Saturday, May 23, 2026

పెళ్లికి వెళ్ళి భోజనం చేయకుండా వచ్చేస్తున్నారా? || @sridevi_vlogs515

పెళ్లికి వెళ్ళి భోజనం చేయకుండా వచ్చేస్తున్నారా? || @sridevi_vlogs515

Author Name:RAJAHMAHENDRI__SRIDEVI

Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515

Youtube Video URL:https://www.youtube.com/watch?v=pior-vIrPWQ



Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం పెళ్లిళ్లు ఓ ఆర్బాటంగా చేస్తున్నారు కదా అందులో ఒక్కలైనా వచ్చి మీ పిల్లల్ని నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారా ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి మీరు ఆర్బాటాలకు పోయి ఒక 1000 మంది 5వేల మంది 10వేల మంది కూడా పిలుస్తున్నారు. అంటే ఒక సెలబ్రిటీస్ పెళ్లిళ్లు ఎలా జరుగుతున్నాయో అలాగే డబ్బున్నోళ్ళ పెళ్లిళ్లు ఇంకొంతమంది గొప్పలకు పోయి మధ్య తరగతి వాళ్ళు కూడా ఇలాగే చేస్తున్నారు.
(00:35) మరి మీరు ఎంత గొప్పలకి పోయి పెళ్లిలు చేసినా నిండు మనసుతో వచ్చి మీ పిల్లల్ని ఆ పెళ్లి జంటని ఆశీర్వదించేవాళ్ళు ఎవరున్నారు కనీసం పెళ్లికి వచ్చి పెళ్లి భోజనం కూడా తినకుండా వెళ్ళిపోతున్నారు. మీరు గమనించారా నేను ఇదేదో నా వీడియో కోసం చెప్పట్లేదు ఇదివరకు పెళ్లిళ్లు ఎలా జరిగేవి ఇప్పుడు పెళ్లిళ్లు ఎలా జరుగుతున్నాయి ఒక్కసారి మీరు పోల్చుకోండి అసలు పెళ్లికి జనాల్ని ఎందుకు పిలవాలి మన బంధువుల్ని గాని మన దగ్గరి వాళ్ళని గాని మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ని గాని మనకి పరిచయస్తులని గాని మన ఆఫీసుల్లో మన పని చేసిన చోట మనం నివసిస్తున్న చోట గల్లీల్లో వీళ్ళందరినీ ఎందుకు పిలవాలి అసలు
(01:18) వాళ్ళందరూ ఎందుకు రావాలి అక్షితులు ఎందుకు వేయాలి పెళ్లి భోజనం ఎందుకు తినాలి ఇవన్నీ ఒక్కసారి మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో చూస్తే ఎవ్వరి కాళ్ళు చాలా బలుపుతో ప్రవర్తిస్తున్నారు. అది డబ్బు ఉన్నోళ్లా బాగా రాజకీయ నాయకులు పిల్లలా సెలబ్రిటీస్ మధ్య తరగతి వల్ల అని ఏ మాత్రం లేకుండా టెంపర్ చూపిస్తున్నారు.
(01:47) పెళ్లికి వచ్చారు అంటే ముందుగా వాళ్ళని వాళ్ళు చూపించుకోవడానికి వస్తున్నారు. అసలా పెళ్లికి వచ్చిన జనాలు ఎలా ఉంటున్నారో మీరు చూస్తూనే ఉన్నారు. పెళ్లికూతురు పెళ్లి కొడుకు కంటే ఎక్కువగా బాగా రెడీ అయిపోయి వస్తున్నారు. వేలకి వేల చీరలు 20వేల 50వేలపవేల పెళ్లి కూతురు కన్నా ఖరీదైన చీరే కట్టుకుంటున్నారు. ఇంకా ఎక్కువ నగలే వేసుకుంటున్నారు వంటె నిండా తెగేసుకుంటున్నారు.
(02:12) అలా కాకుండా నగలు లేకపోతే రోల్డ్ గోల్డ్ ఉంది కదా మనకి అది కూడా కచ్చితంగా వేసుకొని చూపిస్తున్నారు. ఇక్కడ పెళ్లికి వచ్చినప్పుడు చక్కగా ముస్తాబయ్యి రావటం చాలా సంప్రదాయమైన పద్ధతి అది నేను కాదనట్లేదు మన భారతీయ సంప్రదాయంలో పెద్ద పీట వేసేది ఏంటి అంటే ఆడవాళ్ళ అలంకారం అది చూడగానే ఎవ్వరికైనా సరే మనసు చెలించిపోతుంది అన్నమాట అంత గొప్పగా ఆడదాన్ని ఇంకా అందంగా చూపించేది ఏంటి అంటే అలంకారం మరి విపరీతమైన మేకప్పులు విందుకు వేసుకుంటున్నారు గొప్ప గొప్ప సారీస్ కట్టుకుంటున్నారు జుట్టులు విరబోసుకొని వస్తున్నారు.
(02:55) పెళ్లికూతురు పెళ్లి కొడుకు వాళ్ళ ముందు చిన్నబోతున్నారు. వాళ్ళ అలంకారాలు ఎక్కడా కనిపించట్లేదు. మరి దీనికి కారణం ఏంటి అంటే మనుషులు అని అహం నిండిపోయింది. కుల్లు కుతంత్రాలతో చాలా పాడైపోయారు మనది కాని సంప్రదాయాలని పట్టుకుంటున్నారు. ఇంతకీ మనం ఇక్కడ పెళ్లి ఎలా చేయాలి అని చెప్పి మాట్లాడుకోవట్లేదు ఎలా ఉండాలి అని చెప్పి మాట్లాడుకుంటున్నాం.
(03:22) ఒక పెళ్లికి నిండు మనసుతో నిన్ను పిలిచారు అంటే కచ్చితంగా నువ్వు వెళ్ళాలి. పెళ్లికూతురు పెళ్లి కొడుకు ఇద్దరిలో ఎవరి తల్లిదండ్రులైనా నిన్ను సెలెక్ట్ చేసుకున్నారు అనుకో అంటే వాళ్ళ బంధువర్గంలో నువ్వు కూడా ఉంటావు ఆయన పిలిచిన 200 మంది జనంలో నువ్వు ఉన్నావు అంటే కచ్చితంగా వెళ్ళాల్సిందే అందులో ఎందుకు ఉన్నాం మనం అని ఒక్కసారి ఆలోచించండి నాకు కావలసిన మనిషి కాబట్టే నేను నా ఇంటి శుభకార్యానికి పిలిచాను అని వాళ్ళు మనకి అంత మర్యాద ఇచ్చినప్పుడు ఆ విలువిచ్చినప్పుడు ఆ గౌరవాన్ని ఇచ్చినప్పుడు కచ్చితంగా అది మనం కాపాడుకోవాలి కానీ ఇప్పుడు వాళ్ళు ఏం
(03:59) చేస్తున్నారు పెళ్లికి పిలిచినా వెళ్ళట్లేదు చాలా బలుపు చూపిస్తున్నారు మాకేం తక్కువ వాడు పెట్టింది మేము తినాలా వాడు ఇప్పుడు గ్రాండ్ గా పెళ్లి చేస్తున్నాడు అని అది చూపించుకోవాలని చేస్తున్నాడు మమ్మల్ని ఎందుకు పిలిచాడు మేము చూడాలా అని చెప్పి విపరీతమైన అసూయతో మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను అంటే మన్నీ మధ్యనే ఒక పెళ్లికి వెళ్లి వచ్చాను.
(04:26) అంటే ఈరోజు ఈ పెళ్లి చూడటం కాదు నేను ఎప్పటినుంచో ఇలాగే పెళ్లిల్లో జరుగుతున్నాయి జస్ట్ ఫార్మాలిటీ కోసం వస్తున్నారు ఇలా కారు దిగుతారు అలాగ స్టైల్ గా నడుచుకుంటూ వస్తారు కళ్యాణ మండపంలో పెళ్లి కొడుకు పెళ్లికూదురికి ఇలా అక్షింతలు నాలుగు అక్షింతలు ఇలా ఇలా జల్లుతారు. జల్లేసి వాళ్ళని కాసేపు చూపించుకొనిఫైవ్ మినిట్స్ే ఉంటారు వీళ్ళు మొదటి రకం మనుషులు మేము చాలా గొప్పోళ్ళం అని చెప్పి వాళ్ళకి వాళ్ళు అదే బ్రమలో బతికేస్తా ఉంటారు.
(04:54) వాళ్ళకి ఎవరో అవసరం లేదు. వాళ్ళు అటువంటి మనుషులు చచ్చినప్పుడు ఒక నలుగురు తీసుకెళ్లి పడేస్తారుగా అని చెప్పి అనుకొని బతికే మనుషులు అన్నమాట. డబ్బు ఉంటే చాలు డబ్బే అంతా చేసేస్తది అని అనుకుంటారు సింపుల్ గా ఇది మాట మరి కొంతమంది ఇలా వస్తారు ఒక అరగంట కూర్చుంటారు ఎవరైనా పలకరిస్తే తల ఊపుతారు అంతే సైలెంట్ గా భోజనం చేయకుండా వెళ్ళిపోతారు.
(05:20) వాళ్ళు అదొక రకంగా అనుకుంటారు అంటే ఏ మాకేమైనా తిండి కరువ మా ఇంట్లో లేదా అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉంటారు అన్నమాట ఆ భోజనం మేము తినంలే అని చెప్పి కొంతమంది అయితే గలేజుగా వండుతారు ఎవరెవరో వండుతారు శుభ్రం ఉండదు అని కొంతమంది అదొక బ్రమలో ఉంటారు. మరి కొంతమంది భోజనానికి కూర్చున్నా కూడా పక్కన వాళ్ళని తిననివ్వరు. ఏదో ఇలా కలిపేసి గలేజ్ గా నాలుగు ముద్దలు తినేసి ఆ చాల్లే పెట్టేరులే భోజనం సమ్మడం అని అంటారు.
(05:52) చేతులు ఇదిలిచ్చి దులుపుతూ ఉంటారు. ఈ చేష్టలకి పక్కనోళ్ళు కూడా వాళ్ళు కూడా సరిగా భోజనం చేయలేరు పక్కన వాళ్ళు తినేసి లేసిపోతున్నారు మనం కూడా తినేసేయాలి అయిపోతుంది అని చెప్పి కంగారుపడుతూ వాడు పట్ట మాడుచుకుంటాడు. ఇటువంటి జాషులఅన్నీ చేస్తూ ఉంటారు. మరి పెళ్లికి వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి డీసెంట్ గా ఉండాలి కాదంట్లా కానీ నలుగురితో ఉన్నప్పుడు మన ప్రవర్తనలో ఎటువంటి అసూయ గాని చెడు ఉద్దేశాలు గాని ఆ కొంటరాసి చూపులు గాని ఉండకూడదు.
(06:28) ఆడవాళ్ళు మరీ ఓవర్ గా రెడీ అవుతున్నారు మేకప్లు లిప్స్టిక్లు జుత్తులు ఇరబోసుకోవటాలు రకరకాల డ్రెస్సులు వేసుకురావటాలు సారీలు అయితే కళ్యాణ మండపం మొత్తం వీలే తుడిచేస్తూ ఉంటారు మొత్తం కింద మీద వేసేసి వాళ్ళని చూడాలని చెప్పి అటు ఇటు ఒక పది రౌండ్లు వేసేస్తూ ఉంటారు. నన్ను చూడండి నా ఒంటి నిండ నగలు వేసుకొచ్చాను చూడండి మాకు డబ్బు ఉంది చూడండి లేకపోతే మా పిల్లలు ఎక్కడో అమెరికాలో జాబ్ చేస్తున్నారు మాకేం తక్కువ ఇవే చెప్పుకుంటూ ఉంటారు సోది కబుర్లు మరి మన వీడియో వచ్చేసి టాపిక్ ఇది కాదండి అసూయబర్లు కూడా ఉంటారండి ఇందులో వాళ్ళ పిల్లలకి పెళ్లిలు రావట్లేదు పెళ్లి
(07:09) కుదరట్లేదు దీని కూతురికి పెళ్లి అయిపోతుంది అని చెప్పి అసూయ పడుతూ ఉంటారు ఈర్షగా చూస్తూ ఉంటారు ంటారు అటువంటి వాళ్ళు పిలిచి దండగమాట అనవసరంగా ఆ పెళ్లి జంటకి దిష్టి తగులుద్ది. మరి అసలు పెళ్లి జంట అంటే ఏంటి పెళ్లి అంటే ఏంటి పెళ్లికి ఎందుకు పిలుస్తారు జనాల్ని బంధువుల్ని మన దగ్గర వాళ్ళని కావలసిన వాళ్ళని ఎందుకు బలుపు చూపిస్తున్నారు మీరు భోజనం ఎందుకు చేయాలి పెళ్లి భోజనం ఎందుకు చేయాలి ఇవేమి మీకు తెలిీదు.
(07:42) ఇదివరకు వాళ్ళని అడగండి చెప్తారు ఇద్దరు మనుషుల్ని కలిపేదే పెళ్లి ఆ ఇద్దరి నుంచి మూడవ ప్రాణం పుట్టేదే బిడ్డ మరి ఇక్కడి నుంచే కదా వంశాభివృద్ధి గాని మన జనరేషన్లు గాని లేదా మన దేశ అభివృద్ధి గాని కొనసాగేది ఒక జంటని చూడటానికి రెండు కళ్ళు సరిపోవుమాట పెళ్లి జంటని పెళ్లి అనేది ఇరువరు మనుషులని కలుపుతుంది కొత్తగా వాళ్ళ జీవ జీవన ప్రయాణం కొనసాగిస్తారు.
(08:12) ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పడుతుంది. దీనికోసమే మనకు కావలసిన వాళ్ళందరినీ పిలుచుకుంటాం. పెళ్లికి వచ్చినోళ్ళు తృప్తిగా భోజనం చేసి వెళ్ళాలని రకరకాల వంటలో వండి వడ్డిస్తాం. పెళ్లికి వచ్చి పెళ్లికూతురు పెళ్లి కొడుకుని ఆ జంటని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని తృప్తిగా భోజనం చేస్తారని ఆ కడుపు నిండి ఆ నిండు ఓ మనసుతో వచ్చి నాలుగు అక్షింతలు వేస్తారని ఆ పిలిచిన వంద మందిలో గాని 200 మందిలో గాని ఎవరో ఒకడు పుణ్య పురుషుడు ఉంటాడని ఆడవాళ్ళఅయితే ఒక పతివ్రత స్త్రీ ఒక సాద్విమని ఒక సుగుణ శీలి గుణవంతురాలు ఉంటుందని వాళ్ళ ఆశీర్వచనం ఖచ్చితంగా నా
(08:59) బిడ్డలకి అందుద్ది అన్న ఉద్దేశంతో ఈ పెళ్లి తాతంగం అంతా చేస్తారు. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళలో మీరు పిలుచుకున్న 200 మందిలో ఎవరైనా నిండు మనసుతో వచ్చి ఆ జంట బాగుండాలి పిల్ల పాపలతో చల్లగా ఉండాలి కుటుంబాభివృద్ధి జరగాలి నిండు నూరేళ్ళు నువ్వు పసుపు కుంకాలతో ఉండాలమ్మ అని దీవించినోళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవ్వరూ లేరు పెద్దవాళ్ళు కూడా ఈ వేలో లేరు అసలు ఎందుకంటే వయసు వస్తుంది కానీ వంకర బుద్ధి పోవట్లేదు చిన్నవాళ్ళు చేసినట్టే వాళ్ళు చేస్తున్నారు న్నారు మరి ఈ తంగం అంతా ఎందుకు బోల్డ్ కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిలు చేస్తున్నారు. అంతేకాకుండా
(09:44) రకరకాల వంటలు అంటే ఇక్కడ 100 రకాల ఐటమ్స్ పెడుతున్నారు ఇది కూడా గొప్పలకే పిల్లల గురించి చెప్తున్నానండి అసలు మనిషి ఎంత ఆహారం తింటాడు నేను చెప్తుంది ఇప్పుడు ఒక మరీ చిన్న వేసోళ్ళు కాదు పెద్దోళ్ళు కాదు యంగ్ గా ఉన్నవాళ్ళు వాళ్లే తిండే ఇంత పడిపోయింది ఇదివరకు ఒక కేజీ బియ్యం తినేవారు ఇప్పుడు కనీసం అరకేజీ బియ్యం అన్నా ఏమనా తింటున్నారా అరకజ బియ్యం తో వండిన అన్నం తింటున్నారా లేదు పొట్ట పట్టట్లే అంతా క్లాస్ టిల్లు డైటింగ్ ఫుడ్స్ అంట ఇంకేవో చేస్తున్నారు.
(10:21) ఇది ఇంత తిని లేచిపోతున్నారు ఫార్మాలిటీ కొంతమంది తిందామని చూసిన పొట్ట పట్టదు మరి మీరు పెట్టిన ఈ 60 రకాలు 80 రకాలు 100 రకాలు ఈ ఫుడ్ అంతా ఎందుకు ఇటువైపుేమో టిఫిన్ సెక్షన్ ఇటువైపుేమో భోజనం సెక్షన్ తర్వాత స్నాక్స్ స్ట్రాటర్స్ అంట ఇంకా ఫ్రూట్ సలాడ్లు చెప్పక్కర్లేదు మీకు తెలుసు కొన్ని పెళ్లిలకి వెళ్తే ఇవే కనబడుతున్నాయి.
(10:50) మరి ఇవన్నీ ఎప్పుడు తినాలి ఆదిరా బీదిరా తినటాకి లేదు లేదా మొత్తం నేనే తినేయాలని కొంతమంది అన్ని పట్టుకొని తినేస్తూ ఉంటారు. వాడు కచ్చితంగా ఇంటికి వెళ్లి ఆపసోపాలు పడతాడు మంచాన పడతాడు. అసలు మన సంప్రదాయాల్లో లేనివి మీరు కూడా చేస్తున్నారు మీరు ఒకసారి వెనక్కి వెళ్లి చూడండి పెళ్లిలు జరిగితే మన సొంత ఇంట్లో పెళ్లి జరిగినట్టు అందరం వెళ్లి తలలో చేయి వేసేవాళ్ళం ఒకరికొకరు సహకరించుకునేవాళ్ళం అది పిల్ల పెద్ద ముసలి ముతకా అని కాదు ముసలివాళ్ళ అయితే అక్కడ కూర్చొని డైరెక్షన్స్ చెప్పి ఇది ఇలా చేయమ్మ అది అలా చేయాలి అని సాంప్రదాయకంగా మన ఇంటి ఆచారాల బట్టి చేపిస్తూ ఉండేవారు
(11:30) చిన్నవాళ్ళు చాలా చలాగగా నీళ్లు మోసేయడం డ్రమ్ములు నింపేయటం అవన్నీ ఊడ్ చేయడం కాయితాలు గీతాలు ఏరేయటం అన్ని చేసేవారు మిడిల్ ఏజ్ వాళ్ళు చాలా పనులు చేసేవారు భోజనాల దగ్గర పెళ్లిల దగ్గర పందిట్లి దగ్గర ఇంకా పెళ్లి పందిరి వేయడంలో పెళ్లికూతురికి పెళ్లి కొడుకుకి సహకరించడంలో బయట నుంచి వస్తువులు తేవడంలో ఇంకా చెప్పనవసరంలే ఎవ్వరూ కలుగజేసుకోకుండా మన పనులు మనకే అయిపోయేవి మన బంధువులతో కూడా పని ఉండేది కాదు మరి ఈరోజు మన బంధువులే మనకు సహకరించట్లేదు మన ఇంట్లో ఏమన్నా శుభకార్యాలు జరిగితే కచ్చితంగా ఒక అరగంట ముందు వస్తున్నారు అంతే లేదా ఫంక్షన్ స్టార్ట్ అయిపోయే స్టార్ట్
(12:14) అవ్వకముందు ఐదు నిమిషాల ముందు వస్తున్నారు వచ్చి ఇలా నవ్వుతున్నారు వాటేసుకుంటున్నారు కాసేపు కూర్చుంటున్నారు ఒక గంట తర్వాత మళ్ళీ ఏదో ఆ ప్రాణం పోయినట్టు మళ్ళీ వాటేసుకుంటున్నారు వెళ్ళ వెళ్ళిపోతున్నారు. ఈ పద్ధతులన్నీ ఏంటి అసలు మన కర్మ కాకపోతే మీరే చెప్పండి. మరి బంధువులు కలిసి రాక చుట్టుపక్కలలో మన స్నేహితులు ఎవ్వరూ ఏమి చేయట్లే ఇంకా చెప్పాలంటే బయట వాళ్ళే బెటర్ అన్నమాట ఈ రోజుల్లో ఇదంతా ఎందుకు వచ్చింది చెప్పండి కేవలం క్యాటరింగ్ ఫుడ్లు పెళ్లి ఈవెంట్లు పెళ్లి ఈవెంట్ చేసేవాళ్ళు ప్రతిదీ వాళ్లే చేసేస్తున్నారు. అంటే ఇక్కడ పెళ్లిలు
(12:57) సంప్రదాయంగా జరగట్లేదు. వాడు పసుపు రాసుకోమంటే పసుపు రాయాలి. గన్నం రాసుకోవాలంటే గన్నం రాసుకోవాలి. బొట్టు పెట్టుకోమంటే పెట్టుకోవాలి లేదా ఆ బొట్టు తీసి పక్కనోడికి పెట్టమంటే పెట్టాలి. అలాగుంది పోకడ ఇక్కడ నీ ఇంట్లో సంప్రదాయం మర్చిపోయారు నీ ఇంట్లో పెళ్లిళ్లు ఎలా జరిగినయో పేరెంటాలు ఎలా జరిగినయో మర్చిపోయారు మీ పెద్దవాళ్ళని మర్చిపోయారు మీ పోకళ్ళు మర్చిపోయారు కేవలం ఈవెంట్లో మీద వేసేస్తున్నారు.
(13:30) వాళ్లే ఏ టు జెడ్ మొత్తం అలంకరించేసుకుంటున్నారు వాళ్లే చేసేస్తున్నారు. పెళ్లికూతురు చేరలు కూడా వాళ్లే కట్టేస్తున్నారు మేకప్లు వేసేస్తున్నారు కేవలం ఒక పందులు గారిని తీసుకురావడం మీ ఇద్దరు పెళ్లికూతురు పెళ్లి కొడుకు కూర్చోవడం అంతే ఇంకా పెళ్లి అయిపోయినట్టే మనక ఏ పని లేదు అబ్బాయి తాలికట్టడం వచ్చినోళ్ళు భోజనం తింటే తింటారు లేకతే వెళ్ళిపోతారు.
(13:54) ఇలా జరుగుతున్నాయండి పెళ్లిళ్లు ఇంత అసహ్యకరమైన పోకళలోకి మనం వచ్చేసాం. పెళ్లో కన్నా పెట్టెలు మోసే వాళ్ళ హడావడి ఎక్కువగా ఉంటదంట చిన్నప్పుడు మా నాన్న నాతో అనేవారు ఏదైనా పెద్దవాళ్ళు మాటూసి వచ్చినప్పుడు ఇలాగే అనేవారు ఇప్పుడు జనాలు అలాగే ఉన్నారు ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే పెళ్లి చేసుకున్న జంట సింపుల్ గానే ఉంటున్నారు వాళ్ళు ఇంకా హెవీగా రెడీ అవ్వాలి కూడా తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళమాట వాళ్ళు కూడా బానే ఉండి పనులు చేసుకుంటున్నారు.
(14:28) మిగతా మీరు ఎవరినైతే పిలుస్తున్నారో పెళ్లిలకి వాళ్ళు ఆర్బాటాలు చూపించుకుంటున్నారు పెళ్లో కన్నా పెట్లు మోసల హడావడ ఎక్కువ అవుతుంది అని అందుకే అంటున్నా అన్నమాట విపరీతంగా పిచ్చి పిచ్చి సారీస్ పిచ్చి పిచ్చి బట్టలు ఆ ఇక మేకప్ లో లిప్స్టిక్లు ఇంకా చెప్పన అవసరంలే వీలు హడావడ ఎక్కువైపోద్ది వీళ్ళు నన్నే చూడండి అని తిరుగుతూ ఉంటారు.
(14:49) పెళ్లికి వెళ్ళినప్పుడు కచ్చితంగా మీరు భోజనం చేయండి మీరు పట్టనిండ అన్నం తిని హాయిగా నలుగురితో మాట్లాడుతూ అందరితో సంతోషకరమైన వాతావరణాన్ని మీరు అనుభవిస్తూ అందరూ కలిసినప్పుడే కదా మాట మంచి ముచ్చట్లు ఇంకా తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎక్కడెక్కడో బంధువర్గాలు కూడా మళ్ళీ మనకి కనబడుతూ ఉంటారు కొత్తగా పరిచయస్తులు ఉంటారు మళ్ళీ ఎప్పుడో ఒకసారి చూడాలి అనిపించిన మనిషిని మళ్ళీ కనబడతారు.
(15:20) ఇటువంటి స్వీట్ మూమెంట్స్ ని మీరు మిస్ అవ్వద్దు. పెళ్లికి వెళ్తే నిండు మనసుతో ఆ జంటని ఆశీర్వదించండి అంతేగాన మీ కనిదిష్టాలకి తగిలినట్టు చేయకండి మీ అసూయ ద్వేషాలు మీరు అనుకుంటారు అది మీ దగ్గరే ఉంటాయేమో అని మీరు ఎంత ఈర్ష వ్యక్తం చేస్తూ ఉంటారు కానీ అది ఆ జంటకి ఎంత నష్టం కల్పిస్తుందో మీరు అనుకున్నట్టే మీరు ఈష పోతున్నట్టే వాళ్ళు సంవత్సరం తిరగకుండానే ఏడు నెలలు ఆరు నెలలో విడాకులు తీసుకుంటారు లేకపోతే వాళ్ళద్దరిలో ఒకలో టపా కట్టేస్తారు.
(15:57) కనిదిష్టు అనేది అంత ప్రమాదం ఇదివరకు రోజుల్లో పెళ్లిళ్లు ఎంత ముచ్చడిగా జరిగేవండి ఆ జంటను చూస్తే సాక్షాత్తు సీతారాముల్లా ఉన్నారు అని చెప్పి అందరూ తెగ సంబరపడిపోయేవారు. అందాన్ని చూసి వీళ్ళు మురిసిపోయేవారు ఇప్పుడు ఒక అందమైన ఆడదాన్ని చూసిన వెంటనే ఈర్షాడుతున్నారు. ఆడవాళ్ళు మరీనండి అందమైన ఆడవాళ్ళని చూడగానే వాళ్ళు ఒక మంచి చీర కట్టుకోగానే వెంటనే వీళ్ళ మొహం మాడిపోద్ది ఇక చెప్పాలంటే ఆ మొఖాన్ని మనం వర్ణించడం చండాలఅన్నమాట ఇంకా వాళ్లే రెడీ అవ్వాలి వాళ్లే ముస్తాబ్ అవ్వాలి ఆ వాళ్లే చీరలు కొట్టుకోవాలి వాళ్లే తిరగాలి.
(16:39) ఇంకెప్పుడు సూరమంటూ నైటీలు వేసుకొని ఉంటే వాళ్ళకి నచ్చుతారు అన్నమాట సమాజం పాడవడానికి ముందుగా కారణాలు తొలి కారణాలు ఆడవాళ్లేనండి వీళ్ళ ఈర్షా అసూయ వల్లే నాశనం అవుతున్నారు. మగవాళ్ళు బాగున్న ఇళ్లల్లో వాళ్ళని కూడా వీళ్లే జడగొడుతున్నారు. పెళ్లి అంటే ఏంటి కచ్చితంగా పప్పు ఉంటది గుట్టు వంకాయ కూర ఉంటది లేదా వంకాయ బఠానీ ఉంటది బంగాళ దుంప కూర ఉంటది.
(17:06) ఆంధ్ర గాసి పెళ్లిల్లో నాన్వెజ్ తినరు తెలంగాణ లాగా అక్కడ ముక్క లేనిదే పెళ్లి జరగదు మందు మొక్క ఉండాలి మాకు అలా కాదు కచ్చితంగా వెజ్ ఉంటది అంటే ఒక మనిషి తినగలిగిన ఆహారమే ఉంటుంది. అవి కమ్మగా పెట్టేవారు సాంబార్ వేసేవారు పప్పు మామిడికాయ ఉండేది ఆవకాయ బద్ద ఉండేది. చాలా బాగుండేదండి గడ్డ పెరుగు కనీసం ఇటువంటి ఆహారం చాలండి మనిషికి తినే అంత తృప్తిగా తింటాడు మీరు 100 రకాల ఐటమ్స్ పెడితే 200 రకాల ఐటమ్స్ పెడితే ఆ ఫుడ్ వేస్ట్ అయిపోద్ది మళ్ళీ ఆ ఫుడ్ ని తీసుకెళ్లి కనీసం మీరు పేద ప్రజలకి డొనేట్ చేయరు ఆశ్రమాల్లో ఇవ్వరు అది ఎవరో గాని చేస్తున్నారు. ఇదివరకు భోజనం నచ్చితే ఆ
(17:51) సాంబార్ పోయమని ఇంకొద్దిగా ఆ పులిహార బాగుందే లేకపోతే ఆ పచ్చడి బాగుంది అని చెప్పి ఇళ్లకు తీసుకెళ్ళేవారు ఇప్పుడు ఆ పరిస్థితులే లేవు ఆడు పెట్టడం ఏంటి మేమ తినటం ఏంటి అని చెప్పి బాగా గొప్పలు చూపిస్తున్నారు అదిఒక బలుపండి మరి తినేంత ఫుడ్ే పెట్టండి మిమ్మల్ని ఎవరైతే పిల్లలకి పిలుస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని నాకు కావలసిన మనిషి అని పిలవబట్టే మీ వరకు ఆ శుభలాక వచ్చింది ఆ పిలుపు వచ్చింది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి చిన్న లైఫ్ దేవుడు ఫోన్ చేస్తే వెళ్ళిపోతాం కాబట్టి కచ్చితంగా పిలిచినప్పుడు వెళ్ళండి భోజనం చేయండి
(18:28) కాసేపు అక్కడ కూర్చోండి ఇదివరకు పెళ్లి అయ్యేంతవరకు అర్ధరాత్రి పెళ్లిళ్లు అయినా సరే తెల్లవారు జామును పెళ్లిళ్లు అయినా సరే అక్కడే సమయం గడిపేవారు మొత్తం పెళ్లి వాళ్ళతో ఉండేవారు ఆనందాన్ని పంచుకునేవారు అమ్మాయి అప్పగింతల వరకు వేచి చూసేవారు ఒకరికొకరు సపోర్ట్ అమాట చాలా ధైర్యంగా ఉండేది ఆ సమయం బెంగ లేకుండా ఉంటది పెళ్లికూతురు తల్లిదండ్రులకు కూడా ఎంతో బాగుండయోనండి ఆ అచ్చట్లో ముచ్చట్లు మరి దులిపేసుకొని వచ్చేట్లేదు ఇప్పటిలాగా అందరూ మనవాళ్లే అనుకోండి ఇర్షా ద్వేషాలని వదిలిపెట్టండి ముఖ్యంగా పెళ్లి జంటల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి ఏమో ఏ పుట్లో ఏ పాము ఉందో
(19:08) మీ నోట్లో ఏముందో అంతే కదా ఒక 10 మంది బుద్ధులు సరిగ్గా లేకుండా దొంగ ఆశీర్వచనాలు ఇచ్చిన ఆ 10 మందిలో లో ఒక్కలైనా సరే నిండు మనసుతో ఆశీర్వదిస్తే ఆ జంట కలకాలం హాయిగా పిల్ల పాపలతో బ్రతుకుద్దని నా ఉద్దేశం కాబట్టి ఈర్షుతో ఎవరు అక్షంతలు వేయొద్దు జంటల్ని నాశనం చేయొద్దు మరి రేపు పొద్దున్న పెళ్లిళ్లు మీల్లో కూడా జరుగుతాయి ఇటువంటి సిచువేషన్స్ అవుతాయని గుర్తుపెట్టుకోండి.
(19:39) కర్మ ఎవరిని వదిలిపెట్టదు. మన పాతకాలం పద్ధతుల్లో పెళ్లిలు చేసుకోవాలని చెప్పి అసలు పెళ్లి భోజనం ఎందుకు తినట్లా జస్ట్ ఇలా వచ్చి అలా ఎందుకు వెళ్ళిపోతున్నారు అన్న ఆలోచన బాధ కూడా అనిపించి నేను ఈ వీడియో చేయడం జరిగింది. మరి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అందరికీ ఉపయోగపడుతుంది మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి

No comments:

Post a Comment