తి వల్ల మాత్రమే భక్తి కలుగుతుంది.
(05:58) కారణం లేనిది భక్తి అన్నారు. అలాగే అహైతుకి అప్రతిహత అప్రతిహత అంటే నిరంతరం కొనసాగేది నిరాటంగా కొనసాగేది దానికి విఘ్నాలు లేనిది అకుంటితమైనది అచంచలమైనది ఆగిపోకుండా సాగిపోయేది అది భక్తి భగవంతుడి పట్ల ప్రేమ ఆగిపోకుండా నిరంతరం సాగిపోయేది ఏ రకమైన అవాంతరాలు లేకుండా ఉండేది ఫలాపేక్ష లేకుండా ఉండేది చాలా మంది తిరుపతికి ఎందుకు వెళ్తున్నావు అంటే నా కోరికలు తీర్చుకోడానికి తిరుపతికి వెళ్తున్నాను లేకపోతే ఒక చిలుకూరు బాలాజీ మందిరానికి వెళ్తున్నాను అని చెప్తారు అది భక్తి కాదు భక్తి దానిలో వ్యాపార ధోరణ ఉండదు. తర్వాత అన్య దేవతల ఆరాధన అన్య
(06:40) దేవతలని సేవించడం అది భక్తి కాదు శాస్త్రంలో చెప్పారు భక్తి అంటే భగవంతుడు అతోక్షజుడు ఎవ్వరైతే అక్షరాలకు అతీతుడో అతనికి మాత్రమే చేసేది భక్తి అనేది చెప్పారు కాబట్టి ఈ భక్తి అనేదాన్ని మనం ఊత పదంగా వ్యవహరిస్తుంటాం ఒక్కోసారి చెప్తుంటాం వాడికి పితృ భక్తి ఉంది మాతృభక్తి ఉంది దేశభక్తి ఉంది ఇంకా భార్యా భక్తి ఉంది అని ఇవన్నీ చెప్తూ ఉంటాం అవన్నీ ఈ పదాన్ని అలా వాడుతున్నాం మూత పదంగా కానీ నిజానికి భక్తి అంటే భగవంతుడైన విష్ణువుకు చేసేది మాత్రమే భక్తి అందులో సర్వోత్కృష్టమైనది చెప్పుకున్నాం ఏ రకంగా అయితే గోపికలు సర్వకాల సర్వావస్థల్లో
(07:22) భగవంతుే సేవించారో అది మాత్రమే భక్తి మీరు చాలా పెద్ద నిర్వచనం చెప్పారు కానీ ఒక సింప్లిఫైడ్ వర్షన్ లో నాకు అర్థమయింది ఏంటంటే ఏ ఫలాపేక్ష లేకుండా అంటే అంటే నథింగ్ ఇన్ ఎక్స్చేంజ్ నథింగ్ ఇన్ రిటర్న్ నన్ను మీరు ద్వేషించినా నన్ను మీరు ఇష్టపడ్డా నేను మిమ్మల్ని ఇష్టపడితే అదే భక్తి అంటే ఎటువంటి అపేక్ష లేదు ఎటువంటి లాజిక్ లేదు.
(07:53) అంతే కదా సో ఏ ఎక్స్చేంజ్ రిలేషన్షిప్ లేకుండా ఎక్స్చేంజ్ ఉంది కానీ భౌతికమైన ఎక్స్చేంజ్ లేదు అదే ఇహమైన ఎక్స్చేంజ్ ఏది లేకుండా కేవలం ప్రేమ పూరిత సంబంధం మాత్రమే అది ఉంటే అది భక్తి అందుకే మీరు గోపికలతో పోల్చారు అందుకని గోపికలతో కానీ ఇక్కడ మీరు అన్య దేవతలది భక్తి ఎలా కాదు అంటారు ఇప్పుడు శివుడి మీద నయనమార్లకు ఉన్నది భక్తిా కాదా అంటే అది కూడా ఒక రకమైన భక్తే కాకపోతే భక్తి అనే పదానికి కి అనేకమంది వైష్ణవాచార్యులు ఏం చెప్పారంటే అది విష్ణువు పట్ల కలిగిన ప్రేమను మాత్రమే వాళ్ళు భక్తి అన్నారు.
(08:31) కానీ ఒక్కొక్కసారి ఉదాహరణకి చూడండి ఇప్పుడు చెప్తుంటారు కృష్ణ జయంతి అక్కడ ఏం చెప్పారంటే జయంతి అనేది నక్షత్రాలు గ్రహాలు ఒక పర్టికులర్ గ్రూప్ లో ఉన్నప్పుడు దాన్ని జయంతి అంటారు. అవన్నీ కొన్ని కొన్ని కలుసుకున్నప్పుడు ఆ జయంతి అనే పదం ఇంకా దేనికి వాడకూడదు ఉదాహరణ కృష్ణ జయంతికి మాత్రమే వాడాలి మనం దాన్ని వామన జయంతికి వాడలేం ఆ తర్వాత గాంధీ జయంతికి వాడకూడదు ఇంకో జయంతికి వాడకూడదు ఇంకో జయంతికి వాడకూడదు అని వాడుతున్నారు కదా వాడుతున్నారు ఎందుకంటే అది కొలోకియల్ లాంగ్వేజ్ లో అలా ఆ పదాన్ని వాడుతూ ఉంటాం.
(09:07) ఇలాగే భక్తిని కూడా అనేక చోట్ల చెప్పారు కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే భక్తి అంటే విష్ణు భక్తి హరిభక్తి భక్తి అది శాస్త్ర ప్రమాణంగా భాగవతం చెప్తుందా ఆ శాస్త్ర ప్రమాణంగా భాగవతం చెప్తోంది భాగవతాన్ని వ్యాఖ్యానించిన ఆచార్యులు కూడా చెప్తున్నారు సో అల్టిమేట్లీ మీరు ఏం చెప్పారంటే మాధవ శర్మ గారు భక్తి అనేది కేవలం శ్రీమన్నారాయణుడికి శ్రీమహా విష్ణువుడికి కృష్ణుడికి రాముడికి మాత్రమే ఆపాదించారు మీరు కన్నప్ప పేరే భక్త కన్నప్ప అంటే శివుడికి చేసే భక్తి అది భక్తి కాదని అని మీరు చెప్తున్నారు.
(09:38) దుర్గకు చేసే భక్తి భక్తి కాదని మీరు చెప్తున్నారు. అసలు ఇది ఎలా చెప్పగలరు అసలు అది నేను అలా అని చెప్పట్లేదు నిజానికి శివుడు ఎవరు రుద్రాణం శంకరస్చాస్మి విత్తేషో యక్షరక్షశాం వసునాం పావకస్చాస్మి మేరు శికరినామహం అన్నాడు భగవంతుడు విభూతి యోగంలో రుద్రుల్లో నేనే శంకరుని అంటున్నారు ఆ విధంగా చూసుకుంటే శివభక్తి కూడా పరోక్షంగా కృష్ణ భక్తి అలాగే అనేకమంది నేను చెప్పేది ఏ శ్లోకం అండి ఇది భగవద్గీతలో భగవద్గీతలో 10వ వ అధ్యాయంలో 23వ శ్లోకం ఇంత క్లియర్ గా చెప్పేసాడా కృష్ణుడు ఆ ఏమ ఏంటి దాని అర్థం ఏమిటి అంటే రుద్రుల్లో నేను శంకరుని అన్నాడు
(10:20) యక్ష రాక్షసుల్లో నేను కుబేరుని అంటే వీళ్ళు నా విభూతులు అని అలాగే వసువుల్లో నేను వాయువుని మేరు శిఖరినామహం అంటే పర్వతాల్లో నేను మేరు పర్వతాన్ని అంటున్నారు రుద్రులో ఆయనే శంకరుడు అంటున్నారు అంటే శంకరుడికి కృష్ణుడికి భేదం లేదు శంకరుడికి కృష్ణుడికి భేదం ఉందా భేదం లేదా అనేది ఒక పెద్ద తాత్వికమైన చర్చ ఇక్కడ విభూతి యోగంలో ఆయన ఏం చెప్తున్నారు అంటే శంకరుడు నా విభూతి ఆ రుద్రుల్లో శంకరుని నేనే అని చెప్తున్నారు భగవంతుడు మ్ సో దీన్ని బట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే శివభక్తి కృష్ణ భక్తియా కాదా అంటే ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా అవును
(11:07) ఎందుకంటే దేవతలందరూ కూడా భగవంతుడి యొక్క వివిధ అంగాలు ఆ విధంగా దేవతలను ఆరాధిస్తే అది కూడా భగవంతుని ఆరాధించినట్లే ఎప్పుడు మనకు వాళ్ళందరూ భగవంతుడి యొక్క అంగాలు భగవంతుడి యొక్క ప్రతినిధులుగా మనం భావించి చేస్తే అలా లేదంటే వాళ్లు సర్వ స్వతంత్రులు వాళ్ళు కూడా భగవంతుడితో సమానము అని మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో అటువంటి భక్తి అది శాస్త్రోచితమైన భక్తి కాదు సో అన్య దేవతారాధన చేసేవాళ్ళు ఎవరు భక్తులు కాదు అన్య దేవతారాధన చేసే వాళ్ళు ఎవరు భక్తులు కాదని నేను అనట్లేదు ఎందుకంటే వేదము పురాణము కూడా మన సనాతన ధర్మంలోనే పంచోపాసన
(11:54) దేవతారాధన ఇవి ఉన్నాయి కానీ దేవతలందరినీ ఏదే శ్రద్ధ ప్రతి ఒక్కలకు అనేక దేవతల పట్ల శ్రద్ధ ఉంది ఉదాహరణకు భగవద్గీతలో చెప్తున్నారు యోయోం తనుం భక్తః శ్రద్ధయ ర్చితమిచతి తస్య తస్యచలం శ్రద్ధాం తామేవ విదధామ్యహం అని భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు అంటే ఎవరెవరికి ఏ ఏ దేవతల పట్ల శ్రద్ధ ఉందో ఆ అదంతా కూడా నావల్లే కలుగుతోంది ఎవరైనా వాళ్ళని ఏవైనా కోరికలు అడుగుతుంటే ఆ కోరికలు కూడా నేనే తీరుస్తున్నాను అంటున్నారు ఎందుకంటే దేవతలందరూ భగవంతుని యొక్క ప్రతినిధులు భగవంతుడి యొక్క అంగాలు ఆ విధంగా కాబట్టి ఎప్పుడైతే మనము వాళ్ళని కూడా కృష్ణుడిలాగా స్వతంత్రుడు స్వరాట్
(12:39) అనుకొని మనం సేవిస్తున్నామో అప్పుడు అటువంటి భక్తి కలిగితే అటువంటి భక్తిని మనం నిజమైన భక్తి అనం సో మరి భాగవత ప్రమాణంగా ఏంటి భక్తి అంటే భాగవతం ప్రమాణంగా ఏమిటి భక్తి అంటే సవైపుంసాం పరోధర్మః యతో భక్తి రథోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసిీదతి భాగవతం ప్రకారం భక్తి అంటే ఏమిటంటే అతోక్షజుడు మన అక్షర మాలలో మొదటి అక్షరం అ చివరి అక్షరం క్ష అక్షజము అంటే అక్షరాల నుంచి పుట్టింది అదోక్షజము అంటే అక్షరాలకు అతీతమైంది అతి సులువుగా అక్షరాలతోటి నిర్వచించలేకపోయేది ఆ భగవంతుని కాబట్టి అదోక్షజుడైన భగవంతుని సేవించడమే భక్తి
(13:26) ఎలాగ అహైతుకి అప్రతిహత అంటే ఫలాపేక్ష లేకుండా ఫలానుసంధానం ఫలతృష్ణ లేకుండా అహైతుకి అప్రతిహత అలాగే ఆటంక రహితంగా అకుంటితంగా అచంచలంగా ఆయన్ని సేవిస్తే అదే భక్తి ఇటువంటి భక్తి వల్ల ఏ ఆత్మ సుప్రసీదతి ఆత్మ సంతృప్తి కలుగుతుంది. అదే భాగవతం ప్రకారం భక్తి సో మీరు ఒకడు భక్తుడు ఇతను భక్తుడు వాళ్ళు భక్తులు అనే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? భక్తులు అనేకమంది మంచి వాళ్ళు ఉన్నారండి.
(14:04) వాళ్ళు కర్మిష్టులు అంటారు వాళ్ళని అంటే వేదశాస్త్రానుసారంగా నిత్య నైమిత్తిక కర్మలను నిర్వర్తించుకునేవాడు వాళ్ళకంటే జ్ఞాని గొప్పవాడని భగవద్గీత చెప్తుంది కర్మిభ్యస్చదికో జ్ఞాని ఆ జ్ఞాని కంటే కూడా యోగి గొప్పవాడు అటువంటి యోగులందరిలో కూడా భక్తి యోగి చాలా గొప్పవాడు భక్తులకు నేను ఇచ్చే సందేశం ఏమిటంటే వాళ్ళు భగవంతుని అర్థం చేసుకోవడంలో వాళ్ళు సరైన మార్గంలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు భక్తి యోగాన్ని ఎంచుకున్నారు.
(14:39) వాళ్ళు అతి త్వరలో అంటే ఈ జీవితంలోనే భగవంతుడిని చేరుకుంటారు అంటే ఇది ఈజీ ప్రాసెస్ అన్నిటికంటే భక్తి అన్నిటికంటే సులభమైన మార్గం దానికి భగవంతుని చేరుకోవడానికి దానికి ప్రమాణం ఏమిటి అంటే భగవంతుడే భగవద్గీతలో చెప్తున్నారు 11వ అధ్యాయంలో ఒక చోటో చెప్పారు 11వ అధ్యాయంలో ఏం చెప్పారంటే భక్త్యా మాం అభిజానాతి భక్తులకు మాత్రమే నేను అవగతం అవుతాను అని చెప్పారు ఇంకా ఇంకా అనేక చోట్ల కూడా చెప్పారు ఏవైతే నా దర్శనాన్ని నువ్వు చూస్తున్నావో ఓ అర్జున అది జ్ఞానులు కానీ యోగులు కానీ మిగతా వాళ్ళు ఎవ్వరు చూడలేరు యజ్ఞ దాన తపస్సులతోటి ఇది సాధ్యం కాదు
(15:22) కేవలం భక్తితో మాత్రమే సాధ్యము అని తర్వాత గీతా రహస్యం నీకు ఎందుకు చెప్తున్నాను అనే దానిలో కూడా భగవంతుడు చెప్పాడు భక్తామే సకాచేతి నువ్వు నా భక్తుడివి నువ్వు నా స్నేహితుడివి కాబట్టే నేను నీకు గీత రహస్యం చెప్తున్నాను అన్నాడు ఇలా భగవద్గీతలోనే అన్ని చోట్ల ఉంది భక్తే అన్ని యోగాల్లో కూడా ఉత్తమమైన భక్తి ఉత్తమమైనది అని సో భక్తి అనేది మనం రియల్ లైఫ్ లో యూస్ చేసేది చాలా కేర్లెస్ గా యూస్ చేస్తున్నాం మనం ఆ వర్డ్ వాడుక భాషలో అన్నిటిని భక్తి అంటాం కానీ అన్నిటిని సమన్వయం చేసుకోవచ్చు ఉదాహరణకు ఏదైనా కార్యం తలపెట్టాం అనుకోండి గణపతి
(16:02) పూజ చేస్తాం ఆ గణపతిని భగవంతుడి యొక్క ప్రతినిధిగా మనం పూజించడంలో తప్పులేదు ఎందుకంటే మనం భగవంతుని పూజించాలంటే ముందు ఆయన ప్రతినిధిని పూజించాలి అందుకే గురుపూజ వ్యాస పూజ ఇత్యాదులు చేస్తాం అలా చేయడం అది భక్తిలో ఒక భాగమే కాకపోతే ఎప్పుడైతే భౌతికమైన కోరికల కోసం వీళ్ళందరినీ భగవంతుడిలాగా భావించి సేవించడం లేకపోతే భగవంతుడులాగా స్వతంత్రుడని లేకపోతే భగవంతుడు ఇవ్వకపోయినా వీళ్ళు కోరికలు తీరుస్తారు అనే భావంతోటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అది భక్తి కాదు అది శాస్త్రోచితమైనది కాదు భరత భరత మహారాజు ఉదాహరణకు దేవతలందరినీ భగవంతుని యొక్క అంగాలుగా ఆయన పూజించారు. ఆ
(16:44) భరతుడి చరిత్ర భాగవతంలో చాలా గొప్పగా వర్ణించబడింది. భక్తి అనేది ఒక తాత్వికంగా మనం అర్థం చేసుకునేది తప్ప అది అంత వాడుక భాషలో యూస్ చేసినంత తేలిగ్గా దాన్ని వాడకూడదు. మ్ ఉదాహరణకి దేశభక్తి అనేది కూడా ఒక రకంగా కృష్ణ భక్తి. ఎందుకంటే భారతదేశంలో ఇన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, పుణ్య నదులు ఉన్నాయి, గొప్ప గొప్ప పర్వతాలు ఉన్నాయి.
(17:07) ఎక్కడికి వెళ్ళినా భగవంతుడు ఉన్నాడు. నేను పుట్టాను కాబట్టి భారతదేశానికి నేను భక్తుడిగా ఉంటాను అనుకుంటే అది భక్తి కాదు. ఇక్కడ ఎంతోమంది మహర్షులు, మహానుభావులు, భగవంతుడు స్వయంగా అవతరించాడు కాబట్టి, ఈ భారత భూమి పట్ల నేను భక్తి కలిగి ఉంటాను అంటే అది భక్తి. చాలా బాగా చెప్పారు సో భక్తి అనేది ఒక ఆటిట్యూడ్ అదొక రైట్లీ వైర్డ్ ఫీలింగ్ అది థాంక్యూ సో మచ్ మాధవ శర్మ గారు నాకు ఇవాళ భక్తి అంటే ఒక కొత్త నిర్వచనం తెలుసుకున్నాను మీ దగ్గరనుంచి హరే కృష్ణ కృష్ణ
No comments:
Post a Comment