పూర్వపు మానసిక సంస్కారాల ప్రతిఫలంగానే ఇప్పుడున్న ఈ ప్రపంచాన్ని పొందుతున్నాడు #yogavasistham
Author Name:TATTWABODHA
Youtube Channel Url:https://www.youtube.com/@Tattwabodha2498
Youtube Video URL:https://www.youtube.com/watch?v=RDH6hAGGUvA
Transcript:
(00:00) ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యః మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని నే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం హరిహి ఓం శ్రీ గురుభ్యో నమః
(00:47) కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం బ్రహ్మ మానస సంభూతం బ్రహ్మ బోధన తత్పరం యోగివర్యం ఋషిశ్రేష్టం వశిష్టం సద్గురుం భజే హరి ఓం మనం గత భాగంలో మూడు ఆకాశాల గురించి ప్రస్తావన చేసుకున్నామండి. వాటిలో మొదటిది బహిరాకాశం రెండవది మానసాకాశం మూడవది చిదాకాశం. ఈ బహిరాకాశం అంతటా మానసాకాశం వ్యాపించి ఉంటుంది.
(01:29) అందుకే బహిరాకాశంతో పోలిస్తే మానసాకాశం సూక్ష్మమైనది. ఇక ఈ మానసాకాశం అంతటా చిదాకాశం వ్యాపించి ఉంటుంది. అందుకే ఈ మానసాకాశంతో పోలిస్తే చిదాకాశం సూక్ష్మమైనది. ఈ విధంగా బహిరాకాశం మానసాకాశంలో ఉంటుంది. మానసాకాశం చిదాకాశంలో ఉంటుంది. చిదాకాశం అన్నిటికంటే సూక్ష్మమైనది అండి. చిదాకాశంతో పోలిస్తే మానసాకాశం కొంచెం స్థూలమైనది, మానసా ఆకాశం తో పోలిస్తే బహిరాకాశం ఇంకొంచెం స్థూలమైనది.
(02:10) సో ఈ విధంగా మూడు ఆకాశాల గురించి ప్రస్తావన చేశారండి. ఈ చిదాకాశం అంటే ఆత్మ చైతన్యాన్నే చిదాకాశం అంటారండి. అంటే సర్వత్ర వ్యాపించి ఉన్న ఆత్మ చైతన్యం ఉన్నది చూసారా అండి ఆ ఆత్మ చైతన్యాన్నే చిదాకాశం అంటారండి. మనకి చిదంబర రహస్యం అంటారు కదండీ చిదంబర రహస్యం అనే పదం అందరూ వినే ఉంటారు కదా చిదంబర రహస్యం అంటే ఇదేనండి ఏమీ లేదు చిత్ అంబరం అంబరము అంటే ఆకాశం అండి చిత్ అంటే చైతన్యం అండి అంటే ఆకాశం వలె సర్వత్ర
(02:57) వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ చైతన్యానికే చిదాకాశం అని పేరండి అంతట వ్యాపించి ఉన్న ఆ ఆత్మ చైతన్యానికే చిదాకాశము అని పేరండి అంతే చిదంబరము మన చిదంబర రహస్యం ఇదేనండి చిదాకాశము చిదంబరము రెండు ఒకటేనండి చిదాకాశము చిత్ ప్లస్ ఆకాశం చిదంబరము చిత్ ప్లస్ అంబరం అంబరము అంటే ఆకాశం అండి సర్వత్ర ఆకాశం వలె [నవ్వు] ఆకాశం అంతటా
(03:42) వ్యాపించి ఉంటుంది కదండీ అలా ఆకాశం వలె సర్వత్ర వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ చైతన్యమే చిదాకాశం అండి ఇప్పుడు మనం ఒక విషయాన్ని తెలుసుకుందాం అండి ఈ ఆకాశం గురించి తెలుసుకుందాము మనము ఆకాశాన్ని సూటిగా ఏ ఇంద్రియం అంటే మనకి పంచజ్ఞానేంద్రియాల్లో ఏ ఇంద్రియానికి సూటిగా ఈ ఆకాశం దొరకదు. అందుకే పంచభూతాల్లో ఆకాశం అనేది సూక్ష్మమైనది అని చెప్పేసి మనం తెలుసుకున్నాం కదండీ చూడండి వాస్తవానికి మనం ఆకాశాన్ని కంటితో చూడగలమా
(04:28) చూడలేమండి ఇప్పుడు మనం కంటి ముందు ఖాళీ ప్రదేశం ఉందండి అంటే ఇప్పుడు మీకు గోడకి మీరు రూమ్లో కూర్చొని ఉన్నారు మీ గదిలో మీ ఎదురుగా ఉన్న గోడకి మీకు మధ్యలో ఖాళీ ఉందండి అంటే ఏమీ లేవు ఏ వస్తువులు లేవు మీరు ఖాళీ ఉన్నది అని ఊహిస్తున్నారు. వాస్తవానికి మీరు చూసే అంటే మీకు గోడకి మధ్యలో ఖాళీ ఉన్నది కదా అది ఆకాశమా ఆకాశాన్ని మీరు అంటే కంటితో చూస్తున్నారు అన్నమాట ఆకాశాన్ని కంటితో చూడలేమే ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలలో రూపానికి అందదు కదా ఆకాశం అది రుచికి కూడా అందదు
(05:17) వాసనకి కూడా అందదు స్పర్శకి కూడా అందదు మీరు చూడండి మీరు ఏ పదార్థమైనా తీసుకోండి మీరు ఒక వస్తువుని తీసుకుంటే అది కంటికి అందుతుందండి డైరెక్ట్ గా మీరు కంటితో ఆ వస్తువుని చూడవచ్చు ఆ రూపాన్ని చూడవచ్చు. ఇప్పుడు మీ ఎదురుగా ఒక వస్తువు ఉన్నదండి ఆ వస్తువు మీ ఇంద్రియాలకు అందుతుంది కదా డైరెక్ట్ గా అందుతుంది. కంటి ద్వారా రూపాన్ని చూస్తున్నారు చేతితో తాకి స్పర్శన తెలుసుకుంటున్నారు.
(05:56) అది తీపి పదార్థం అయితే నాలుక మీద ఉంచి రుచిని కూడా తెలుసుకుంటున్నారు. ముక్కు దగ్గర ఉంచి వాసనను కూడా తెలుసుకుంటున్నారు. ఈ విధంగా ఇంద్రియాలకి డైరెక్ట్ గా అందుతుందండి మీరు ఏ పదార్థమైనా తీసుకోండి డైరెక్ట్ గా అది అందుతుంది. ఇప్పుడు అగ్నిని తీసుకోండి అగ్ని రూపం ఉంది కదా డైరెక్ట్ గా కంటికి అందుతుంది. శబ్దం వస్తూ ఉన్నది అగ్ని మండుతున్నప్పుడు అగ్నిలో నుంచి శబ్దం వస్తూ ఉన్నది ఆ శబ్దం మీ డైరెక్ట్ గా మీ చెవికి అందుతుంది డైరెక్ట్ గా అగ్ని నుంచి వస్తూ ఉన్నది.
(06:37) స్పర్శ తెలుస్తూ ఉన్నది వేడికి డైరెక్ట్ గా ఇంద్రియాలకు అందుతుందండి కానీ మీరు ఆకాశం దగ్గరికి రండండి అసలు ఆకాశం [నవ్వు] డైరెక్ట్ గా ఈ రూపాలలాగా కంటితో చూస్తున్నాం కదా రూపం డైరెక్ట్ గా కంటికి అందుతుంది కన్ను రూపాన్ని చూస్తుంది కదండీ అంటే డైరెక్ట్ గా కంటికి ఆ రూపం తెలియబడుతూ ఉంది అంటే డైరెక్ట్ గా అది అనుభవానికి అందుతుంది ఆ వస్తువు కానీ ఆకాశం దగ్గరికి వస్తే అలా ఉండదండి ఆకాశాన్ని మీరు డైరెక్ట్ గా ఏ ఇంద్రియం చేత అనుభవించలేరండి దాన్ని మీరు ఊహించవచ్చు అంటే ఇండైరెక్ట్ గా మనం దాన్ని గ్రహించవచ్చుండి అంతే తప్పనుంచి డైరెక్ట్ గా మనం ఆకాశాన్ని చూడలేమండి
(07:23) ఈ ఇంద్రియాలతో ఈ కంటితో ఆకాశాన్ని చూడలేమండి స్పర్శించలేమండి ఇప్పుడు శబ్దం ద్వారా మనము ఊహిస్తున్నాం ఇప్పుడు ఆకాశం అనేది ఆ శబ్ద గుణాన్ని కలిగి ఉంటుంది అని మనం చెప్పుకున్నాం కదండీ అంటే శబ్దం ద్వారా మనం ఊహిస్తున్నాం. ఇప్పుడు శబ్దము పుట్టాలి అంటే రెండు వస్తువులు విడివిడిగా ఉండి అవి ఒకదానితో మరొకటి కలిసినప్పుడు అక్కడ ధ్వని పుడుతుంది.
(07:52) మీ రెండు చేతులు విడివిడిగా ఉంచారండి అవి రెండు దగ్గరికి తీసుకొని వచ్చి కలిపినప్పుడు చప్పట్లు మ్రోగుతాయి కదా అక్కడ శబ్దం గుర్తుంది అంటే శబ్దం వచ్చింది కనుక అక్కడ ఆకాశం ఉన్నది అని మనం ఊహిస్తామండి ఆకాశం ఉంటేనే కదండీ శబ్దం పుట్టేది మీ రెండు చేతులు విడివిడిగా దూరంగా ఉండకుండా దగ్గరే కలిపి పెట్టుకోండి శబ్దం ఏమనా పుట్టిద్దాం పుట్టదండి శబ్దం పుట్టాలి అంటే అవి దూరం వెళ్లి మళ్ళీ దగ్గరికి వచ్చి కలవాల్సిందే అంటే ఆ విధంగా శబ్దం ద్వారా మనం ఊహిస్తున్నాం ఓకే ఇక్కడ ఆకాశం ఉన్నదని మనము ఊహిస్తామండి అంటే ఇండైరెక్ట్ గా తెలుసుకుంటున్నాం శబ్దం ద్వారా
(08:36) ఇండైరెక్ట్ గా ఆకాశం ఉన్నదని మనం తెలుసుకుంటున్నాము. అందుకే ఆకాశం అనేది అప్రత్యక్షం అండి ఇది మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాము. ఇది ఆకాశము అనేది అప్రత్యక్షము అంటే ప్రత్యక్షంగా ఏ ఇంద్రియానికి అందేది కాదు ఇప్పుడు ఒక వస్తువు కంటికి డైరెక్ట్ గా ఎలాగైతే అందుతుందో రూపము అలా ఆకాశం అనేది డైరెక్ట్ గా అనదండి ఇంద్రియాలకి అంత సూక్ష్మమైనదండి ఆకాశం మనము కంటి ముందు ఖాళీ ప్రదేశం ఉన్నది అంటున్నాం కదా మనం చూస్తున్నాం కదా ఇది ఆకాశం అంటున్నాం కదండీ వాస్తవానికి అది ఆకాశం కాదండి మనం చూసేది ఆకాశాన్ని కాదండి మరి ఏమిటి అంటే మనం చూసేది
(09:21) మన కంటి ముందు ఖాళీ అనుకుంటున్నాం కదండీ ఈ ఖాళీ ప్రదేశంలో ఎన్నో ధూలి కణాలు ఇవన్నీ వీటి మీద గాలి ధూలి కణాలు నీటి ఆవిరి వీటన్నిటి మీద పడిన కాంతి ఉంది చూసారా అండి ఆ కాంతి వీటి మీద పడి రిఫ్లెక్ట్ అయి పరావర్తనం చెంది మన కంటి మీద పడి మనక అక్కడ కనిపిస్తూ ఉన్నది తప్పితే వాస్తవానికి మనము శూన్యాన్ని ఏం చూడటం లేదండి మనం ఆకాశాన్ని ఏం చూడటం లేదు కాలిని మనం చూడలేమండి అది ఒక వస్తువు మీద పడి
(10:06) ప్రతిఫలనం చెంది ఆ కాంతి కిరణం మన కంటి మీద పడినప్పుడు మనక అక్కడ అది ఏ వస్తువు మీద అయితే పడుతుందో అది ప్రకాశించి మనక అక్కడ అది కనిపిస్తూ ఉన్నది. అంతే తప్పనుంచి మనం ఆకాశాన్ని డైరెక్ట్ గా కంటితో చూడలేమండి. ఇప్పుడు చూడండిండి నిజంగా అసలు ఆకాశాన్ని చూడలేము ఎందుకంటే దానికి రూపం లేదు రుచి లేదు రంగు లేదు ఏమీ లేదండి ఇంత సూక్ష్మమైనదండి ఆకాశం మరి ఇంత సూక్ష్మమైన ఆకాశాన్ని ఈ ఇంద్రియాలతో డైరెక్ట్ గా గ్రహించలేని
(10:55) ఆకాశాన్ని ఈ బహిరాకాశాన్నే మనము ఈ ఇంద్రియాలతో గ్రహించలేము అంటే ఇక చిదాకాశం అండి ఆ చిదాకాశం ఈ ఇంద్రియాలకు అందుతుందా అండి అందం అందుకే మనకి ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయండి ఆ చిదాకాశాన్ని అది అవాగ్ మానస గోచరం అని అది వాకుకి మనసుకి అందదండి అందుకే మనకి తైత్రయో ఉపనిషత్తు చెప్తుందండి యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసః అని అంటే ఆ పరబ్రహ్మ తత్వాన్ని మనసు గ్రహించలేదండి
(11:42) వాక్కు ప్రకటించలేదు ఈ మనసుకి వాక్కుకి అందదండి అది ఎందుకంటే ఈ మనసుకి వెలుపల ఉన్నది ఆ చిదాకాశం అంటే ఈ మానసాకాశాన్ని తనలో ధరించి ఉన్నది ఈ చిదాకాశం ఈ చిదాకాశం నుంచి పుట్టింది ఆ మానసాకాశం అటువంటి మానసాకాశము దానికి మూలమైన ఈ చిదాకాశాన్ని ఎలా తెలుసుకోగలుగుతుందండి ఎలా గ్రహించగలుగుతున్నది మనకి బహిరాకాశాన్నే మనం తెలుసుకోలేకపోతున్నామే అంటే కంటితో ఇంద్రియాలతో అనుభవించలేకపోతున్నామే ఇక చిదాకాశాన్ని ఈ ఇంద్రియాలతో అనుభవించగలమా అండి ఇంద్రియాలతో
(12:26) తెలుసుకోగలమా అందుకే ఆవాగ్మానస గోచరం అండి అది అది ఇంద్రియాలకు అందదండి ఇక వశిష్ట మహర్షి బోధను ప్రారంభిస్తున్నారండి రామచంద్ర ఇప్పటివరకు మనకు మూడు ఆకాశాలు తేలాయి మొదటిది చిదాకాశం రెండవది మానసాకాశం మూడవది బహిరాకాశం ఈ చిదాకాశంలో మానసాకాశం ఉన్నది మానసాకాశంలో ఈ బహిరాకాశం ఉన్నది ఈ బహిరాకాశంలో ఈ సమస్త బ్రహ్మాండాలు ఉన్నాయి.
(13:09) రామచంద్ర నేను నీకు ఇప్పుడు చెప్పబోయే విషయం నువ్వు మరింత జాగ్రత్తగా గమనిస్తే గాని అర్థం కాదు. వాస్తవానికి ఈ మాట రాముడిని నిమిత్తం చేసుకొని మనకు చెప్తున్నారండి శ్రీరామచంద్రుల వారిని నిమిత్తంగా చేసుకొని వశిష్ట మహర్షి మనకు చెప్తున్నారు. రామచంద్రుల వారు ఒక్కసారి చెప్తే సూక్ష్మమైన విషయాలను కూడా గ్రహించగలరు. మనకు చెప్తున్నారు ఇప్పుడు చెప్పబోయేది జాగ్రత్తగా గ్రహిస్తే గాని అర్థం కాదు అని చెప్తున్నారండి ఏం చెప్తున్నారు అంటే ఈ లోకంలో ఒకడు చచ్చిపోయాడు అనుకో రామ నీవు ఇందాక చెప్పావు కదా ప్రపంచంలో పుట్టడము చావటమ అనేవి లేనే లేవు
(13:57) కనిపించడము కనిపించకపోవడం అనేవి మాత్రమే ఉన్నాయి అని చెప్పావు కదా ఈ విషయాన్ని శ్రీరామచంద్రుడు చెప్పారండి అంటే తను ప్రపంచాన్ని పరిశీలించి తెలుసుకున్న విషయాలని విచారణ చేసి తెలుసుకున్న విషయాలని ప్రస్తావన చేసేటప్పుడు ఈ విషయాలని మాట్లాడారండి అంటే గతంలో వారు చెప్పి ఉన్నారు చూడగా ఈ ప్రపంచంలో పుట్టేది ఎవరు చచ్చేది ఎవరు ఒక వస్తువు కనిపించడము కనిపించకపోవడం ఈ రెండే ఉన్నాయి.
(14:30) పుట్టడము చావడము అనేవి లేనే లేవు కనిపించడము కనిపించకపోవడం ఇవి రెండే ఉన్నాయి అని చెప్పారు కదండీ అదే చెప్తున్నారండి అదే ఆ విషయాన్నే మాట్లాడుతున్నారు. కానీ రామ ఒక దృష్టితో చూస్తే నీవు చెప్పింది సత్యమే అది సత్యమే కానీ లోకంలో మరణించాడు అనే వ్యవహారం ఉంది కదా అంటే ఇప్పుడు మనము సహజంగా చూస్తూ ఉంటాం కదండీ సమాజంలో ఒక వ్యక్తి మరణించాడు చనిపోయాడు అని చెప్తున్నారు కదా మరణించడము పుట్టడము అనేవి లేవు కనిపించడము కనిపించకపోవడమే ఉన్నాయని నీవు నువ్వు చెప్తున్నావు కదా రామ అది సత్యమే కానీ
(15:15) లోకంలో వ్యవహారంలో మరణించాడు అని అంటున్నారు కదా ఒకడు మరణించాడు అనేటప్పుడు ఏం జరుగుతోంది? రామచంద్ర ఏమవుతోందంటే ఒక ప్రాణి మరణించే సమయం వచ్చేసరికి వాడి ఇంద్రియాలు వెళ్లి ప్రాణంలో కలుస్తాయి. ప్రాణం వెళ్లి తేజస్సులో కలుస్తుంది. తేజస్సు ఆకాశంలో కలుస్తుంది. ఆకాశము పరమాత్మలో కలుస్తుంది. అంటే క్రమం చెప్తున్నారండి అలా కలిసే సమయంలో
(16:04) వాడి మనసు యొక్క అంటే వాడి యొక్క మానసాకాశంలో పూర్వజన్మ వాసనలు అంటే ఈ వాసనలేనండి ఈ వాసనలే జన్మలకు కారణం అవుతున్నాయండి జన్మలకి ఈ వాసనలే హేతువులు అవుతున్నాయండి అందుకే మనకి ఇదే యోగ వాసిష్టంలో రాబోయే ప్రకరణాలు అద్భుతంగా చెప్తారండి ఈ వాసనలేనండి నేను ఈ వాసనల మీద వీడియోస్ చేసి ఉన్నానండి అవి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నానండి
(16:50) లింక్స్ అవి తప్పకుండా చూడండి అవి మూడు భాగాలు ఉంటాయి తప్పకుండా చూడండి మీకు ఇదే విషయం ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుందండి ఈ వాసనలో రెండు రకాలుండి ఒకటి మలిన వాసన మరియొకటి శుద్ధ వాసన ఈ మలిన వాసనలో జన్మ పరంపరకి హేతువులు అవుతాయండి అంటే జన్మ పరంపరకి మలిన వాసనలే కారణం అవుతాయి. శుద్ధ వాసనలో జన్మ పరంపరకి హేతువులు కావు.
(17:31) ఎందుకంటే శుద్ధ వాసనలు వేయించబడిన గింజల వంటివి అంటారండి అంటే ఇప్పుడు గింజలు వేయిస్తే అవి మరలా మొలకెత్తవు కదండీ అలా ఈ శుద్ధ వాసనలు అనేవి వేయించబడిన గింజలు వంటివి ఇక మరలా అవి జన్మ పరంపరలకి కారణం కావు అంటారు. కానీ ఈ మలిన వాసనలో ఇవి అజ్ఞానం అంటే ఇవి అజ్ఞానం వల్ల పుడతాయండి ఈ మలిన వాసనలో అజ్ఞానం అనే క్షేత్రంలో మొలకెత్తి జన్మ పరంపరలు అనే వృక్షాలుగా ఎదిగి సుఖ దుఃఖాలు అనే ఫలాలను ఇస్తాయి అని చెప్తారండి.
(18:17) ఈ మలిన వాసనలు అజ్ఞానం వల్ల ఏర్పడతాయండి. అతి పెద్ద మలిన వాసన ఏమిటో తెలుసా అండి ఈ జన్మ పరంపరలకి కారణమయ్యే అతి పెద్ద మలిన వాసన ఈ దేహ వాసన అండి ఈ దేహమే నేను అనే భావన ఉన్నది చూశరా అండి ఈ భావ సంస్కారమే మలిన వాసన అండి. ఇది అనాదికాలంగా అజ్ఞానం చేత ఈ మలిన వాసన మన చిత్త కుహరంలో బీజ రూపంలో ఇది నాటుకొని ఉన్నదండి ఇది జన్మ పరంపరలకు తీసుకొని వెళ్తూ ఉన్నది.
(19:05) ఈ మలిన వాసనలని తొలగించుకోవాలండి వాటి స్థానంలో శుద్ధ వాసన బీజాలు వేసుకోవాలండి. ఈ శుద్ధ వాసనలు జ్ఞానం వలన ఏర్పడతాయండి అంటే బ్రహ్మ సత్యం జగన్మిత్య జీవో బ్రహ్మైవనాపరహ అనే వేదసారం ఉన్నది చూసారా అండి ఆ సత్యాన్ని మనం అనుభవంలో గ్రహించినప్పుడు ఆ అనుభవమే వాసనగా ఏర్పడుతుందండి అదియే శుద్ధ వాసన ఈ శుద్ధ వాసన జన్మ పరంపరలకే హేతువులు కావండి ఇవి జన్మ రాహిత్యాన్ని ప్రసాదిస్తాయి.
(19:49) జ్ఞానం వలన శుద్ధ వాసనలు ఏర్పడితే అజ్ఞానం వలన మలిన వాసనలు ఏర్పడతాయండి. ఈ విషయాలు నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నానండి లింక్స్ తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. ఎన్నో అద్భుతమైన విషయాలని నేను అక్కడ ప్రస్తావన చేసి ఉన్నానండి చూడండి ఒక్కసారి ఇక మనం విషయంలోకి వెళితే చెప్తున్నారండి వశిష్ట మహర్షి రామచంద్ర అలా కలిసే సమయంలో వాడి యొక్క మానసాకాశంలో అంటే మనసులో పూర్వజన్మ వాసనలు మిగిలి ఉంటే వాడు మళ్ళీ జన్మ ఎత్తుతాడు.
(20:32) గొప్ప విషయం అండి ఇది అందుకేనండి వాసనా రహిత్యం లేనిదే ముక్తి లభించదండి మోక్షం లభించదు. జన్మ పరంపరలు ఆగవండి తత్వజ్ఞానము వాసనాక్షయము మనోనసము జీవన్ ముక్తి అండి ఈ వాసనలు క్షయం కాకుండా ముక్తి లభించదండి జన్మ పరంపర ఆగదండి అదే సమయంలో వాడికి పరిపూర్ణమైన తత్వజ్ఞానం ఉంటే అంటే నేనే పరమాత్మను ఇదే విషయం నేను ఇందాక చెప్పానండి
(21:17) నేనే పరమాత్మను జీవ బ్రహ్మైవ నాపరః నేనే పరమాత్మను అనే పరిపూర్ణమైన జ్ఞానం ఉంటే రామ అతడు మరలా జన్మించడు ఇదే విషయాలండి ఇప్పుడు నేను ప్రస్తావన చేసింది. ఇదే విషయాలు నేను గతంలో మాట్లాడి ఉన్నానండి తప్పకుండా ఆ వీడియోస్ చూడండి. ఒక్కసారి మళ్ళీ చెప్తానండి వశిష్ట మహర్షి చెప్తున్నారు రామచంద్ర అతని యొక్క మానసాకాశంలో పూర్వజన్మ వాసనలు మిగిలి ఉంటే అతను మరలా జన్మ ఎత్తుతాడు.
(21:59) ఒకవేళ అదే సమయంలో వాడికి పరిపూర్ణమైన తత్వజ్ఞానం ఉంటే అంటే నేనే పరమాత్మను అనే పరిపూర్ణమైన జ్ఞానం ఉంటే వాడు మళ్ళీ జన్మించడు. రామచంద్ర ఒకడు తన మానసాకాశంలో పూర్వజన్మ వాసనలు ఇంకా ఉంచుకొని పరమాత్మ చైతన్యంలోకి వెళ్ళాడనుకో మళ్ళీ వెనక్కి వచ్చే లోపల వారి స్థితి ఏమిటి అంటే చిదాకాశంలోకి వెళ్తే మరలా వెనక్కి వచ్చేలోపు వారి స్థితి ఏమిటి అని అడుగుతున్నారండి అంటే ఆ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు.
(22:44) వాడు బహిరాకాశాన్ని మానసాకాశాన్ని దాటి చిదాకాశంలోకి వెళ్ళాడు. అతను చిదాకాశంలోకి వెళ్ళాడు కనుక ఆ క్షణంలో అతడు చిదాకాశంలో అంతర్గతంగా ఉన్న మానసాకాశాన్ని ఆ మానసాకాశంలో అంతర్గతంగా ఉన్న బహిరాకాశాన్ని ఆ బహిరాకాశంలో అంతర్గతంగా ఉన్న మూడు లోకాలను అన్నింటిని ఏకకాలంలో దర్శించగలుగుతున్నాడు అన్నమాట ఇది గొప్ప సత్యం అండి నేను గత వీడియోలో చెప్పానండి ఋషులు ఇక్కడే ఉండి అంతరిక్షంలో జరుగుతున్న
(23:30) నక్షత్ర మండలంలో జరుగుతున్న విషయాలను ఎలా తెలుసుకోగలుగుతున్నారు ఇక్కడే ఉండి ఎక్కడో మరొక ప్రదేశంలో జరుగుతున్న విషయాలను ఇక్కడే ఉండి ఎలా దర్శించి చెప్పగలుగుతున్నారు ఇలాగేనండి ఆ చిదాకాశంలోకి వెళ్తారండి ఋషు లు ఆ చిదాకాశంతో కనెక్ట్ అయి ఉంటారండి. ఆ చిదాకాశంలోకి వెళ్తే అన్ని తెలుస్తాయండి. అన్ని దర్శించగలరు. ఇక్కడే ఉండి అంతరిక్షంలో జరుగుతున్న విషయాలను కూడా ఇక్కడే ఉండి ఋషులు చెప్పగలరు.
(24:11) ఆ చిదాకాశంలోకి వెళ్ళాలండి అక్కడ అన్ని ఉంటాయండి. ఇంకా చెప్తున్నారండి అతడు అలా దర్శించి అంటే చిదాకాశంలో అన్నింటిని ఏకకాలంలో దర్శించగలుగుతున్నాడు కదా అలా దర్శించి మళ్ళీ తన మనసులో ఉన్న సంస్కారాల బలం వల్ల వెనుకకు వచ్చి ఏదో ఒక శరీరాన్ని స్వీకరిస్తున్నాడు. శరీరంతో పాటు దాని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా స్వీకరిస్తున్నాడు.
(24:56) ఇది గొప్ప సత్యం అండి. అంటే అతని యొక్క సంస్కారాల బలం వల్ల వెనుకకు వచ్చి ఏదో ఒక శరీరాన్ని స్వీకరిస్తున్నాడు శరీరంతో పాటు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా స్వీకరిస్తున్నాడు. ఇక చెప్తున్నారండి అందుకే మనకి గీతలో ఒక గొప్ప శ్లోకం ఉంటుందండి ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తుంది. యం వాపి స్మరణ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః అని అంటే ఓ కుంతి పుత్ర మనిషి దేనిని గురించి ఆలోచిస్తూ శరీరాన్ని వదులుతాడు ఆ భావ సంబంధమైన జన్మనే పొందును
(25:46) ఎందుకనగా సర్వదా అతడు ఆ భావజనిత సంస్కారమును కలిగించుకొనెను కనుక అంటే ఈ వాసనాలన్నీ ఏ వాసన అతని మనసు యందు కదులుతూ ఈ దేహాన్ని వదులుతాడో ఆ భావ సంస్కారమైన జన్మనే పొందుతాడండి. ఇక్కడ చెప్తున్నారండి రామచంద్ర మనకి దీని వల్ల ఏం తెలుస్తుందంటే ఇవాళ జన్మించి ఉన్న ప్రతివాడు తన పూర్వపు మానసిక సంస్కారాల ప్రతిఫలంగానే ఇవాల్టి ఈ ప్రపంచాన్ని పొందుతున్నాడు.
(26:33) ఇదేనండి ఇప్పుడు నేను చెప్పింది. ఇవాళ జన్మించి ఉన్న ప్రతివాడు తన పూర్వపు మానసిక సంస్కారాల ప్రతిఫలంగానే ఇవాల్టి ఈ ప్రపంచాన్ని పొందుతున్నాడు. ఇది అర్థం కావాలి అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. నేను ఇదే విషయాన్ని కూడా సృష్టి రహస్యం అనే టాపిక్ మీద రెండు వీడియోస్ చేసిున్నానండి. అందుట్లో మొదటిది ఈ విషయాన్నే ప్రస్తావన చేస్తున్నాను.
(27:01) ఇప్పుడు వశిష్ట మహర్షి ఏదైతే చెప్పి ఉన్నారో ఆ విషయాన్నే నేను గతంలో సృష్టి రహస్యం అనే టాపిక్ మీద రెండు వీడియోస్ చేశానండి అందుట్లో మొదటి భాగం ఇదే విషయాన్ని చెప్తుందండి అది అందుట్లో వివరంగా వివరించానండి ఒక్కసారి మీరు కూడా డిస్క్రిప్షన్ లోకి వెళ్లి వెళ్లి ఆ వీడియో లింక్ క్లిక్ చేసి చూడండి అండి ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను అదే చెప్తున్నారండి ఇది చాలా లోతైన గొప్ప సత్యం అండి అంటే మూలం ఇవాళ మనము ఈ అనుభవిస్తున్న ఈ ప్రపంచము మన పూర్వపు మానసిక సంస్కారాల ప్రతిఫలంగానే ఇవాల్టి ఈ ప్రపంచాన్ని మనం అనుభవిస్తూ
(27:45) ఉన్నాము అంటున్నారండి. అంటే ఇవాళ మనం అనుభవించే ఈ ప్రపంచము మన గతంలో మనం ఏర్పరచుకున్న ఆ వాసనలు ఉంటాయి కదండీ మనం ప్రోగు చేసుకున్న వాసనలు వాటి ఆధారంగానే ఈ ప్రపంచం మనకి ఇప్పుడు అనుభవానికి అందుతూ ఉన్నదండి అంటే వాసనల ఆధారంగానే ఇప్పుడు ఈ ప్రపంచం అనేది మనకి తెలుస్తూ ఉన్నది అనుభవానికి అందుతూ ఉన్నది మనం చూస్తూ ఉన్నాము అంటే మనం అనుభవించే ఈ ప్రపంచము వాసనామయం వాసనల వలన ఏర్పడినది.
(28:22) ఈ విషయాన్ని నేను పట్టుకోవడానికి స్వప్నాన్ని ఉదాహరణగా చెప్తానండి. మనం స్వప్నంలో అనేక వస్తువులు అంటే ఇప్పుడు మనం జాగ్రత్తలో చూసినట్టు మేల్కొన్నప్పుడు చూస్తూ ఉంటాం కదండీ ఈ వస్తువులు వ్యక్తులు ఇవన్నీ ఇవన్నీ స్వప్నంలో కూడా ఉంటాయి కదండీ మరి స్వప్నంలో మనం అనుభవించే ఆ ప్రపంచానికి ఆధారం ఏమిటి? ఏమిటంటే మనం మేలుకొని ఉన్నప్పుడు ఈ ప్రపంచాన్ని చూసి ఈ ప్రపంచంతో మనం ఏర్పరచుకున్న ఈ వాసనలు ఉంటాయి కదండీ అవి మన చిత్తంలో నిక్షిప్తమై ఉంటాయండి.
(29:01) అంటే ఇంప్రెషన్స్ అండి ఇవన్నీ మన చిత్తంలో నిక్షిప్తమై ఉంటాయి. ఈ చిత్తములో నిశ్చిత్తమై ఉన్న ఈ వాసనా బీజాలే మనం నిద్రలోకి వెళ్ళినప్పుడు స్వప్నమఅనే ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయండి. అందుకే చూడండి మన స్వప్నము మన వాసనల మీద ఆధారపడి ఉంటుంది కదండీ ఈ వాసనలు జాగ్రత్త ప్రపంచం మీద ఆధారపడి ఉంటాయి. అందుకే మనకి జాగ్రత్త ప్రపంచంలో మనం చూడని మనం అనుభవించని ప్రదేశాలు గాని
(29:48) వ్యక్తులు గాని ఈ స్వప్నంలో వచ్చే అవకాశమే లేదండి. ఏవైతే మన చిత్తంలో సంస్కారాలుగా వాసనలుగా నిక్షిప్తమై ఉంటాయో అవే స్వప్నమైన ప్రపంచంలో వస్తాయి తప్పితే స్వప్న ప్రపంచంలో అవే స్వప్న ప్రపంచంగా వస్తాయి తప్పితే వేరే మనకు తెలియనివి మనకి మన అనుభవంలో లేనివి రావండి. ఒక్కొక్కసారి మనం ఇంతవరకీ చూడని వ్యక్తులు చూడని వస్తువులు చూడని ప్రదేశాలు కూడా స్వప్నంలో కనిపిస్తూ ఉంటాయి.
(30:23) ఈ జన్మలో మనం ఎప్పుడు వాటిని అనుభవించి ఉండము ఎప్పుడు చూసి ఉండము మన మనసులో ఎప్పుడు అవి ముద్రించుకొని ఉండవు కానీ స్వప్నంలో వస్తాయి. ఎలా అంటే అవి గత జన్మ వాసనలుఅండి అంటే ఈ మనసే జన్మల్లో తిరిగేది ఈ మనసు కదండీ ఈ మనసులోనే ఈ వాసనలు ఉంటాయి కదా అనేక జన్మల నుంచి ప్రోగ చేసుకొని వస్తున్న ఈ సంస్కారాలు ఉంటాయి కదా వాటి ఆధారంగా ఈ స్వప్నంలో మనకి ఆ విషయాలన్నీ కనబడుతూ ఉంటాయండి ఈ విషయాలు నేను వివరంగా చెప్పి ఉన్నానండి.
(31:04) ఒకసారి డిస్క్రిప్షన్ లో సృష్టి రహస్యం అనే భాగం మీద నేను రెండు వీడియోస్ చేశనండి అందుట్లో మొదటి వీడియో చూడండి ఇదే విషయాన్ని నేను డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేశనండి. ఒకసారి ఆ వీడియో తప్పకుండా చూడండి. రామచంద్ర అందుకే పెద్దలు ఈ ప్రపంచాన్ని మనోరాజ్యం అని పిలుస్తూ ఉంటారు. అని చెప్పి ముగిస్తున్నారండి హరిహి ఓం ఓం సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు
(31:47) అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతిహి
No comments:
Post a Comment