మూలంలో మామిడి చెట్టు ఉంటే చింతచెట్టు రాదు🌹అష్టావక్ర talk97🌹kanthrisa
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=14oMAtMPd6c
Transcript:
(00:01) అష్టవక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 97 అందరికీ శుభదీపావళి కొన్ని వేల సంవత్సరాల మానవజాతి పరిణామ క్రమంలో మనిషి ఒక విషయాన్ని గమనించాడు తెలుసుకున్నాడు. రకరకాల విషయాలు తెలుసుకున్నాడు కానీ ఆ తెలుసుకున్న విషయాల్ని బైఫర్కేట్ చేస్తూ చేస్తూ చేస్తూ ఒకవేళ మూలంలోకి వస్తే దాదా ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళి తెలుసుకున్న ఒక విషయం ఉంది.
(00:36) అదేమిటి అంటే ఈ భూమి మీద మనిషి సృష్టించిన రకరకాల విషయాలు మనిషి ద్వారా ఆవిష్కృతమైన రకరకాల విషయాలు అందులో వస్తువులు ఉన్నాయి విజ్ఞానం ఉంది టెక్నాలజీ ఉంది దాంతో పాటు మనిషి సృష్టించనివి ఈ రెండు ఉన్నాయి ఇందులో కొన్ని శాశ్వతమైనవి కొన్ని అశాశ్వతమైనవి సో ఏది అశాశ్వతమో అది మనిషిని బాధకు గురి చేస్తుంది.
(01:10) కానీ మనిషిని ఆకర్షించేలా చేస్తుంది ఏది శాశ్వతమో మనిషి గుర్తించడు కానీ అదే మనిషికి ఒక స్వాంతని ఇస్తుంది. మనిషి యొక్క మజిలి మనిషి సృష్టించిన విషయాలు లేదు ఏ సృష్టి మనిషిని తీసుకొచ్చిందో దాన్ని గమనించడంలో ఉంది అని తెలుసుకున్నాడు. ఇదొక అద్భుతమైన రియలైజేషన్ ఇప్పుడు నేను చెప్పింది మీకు తెలుసు ఒకసారి మీ చుట్టూ పరికించి చూడండి. రకరకాల వస్తువులు ఉన్నాయి మనుషులు ఉన్నారు మీ చేతిలో ఫోన్ ఉంది మీరు చేసే ఉద్యోగం ఉంది.
(01:45) అవేవి శాశ్వతం కాదు కానీ వాటితో అవసరం ఉంది. అందులో ఏ సందేహం లేదు. కానీ ఎవడైతే వాటినే శాశ్వతం అనుకున్నాడో ఎవడైతే వాటిని అట్లాగే నిలిపి ఉంచుకోవాలని ఆరట పడుతున్నాడో ఎవడైతే ఆనందాన్ని తన సుఖాన్ని తన ప్రశాంతతని తన యొక్క ధ్యానాన్ని వాటిలో వెతుకుతున్నాడో అట్లాంటివాడు భంగపడుతున్నాడు. సో అష్టవక్ర సంహిత సమగ్ర సారం మూల సారం ఏమిటంటే ఏది ఎప్పటికీ మారదో దాన్ని గుర్తించు అది నీలోనే ఉందని గుర్తించు అది నీవే అని గుర్తించు అదే
(02:31) నీవై కదులు ఒక చిన్న స్టేట్మెంట్ ఉంది దీని గురించి కాస్త విచారణ చేయండి నీవు నీవై ఉండు నీవు నీతో ఉండు నీవు నీలో ఉండు నీవు ఉండు ఉండు భాష కానీ ఆధ్యాత్మిక ప్రగతి ఇలా కొనసాగుతది. ఇది నిజంగా ప్రగతి కాదు ఒకటే అంశం యొక్క భిన్న అభివ్యక్తి ఏదైతే అశాశ్వతమో ఏదైతే క్షణభంగురమో ఏదైతే కచ్చితంగా నీ జీవితంలో నుంచి వెళ్ళిపోతుందో ఏదైతే కాలంలో నిలబడి దాని యొక్క ప్రభ కోల్పోతుందో అట్లాంటి
(03:16) దానితో నీ అస్తిత్వాన్ని ముడిపెట్టకు ఆత్మజ్ఞానం యొక్క సమస్త సారం ఇంతే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక టీవీ కొన్నావు నీకు చాలా నచ్చింది. ఆ టీవీకి నీ ప్రశాంతతకి ముడిపెట్టకు ఆ టీవీకి నీ గౌరవాన్ని ముడిపెట్టకు ఆ టీవీకి అది ఉండే స్థితికి నీ యొక్క ఆకలిని ముడిపెట్టకు నీ నిద్రను ముడిపెట్టకు నీ స్నేహాన్ని ముడిపెట్టకు నీ అహంకారాన్ని ముడిపెట్టకు ఆ ముడిపెట్టడమే అహంకారం టీవీని ఉపయోగించుకో ప్రతిరోజు హాయిగా నీట్ గా తుడుచుకుంటూ దాన్ని పదిలంగా చూసుకో టీవీ ఉండి నువ్వు పోవచ్చు నీవు ఉండి టీవీ పోవచ్చు టీవీ టీవీ ఉండి నాది అనుకున్న నీ శరీరం మనసు పోవచ్చు నీ శరీరం మనసు ఉండి టీవీ
(04:02) పోవచ్చు కానీ ఎప్పటికీ పోనిది ఏదైతే ఉందో అట్లాంటి దాన్ని గుర్తించడానికి మనిషి చేసే చిన్న చేష్ట అటువైపే అష్టవక్రుడు ప్రతి సూత్రంలోన తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పటికీ మారని దాన్ని నువ్వు గుర్తించు నేను నా అనుభవ ప్రమాణంగా చెప్తున్న చూసే స్థితి ఎప్పటికీ మారదు. అది నువ్వు క్రియేట్ చేసింది కాదు ఆకలి యొక్క స్థితి ఎప్పటికీ మారదు నిద్ర యొక్క సుషుప్తి ఎప్పటికీ మారదు ప్రకృతి యొక్క కదలిక ఎప్పటికీ మారదు నిశ్చల నిరంతర కదలిక సత్యం కానీ ఆ కదలిక వల్ల సృష్టించబడ్డ రకరకాల విషయాలు వాటి నుంచి బయటికి ఎక్స్ట్రాక్ట్
(04:47) చేసిన రకరకాల ప్రకృతి తత్వాలను తీసుకొని తయారు చేసిన వస్తువులు ఆశాశ్వతం అసత్యం. ఒకసారి చూడు అష్టవకుడు చెప్తాడు ఇక్కడంతా కొట్టుకుపోతుంది ఆ కొట్టుకుపోయే దానితో తాదాత్మతో వద్దు అంటున్నాడు. నేను అదే చెప్తున్నాను. నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు ఈ క్షణం మీరు ఉన్న స్థితి మీ మొత్తం జీవితానికి సంబంధించిన ఒకానొక తార్కిక స్థితి అది ఒక లాజికల్ కంక్లూజన్ ఈ క్షణం నువ్వు అనుభవిస్తున్నది.
(05:23) ఒక వ్యక్తి మరణించే సమయంలో ఏడుస్తున్నాడు దానికి కారణం ఏమిటి అని ఎవరో మిత్రుడు అడిగితే ఒక బంధువు వచ్చి అందరి ముందు అతన్ని ఇన్సల్ట్ చేసిపోయాడు అందుకే ఏడుప వచ్చింది అన్నాడు ఆ తర్వాత గంటకి మరణించాడు అతని వయసు 70 సంవత్సరాలు ఆ 70 సంవత్సరాలు ఎలా ఉన్నాడని అన్న విషయం ముఖ్యం కాదు ఆ మరణ సమయంలో అతను పడ్డ వేదన జీవితాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల ఒక వ్యక్తి ఏదో అన్నాడని బాధపడ్డాడు చూడు అదే అతని జీవితం యొక్క సమగ్ర సారం ఆ చివరి క్షణం ఈ క్షణం నువ్వు అనుభవిస్తున్న స్థితి ఇప్పటివరకు నువ్వు జీవించిన జీవితం యొక్క అవగాహన సారం అది మూడత అంటే అది నువ్వు ఎంతో చేశవు కానీ
(06:11) అర్థం చేసుకోవాల్సింది అర్థం చేసుకోలేదు మొండి పట్టుంది నాది అన్న భావన ఉంది కొన్నిటిని గట్టిగా పట్టుకున్నావు కొందరి మీద ఆజమాయిషి చేస్తున్నావ్ ఏదో మార్చాలని ప్రయత్నం చేస్తున్నావ్ ఇదంతా జరగదు అని తెలిసిన ప్రయత్నం చేస్తున్నావు మూడత స్వష్టావక్రుడు ఈ సూత్రంలో చెప్తున్న విషయం అదే కాస్త జాగ్రత్తగా దీంట్లో ఉన్న సత్యాన్ని గమనించండి ఏమో ఏదో ఒక సూత్రం మిమ్మల్ని గట్టు మీద పడేయొచ్చు
(06:59) అంత పొటెన్షియల్ ఉన్న సూత్రాలు ఇవి చిన్న మాటలు బట్ మీకు స్పష్టంగా తేడా తెలుస్తది వాట్ ఇస్ వాట్ స్ అస్తవకుడు అంటున్నాడు ఉచ్ఛ శృంఖలాప్యాకృతికా స్థితి ధీరస్య రాజతే నతూ సంస్పృహ చిత్తస్య శాంతి మూఢస్య కృత్రిమ మూడుడు అనుభవించే శాంతి కృత్రిమమైంది అంటున్నాడు. సో దీని యొక్క అర్థం ఏమిటి అంటే ధీర పురుషుడైన జ్ఞాని స్వేచ్ఛ స్వభావం కలిగి విశృంఖలంగా ఉండి కూడా శోభిస్తాడు.
(07:40) అజ్ఞాని మూర్ఖుడు స్పృహ లేకుండా అతివాంచాలోలుడై కృత్రిమ శాంతి స్వభావం కలిగినప్పటికీ నీ జీవితంలో శోభించలేడు ఆనందించలేడు. ఎంత అద్భుతం ఉంది. ఈ ప్రపంచంలో ఉన్న మానవజాతిని ఈ రెండు రకాలుగా విడగొట్టొచ్చు. మొదటి భాగంలో ఉన్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. రెండో భాగంలో ఉన్న వాళ్ళ సంఖ్య అసంఖ్యాక సో ఒక వ్యక్తి జస్ట్ నోరు మూసుకొని కూర్చున్నాడు అతను అంతర్గతంగా శాంతిని అనుభవించడంలే ఒక వ్యక్తి అసలు మాట్లాడనులే కానీ లోపట అతను చాలా మాట్లాడుతున్నాడు ఇన్నర్ టాక్ నడుస్తుంది.
(08:25) ఒక మూడుడు అంతర్గత ప్రగతి లేకుండా ఏం మాట్లాడినప్పటికీ సంవత్సరంలో ఒక్కసారి మాట్లాడినప్పటికీ అక్కడ మూడతనే బయటికి వస్తుంది నేను ఒక చిన్న కథ విన్నా ఒక ఊర్లో ఒక ఆవిడ ఉంది ఆవిడ మాట్లాడితే గొడవనే అవుతుంది. దానికి బియాండ్ గా ఆమెకు మాట్లాడడం తెలియదు. మనం చాలా మందిని చూస్తుంటాం మాట్లాడితే తులనాడడమే ఉంటది మాట్లాడితే కించపరచడమే ఉంటది మాట్లాడితే వ్యత్యాసాలు ప్రదర్శించడమే ఉంటది.
(08:59) మాట్లాడితే కులమృతాల ప్రస్తావనే ఉంటది. మాట్లాడితే డబ్బు ప్రస్తావనే ఉంటది. ఇది మనిషి యొక్క అంతర్గత స్వభావం. మూలం కరప్ట్ అవ్వడం చేత మాట కూడా కరప్ట్ అవుతది చూపు కరప్ట్ అవుతది స్పర్శ కరప్ట్ అవుతది అన్ని కరప్ట్ అవుతాయి. సో ఈ పెద్దావిడ ఊర్లో ఉన్న అందరితో నిరంతరం ఏదో కారణ వశం చేత గొడవ పడుతూ ఉంటది. ఆమె గొడవ పడడానికి కారణాలు అక్కర్లేదు ఏమమ్మా బాగున్నావా ఆ బాలేకపోతే నేను తిండి తిననా అంటది ఎక్కడికి పోతున్నావ్ సావనీక పోతున్నా ఊక పోతుంటే అడ్డం తాగుతారు అంటది.
(09:36) ఏం మాట్లాడిన కష్టమే ఊర్లో ఉన్న వాళ్ళకి సరే కొంతకాలం చూద్దాం ఎప్పుడన్నా ఆమె ప్రశాంతంగా ఆరోగ్యకరంగా ఒక జవాబు ఇస్తుందేమో ఆహా నిరంతరం ఇది ఫైనల్ గా ఊర్లో వాళ్ళంతా ఈమెకు తెలియకుండా ఒక మీటింగ్ పెట్టుకొని ఒక నిర్ణయానికి వచ్చారు ఏం చేసినా ఏం మాట్లాడినా చివరికి చూసినా ఆమె గొడవ పడుతుంది కాబట్టి మనం ఆమెని బైకాట్ చేద్దాం.
(10:01) అందరికీ ఇష్టం ఉన్నా లేకపోయినా సరే మన ప్రశాంతత కోసం ఎందుకంటే నిరంతరం గొడవలు వస్తున్నాయి. దానికి కారణమే లేదు సరే మనిషి అనేవాడు ఏదో కారణం చేత గొడవ పడతాడు బట్ ఆ కారణంగా గొడవ పడడం. సో కొంత కాలం అయింది ఆమె ఉన్న వేది వైపు ఎవరు రావడంలే ఆమెకు అటు పక్క ఇటు పక్క ఉన్న వాళ్ళంతా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇదంతా నిశశబ్దంగా జరిగింది.
(10:26) కానీ అప్పుడప్పటికీ కొందరి క్యూరియాసిటీ ఉంది అసలు ఈమె ఏం చేస్తుంది రోజంతా అక్కడి నుంచి ఏ శబ్దం లేదు రోజంతా ఏం చేస్తుంది ఆమె ఆ గోడ మీద నుంచి తొంగి చూస్తున్నారు. ఇంటి ముందు నుంచి పోతూ పోతూ అట్లా కన్ను ఆ ఇంటి వైపు వేసి ఆమె ఏం చేస్తుందో చూస్తున్నారు ఒకసారి ఒక ఆవిడ అట నుంచి వెళ్తూ ఉండగా ఈమె మధ్యాహ్నం పూట 1:00 గంటకి ఎండకాలం పెరుగు బయట ఆరబోస్తుంది పెరుగు అసలు ఆమె ఆశ్చర్యపోయింది.
(10:57) తన మిగతా వీధి వాళ్ళకి వెళ్లి చెప్పింది నేను ఒక ఆశ్చర్యాన్ని చూశాను ఎవరైతే గొడవలు పడుతుందో ఆవిడ ఒక వింత చేష్ట చేస్తుంది నాకు చాలా క్యూరియస్ గా ఉంది నాకు వంట్లంటే ఇష్టం ఏమన్నా కొత్త పదార్థం చేస్తుందా ఒక కొత్త తరహ వడియం పెడుతుందా ఏదనా ఒక రెసిపీకి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుందా ఏమిటది ఇంతక ఏం చేస్తుంది అని అడిగితే పెరుగు ఎండ పోస్తుంది.
(11:20) అందరికీ ఆశ్చర్యం వేసింది పెరిగి ఎందుకు ఎండ పోస్తుంది ఈ విషయం అడిగి తెలుసుకుందామా గొడవైనా సరే అప్పుడు ఒక వ్యక్తి అన్నాడు గొడవైనా సరే కాదు గొడవ కాకుండా ఎలా అడగాలో ఇక్కడే ప్రాక్టీస్ చెయ్ అప్పుడు వాళ్ళంతా కూర్చుని ఒక మీటింగ్ వేసుకున్నారు. ఒక వ్యక్తి పెరుగు ఎండబోస్తుంది. ఇప్పుడు ఏమ అడిగితే తనకు కోపం రాదు ఇలా అడిగి చూద్దాం అత్తమ్మ పెరుగు ఎందుకు ఎండ పోస్తున్నావ్ పెరుగుతో ఏం చేద్దాం అనుకున్నావ్ ఎలా అడిగినా గొడవకి దారి తీసినట్టు కనిపిస్త ఫైనల్ గా ఒక నిర్ణయానికి వచ్చారు అత్తమ్మ పెరుగు ఎందుకు ఎండబోస్తున్నావ్ అని అడుగుదాం ఇందులో గొడవ పడడానికి ఏముంది
(11:56) చూద్దాం ఇందులో అందరూ గోడ అవతల నక్కి చూస్తున్నారు ఒక ఆవిడ వెళ్ళింది వెళ్లి పెరుగు ఎండపోస్తుంటే ఆగింది ఆగి అత్తమ్మ పెరుగు ఎందుకు ఎండబోస్తున్నావ్ అన్న క్షణంలోనే ఆమె లేచి చాలా సీరియస్ గా దొంగ ఉండా నా పెరుగు నేను ఎండపోసుకుంటా నా ముఖానికి రాసుకుంటా నీకెందుకే ఎవతివే నువ్వు నా దగ్గరికి వచ్చి అడుగుతోని కూడా వేసుకుంది.
(12:20) సో ఇప్పటివరకు ఆమె ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ లోపట ప్రశాంతత లేదు. మనం ఒక విషయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు మన ప్రశాంతత పోతుంది. నీకు నువ్వు అధిక ప్రాధాన్యత ఇచ్చుకున్న ప్రశాంతత పోతుంది. సో ధీర పురుషుడైన జ్ఞాని తనకు తాను ఏ అధిక ప్రాధన తెచ్చుకోకుండా ఒక స్వేచ్ఛ స్వభావం కలిగి విచ్చలవిడిగా పిచ్చిగా ఉన్నట్టు కనిపించినప్పటికిని అతని యొక్క అంతర్గత సౌందర్యం స్థిరపడడం వల్ల అతని మాటలో గాని అతని యొక్క స్పర్శలో గాని అతని చూపులో గాని ఎలాంటి కల్మషము ఎలాంటి మచ్చ ఉండవు.
(12:59) కానీ అజ్ఞాని అన్ని తెలుసుకొని అన్ని చదివి అంతర్గత సౌందర్యం లేని కారణంగా అంతర్గత అవగాహన ఆ సంస్థిత స్థితి ఆ ప్రశాంతత అనుభవం లేని కారణంగా శాంతి నటిస్తాడు కానీ మాట్లాడితే అశాంతి సృష్టిస్తాడు ఒక మూర్ఖుడు ఒకవేళ మాట్లాడితే మూర్ఖతనే బయటికి వస్తుంది. ఈ మధ్య ఒక పెద్దాయన వచ్చాడు నా దగ్గరికి ఆయనను చూస్తే ఎంత ముచ్చట వేసిందో నేను ఎవ్వరిని అడగను మీ ఇంటర్వ్యూ చేస్తానని కానీ అతనితో మాట్లాడినంతసేపు అంటే నేను మాట్లాడలేదు అతను మాట్లాడినంతసేపు నాకు ఒకటే అనిపించింది.
(13:37) అందరూ ఉన్నారు నా బిడ్డ సునీత ఉంది బాలాజీ ఉన్నాడు టైసన్ ఉన్నాడు ఇంకెవరో ఉన్నారు ఒక 10 మంది చుట్టుపక్కలంతా అతను మాట్లాడుతున్నాడు. అతను పోయే ముందు ఒక మాట చెప్పాడు నేను జీవితకాలం వద్దాం అనుకుంటున్నా ఏదైతే నేను అనుభవిస్తున్నానో అది మొదటిసారి నాకు ఇక్కడ దర్శనం అయింది. అందరూ నన్ను పిచ్చివాళ్లే అంటున్నారు కానీ మొదటిసారి అట్లా అనని వాడివి నువ్వు చిన్న సంఘటన చెప్పాడు తను టీవీ చూస్తున్నాడు.
(14:08) వాళ్ళ మనవడు వచ్చి ఆ టీవీకి తనకి మధ్యన మూత్రం పోశాడు ఆ మూత్రంలో ఆడుకుంటున్నాడు. వాళ్ళ ఆవిడ వచ్చి ఏమయ్యా కళ్ళు కనిపిస్తలేవా పిల్లవాడు మూత్రం పూస్తే టీవీ ఎట్లా చూస్తావ్ అన్నది ఇతను చూశడు కానీ చెప్పాడు నేనేదో టీవీ చూస్తున్నాను అన్నాడు అసలు కొంచెం ఉన్న బుద్ధి ఉండాలి పిల్లవాడు మూత్రంలో ఆడుకుంటున్నాడు వాడిని అక్కడి నుంచి తీయాలని తెలవదా అప్పుడు నాకు తెలియదు నీకు తెలుసు కాబట్టి నువ్వు చెయ్ రెండవది నేను టీవీ చూస్తున్నా అతను మూత్రం పోసి ఆడుకుంటున్నాడు.
(14:48) నీవే మా ఇద్దరిని డిస్టర్బ్ చేస్తున్నావ్. అంటే నీ అంత మూర్ఖుడిని నేను ఎప్పుడూ చూడలేని వెళ్ళిపోయింది. అవును నేను మూర్ఖుడినే తను చెప్పాడు నేను గడిచిన 50 సంవత్సరాల్లో ఎవరికీ ఏ సలహా ఇవ్వలేదు. అందరూ నాకు సలహాలు ఇస్తారు అందరూ నన్ను ఇన్సల్ట్ చేస్తారు. అందరూ వేరేవాళ్ళు వచ్చినప్పుడు నేను చేసిన పనులు ఎత్తి చూపి నన్ను కించపరుస్తారు అది వాళ్ళ స్వభావం నా స్వభావం అది కాదు నాకు ఎవరి మీద ఏ నెగిటివ్ వైకర్ లేదు నాకు నా భార్య ఎంతో నా కొడుకు ఎంతో నా డ్రైవర్ అంతే ఇలా అంటే గొడవ అయిపోతది.
(15:28) నీకు చనిచాలు తెలుస్తలేవు కళ్ళు బైర్లు గమ్మినాయి ఎవడు నీవాడో ఎవడు నీవాడు కాదో గుర్తించలేవా గుర్తించే వాళ్ళంతా అశాంతితో ఉన్నారు. అన్నిటిని గుర్తించి ఏ తేడా లేదని తెలుసుకున్న ఒకతను హాయిగా ఉన్నాడు. చిన్న విషయం లోపట చిక్కుముడి విడిపోవాలి అంతే సో నిస్పృహ నిశ్చల జ్ఞానం నిర్మలత్వం గల జ్ఞాని సహజంగా సుందరంగా ఉంటాడు. అతనిలో ఒక సహజ ప్రశాంతత ఉంది ఎందుకు అంతర్గత అలజడి లేదు కాబట్టి అట్లాంటి వాళ్ళలో కృత్రిమ వేషాలు ఉండవు.
(16:07) కపట వేషాలు ఉండవు అవసరం కోసం అబద్ధం చెప్పడం ఉండదు ఒకవేళ అబద్ధం చెప్పినా అది అబద్ధం అని చెప్తాడు తర్వాత తను ఒక ప్రవాహ స్థితిలో ఉంటాడు. అతను ఆత్మ ద్రోహం చేసుకోడు. అతను మూలాన్ని పట్టుకొని విరాజిల్లుతున్నాడు. నిన్న నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను అర్థం చేయించడం కోసం నువ్వు దేవాలయానికి పోతున్నావ్ చేతిలో దీపం ఉంది.
(16:31) ఇంటి నుంచి దేవాలయం వెళ్ళేసరికి దీపం ఆరిపోకుండా చూసుకోవాలి దీపం ఆరిపోకుండా చూసుకో అక్కడి నుంచి ట్రాఫిక్ రావచ్చు పోవచ్చు నీ చుట్టుపక్కల ఎవరో మాట్లాడొచ్చు అప్పుడే వర్షం పడొచ్చు అప్పుడే కాలికి ఏదో ముల్లు తగలొచ్చు బట్ ఏం జరిగినా దీపాన్ని నువ్వు పోనియట్లే అట్లాగే నీ అంతర్గత దీపాన్ని కాపాడుకో దీపం కాబట్టి గాలికి అటు ఇటు కదలచ్చు మరి అంతర్గత దీపం నీ అవగాహన లోపానికి కి అటు ఇటు ఊగుతది అష్టవకుడు అదే చెప్తున్నాడు.
(17:05) సహజంగా శాంతంగా ఉండు ఆ శాంతతలో నుంచి ఆ సందర్భం ఏది చేయనిస్తే అది చెయ్ ఏం చేసినా దాని ఫలితం నువ్వు తీసుకోకు చేస్తున్నప్పుడు కర్తగా ఉండకు ఎవరేమన్నా అది వాళ్ళ స్వభావాన్ని గుర్తించు ఒకటే అడవిలో రెండు పక్క పక్కన పెరిగిన మొక్కలు ఉన్నాయి ఒకదానికి పూలు పూస్తున్నాయి ఒకదానికి ముళ్ళు పూస్తున్నాయి దేని స్వభావాన్ని అది వ్యక్తపరుస్తుంది ఆ తర్వాత అష్టవకుడు చెప్తున్నాడు విలసంతి మహాభోగై విషంతి గిరిగహ్వరాన్ నిరస్త
(17:51) కల్పనాధీరా అబంధా ముక్తబుద్ధయ జ్ఞాని కల్పన రహితుడు బంధన రహితుడు ముక్తిపై ఏ ఆకాంక్ష లేనివాడు సిద్ధుడు అట్లాంటివాడు ఎక్కడున్నా పెద్ద పెద్ద భవనాల్లో ఉన్న భోగాల్లో క్రీడిస్తున్న రోడ్డు మీద పడి ఉన్న విలాసాల్లో విలసిలుతున్న అట్లాగే కొండ గుహల్లో కందమూలాలు తింటున్నప్పటికిని అతని యొక్క తృప్తిగా జీవితాన్ని ఆనందంగా గడుపుతాడు.
(18:27) అతనే తృప్తి అతనే ఆనందం ఎంత బాగుంది సూత్రం మోక్షం అంటే నువ్వు ఉన్న ప్రదేశాన్ని బట్టి నీ మానసిక స్థితి మారడం లేదు. చింతే నువ్వు ఎక్కడైనా ఉండు ప్యాలెస్ లో ఉండు సందర్భం వచ్చింది. ఇంకొక సందర్భం వచ్చింది రోడ్డు మీద ఉన్నావు ఇంకొక సందర్భంలో ఎవరిదో శేవం మోస్తున్నావ్. ఇంకొక సందర్భంలో ఎక్కడో వంట చేస్తున్నావ్. ఇంకొక సందర్భంలో 100 మంది ముందు ఉన్నావు.
(18:52) ఒక సందర్భంలో ఒకరిని కాళ్ళు మొక్కుతున్నారు. ఒక సందర్భంలో నీవు ఒకరి కాళ్ళు మొక్కుతున్నావు. ఒక సందర్భంలో ఎవరు నిన్ను తిడుతున్నారు. ఒక సందర్భంలో నిన్ను అందరూ పలాయనవాది అని తిడుతున్నారు. ఒక సందర్భంలో అందరూ నిన్ను మెచ్చుకున్నారు ఏం జరిగినా సరే నీ అంతర్గత శాంతిలో మార్పు లేదు. అదే మోక్షం అంటే అతనికి గుహ లేదా ప్యాలెస్ లేదా రోడ్డు అన్న తేడా లేదు అతను అతని మూల స్వభావంతో రమిస్తాడు.
(19:25) విలసంతి మహాభోగై విషంతి గిరి గహవరాన్ అతను గొప్ప భవనంలో విలాసాల మధ్యన భోగిస్తున్నప్పటికిని లేదా కొండగుహల్లో కందమూలాలు తింటున్నప్పటికిని నిరస్త కల్పనాధీర అతను జీవితాన్ని ఊహించడు గనుక ఏం జరిగినా చూసే స్థితిలో నిలిచిపోయాడు గనుక అతను అబంధ ముక్త బుద్ధయ సో ముక్తి అంటే బంధము లేని స్థితి ముక్తిని నువ్వు సృష్టించలేవు నిద్రని నువ్వు సృష్టించలేవు జ్ఞానాన్ని నువ్వు సృష్టించలేవు సమాచారాన్ని సృష్టించవచ్చు డేటా కెన్ బి క్రియేటెడ్ బట్దవిస్డమ కెనాట్ అండ్ అష్టవక్ర ఇస్ నాట్ టాకింగ్ అబౌట్ ద
(20:11) డేటా ఆర్ ద కంటెంట్ ఆర్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ హిఇస్ టాకింగ్ అబౌట్హిఇస్పాయింటింగ్ టువర్డ్స్ సంథింగ్వచ్ ఇస్ నాట్ క్రియేటడ్ బై యుబట్ ఇట్ కెన్ బిఫెల్ట్ అది ఆల్రెడీ నీలో ఉంది కాబట్టి సో ఈ విషయాన్ని మీరు జ్ఞప్తికి తెచ్చుకోండి నిరంతరం వీలైతే గోడ మీద రాసి పెట్టుకోండి. ఇది ఈ సమాజంలో ఏమేమి జరుగుతుందో మీకు ఒక అవగాహన ఇస్తుంది.
(20:40) అక్కడి నుంచి మీరే ఒక నిర్ణయానికి రండి. సో జీవితం ధ్యానం జ్ఞానం ఇవన్నీ ఊహాతితం ఎక్కడెక్కడ ఊహ ఉందో అక్కడ జీవితం లేదు ధ్యానం లేదు జ్ఞానం లేదు ఒక స్పష్ట వాస్తవ దర్శనం జ్ఞానం ఏది ఉందో అది నిర్ద్వంద్వంగా అనుభవించే ఒకానొక మానసి మోక్షం నీ స్వభావం తృప్తి సుఖం ప్రశాంతత కానీ ఈ సమాజంలో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి ధ్యానం ఊహా పూర్ణమైంది.
(21:23) జ్ఞానం ఊహా పూర్ణమైంది జీవితం ఊహాపూర్ణమైంది. అందుకే ఈ చిన్న డిస్టింషన్ మీరు గమనించాలి మీరు ఏదనా సినిమా కథ రాస్తున్నారు దానికి నీ ఊహని ఒక ఫ్యాకల్టీగా ఉపయోగించుకో కానీ జీవిస్తున్నావ్ అక్కడ ఊహ పనికి రాదు. సో ఎక్కడ ఊహ అవసరం ఎక్కడ ఊహ అవసరం లేదు అన్న తేడా తెలియాలి. ఒక చిన్న సంఘటన మా ఊరి దగ్గర అచ్చంపేట దగ్గర ఉమా మహేశ్వరం అని ఒక ఊరు ఉంది ఒకసారి నేను కొందరు మిత్రులు మా కజిన్ అందరం కలిసి వెళ్ళాం మా ఊరి నుంచి నడుస్తూ వెళ్ళేవాళ్ళం లేకపోతే రంగాపురం ఒక ఊరు ఉంది అక్కడి నుంచి అడవి ప్రాంతం లాగా రోడ్డు ఉంటుంది చిన్న కొండ ప్రాంతం అట్లా వెళ్తూ ఉండేవాళ్ళం
(22:03) ఇప్పుడంతా అడవి అంతా పోయింది మనిషి ఉన్నాడు కదా ఎక్కడ మనిషి వచ్చినా అక్కడ ప్రకృతి నాశనం అయిపోతుంది మనిషి చేస్తున్నదే అది ప్రకృతిని వికృతిగా మార్చడం పైకిఎక్కిన తర్వాత ఒక కొండ గుహలు ఉంటాయి ఒక గుహలో ఒక సాధువు కూర్చున్నాడు. నాకు మా కజిన్ కనిపించింది. ఆ గుహ లోపట ఏముందో చూడాలని ఎందుకంటే దాని గురించి చాలా కట్టు కథలు ఉన్నాయి ఇక్కడ ఉన్న గుహలు అట్లా వెళితే శ్రీశైలం వస్తుంది అని చెప్పడం విన్నాను.
(22:38) సో కొంచెం తొంగి చూస్తే గుహ కాస్త లోపటగా ఉన్నట్టు కనిపించింది. సో అతన్ని అడిగాను స్వామీజీ కాస్త పక్కకు జరుగుతారా ఒకసారి గుహ లోపట చూస్తాను. అతను అన్నాడు నో నేను చూడనివ్వను అన్నాడు. నేను అతన్ని ప్రాధేయ పడుతున్నాను. మా కజిన్ అడిగాడు అతను మాత్రం అక్కడి నుంచి లేవడం లేదు. ఆ గుహ అతనిది ఏమి కాదు కానీ గుహతో అతనికి ఒక అటాచ్మెంట్ ఏర్పడ్డది. ఒక వ్యక్తి కార్తో అటాచ్మెంట్ ఏర్పడొచ్చు ఒక వ్యక్తికి ఒక అమ్మాయితో అటాచ్మెంట్ ఏర్పడొచ్చు.
(23:15) రెండోది ఆ గుహను ఎవరు తీసుకోరు సరే కారు బంగళా ఇవన్నీ లాగేసుకోవచ్చు ఆ గుహని ఎవరు తీసుకుంటారు ఎవరు ఉంటారు ఆ గుహలో ఎవరు ఉండటం లేదు కాబట్టి అతను ఉంటున్నాడు ఆ గుహ ఎవరిదైనా అయితే ఫస్ట్ అతను ఉండనిచ్చేవాళ్ళా అతను ఏమైనా ఎవరైనా అడిగి పర్మిషన్ తీసుకొని అక్కడ కూర్చున్నాడా సో ఎంత అడిగినా అతను పక్కకు జరగలేదు నేను ఆల్మోస్ట్ ఇక వదిలేద్దాం అని అనుకుంటుండగా ఒక మిత్రుడు వచ్చాడు శేషన్ రాజని రౌడీ టైప్ ఏందయ్య గారు వాట్ ఇస్ ద ప్రాబ్లం అన్నాడు.
(23:53) నేను అతనికి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ స్వామీజీ ఎవరో కూర్చున్నారు ఆ గుహలోపట ఒక్కసారి నడిచి కొంచెం వెళ్లి చూద్దాం ఆ చీకట్లో ఎంత దూరం ఉంది గుహ చూసుకో పోయ్యగారు అన్నాడు లేదు ఇతను అడ్డం జరగనలేదు. ఆడెవడు అడ్డం కూర్చోడానికి అని ఆ స్వామీజీని ఎత్తి బయట పడేశాడు. స్వామీజీకి చెప్పాడు నువ్వేం స్వామీజీవిరా గుహనంటి పెట్టుకొని ఉన్నావ్ అన్ని వదిలేస్తున్నాను గుహను పట్టుకున్నావ ఏంది వే గూట్లే అన్నాడు.
(24:25) చేశను రాజు రౌడీ కానీ ఇంత జ్ఞానంతో మాట్లాడుతున్నాడు అతను జ్ఞానిలా కనిపిస్తున్నాడు కానీ ఇంత మూడతలో ఉన్నాడు. నేను లోపటికి వెళ్లి ఒక రెండు సెకండ్లు చూసి ఏమీ లేదు. డెడ్ ఎండ్ అయిపోయింది బయటికి వచ్చాను. అతనికి చెప్పాను వెళ్లి కూర్చోపో అతను భయపడుతుండు నేను సేషన్ రాస్తూ చెప్పాను ఒకసారి అతనికి చెప్పు కూర్చోమని ఏ ఊక అయ్యయ్యగారు వాడు కూర్చుంటే కూర్చుంటాడు పండుకుంటే మనక ఎందుకు పోదాంపా అన్నాడు.
(24:55) నాకు ఆరోజు ఒక విషయం తెలిసింది ఏమీ లేని వాడికి కూడా ఒకదాని పట్ల విపరీతమైన మమకారం ఉండొచ్చు అన్ని ఉండి ఈమె పట్టనట్టు ఉండొచ్చు కొందరు ఆ స్థితిలోకి రావాలి దేనికి అధిక ప్రాధాన్యత లేదు ఆ సందర్భం నీది కాని దాన్నే అంత పట్టుకుంటున్నావ్ మరి నీది అని తెలిసిన దాన్ని నువ్వు వదులుతావా సో జ్ఞాని ఎక్కడున్నా అక్కడ హాయిగా ఉంటాడు.
(25:24) ఇక్కడ ఏది నీది కాదు కానీ అన్ని నీకు ఉపయోగపడే ఉన్నాయి వాటిని ఉపయోగించుకో తెలుసుకో ఇది శాశ్వతము కాదు నాకు సందర్భ సందర్భం క్రియేట్ చేసిన ఈ అవసరము శాశ్వతము కాదు. ఈ వాడుకుంటున్న ఈ మనసు శాశ్వతం కాదు వీటన్నిటికీ అతీతమైన ఒకానొక స్థితి నీవు అది గుర్తించు దీపం ఎగ్జాంపుల్ చెప్పాను కదా నువ్వు ప్రశాంతంగా ఉన్న క్షణాలు ఉన్నాయి కదా నువ్వు హాయిగా ఉన్న క్షణాలు ఉన్నాయి కదా ఏమి పట్టనట్టు ఉన్న క్షణాలు ఉన్నాయి కదా అక్కడే సత్యం ఉంది.
(25:59) నీతో నీవు ఉండు నీవై ఉండు నీలో ఉండు నీవే ఉండు ఉండు అట్లా సో నిన్న రాత్రి ఒక మిత్రుడు వచ్చినప్పుడు ఒక చిన్న చర్చ జరిగింది. సమాజం గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటారు ఇక్కడ ఎవరిని మార్చలేము అన్నప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడిగాను ఇక్కడ ఎవరు లేరు నువ్వు ఒక్కడివే ఉన్నావు నీ చేతిలో ఏదో వస్తువు ఉంది ఎవ్వరు లేరు ఇక్కడ కానీ ఆ వస్తువు పట్ల నీ వైఖరి ఏందన్నది నీవు నిర్ణయిస్తున్నావు అది సమాజం ఇచ్చింది కాదు ఒకవేళ సమాజం ఇచ్చినప్పటికిని అది వాలిడా ఇన్వాలిడా నీవు నిర్ణయిస్తున్నావు ఆ వైఖరి దగ్గర ఉంది నీ జ్ఞానం యొక్క ఆవిర్భావం వైఖరి మారాలి
(26:39) సో అష్టవక్రుడు ప్రతి సూత్రంలోనూ ఇదే చెప్తాడు పదే పదే చెప్తాడు అష్టవక్రుని యొక్క సారం అంతా ఒక 10 వాక్యాలు చెప్పుకోవచ్చు 100 వాక్యాలు చెప్పుకోవచ్చు ఆ 10ని కుదించి ఐదు వాక్యాలు చెప్పుకోవచ్చు ఐదు వాక్యాలను కుదించి రెండు వాక్యాలు చెప్పుకోవచ్చు ఒక్క వాక్యంగా చెప్పుకోవచ్చు ఒక్క పదముగా చెప్పుకోవచ్చు కర్త శూన్యత అయిపోయింది ఇంకొక పదం అన్నిటికీ సాక్షిగా ఉండు అయిపోయింది ఇంకొక పదం నిరపేక్షలో ఉండు అయిపోయింది ఇంకొక పదం పసిపిల్లవాడి మానసిక స్థితిని తిరిగి పొంది అందులో రమించు అయిపోయింది.
(27:18) ఇంతే నువ్వు ఏమేమో చేయక్కర్లేదు ఎన్నో చేసినంత మాత్రాన అవుతుందని కాదు చేయవలసిన ఒక్కటి చెయి ఆ మూల పరివర్తన నీ మూలంలో సమూల పరివర్తన చిలంగారు ఆశ్చర్యపోయేవాళ్ళు రమణ మహర్షిని చూసి నేను ఎందరినో చూశాను ఎందరెందరో అందగాళ్ళను చూశాను గొప్ప వాగ్దాటి కలిగిన వాళ్ళని చూశాను ఇతని దగ్గర అవేవి లేవు కానీ ఇతని దగ్గరికి ఎందుకు వస్తున్నాను ఏముంది ఇక్కడ అతను మాట్లాడితే కర్ణ కఠోరం బుజ్జగించడు లాలించడు సూటిగా చెప్పేస్తాడు ఎదుటి వ్యక్తి ఏమనుకున్నాడని పట్టించుకోడు ఒక వ్యక్తి 10 రోజులుగా ఎదురుచూస్తున్న తలదిప్పి చూడడు తింటున్నప్పుడు వద్దన్న తర్వాత వేస్తే
(28:03) పట్టనట్టు వెళ్ళిపోతాడు. తన చుట్టూ ఎవరున్నా లేకున్నా ఇలా ఉంటున్నాడు ఏమిటిది నేను దేని వైపు అట్రాక్ట్ అయింది అప్పుడు చిలం గారు అంటారు ఆ అతను మనిషి కాదు జ్ఞానంతో నిండి నిబిడీకృతమైన మౌనముతో నిండి నిబిడీకృతమైన జ్ఞానం అన్నాడు. అక్కడ కూర్చున్నది జస్ట్ ఒక సాదా సీదా శరీరపరంగా గోచి పెట్టుకున్న వాళ్ళు చాలామంది కనిపిస్తారు కానీ ఆ స్థితి నీ మనసులో ఉన్న అన్ని లంకెలు తెగిపోవాలి వస్తువులు పోనక్కర్లేదు మనుషులను వదిలేయకు వస్తువులని వదిలేయకు వాటి పట్ల నీకున్న వైఖరిని మార్చు నాది నాది నాది నాది అనుకుంటున్న నీవు జస్ట్ సంయోగ వశాత్తు అవసరం కోసం అట్లా ఉన్నావ్
(28:49) అని గుర్తిస్తున్నావు ఆ గుర్తించడంతో ఒక సమూల పరివర్తన జరుగుతది. ఒక ఈవెంట్ కి వెళ్ళాం నేను ఒక మిత్రుడు ముందు కుర్చిలో కూర్చున్నాం అప్పుడు ఎవరు లేరు ఈవెంట్ స్టార్ట్ అయింది. ఎవరో వచ్చి అన్నారు కాస్త వెనక కుర్చిలో కూర్చుంటారా మా మిత్రుడు గాయపడ్డాడు. నేను అన్నాను వెనక్కి కుర్చిలో కూర్చుందాం. ఆ తర్వాత వెనక కుర్చిలో కూర్చున్న తర్వాత మళ్ళ కాసేపటికి హాల్ నిండింది ఇంకెవరో వచ్చారు మీకు అభ్యంతరం లేకపోతే ఇవన్నీ రిజర్వ్డ్ కుడ్ యు ప్లీజ్ సిట్ దే ఆర్ ఇన్ ద బ్యాక్ సీట్స్ నేను లేచి వెళ్ళిపోతుండగా మా మిత్రుడు చాలా కోపపడ్డాడు వెళ్ళిపోదాం
(29:26) పదా ఇక్కడి నుంచి అన్నాడు ఎందుకు ఇన్సల్ట్ చేశారు నో నువ్వు ఇన్సల్ట్ తీసుకున్నావ్ ఇక్కడ ఎవరు ఇన్సల్ట్ చేయలేదు డోంట్ బ్లేమ్ దెమ యాక్చువల్ గా నువ్వు ఇన్సల్ట్ చేస్తున్నావ్ ఈవెంట్ నీది కాదు కుర్చి నీది నీది కాదు ఎక్కడ కూర్చోవాలో నువ్వు తెలుసుకొని రాలేదు నీకంటూ ఏ సీట్ రిజర్వ్డ్ కాలేదు నిజానికి నా సీట్ రిజర్వ్డ్ నేను కూర్చోవచ్చు అక్కడ బికాజ్ నేను స్టేజ్ మీద ఎక్కి ఈరోజు కాస్త మాట్లాడవలసి ఉన్నది కానీ నీకోసం నీకు తోడుగా ఉండటం కోసం నా కుర్చిని వదిలి వస్తున్నాను కానీ ఇక్కడ నీదంటూ ఏది లేదు ఇంత గట్టిగా పట్టుకున్నావ్ అంటే ఇప్పుడు అన్ని కుర్చీల్లో
(30:06) కూర్చోవద్దంటే ఎటు పోవాలి నేను హాయిగా గోడ దగ్గర కూర్చుందాం పద అక్కడ కుర్చిలే లేవు అన్నాడు నీళ్ల మీద కూర్చుందాం పదా ఇలా నేను ప్రతిదానికి చెప్పిన తర్వాత పా కూర్చుంది పా అన్నాడు నేను హాయిగా వెళ్లి నీళ్ల మీద మూల కూర్చున్నాను. ఆ తర్వాత ఈవెంట్ స్టార్ట్ అయింది అతను నా పక్కన చాలాసేపు నిలబడి కూర్చున్నాడు. ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఒక చిన్న ప్రోమో ఏదో వేశారు అందులో నా గురించి ప్రస్తావన ఉంది.
(30:37) అందులో ఆర్గనైజర్స్ నాకోసం వెతుకులాడుతున్నారు. సమ వన్ టోల్డ్ హి ఇస్ సిట్టింగ్ సంవేర్ ఇన్ ద బ్యాక్ ఆన్ ద గ్రౌండ్ సో అప్పుడు నా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి ఏంటండి కాంత గారు ఇక్కడ కూర్చున్నారు నేను ఇక్కడ కూడా బాగుంది. మా మిత్రుడు ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. లేదు మీకు ముందలో కూర్చోండి ముందుల మీకు సీటు ఉందన్నాను అప్పుడు నేను చెప్పాను ఎక్కడో చాలా దూరం నుంచి మిత్రుడు వచ్చాడు.
(31:01) నాతో పాటు అతనికి మీరు సీట్ ఇవ్వగలరా వస్తాను లేదన్నా నేను మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు డైరెక్ట్ గా అక్కడికి వస్తానులే ఎక్కడ కూర్చున్న హాల్లోనే ఉన్నాం కదా అన్నాను. ఏ అలాంటిది ఏమి లేదు మీ మిత్రుడు ఏమిటి మీతో ఎంతమంది వచ్చిందో అందరికీ కూర్చున్నా రండి అని మా మిత్రుడిని లేపి పోతూ పోతూ ఉన్నది మీరేనా చెప్పాలి కదండీ మాకు తెలియదు కదా అందుకనే అట్లా అన్నా మీరేమనా బాధపడితే క్షమాపణ అన్నాడు.
(31:25) మా మిత్రుడు కరిగిపోయాడు అప్పుడు నేను చెప్పాను కరిగిపోవద్దు అసలు బాధ పడితేనే కదా ఇదంతా చూడు జస్ట్ చూడు ప్రతి సందర్భంలో నీ మనసులో రేగే ఆలోచనల అలల్ని చూడు ఒక్కొక్క ఆలోచన నిన్ను ఎంత ఉక్కిరి బిక్కిరి చేస్తుందో నిన్ను ఎన్ని పల్లిటీలు కొట్టిస్తుందో చూడు నీ ప్రశాంతతని నాశనం చేస్తున్నది ఎవరో నీవే చూడు అది నీవే నీ ఆలోచననే నీ వైఖరి నీ ధారణే నీ కాన్సెప్ట్స్ే నీ నోషన్స్ ప్రీకన్సీవడ్ నోషన్స్ నీకున్న ఫోబియాస్ ఇవన్నీ కలిసి ఈ క్షణాన్ని కరప్ట్ చేస్తున్నాయి.
(32:12) మూలాన్ని పట్టుకో నీవే అది నిన్ను నువ్వు కవలించుకో ఇక్కడి నుంచి మీ అందరి ఓపిక శిరసు వచ్చి నమస్కారం చేస్తున్న రసరసు
No comments:
Post a Comment