Tuesday, May 26, 2026

అమ్మాయిలు ఎందుకు Emotional గా అలసిపోతున్నారు?|Why Modern Girls Feel Mentally Exhausted All The Time|

అమ్మాయిలు ఎందుకు Emotional గా అలసిపోతున్నారు?|Why Modern Girls Feel Mentally Exhausted All The Time|

Author Name:victory vibes telugu

Youtube Channel Url:https://www.youtube.com/@victoryvibestelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=d96gzMFQLzs



Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ బాధ్యతల్లో పడి బంధాలను మోస్తూ గడియారంతో పోటీ పడుతూ ఈ రోజుల్లో ప్రతి అబ్బాయి ఒక యుద్ధమే చేస్తుంది. అవును ఈ ప్రయాణంలో మీరు స్ట్రాంగ్ అవుతున్నారు. కానీ మీకు తెలియకుండానే మీలో ఉండాల్సిన ఆ ప్రశాంతతను కోల్పోతున్నారు. గుర్తుపెట్టుకోండి గెలవటం అంటే కేవలం పరిగెత్తడం మాత్రమే కాదు. లోపల ప్రశాంతంగా ఉంటూనే అనుకున్నది సాధించడం.
(00:28) మీలో దాగి ఉన్న ఆ అద్భుతమైన శక్తిని ఆనందాన్ని మళ్ళీ మేల్కొలిపే 10 చిన్న అలవాట్లు ఈరోజు మనం తెలుసుకుందాం. లెట్ అస్ స్టార్ట్ పాయింట్ నెంబర్ వన్ నడిచే విధానం కూడా మీ ఎనర్జీని మార్చేస్తుంది. మన హావభావాలు మన నడక మన మనసులో ఏముందో బయట పెట్టేస్తాయి. మనం ఎలా నడుస్తాం అనే దాన్ని బట్టి కూడా మన లోపల ఉండే ఎనర్జీ మారిపోతుంది.
(00:51) తెలుసా? ఎప్పుడు లైఫ్ లో ఏదో కోల్పోతున్నాం అనే టెన్షన్ ఉన్నవాళ్ళు విపరీతమైన స్ట్రెస్ ఫీల్ అయ్యేవాళ్ళు చాలా స్టిఫ్ గా బాడీని గట్టిగా బిగబట్టి కంగారు కంగారుగా నడుస్తారు. అది మీలో నెగిటివ్ ఎనర్జీని పెంచుతుంది. కానీ ఫెమినైన్ ఎనర్జీ అంటే ఒక ప్రవాహం అదిఒక ఫ్లో అందులో కంగారు ఉండదు. ఒక అందమైన ప్రశాంతత ఉంటుంది. అందుకే ఇవాల్టి నుండి మీరు నడిచేటప్పుడు కొంచెం స్లో అవ్వండి.
(01:19) మీ భుజాలను రిలాక్స్ చేయండి. మీ నడకలో ఆ కాన్ఫిడెన్స్ ఆ సాఫ్ట్నెస్ కనిపించనివ్వండి. వీలైతే సాయంత్రం పూట మీకు నచ్చిన మంచి మ్యూజిక్ వింటూ అలా వాకింగ్ కి వెళ్ళండి. కానీ గుర్తుపెట్టుకోండి. ఈసారి మీరు నడిచేది ఎక్కడికో వెళ్ళిపోవాలనే టార్గెట్ తో కాదు కేవలం ఆ క్షణాల్ని ఆ ప్రకృతిని ఫీల్ అవ్వడం కోసం మాత్రమే. అలా నడుస్తున్నప్పుడు మీతో [గొంతు సవరించుకోవడం] మీరు మాట్లాడుకోండి.
(01:42) కొన్ని రోజులు ఇలా చేసి చూడండి. మీకే అనిపిస్తుంది. నేను లోపల చాలా ప్రశాంతంగా ఉన్నాను. నాలో ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అని అమ్మాయిలు ఇప్పుడే ఈ వీడియో చూస్తూ ఒక్కసారి ఆలోచించండి. మీరు నడిచేటప్పుడు కంగారుగా ఉంటారా లేక ప్రశాంతంగా నడుస్తారు. మీ అలవాటు ఏంటో కింద కామెంట్స్ లో నాతో షేర్ చేసుకోండి. పాయింట్ నెంబర్ టూ ఫుల్ మేకప్ అవసరం లేదు.
(02:08) ఒక చిన్న టచ్ చాలు. చాలా మంది అమ్మాయిలు అనుకుంటూ ఉంటారు. ఆఫీస్ వర్క్ తోనూ ఇంటి పనులతోనూ అసలు ఖాళీ దొరకట్లేదు. ఇక రెడీ అవ్వడానికి టైం ఎక్కడఉంది అందుకే నేనేం చేసుకోవడం లేదు అని కానీ నిజం చెప్పమంటారా మీ మూడు పూర్తిగా మారిపోవడానికి గంటల తరబడి మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదు కేవలం ఒక ఐదు నిమిషాలు చాలు రోజంతా పనుల్లో మునిగిపోయి నీరసంగా ఉన్నప్పుడు ఒక్కసారి ముఖం కడుక్కొని మీకు నచ్చిన ఒక క్యూట్ డ్రెస్ వేసుకొని లైట్ గా లిప్స్టిక్ రాసుకొని చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకొని చూడండి జుట్టుని నీట్ గా సర్దుకొని కొంచెం పర్ఫ్యూమ్ కొట్టుకోండి
(02:45) చూడడానికి ఇవి చాలా చిన్న విషయాలుగా అనిపించవచ్చు కానీ ఇవి మీరు ఇతరుల కోసం చేసే పనులు కాదు మీ మీద మీకు ఉన్న గౌరవానికి ప్రేమకు గుర్తులు మిమ్మల్ని మీరు అందంలో అలా ఫ్రెష్ గా చూసుకున్నప్పుడు మీ మెదడుకి ఒక పాజిటివ్ సిగ్నల్ వెళ్తుంది. మీలో కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి మీరు అందంగా రెడీ అవ్వాల్సింది ఎవరినో ఇంప్రెస్ చేయడానికి కాదు.
(03:10) మీలోని ఎనర్జీని పెంచుకోవడానికి మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ప్రెజెంటబుల్ గా ఉంచుకుంటారో అప్పుడు మీ చుట్టూ ఉండే నెగిటివిటీ అంతా మాయమైపోతుంది. అవును అమ్మాయిలు పనుల మధ్యలో కూడా మీకోసం మీరు కేటాయించే ఆ ఐదు నిమిషాల సెల్ఫ్ కేర్ మీకు నచ్చుతుందా? ఈ అలవాటు మీలో ఎంతమందికి ఉందో ఎస్ అని కామెంట్ చేయండి. పాయింట్ నెంబర్ త్రీ హెల్ప్ అడగటం బలహీనత కాదు. ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిల్లో ఒక అలవాటు చూస్తూ ఉంటాం.
(03:38) ఏదైనా చిన్న సమస్య వచ్చినా లేదా పరిభారం ఎక్కువైనా ఎవరిని సాయం అడగడానికి అసలు ఇష్టపడరు. చాలా హెసిటేట్ అవుతారు. అన్ని నేనే చేసుకోవాలి నేనే మేనేజ్ చేయాలి అని వాళ్ళ మీద వాళ్ళే ఒక తెలియని ప్రెజర్ ని పెట్టేసుకుంటారు. కానీ నిజం చెప్పమంటారా ప్రతి పనిని ఒంటరిగానే ముక్కి మూలిగి చేయడం అసలు గొప్పతనుక అది మీ స్ట్రెంగ్త్ కూడా కాదు కొన్నిసార్లు అవతలి వాళ్ళ సాయాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించడం కూడా ఒక గొప్ప మెచూరిటీ మీరు విపరీతంగా అలిసిపోయినప్పుడు లేదా ఒక పని మీకు అర్థం కానప్పుడు ప్లీజ్ నాకు కొంచెం హెల్ప్ కావాలి అని అడగడంలో ఎలాంటి తప్పు లేదు. అది మిమ్మల్ని తక్కువ చేసి
(04:16) చూపించదు. ఎందుకంటే ఆల్రెడీ బయట లైఫ్ చాలా హార్డ్ గా ఎన్నో బాధ్యతలతో నడుస్తుంది. అలాంటి టైంలో అన్ని మనభుజాల మీదే వేసుకొని జీవితాల్ని ఇంకెందుకు అంత కష్టతరం చేసుకోవడం సహాయం అడగడం అంటే మీరు బలహీనులు అని కాదు. మీ మానసిక ప్రశాంతతకు మీరు ఇస్తున్న విలువ. మీ చుట్టూ ఉన్న వాళ్ళను నమ్మటం వాళ్ళ ప్రేమను సాయాన్ని స్వీకరించడం కూడా ఫెమినైన్ ఎనర్జీలో ఒక భాగమే.
(04:45) నిజం చెప్పండి అమ్మాయిలు మీరు పనుల భారంతో అలిసిపోయినా సరే పక్కవాళ్ళని హెల్ప్ అడగడానికి మొహమాట పడతారా అవునో కాదో కింద కామెంట్స్ లో నాతో పంచుకోండి. పాయింట్ నెంబర్ ఫోర్ ప్రొడక్టివ్ కాకపోయినా హ్యాపీగా ఉంటే చాలదా ఈ రోజుల్లో మనం ఏ జనరేషన్ లో బతుకుతున్నామ అంటే మనం చేసే ప్రతి పని వెనుక ఏదో ఒక లాభం ఉండాలి. అది ప్రొడక్టివ్ గా ఉండాలి అనుకుంటున్నాం. ఒక బుక్ చదివితే నాలెడ్జ్ పెరగాలి.
(05:09) వాకింగ్ చేస్తే క్యాలరీలు బర్న్ అవ్వాలి. ఒక వీడియో చూస్తే ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఇలా ప్రతి చిన్న విషయాన్ని ఒక టార్గెట్ లా మార్చేసుకుంటున్నాం. కానీ జీవితంలో అన్నింటికీ లెక్కలు వేయలేము కదా ఏ లాభం ఆశించకుండా కేవలం మీ ఆనందం కోసం మీ మనసుకి నచ్చిన పనులు చేయడం కూడా అంతే ముఖ్యం. ఒక్కసారి ఆలోచించండి. నాలెడ్జ్ కోసం కాకుండా కేవలం ఆ కథలో లీనమైపోవడానికి ఒక మంచి నవల చదివితే ఎంత బాగుంటుంది బయట వర్షం పడుతుంటే ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఒక కప్పు వేడి టీ తాగుతూ ఆ వర్షాన్ని చూస్తే వచ్చే ప్రశాంతత ఎంత గొప్పది బాత్్రూమ్ సింగర్లా మీకు నచ్చిన పాటలు
(05:48) పాడుకోండి. మీ ఇంట్లో ఉన్న మొక్కలతో మనస్ఫూర్తిగా మాట్లాడండి. పెయింటింగ్ వేయండి. ఏదైనా సరే చేయండి. కానీ ఈసారి ఏ రిజల్ట్ కోసమో లాభం కోసమో కాదు కేవలం మీ ఆనందం కోసం మీ మనసుకి నచ్చేలా చేయండి. అదే మీ లోపల ఉన్న నిజమైన [గొంతు సవరించుకోవడం] ఫెమినైన్ ఎనర్జీని ప్రశాంతతను మళ్ళీ నింపుతుంది. అవునమ్మాయిలు మీ హడావిడి జీవితంలో ఎలాంటి లెక్కలు లేకుండా కేవలం మీ ఆనందం కోసం మీరు చేసే ఆ ఒక్క చిన్న పని ఏంటో కింద కామెంట్స్ లో నాతో షేర్ చేసుకోండి.
(06:21) పాయింట్ నెంబర్ ఫైవ్ మీ బ్రెయిన్ ని డస్ట్ బిల్ లా యూస్ చేయొద్దు. ఈ రోజుల్లో మన మైండ్ ఎప్పుడూ ఓవర్లోడ్ అయిపోతూ ఉంటుంది. పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఇంట్లోకి ఏం కావాలో గుర్తుపెట్టుకోవాలి. ఆఫీస్ డెడ్లైన్స్ రీచ్ అవ్వాలి. ఎవరికో ఫోన్ చేయాలి బిల్స్ పే చేయాలి. ఇలా 100 రకాల విషయాలను మనం బుర్రలోనే దాచిపెట్టుకుంటాం. అన్ని బ్రెయిన్ లోనే స్టోర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందో తెలుసా? బైండ్లో స్పేస్ లేక తెలియకుండానే విపరీతమైన స్ట్రెస్ చిరాకు వచ్చేస్తాయి.
(06:52) అందుకే ఇవాల్టి నుండి మీ ఆలోచనలను మీ పనులను బయటకు రాయడం అలవాటు చేసుకోండి. మీ ఫోన్ లోని నోట్స్ యాప్ అయినా పర్లేదు. ఒక చిన్న డైరీ అయినా పర్లేదు లేదా క్యాలెండర్ అయినా పర్లేదు. మీకు ఏది వీలైతే అది తీసుకోండి. రేపు మీరు చేయాల్సిన పనులను మీ మనసులోని థాట్స్ ని అందులో క్లియర్ గా రాసేయండి. గుర్తుపెట్టుకోండి మన బ్రెయిన్ అనేది విషయాలను స్టోర్ చేసుకోవడానికి కాదు [గొంతు సవరించుకోవడం] కొత్తగా ఆలోచించడానికి ప్రశాంతంగా ఉండడానికి దేవుడి ఇచ్చిన ఒక అద్భుతమైన గిఫ్ట్ ఎప్పుడైతే మీరు పనులన్నీ ఒక పేపర్ మీద పెడతారో అప్పుడు మీ బ్రెయిన్ చాలా తేలిక అవుతుంది. మీలో ఒక తెలియని ప్రశాంతత
(07:28) క్లారిటీ కనిపిస్తాయి. అవును అబ్బాయిలు పరులన్నీ బుర్రలోనే పెట్టుకొని టెన్షన్ పడతారా లేక డైరీలో రాసుకునే అలవాటు మీకు ఉందా? మీ పద్ధతి ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. పాయింట్ నెంబర్ సిక్స్ స్లో డౌన్ ప్రపంచం ఎక్కడికి పోదు. ఫ్రెండ్స్ పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎప్పుడూ ఏదో ఒక హడావిడి ఎప్పుడూ ఏదో ఒక అర్జెంట్ ఇలా ఎప్పుడూ కంగారులో పరుగుల మధ్యలో బతికే వాళ్ళు జీవితాల్ని అస్సలు ఫీల్ అవ్వలేరు.
(07:59) గమనించారా ఈ రోజుల్లో మన తిండి ఫాస్ట్ మన నడక ఫాస్ట్ ఆఖరికి పక్కవాళ్ళతో మాట్లాడే మాటలు కూడా ఫాస్టే అంతా ఒక మెషిన్ లాగా అయిపోయింది. ఒక్కసారి ఆగండి కొంచెం స్లో అవ్వండి. ఈ ప్రపంచం ఎక్కడికి పారిపోదు. మీరు పొద్దున్నే ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కూడా ఆ నీటి స్పర్శను ఆ ఫ్రెష్నెస్ ని ఎంజాయ్ చేయండి. సాయంత్రం ఒక కప్పు టీ తాగేటప్పుడు ఆ ఐదు నిమిషాలు ఫోర్ ని కాస్త పక్కన పెట్టండి.
(08:25) ఆ వేడి వేడి టీ టెస్ట్ ని మనస్ఫూర్తిగా ఆస్వాదించండి. గుర్తుపెట్టుకోండి స్లో లివింగ్ అంటే బద్ధకంగా ఉండటం కాదు ప్రతి క్షణాన్ని హ్యాపీగా ప్రశాంతంగా అనుభవిస్తూ బతకడం. ఎప్పుడైతే మీరు మీ పనుల్లో ఈ నిమ్మళత్వాన్ని అలవాటు చేసుకుంటారో మీ చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్స్ అన్నీ పోయి మీ ఫెమినైన్ ఎనర్జీ అద్భుతంగా యాక్టివేట్ అవుతుంది.
(08:48) ఫ్రెండ్స్ నిజం చెప్పండి మీలో ఎంతమంది పొద్దున లేచినప్పటి నుండి రాత్రి వరకు ఎప్పుడూ హడావిడి హడావిడిగానే బతుకుతున్నారు. మీలో ఎవరైనా స్లో డౌన్ అవ్వాలి అనుకుంటున్నారా? ఎస్ అని కామెంట్ చేయండి. పాయింట్ నెంబర్ సెవెన్ పర్ఫెక్ట్ కావాలని ప్రయత్నిస్తే లైఫ్ బోరింగ్ అవుతుంది. ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి పని పర్ఫెక్ట్ గా ఉండాలి నా ఇల్లు పర్ఫెక్ట్ గా ఉండాలి నా కెరీర్ పర్ఫెక్ట్ గా ఉండాలి ఈ పర్ఫెక్ట్ అనే పదం వెనుక పరిగెత్తడం చాలా ప్రమాదకరం ఎందుకంటే ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలి అనుకునే ప్రెజర్ మీ జీవితంలో ఉండాల్సిన అసలైన సంతోషాన్ని నెమ్మదిగా నల్లేరుపై నడకలా మింగేస్తుంది.
(09:23) ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతిసారి మీరు 100కు 100 శాతం బెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని పనులు 95% పర్ఫెక్ట్ గా ఉన్నా సరే వదిలేయండి పర్లేదు. ఇల్లు కొంచెం సర్దకపోయినా పర్లేదు. ఒకరోజు వంట కొంచెం అటు ఇటు అయినా పర్లేదు. ఈ ప్రపంచంలో పర్ఫెక్ట్ లైఫ్ అంటూ ఏదీ లేదు. కానీ మనసుకి నచ్చినట్టు బతికే ఒక రిలాక్డ్ లైఫ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.
(09:48) మీ తప్పులను మీరు ప్రేమించడం నేర్చుకోండి. చిన్న చిన్న లోపాలు ఉన్నా సరే ఆ క్షణాన్ని ఆస్వాదించండి. ఎప్పుడైతే మీరు ఈ పర్ఫెక్ట్ అనే ముసుగును తీసి పక్కన పెడతారో అప్పుడే మీ మనసు తేలిక అవుతుంది. మీలో ఒక సరికొత్త ఉత్సాహం మొదలవుతుంది. అవును ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ప్రతి చిన్న విషయంలోనూ పర్ఫెక్ట్ గా ఉండాలని మిమ్మల్ని మీరు స్ట్రెస్ చేసుకుంటూ ఉంటారు.
(10:11) ఒప్పుకునే వాళ్ళు కింద కామెంట్స్ లో మీ పేరుని షేర్ చేయండి. పాయింట్ నెంబర్ ఎయిట్ చిన్న ట్రీట్స్ కూడా మనసుని హీల్ చేస్తాయి. ఫ్రెండ్స్ ఒకసారి మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి. కేవలం మీ సంతోషం కోసం మీకు నచ్చిన ఒక చిన్న వస్తువును మీరు చివరిసారిగా ఎప్పుడు కొనుక్కున్నారు గుర్తుందా చాలా మంది అమ్మాయిలు అందరి గురించి ఆలోచిస్తారు.
(10:34) కానీ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం మర్చిపోతారు. కానీ గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు మీకు మీరే ఇచ్చుకునే ఒక చిన్న కాఫీ ట్రీట్ రోడ్డు పక్కల కొనే కొన్ని తాజా పూలు మీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ లేదా ఒక క్యూట్ నోట్బుక్ ఇవేవి లగ్జరీ కాదు ఇదొక సెల్ఫ్ లవ్ మీ మీద మీకున్న ప్రేమ ఈ ప్రపంచంలో అందరి సంతోషంతో పాటు నా సంతోషం కూడా అంతే ముఖ్యం అని మీకు మీరే గుర్తు చేసుకునే ఒక అందమైన మార్గం ఇది.
(11:05) పెద్ద పెద్ద గిఫ్ట్లు అవసరం లేదు. ఈ [గొంతు సవరించుకోవడం] చిన్న చిన్న ట్రీట్స్ మీ మూడ్ని మార్చేస్తాయి. మీ మనసులో ఉన్న అలసటను గాయాలను నెమ్మదిగా హీల్ చేస్తాయి. మీలోని ఫెమినైన్ ఎనర్జీని ఫ్రెష్ గా ఉంచుతాయి. అవును ఫ్రెండ్స్ మీ మూడ్ బాలైనప్పుడు మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోవడానికి మీరేం చేస్తారు ఐస్ క్రీమ్ తింటారా షాపింగ్ [గొంతు సవరించుకోవడం] చేస్తారా లేక కాఫీ తాగుతారా? మీ ఫేవరెట్ ట్రీట్ ఏంటో కింద కామెంట్ చేయండి.
(11:30) పాయింట్ నెంబర్ నైన్ మీ టైం ని క్యాలెండర్ లో పెట్టండి. ఫ్రెండ్స్ మన ఫోన్ క్యాలెండర్ చూస్తే అందులో ఆఫీస్ వర్క్స్ ఉంటాయి మీటింగ్స్ ఉంటాయి ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ బర్త్డేలు ఉంటాయి అన్ని ఉంటాయి కానీ ఎక్కడైనా నాకోసం నేను కేటాయించుకునే సమయం అంటే ఎంబిఈబి టైప్ అనేది ఉందా ఉండదు. అందుకే మన లైఫ్ రోజు రోజుకి అంత బోరింగ్ గా ఒక మెషీన్ లా మారిపోతుంది.
(11:58) వేరే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చినట్టే మీకోసం మీకు మీరే అపాయింట్మెంట్ ఇచ్చుకోండి. వారంలో కనీసం ఒక రోజు లేదా రోజులో ఒక గంట క్యాలెండర్ లో టైం బ్లాక్ చేయండి. ఆ టైంలో వేరే ఏ బాధ్యతలు ఏ ఫోర్ కాల్స్ ఉండకూడదు. మీకు నచ్చిన ఒక మంచి సినిమా చూడండి. ప్రశాంతంగా ఎక్కువ సేపు స్నానం చేస్తూ రిలాక్స్ అవ్వండి. ఒంటరిగా అలా వాకింగ్ కి వెళ్ళండి లేదా ఒక రూమ్లో కూర్చుని బుక్ చదువుకోండి.
(12:23) ఏదైనా సరే చేయండి. కానీ ఆ సమయం కేవలం మీకోసం మాత్రమే. ఈ మీ టైం అనేది మిమ్మల్ని మానసికంగా రీచార్జ్ చేస్తుంది. మీ లోపల మాయమైపోతున్న ఆ సాఫ్ట్నెస్ ఆ ప్రశాంతమైన ఫెమినైన్ ఎనర్జీని మళ్ళీ 100% యాక్టివేట్ చేస్తుంది. అవును ఫ్రెండ్స్ రోజు మొత్తంలో మీకోసం మీరు కనీసం ఒక అరగంట అయినా టైం కేటాయించుకుంటున్నారా? ఎస్ లేదా నో అని కింద కామెంట్స్ లో నిజాయితీగా చెప్పండి.
(12:51) పాయింట్ నెంబర్ 10 ప్రెసెన్స్ అదే అసలైన ఫెమినైన్ ఎనర్జీ. ఫ్రెండ్స్ చాలామంది అనుకుంటారు ఎనర్జీ అంటే పెద్దగా అరవడం గట్టిగా మాట్లాడటం లేదా అందరిని డామినేట్ చేయడం అని కానీ ఫెమినైన్ ఎనర్జీ అంటే లౌడ్ గా ఉండటం కాదు. అదొక ప్రశాంతమైన ఆత్మవిశ్వాసం ఒక అందమైన సాఫ్ట్నెస్ ఒక పీస్ ఫుల్ ప్రెసెన్స్ దీని పవర్ ఎలాంటిదో తెలుసా మీరు ఒక రూమ్లోకి వచ్చినప్పుడు లేదా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా ప్రశాంతంగా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు.
(13:28) మీ ప్రెసెన్స్ వాళ్ళకి ఒక పాజిటివ్ వైబ్ ని ఇస్తుంది. మాటలతో కాకుండా మీ నిశశబ్దంతోనే మీ పవర్ ని చూపించడమే నిజమైన ఫెమినైన్ పవర్ జీవితం అంటే కేవలం బాధ్యతలతో రోజు పోరాడుతూ బ్రతకడం మాత్రమే కాదు ఫ్రెండ్స్ ప్రతి క్షణాన్ని మనస్ఫూర్తిగా ఫీల్ అవ్వడం కూడా ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ 10 చిన్న చిన్న అలవాట్లు మీ జీవితాన్ని ఒకే రాత్రిలో మార్చేయకపోవచ్చు కానీ రోజు రోజుకి ఇవి మీ ఎనర్జీని నెమ్మదిగా చాలా అద్భుతంగా మారుస్తాయి.
(13:57) మిమ్మల్ని విపరీతమైన స్ట్రెస్ నుండి ఒక ప్రశాంతమైన సాఫ్ట్నెస్ వైపు నడిపిస్తాయి. ఇలా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేశక ఒకరోజు మీరు అందం ముందు నిలబడి మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీ మనసు లోతుల్లోంచి ఒకే ఒక మాట వినిపిస్తుంది. అవును ఇప్పుడు నేను నిజంగా చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నాను అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు ఇతరుల కోసం స్ట్రాంగ్ గా మారే క్రమంలో మీకోసం మీరు ప్రశాంతంగా ఉండటం మర్చిపోకండి.
(14:22) మీలోని ఆ సాఫ్ట్నెస్ బలహీనత కాదు ఈ ప్రపంచాన్ని గెలవగల ఒక నిశబ్ద ఆయుధం. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ లైఫ్ ని మార్చే ఇలాంటి మరిన్ని సెల్ఫ్ గ్రోత్ మరియు ఎమోషనల్ వీడియోల కోసం మన విక్టరీ వైబ్స్ తెలుగు ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ 10 అలవాట్లలో మీకు బాగా నచ్చిన మీకు ప్రశాంతతను ఇచ్చే ఆ ఒక్క చిన్న అలవాటు ఏంటో అలాగే మన విక్టరీ వైబ్స్ తెలుగు వీడియోని మీరు ఏ ఊరు లేదా ఏ సిటీ నుండి చూస్తున్నారో కింద కామెంట్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి.
(14:55) మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక అద్భుతమైన టాపిక్ తో కలుద్దాం. అప్పటివరకు కీప్ స్మైలింగ్ అండ్ స్టే పీస్ఫుల్.

No comments:

Post a Comment