*వేషానికి తగినట్లు ప్రవర్తించండి!!!*
*"మీరు మానవ వేషాలు ధరించారు. కనుక, మీరు మానవులుగానే ప్రవర్తించాలి. విద్యా విద్యార్థిగా జీవించాలి. గృహస్థుడు గృహస్థ ధర్మాలను పాటించాలి. సన్యాసి సన్యాసాశ్రమ ధర్మాలను “అనుసరించాలి. కాని, ఈనాడు వేషానికి తగిన చర్యలు ఎక్కడా కనిపించడం లేదు. పైన కాషాయం లోపల కషాయం మంచిది కాదు. గుడ్డలు మారితే సరిపోదు, గుణములు మారాలీ. ఈనాడు మనస్సు కేవలం సృష్టిని గురించి విచారిస్తున్నది కాని, సృష్టికర్తను గురించి విచారించడం లేదు మనోతృప్తి నిమిత్తమై మీరు అనేక కర్మలనాచరిస్తున్నారు కాని, మనస్సును తృప్తి పరచడం ఎవ్వడో సాధ్యం కాదు. మనస్సునే మరచిపోవాలి. మీరు అమనస్కులు కావాలి అప్పుడే మీకు ఆనంద ప్రాప్తిస్తుంది. మీరు అమనస్కులు కావాలంటే ఏమి చేయాలి? దైవాన్ని తప్ప మరొక విషయాన్ని మీరు చింతించకూడదు."*
*~"Sathyasaibalavikas" (Telugu monthly magazine) - May : 2024.*
No comments:
Post a Comment