ఎలాంటి స్థితిలోనైనా నవ్వడం నేర్చుకో | How to Find Inner Peace in Chaos | Satyagrahi
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=FFxj0KrIUe0
Transcript:
(00:07) ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు సుఖంగా ఉండాలని కోరుకుంటారు. కానీ నిజం ఏంటంటే బాధ, కష్టం, నష్టం అనేవి లైఫ్ లో ఒక పార్ట్ అన్నమాట. ఇవి ఎప్పుడు ఎలా ఎటు నుంచి వస్తాయో ఎవ్వరు ఊహించలేము. ఇక్కడ సమస్యలు కష్టాలు రావడం కాదు కష్టం రాగానే మీరు బెంబేలుఎత్తిపోవడం అది సమస్య. ఒక చిన్న సమస్య రాగానే ప్రపంచం మొత్తం మునిగిపోయినట్లు మీ ఒక్కరికే అన్యాయం జరిగిపోయినట్లు కుంగిపోకూడదు.
(00:33) ఈ రోజుల్లో చాలా మంది మానసికంగా ఎంత వీక్ అయిపోయారంటే చిన్న చిన్న కష్టాలకు కూడా ఆత్మహత్యలు చేసుకుందాం అనే స్థాయికి వెళ్ళిపోతున్నారు. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు బాగున్నప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అందులోనూ అందరితో నవ్వుతూ మాట్లాడతారు. కానీ లైఫ్ లో ఒక్క దెబ్బ తగిలితే మీలోని ధైర్యం, మీలోని నమ్మకం, మీలోని ఫిలాసఫీ అన్ని పేక మేడల్లా కూలిపోతాయి.
(00:58) ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే సమస్య మీ చుట్టూ ఉండే తుఫానులో లేదు. మీ లోపల ఉన్న అస్థిరతలో ఉంది. బాహ్య ప్రపంచంలో జరిగే ప్రతి చిన్న విషయానికి మీ మైండ్ రియాక్ట్ అయిపోతుంది. ఎవరైనా ఒక మాట అంటే బాధపడిపోతారు. వ్యాపారంలో చిన్న నష్టం వస్తే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. అనుకున్నది జరగకపోతే దేవుణని నిందిస్తారు. మీరు ఒక విక్టిం లాగా అంటే ఒక బాధితుల్లాగా ఫీల్ అవ్వడం మొదలు పెడతారు.
(01:22) నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నా లైఫ్ ఇంత ఘోరంగా ఎందుకు ఉందని మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటారు. ఈ మానసిక బలహీనత ఈ ఊర్పు లేకపోవటమే ఈ జనరేషన్ లో ప్రతి ఒక్క మనిషి ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య మన పురాణాలు మనకొక అద్భుతమైన మాట చెప్పాయి. అదేంటంటే ఈ సృష్టిలో ఏది స్థిరంగా ఉండదు. అంతా మారుతూనే ఉంటుంది. సుఖం తర్వాత దుఃఖం, వెలుగు తర్వాత చీకటి రావటం ప్రకృతి ధర్మం అని.
(01:52) కానీ మీరు మాత్రం లైఫ్ ఎప్పుడూ ఒకేలాగా కంఫర్ట్ గా సాగిపోవాలని కోరుకుంటారు. ఆ భ్రమలోనే బతుకుతుంటారు. ఎప్పుడైతే ఆ కంఫర్ట్ జోన్ బద్దలవుతుందో అప్పుడు మీ అసలు స్వరూపం బయటపడుతుంది. మీరు ఎంత వీకో మీకే అర్థంవుతుంది. సమస్య అనేది బయట లేదు. మీ ఆలోచన విధానంలోనే ఉంది. పరిస్థితులు మిమ్మల్ని శాసించడం కాదు. పరిస్థితులను మీరు ఎలా స్వీకరిస్తున్నారు అనేది చాలా ముఖ్యం.
(02:15) మీకు తెలుసా appపిల్ కంపెనీ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ జీవితాన్ని ఒక్కసారి గమనించండి. ఆయన కన్న తల్లిదండ్రులకి దూరమయ్యాడు. తను ప్రాణం పెట్టి పెంచిన కంపెనీ నుంచి ఆయన్ని గెంటేశారు. క్యాన్సర్ లాంటి భయంకరమైన జబ్బులతో పోరాడాడు. కానీ ఆయన ఎప్పుడైనా కుంగిపోయాడా లేదు ఆయన ఇండియా వచ్చాడు. ఇక్కడ సనాతన ధర్మంలోని లోతును చూశడు.
(02:36) నిమ్ కరోలి బాబా లాంటి గొప్ప గొప్ప మహర్షుల ఆశ్రయాన్ని వెతుక్కుంటూ కాలి నడకను తిరిగాడు. హిందూ ధర్మం నేర్పిన శూన్యతను నిశ్చలతను అర్థం చేసుకున్నాడు. అందుకయన ఒక మాట చెప్పాడు. మీరు త్వరలోనే చనిపోబోతున్నారు అని గుర్తుంచుకోవడమే మీ జీవితంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి నష్టపోతానేమో అనే భయాన్ని పోగొట్టుకోవడానికి నాకు దొరికిన అతి పెద్ద సాధనం అని చెప్పేసి స్టీవ్ జాబ్స్ ఆ కష్టాలన్నిటిని ఒక ముడి సరుకులా వాడుకొని హిందూ తత్వశాస్త్రంలోని స్థిత ప్రజ్ఞతను అలవరుచుకొని ప్రపంచాన్ని మార్చే ప్రొడక్ట్ ని క్రియేట్ చేశాడు. కానీ ఈరోజు మీరు ఏం
(03:12) చేస్తున్నారు మీరు చదివిన చదువుకి ఉద్యోగం రాకపోతే తట్టుకోలేకపోతున్నారు. ఎగ్జామ్ లో మార్కులు తగ్గితే రూమ్ తలుపులు పెట్టుకొని ఏడుస్తున్నారు. ఒకవేళ ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగంలో మీ బాస్ మిమ్మల్ని ఏదైనా అంటే చాలు మీరు లైఫ్ వేస్ట్ అనుకుంటున్నారు. మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కానీ మైండ్ లో మాత్రం క్లారిటీ లేదు.
(03:31) చిన్న కష్టం రాగానే దేవుణని బ్లేమ్ చేయడం లేకపోతే చెడు అలవాట్లకి బానిసలుైపోవడం ఇలాంటివి మొదలు పెడుతూ ఉంటారు. సమస్య మీ చుట్టూ ఉండే మనుషుల్లోనూ లేకపోతే సమాజంలోనో లేదు. సమస్య మీ ఎమోషనల్ అస్థిరతలో ఉంది. నిజం ఏంటంటే ఒక సముద్రంలో ప్రయాణించే నావ చుట్టూ నీరు ఉండటం వల్ల ఎప్పుడు మునిగిపోదు. ఆ సముద్రపు నీరు పడవ లోపలికి వస్తే అది మునుగుతుంది.
(03:56) అలాగే ఈ ప్రపంచంలో కోట్లాది సమస్యలు మీ చుట్టూ ఉండొచ్చు కానీ ఆ సమస్యల్ని మీ మైండ్ లోకి రానిచ్చినంత కాలం మీరు స్ట్రాంగ్ గా నిలబడలేరు. ఎప్పుడైతే వాటిని రానివ్వకుండా చూసుకుంటారో అప్పుడు మెరిస్ట్రాంగ్ గా నిలబడతారు. ఇంకా కొంచెం క్లియర్ గా చెప్పాలంటే బలాన్ని మర్చిపోయి బ్రతకటం ఈ తరం చేస్తున్న అతి పెద్ద తప్పు. అసలు ఈ మానసిక బలహీనత ఈ అస్థిరత మీలో ఎందుకు అవసరమో తెలుసా? ఎందుకంటే మీరంతా ఒక భ్రమల ప్రపంచంలో బ్రతుకుతున్నారు కాబట్టి ఇల్యూజన్ చిన్నప్పటి నుంచి మన సమాజం మన చుట్టూ ఉన్న మనుషులు మనల్ని కంఫర్ట్ అనే మత్తుకి బానిసల్ని చేశారు. లైఫ్ అంటే
(04:33) ఎప్పుడు లీనియర్ గా హ్యాపీగా సాగిపోవాలని చెప్పేసి ఒక అబద్ధాన్ని మీ మైండ్ లోకి ఎక్కించారు. దాంతో చిన్న సమస్య వచ్చినా ఒక అపజయం ఎదురైనా సరే వాటిని తట్టుకొని నిలబడే శక్తి మీలో ఉన్నా సరే ఈ సమాజం చేత మిమ్మల్ని మీరు హృదించుకోవడం వల్ల అయ్యో ఈ తప్పు నా వల్లే జరిగిందేమో నాకు చేత కాకపోవడం వల్ల నేను ఓడిపోయానేమో అని చెప్పేసి మిమ్మల్ని మీరు తక్కువ అంచన వేసుకుంటున్నారు.
(04:59) ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు గెలవాలని పోరాడుతూనే ఉంటారు. కొన్నిసార్లు ఓడిపోతారు. ఓడిపోయినంత మాత్రాన మళ్ళీ నెక్స్ట్ టైం గెలవరు అని చెప్పేసి ఇక్కడ ఎవరు చెప్పట్లేదు కదా మీరే ఓవర్ గా ఇమాజిన్ చేసుకుంటున్నారు. మీకు తెలుసా మనిషికి కష్టం రాగానే ఒక వింతైన సైకాలజీ యక్టివ్ అవుతుంది. దాన్నే విక్టిమ్ మెంటాలిటీ అంటారు. అంటే నేను బాధితుడిని నాకే అందరూ అన్యాయం చేస్తున్నారు అని చెప్పేసి ఫీల్ అవ్వడం.
(05:23) సమస్య రాగానే మీ మైండ్ దానికి గల కారణాలు వెతకడం మానేసి బ్లేమ్ గేమ్ మొదలు పెడుతుంది. నా చుట్టూ ఉన్నవాళ్ళు బాలేరు. మా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేయట్లేదు నా లక్కు బాలేదు దేవుడు నన్ను కరుణించట్లేదు అని చెప్పేసి ఇలాంటి సాకులు వెతుకుతూ ఉంటారు. నిజం ఏంటంటే సమస్య మీ పరిస్థితుల్లో లేదు. మీ షాకీ ఫెయిత్ లో ఉంది.
(05:45) అంటే పరిస్థితులు బాగున్నప్పుడు పూజలు చేయడం దేవుని నమ్మడం చాలా ఈజీ. కానీ లైఫ్ మిమ్మల్ని ఒక దెబ్బ కొట్టగానే ఆ నమ్మకం ఎటు పోతుందో ఎవ్వరికీ తెలియదు. మీ నమ్మకం అనేది కండిషనల్ అంటే వ్యాపారం లాంటిది. నేను భగవంతుని పూజిస్తాను పూజించాను కాబట్టి నా భగవంతుడు నాకు కష్టాలు రాకుండా చూసుకోవాలి. ఇది పూజ ఎందుకైది డీల్ అయిద్ది కదా ఎప్పుడైతే ఆ డీలింగ్ ఫెయిల్ అవుతుందో నీకు కూడా దేవుడి మీద విశ్వాసం అనేది తగ్గిపోతుంది.
(06:11) భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడో చెప్పాడు. సుఖ దుఃఖే సమోకృత్వ లాభ లాభౌ జయ జయ అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా లాభం వచ్చినా నష్టం వచ్చినా ఒకేలా స్వీకరించడం నేర్చుకో అని. కానీ మీరు మాత్రం కేవలం సుఖాన్ని మాత్రమే కోరుకుంటారు. దుఃఖం రాగానే పారిపోవాలని చూస్తారు. స్టీవ్ జాబ్స్ తన appపిల్ కంపెనీ నుంచి బయటికి పంపించేసినప్పుడు కుంగిపోయి ఉంటే ఈరోజు ఐఫ ఉండేది కాదు ఆయన ఆ కష్టాన్ని తన అహాన్ని చంపుకోవడానికి తనను తాను రీఇన్వెంట్ చేసుకోవడానికి ఒక అవకాశంగా చూశాడు.
(06:45) బంగారం మరింత ప్రకాశించాలంటే అది అగ్నిలో కాలాలి. సుత్తి దెబ్బలు తినాలి. మీ జీవితంలో వచ్చే కష్టాలు కూడా మిమ్మల్ని నాశనం చేయడానికి రావు. మీలోని మాలిన్యాన్ని మీలోని బద్ధకాన్ని తీసేసి మిమ్మల్ని మెరుగుపరచడానికి వస్తాయి. ఆ సత్యాన్ని గ్రహించకపోవడమే మీ సమస్యలన్నిటికీ మూలం. మీరు గమనించారో లేదో ఈ రోజుల్లో అందరికీ అప్రూవల్ కావాలి.
(07:10) పక్కింటోడు ఏమనుకుంటాడో సోషల్ మీడియాలో లైకులు వస్తాయో లేదో ఇదే మీ జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. మీ సంతోషాన్ని ఇంకొకళ్ళ అప్రూవల్ కోసం ఆపుకోమాకండి. ఎందుకంటే వాడు బాగుందంటే మీ జీవితం బాగున్నట్లు కాదు వాడు బాగోలేదు అనంత మాత్రాన మీ జీవితం బాగోలేదని కాదు మీకు మీ జీవితం క్లియర్ గా కనిపించాలి. ఇంకొకడు చెప్తే కనిపించడం అనేది మూర్ఖత్వం అందులోనూ మన మైండ్ అనేది ఒక యుద్ధరంగం ఆ యుద్ధరంగంలో రోజుకి వేలాది ఆలోచనలు వస్తూ ఉంటాయి.
(07:41) అందులో ఎక్కువ భాగం భయం, అనుమానం, ఆందోళనే ఎప్పుడైతే మీరు ఆ నెగిటివ్ ఆలోచనలకి స్పేస్ ఇస్తారో అవి మిమ్మల్ని నాశనం చేయడం మొదలు పెడతాయి. సమస్య బయట ఉండదు కానీ మీ బ్రెయిన్ దాన్ని ఒక పెద్ద భూతంలా క్రియేట్ చేసి చూపిస్తుంది. అప్పుడు మీరు వనికిపోతూ ఉంటారు. టుబి ఫ్రాంక్ చెప్పాలంటే ఒక సమస్యని సమస్యగా చూడకుండా సిచువేషన్ లా చూడటం మొదలు పెడితే మీకు అసలు అది సమస్యలాగే కనిపించదు.
(08:05) నిజం ఏంటంటే సనాతన ధర్మంలో మైండ్ కంట్రోల్ గురించి ఎంతగానో చెప్పారు బుద్ధిని స్థిరంగా ఉంచుకోవడమే అన్నిటికంటే పెద్ద ఆయుధం కానీ మీరు ఆ రూట్స్ అన్నిటిని మర్చిపోయి వెస్టరన్ కల్చర్ కాపీ కొడుతూ పైపై మెరుగులు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ ఆ అంతరంగాన్ని బలోపేతం చేసుకోవట్లేదు. స్టీవ్ జాబ్స్ ఇండియా వచ్చినప్పుడు ఇక్కడ హిందూ తత్వశాస్త్రంలో ఆయన చూసింది ఇదే ఇక్కడ హిమాలయాల్లో ఆశ్రమాల్లో సాధువులు ఎలాంటి ఆస్తులు లగ్జరీలు లేకపోయినా అంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు ఎందుకంటే వాళ్ళ శాంతి అనేది బాహ్య ప్రపంచం మీద ఆధారపడలేదు.
(08:42) వాళ్ళ అంతర్గత నిశ్చలతను సాధించారు. మీరు మాత్రం చిన్న సమస్య రాగానే వణకిపోతూ ఉంటారు దేవుణ్ణి తిడతారు ఇంట్లో వాళ్ళని తిట్టుకుంటారు చుట్టూ ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి బాధపడతారు. కానీ జీవితంలో కష్టాలు రావడం ఎంత సహజమో వాటిని తట్టుకొని నిలబడటం కూడా అంతే అవసరమో క్లారిటీ లేకపోవటం మీ సమస్య ఆ క్లారిటీ లేనప్పుడు మీరు ఎన్ని పూజలు చేసినా ఎంత సంపాదించినా లోపల ఎప్పుడు ఒక అభద్రతా భావం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది.
(09:10) నా పాయింట్ ఏంటంటే సమస్యలు డబ్బు సంపాదించిన వాడికి వస్తాయి అసలు సంపాదన లేని వాడికి కూడా వస్తాయి బట్ ఎవరు వాళ్ళ సమస్యలని ఎంత అద్భుతంగా హ్యాండిల్ చేశారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటివరకు సమస్య ఏంటో చూసాం అది ఎందుకు వస్తుందో కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు అసలు పాయింట్ కి వద్దాం. ఈ అస్థిరతని ఈ మానసిక బలహీనతని ఎలా అధిగమించాలి? దీనికి ఒకటే మార్గం సనాతన ధర్మం యుగాల క్రితమే బోధించిన స్థిత ప్రజ్ఞతని అలవరుచుకోవడం అంటే బయట పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి మీ లోపల ప్రశాంతతను మాత్రం దీనికి తాకట్టు పెట్టకండి భగవంతుడి విశ్రాంతిలో
(09:48) ప్రవేశించడం అంటే అర్థం ఇదే బాహ్యంగా తుఫాను చుట్టుముట్టిన మీ అంతరంగం మాత్రం నిశ్చలంగా పటిష్టంగా ఉండాలి. దానికి మీరు మీ మైండ్ లో ఉన్న యుద్ధ రంగాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే మీరు కొన్ని స్టెప్స్ ని ఫాలో అవ్వాలి అందులో మొదటి స్టెప్ ప్రతికూల ఆలోచనలకి బ్రేక్ వేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో శత్రువులు ఉంటారు అది కామన్ అందులోనూ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే శత్రువులు అంటే బయట ఎవరో ఉన్నవాళ్ళు కాదు మీ జీవితంలో మీ శత్రువులు అంటే మీ ఆలోచనలే అందులోనూ మీ మైండ్ లోకి వచ్చే భయం అవ్వచ్చు అనుమానం అవ్వచ్చు నిరాశ అవ్వచ్చు ఇవన్నీ మీ శత్రువులే ఆ
(10:25) నెగిటివ్ ఆలోచనలు రాగానే వాటిని మీ లోపలికి రానివ్వకుండా భగవంతుడి నామంతో ఆ అంతర్గత నమ్మకంతో అక్కడికక్కడే వాటిని అడ్డుకోవాలి. స్టీవ్ జాబ్స్ తన జీవితంలో ప్రతి సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు ఈ మైండ్ ఫిల్టరింగ్ నే వాడాడు. ఆయన ఇండియాలో నేర్చుకున్న ధ్యానం శూన్యత ఆయనకి ఏకాగ్రతని ఇచ్చాయి. అనవసరమైన ఆలోచనలు కట్ చేసి కేవలం చేయాల్సిన పని మీద మాత్రమే మైండ్ ని ఫోకస్ చేయడం ఆయనకి అలవాటయింది.
(10:54) ఇక రెండో స్టెప్ వచ్చేసి మీరు చేసే పూజా విధానాన్ని మార్చాలి. నిజం ఏంటంటే చాలా మంది సమస్యలు రాగానే దేవుడా నాకు కష్టం వచ్చింది తీర్చేయ అని చెప్పేసి నా చుట్టూ ఉన్న పరిస్థితులని మార్చేయ అని చెప్పేసి భగవంతుని వేడుకుంటారు విపరీతంగా పూజలు చేస్తారు. అది చాలా తప్పు పరిస్థితులు మార్చమని కాదు ఆ పరిస్థితుల మధ్యలో కూడా స్ట్రాంగ్ గా నిలబడే శక్తిని ఇమ్మని భగవంతుని అడగాలి.
(11:20) దేవుడు మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చడానికి ముందే మీ అంతర్గతాన్ని మారుస్తాడు. సో మీ క్యారెక్టర్ ని బిల్డ్ చేస్తాడు. సనాతన ధర్మంలో తపస్సు అంటే అర్థం ఇదే కష్టాన్ని భరిస్తూ లోపల బలాన్ని పెంచుకోవడం సమస్యలు త్వరగా ముగిసిపోవాలని కోరుకోవడం ఆపేసి వాటిని తట్టుకునే ఓర్పుని అలవరుచుకున్నప్పుడే మీరు మీ జీవితంలో ఎలాంటి సిచువేషన్ వచ్చినా సరే స్ట్రాంగ్ గా నిలబడతారు.
(11:46) ఇంకా మూడో స్టెప్ సనుగుడు అనే వైరస్ ని మీ లైఫ్ నుంచి డిలీట్ చేయండి. చాలా మంది చిన్న కష్టం రాగానే ఏడవటం వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం అలవాటు. నిజం ఏంటంటే మీరు ఎంతగా సనుగుతూ ఉంటే మీ సమస్య అంత పెద్దగా కనిపిస్తుంది. దాని వల్ల మీ ఎనర్జీ వేస్ట్ అవ్వడం తప్ప ఒక్క పైసా కూడా ఉపయోగం లేదు. హిందూ ధర్మంలో గ్రాటిట్యూడ్ అనే భావనకి చాలా పెద్ద పెట వేశారు.
(12:10) మీకు ఉన్న సమస్యలు చూసి ఏడవడం మానేసి మీ జీవితంలో దేవుడు మీకు ఇచ్చిన మంచి విషయాలను గుర్తుంచుకొని థాంక్స్ చెప్పండి. థాంక్స్ ఆయనకి చెప్పడం నేర్చుకోండి. ఎప్పుడైతే మీ ఫోకస్ కష్టాల నుంచి గ్రాటిట్యూడ్ వైపు మలుతుందో అంటే కృతజ్ఞత వైపు మలుతుందో అప్పుడే మీ మైండ్ పాజిటివ్ మోడ్ లోకి యాక్టివ్ అవుతుంది. మీరు గమనించారో లేదో స్టీవ్ జాబ్స్ క్యాన్సర్ లాంటి భయంకరమైన జబ్బుతో పోరాడుతున్నప్పుడు కూడా ఎప్పుడూ సనుగుతూ కూర్చోలేదు.
(12:36) స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ స్పీచ్ లో ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పారు. మీ టైం చాలా లిమిటెడ్ దాన్ని ఇతరుల కోసం కాకుండా మీ కోసం ఖర్చు పెట్టుకోమని చెప్పాడు. ఆయన కష్టాలు చూసి భయపడలేదు తన చేతుల్లో ఉన్న సమయాన్ని ఎంత ప్రొడక్టివ్ గా మార్చుకోవాలో చూశాడు. అది సనాతన ధర్మం నేర్పిన కర్మ సిద్ధాంతం యొక్క ప్రాక్టికల్ అప్లికేషన్ ఫలితం గురించి ఆందోళన చెందకుండా ప్రస్తుత క్షణంలో మీ కర్తవ్యాన్ని మీరు సక్రమంగా నిర్వర్తించడమే అసలైన పరిష్కారం.
(13:03) ఇక నాలుగో స్టెప్పు పరిస్థితులను ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడం స్టోయిసిజం మరియు వేదాంత తత్వశాస్త్రం రెండు ఇదే చెప్పాయి. మీ కంట్రోల్ లో లేని విషయాల గురించి ఆలోచించి టైం వేస్ట్ చేయకండి ఉదాహరణకి మీ బిజినెస్ లాస్ అయింది లేదా ఒక రిలేషన్షిప్ బ్రేక్ అయింది అది జరిగిపోయింది దాన్ని మీరు మార్చలేరు కానీ దానికి మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి దాన్ని ఎలా అధిగమించాలఅనేది పూర్తిగా మీ చేతుల్లో ఉంది.
(13:30) ఆ కంట్రోల్ మీ మైండ్ కి ఇవ్వడమే నిజమైన కమిట్మెంట్. పరిస్థితులు ఎలా ఉన్నా నేను మారను. నా ప్రశాంతతని కోల్పోను అని గట్టిగా డిసైడ్ అవ్వడమే ఈ సమస్యకి అంతిమ పరిష్కారం. ఇప్పటివరకు మనం విన్నది ఒక ఎత్తు అయితే ఇకబై దాన్ని మన లైఫ్ లోకి ఎలా అప్లై చేయాలనేది ఇంకొక ఎత్తు కేవలం ఫిలాసఫీ వింటే సరిపోదు దాన్ని జీవితంలోకి దించాలి.
(13:50) మీ లైఫ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలంటే మిమ్మల్ని మీరు రోజువారీగా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటిగా మీ విక్టిం కార్డు ని తీసి అవతల పారేయండి. నాకు అది లేదు ఇది లేదు సమాజం నన్ను తొక్కేసింది నా లక్కు బాగాలేదు ఇలా కబుర్లు చెప్పడం ఆపేయండి. హిందూ ధర్మం మనకి నేర్పిన కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందో తెలుసా మీ ఈనాటి పరిస్థితికి కారణం నిన్న మీరు తీసుకున్న నిర్ణయాలే అలాగే మీ రేపటి భవిష్యత్తును డిసైడ్ చేసేది ఈరోజు మీరు చేసే పనులే.
(14:19) స్టీవ్ జాబ్స్ తన గ్యారేజ్ లో ఆపిల్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఆయన దగ్గర కోట్లు లేవు పెద్ద సపోర్ట్ లేదు కానీ ఆయన తన కర్మ మీద నమ్మకం ఉంది. ఫలితాన్ని దేవుడికి వదిలేసి వర్క్ మీద 100% ఫోకస్ పెట్టాడు. మీరు కూడా మీ లైఫ్ రెస్పాన్సిబిలిటీని పూర్తిగా మీ చేతుల్లోకి తీసుకోండి. ఎప్పుడైతే మీరు బాధ్యత తీసుకోవడం మొదలు పెడతారో అప్పుడే మీ జీవితం మెరుగుపడటం స్టార్ట్ అవుతుంది.
(14:43) ఇక రెండోది మీ కంఫర్ట్ జోన్ ని బద్దలు కొట్టండి. ఇది చాలాసార్లు చెప్పాను. చాలా మంది ఒక చిన్న సేఫ్ జోన్ క్రియేట్ చేసుకొని అందులోనే బతికేస్తూ ఉంటారు. జీవితంలో సవాళ్లు కష్టాలు రాగానే భయపడిపోతారు. కానీ నిజం ఏంటంటే సనాతన ధర్మంలో చెప్పినట్లు శారీర మాధ్యంకాలు ధర్మ సాధనం అంటే కేవలం శరీరాన్నే కాదు మీ బుద్ధిని కూడా కష్టాలకు అలవాటు చేయాలి.
(15:06) ప్రతిరోజు ఒక రిస్క్ తీసుకోండి. కొన్ని కొత్త విషయాలు నేర్చుకోండి. స్టీవ్ జాబ్స్ ఇండియా నుంచి వెనక్కి వెళ్ళాక కూడా తన లైఫ్ లాంగ్ ఒక సన్యాసి లాంటి క్రమశిక్షణని మెయింటైన్ చేశాడు. సింప్లిసిటీని అలవాటు చేసుకున్నాడు. లగ్జరీలు పెరిగితే మైండ్ మొద్దు పారిపోతుంది. కష్టపడే తత్వం పోతుంది కాబట్టి కష్టమైన పనులను చూసి పారిపోకండి.
(15:30) వాటిని మీ మానసిక బలాన్ని పెంచే వెయిట్ లిఫ్టింగ్ లా భావించండి. మూడవది హిందూ ధర్మంలో చెప్పిన స్థిత ప్రజ్ఞతను మీరు రోజూ అలవాటుగా మార్చుకోండి. పొద్దున్నే లేచిన వెంటనే సోషల్ మీడియా నోటిఫికేషన్లు చూస్తూ మైండ్ ని చెత్తతో నింపకండి. అలా కాకుండా ఒక మంచి స్తోత్రమో లేకపోతే మీ మనసుని ప్రశాంతకు గురి చేసే మ్యూజిక్ లేకపోతే కొన్ని అద్భుతమైన మాటలో వినడం మొదలు పెట్టండి.
(15:55) స్టీవ్ జాబ్స్ ప్రతిరోజు ఉదయం అద్దంలో తన ముఖాన్ని చూసుకొని ఒక ప్రశ్న వేసుకునేవాడంట. ఈ రోజు నా జీవితంలో చివరి రోజు అయితే నేను ఎప్పుడు చేయబోయే పని చేస్తానా అని ఒక ప్రశ్న ఆయన మైండ్ లో ఉన్న అనవసరమైన భయాలని అహాన్ని తీసేసి ప్యూర్ క్లారిటీ ఇచ్చేది మీ జీవితంలో కూడా అలాంటి ఒక సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఉండాలి. బాహ్య ప్రపంచం మిమ్మల్ని ఎంత గందరగోళానికి గురి చేసినా రోజులో కనీసం 10 నిమిషాలైనా నిశ్శబ్దంగా కూర్చొని మీ అంతరంగాన్ని గమనించండి.
(16:26) మీ లోపల ప్రశాంతతని ఏ శక్తి కదిలించలేనంత బలంగా మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి. నిజం ఏంటంటే ఈ జీవితం ఒక యుద్ధం ఇక్కడ తుఫానులు రావడం ఆగవు కష్టాలు ముగిసిపోవు. ఒక సమస్య తీరగానే ఇంకొకటి వస్తూనే ఉంటాయి. సో లైఫ్ ఎప్పటికీ పర్ఫెక్ట్ గా మారదు మారాల్సింది పరిస్థితులు కాదు మారాల్సింది మనం. అందులోనే చాలా మంది ఏంటంటే ఆధ్యాత్మిక జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పి అనుకుంటారు కానీ ఆధ్యాత్మిక జీవితం అంటే వందల సమస్యల మధ్యలో కూడా సింహం లాగా నిశ్చలంగా నిలబడటం ఆ బలం ఆ తాత్విక దృక్పదం సనాతన ధర్మంలో ఉంది.
(17:02) మీ అంతరంగంలోనూ ఉంది. దాన్ని మేలుకొలపండి. చివరిగా ఒక మాట రేపు అనేది మీ చేతుల్లో లేదు. నిన్న అనేది ఎలాగో అయిపోయింది. మీ చేతిలో ఉన్నది కేవలం ఈ ఒక్క క్షణం మాత్రమే. ఇప్పుడు చెప్పండి ఇంకా ఎంతకాలం ఈ విక్టిం కార్డు పట్టుకొని ఏడుస్తూ పరిస్థితులను బ్లేమ్ చేస్తూ బతుకుతారు చుట్టూ ఉన్న తుఫాన్ చూసి భయపడతారా? లేక మీ లోపల ఒక నిశ్చలమైన సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకొని రాజులాగా నిలబడతారా ఛాయిస్ మీదే ఎందుకంటే మీ లైఫ్ కి మీరే లీడర్ మీ లైఫ్ కి మీరే డిక్టేటర్ కాబట్టి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే కచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి,
(17:37) కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్.
No comments:
Post a Comment