Tuesday, May 26, 2026

ప్రేమ ఉన్నచోటే అపరాధ భావన. ఓ తల్లి వ్యధ From Guilt to Inner Peace - A Spritual Perspective

ప్రేమ ఉన్నచోటే అపరాధ భావన. ఓ తల్లి వ్యధ From Guilt to Inner Peace - A Spritual Perspective

Author Name:maruthi kiran Poruri

Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Zk0hPVzkRK0



Transcript:
(00:01) బాల్యమిత్రుడు విశ్వేశ్వర శాస్త్రి ఆర్డర్ వేసాడండి సిల్వర్ జూబిలీ కాలేజీ మిత్రులందరూ కూడాను సాయంత్రం హైటీ కి మా ఇంటికి రావాలి అని అంటే ప్రతి నెల ఒకొకళ ఇంట్లో కలవాలని ముందే నిర్ణయించుకున్నాం కాబట్టి మేమందరం కూడాను ఓకే అన్నామండి అది కూడాను ఒక 10 రోజుల ముందు చెప్పాడు. అయితే ఇలా కలవడానికి కారణం ఏంటంటే నండి అందరం 69 లో పడ్డాం అనారోగ్యుల సమస్యలు కూడాను మేము ఉన్నామ అంటూ చాలా మందికి జ్ఞాపకం చేస్తున్నాయి.
(00:33) ఈ 2025 అంటే లాస్ట్ ఇయర్ కి మేము డిగ్రీలో చేరి 50 ఏళ్ళ అయింది అన్నమాట. సరే కదా అని నేను మా ఇంటి నుంచి క్యాబ్ బుక్ చేసుకొని కూకట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర దిగి ఆ పక్కనే ఉన్న ఓమ్నీ హాస్పిటల్ దగ్గరికి చేరుకున్నానండి. అంతలో మొబైల్ మోగింది నేను ఆన్ చేసి హలో అన్నాను ఒక స్త్రీ కంఠం అండి సర్ మారుతి కిరణ్ గారైనా మాట్లాడేది అవునమ్మ మీ వీడియో చూస్తున్నాను సార్ మీతో ఒక పర్సనల్ విషయం మాట్లాడాలి అని అందండి ఈ అనేదానికంటే ముందే సార్ మీరు మారుతి కిరణ్ గారు అంటే అవును అన్నాను కదా ఒక 20 నిమిషాలు ఆమె కొంచెం బాధగా సన్నగా మూలిగిందండి అంటే ఆమెకి
(01:20) ఏడుపు ఎందుకో తనుక వస్తున్నది. నేను ఆశ్చర్యపోయాను ఏంటమ్మా పర్సనల్ విషయం అన్నాను. అంటే అక్కడ వాతావరణం కూడా ఎట్లా ఉందంటే నండి కూకటిపల్లి మెట్రో కదా అంత రణగణ ధ్వని నేను ఎవరో తెలియలేకపోయిన కూడా ఫోన్ చేసింది కాబట్టి అందు స్త్రీ కాబట్టి ఈ ఫోన్ ని మరీ దగ్గరగా చెవు కానించుకొని చెప్పమన్నానండి దాదాపు 28 నిమిషాలు మాట్లాడింది.
(01:47) పల్లెటూరు యాసలో మాట్లాడిందంట ఆమెలో ఒక విధమైన అమాయకత్వం ఉందండి ఆ అమాయకత్వమే నన్ను అంత రణగణ ధ్వనిలో కూడాను ఆమె చెప్పింది జాగ్రత్తగా వినేటట్టు చేసిందండి ఆమె ఏం చెప్పింది అన్నది నేను మీకు చెప్తాను తర్వాత నేను ఆమెక ఏం సమాధానం ఇచ్చాను అన్నది కూడా చెప్తానండి ఆమె ఈ 28 నిమిషాల్లో నాకు చెప్పింది ఏంటంటే సర్ మాది ఆంధ్రాలో పల్లెటూరు మేము మొత్తం నలుగురం అండి నాకు ఒక అన్నయ్య ఉన్నాడు అక్కయ్య ఉంది నేను మూడో దాన్ని అట్లాగే తమ్ముడు కూడా ఉన్నాడు.
(02:23) ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతున్నారు. నాకు ఇద్దరు మా పిల్లలు వాళ్ళు కూడాను పర్వాలేదు బానే ఉన్నారండి హైదరాబాద్ లో ఉద్యోగాలు అవి చేసుకుంటూ మా ఆయన అనారోగ్యమే నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నది. ఇది ఇలా ఉండగా దాదాపు ఐదఆరు ఏళ్ల క్రితం మా అమ్మ బాగా అనారోగ్యానికి గురయిందండి. ఒకోసారి ఏం మాట్లాడుతుందో కూడా తెలియదు. అందువల్ల మిగతా తోపుట్టు వాళ్ళ మనస్తత్వాన్ని నేను అర్థం చేసుకని అక్కడ ఉంటే అమ్మ సుఖపడదని మా ఇంటికి తెచ్చుకున్నానండి అమ్మ కూడాను చాలా సంతోషంగా నా ఇంటికి వచ్చింది.
(02:59) ఏదో కాలం గడిచిపోతుంది కదా అని అనుకున్నాము. అప్పుడప్పుడు ఆమె అపస్మారకంలో పోయేది దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ పెట్టి మళ్ళీ మేము కొంచెం కదిపి ఏదో చేస్తే మెల్లగా తెరిచాం ఏంటి ఏంటి అనేది. జ్ఞాపక శక్తి కూడా బాగా తగ్గిపోతున్నది. అందువలన నిర్ణయించుకొని మా ఆయన నేను హైదరాబాద్ లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ కి తీసుకెళ్ళామండి అంది అంటే కార్పొరేట్ హాస్పిటల్ పేరు కూడా నువ్వు అనవసరం అనుకోండి వాళ్ళు దాదాపు 12 రోజులు ఉంచుకొని బ్రెయిన్ లో బాగా రక్తం అది గడ్డకట్టిందమ్మ అవన్నీ తీసేయాలి అని చెప్పేసి వాళ్ళ ప్రయత్నం ఏదో వాళ్ళు చేశారు.
(03:35) మేము కూడాను ఆమెని వెనక్కి తీసుకొచ్చుకున్నాము. కాకపోతే ఏంటంటే హాస్పిటల్ లో చేరే ముందే ఆమెకి కొంచెం ఈ కాల్ అది కొంచెం చచ్చుపడినట్టుగా ఉంది నడవలేని పరిస్థితికి వచ్చేసింది అప్పటికే ఏం పర్వాలేదమ్మా మేము డిస్చార్జ్ చేస్తున్నాము ఇబ్బంది ఏం పడదు ఆమె హాయిగా నడుస్తుంది అని అన్నారు. కానీ ఇంటికి తీసుకెళ్ళిన ఒక రెండు నెలలు కూడాను ఆమె నడవలేకపోయింది అప్పుడప్పుడు పడిపోయేది.
(03:57) మేము మళ్ళీ పరిగెత్తుకొని వచ్చి హాస్పిటల్ వాళ్ళకి చెబితే నరాలు బాగా మెత్తపడిపోయామ అందువల్ల ప్రస్తుతానికి ఇంతకంటే మేమేం చేయలేమని చెప్పేసారు సార్ ఆఏడు లక్షల వరకు ఖర్చుఅయింది కానీ అమ్మ మటుకు బాగా దిగులు పడిపోయింది. మేమే నిలబెట్టాలి మేమే బాత్రూమ్ తీసుకెవెళ్ళాలి ఇలా నడుస్తుండగా ఒక ఆరుఏడు నెలల క్రితం పడిపోయిందండి పడిపోవడం పడిపోవడం కూడాను ఈ నడుము దగ్గర ఫ్రాక్చర్ అయిపోయిందండి ఇంకా జీవితం మంచానికే పరిమితం అయిపోయింది.
(04:32) నేనే ఆల్మోస్ట్ అన్ని చేస్తూనే ఉన్నాను మనిషిని ఎవరిని పెట్టుకోలేదు. ఒక్కొకసారి నేనే పోతే బాగుండు అని చెప్పేసి అనేది ఎందుకులేమా అలా అంటావు అని [గొంతు సవరించుకోవడం] అన్నాను నాకు మందులు అవన్నీ కూడా నేనే చూసుకుంటున్నానండి ఇద మాతో గుట్టు పెద్దగా వచ్చేది ఏమీ లేదు కానీ ఏదో వాళ్ళ జీవితాలు వాళ్ళు గడుపుతున్నారు వాళ్ళ తత్వం తెలుసు కాబట్టి మమ్మకి నాకు ఇలాగ ఏదో అడ్జస్ట్ అయిపోతున్నాము అని చెప్పిందంట అని చెప్పి ఇప్పుడు ఎట్లా ఉందమ్మా అమ్మ అన్నాను అంటే 20 నిమిషాలు మాట్లాడిన తర్వాత అన్నా నేను అంటే లేదండి మనం డిసెంబర్లో అమ్మ చనిపోయిందండి అదేంటమ్మా
(05:06) నువ్వు ముందు చెప్పాలి కదా విషయం అన్నా అట్లా కాదు సార్ నేను మొత్తం వివరంగా చెబితే మీకు పరిస్థితి అర్థమవుతుంది అని చెప్తున్నాను సార్ అని అసలు ఆ మహాతల్లి మాటల్లో ఒక ఆవేదన ఒక దుఃఖం అలాగే ఒక విధమైన అమాయకత్వం కొంతమంది మాట్లాడుతూ ఉంటే పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని అనిపిస్తుందండి అందువల్ల నేను మాట్లాడకుండా చెప్పమ్మా అన్నా తర్వాత మళ్ళీ ఏడుఎది నిమిషాలు అది మాట్లాడింది అయితే ఆవిడ చెప్పిన మాటల్లో ఒక చిన్న విషయం దాగుందండి అదేంటంటే అంటే ఆ విషయం గురించి ఆమె బాగా బాధపడుతున్నది ఈ రోజు వరకు బాధపడుతున్నది.
(05:40) అదేంటంటే మా అమ్మకి అసలు మోషన్ అయ్యేది కాదండి నేనుఏదో మంది ఇచ్చినప్పుడల్లా అది నాలుగుైదు రోజులక అయ్యేది. అయితే నేను దగ్గర దగ్గర ఒక 10 12 రోజులు కొంచెం అటు ఇటుగా రెండు వారాలు పై పెట్చే ఈ మోషన్ మందు ఎందుకో ఇవ్వలేదండి. ఆ అందువల్ల ఆమెకి మోషన్ కూడా సరిగా అయ్యేది కాదు. సరే పొద్దున మాట్లాడుతూనే ఉంది ఉన్నటువంటి అపస్మారకంలో పోయి ఎనిమిది నరకల్లో చనిపోయిందండి ఆమె కర్మకాంలు అన్నీ చేశము ఇల్లు నిశబ్ధం అయిపోయింది.
(06:14) అప్పటినుంచి నాలో ఒక అపరాధ భావన మొదలైంది సార్ అదేంటండి ఈ మోషన్ ఫ్రీగా కావడానికి మందు గనుక ఇచ్చిఉంటే అమ్మ బతికి ఉండేది అని మరి డిసెంబర్ అంటే చూడండి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఏప్రిల్ మే ఐదు నెలలు బట్టి నాకు కునుకు లేదు సార్ రాత్రి నిద్ర పట్టదు. అమ్మకి వైద్యంలో సరైన సహకారం అందించలేదు తప్పు చేశను. ఆ ఫ్రీ మోషన్ గనుక అయ్యే మందు గనుక ఇచ్చుంటే బతికు ఉండేదేమో అనిని నాకు ఇప్పటికీ చాలా బాధగా ఉందండి.
(06:42) ఆ పిల్లలకి చెబితే ఎందుకమ్మా అనవసరంగా బాధపడతావు అని అంటున్నారు గంగా బరువు తగ్గిపోయాను సార్ నాలుగు నెలలు పైన అయింది నేను సరిగా అన్నం తిని ఇది నా పరిస్థితి సార్ అసలు నిద్రపోలేకపోతున్నాను అమ్మ గుర్తుకు రావటం ఒక ఎత్తు దానికి తగ్గట్టు నేను ఆమెకి ఆ ఫ్రీ మోషన్ కి సంబంధించిన మంది ఇవ్వలేకపోయాను సార్ నన్ను బాధపెడుతున్నది అలా గనుక ఇచ్చిఉంటే అమ్మ దగ్గ ఉండేదేమో అని చెప్పి చెప్పిన విషయాన్నే చెప్తూ చెప్పిన విషయాన్నే చెప్తూ బాధపడటం ప్రారంభించిందంటే అసలు ఆ మాటల్లో నేను ఆమె వ్యక్తిత్వాన్ని నిజంగా మనసులోనే ఎంత గొప్పగా పొగిడాను నేను కొనియాడుకున్నాను అంటే అసలు ఇటువంటి
(07:24) వాళ్ళు ఉండబట్టి కదా ఇంకా కొద్దో గొప్పో కరుణ ప్రేమ ధర్మం సేవ మిగిలిన్నాయి అని అనిపించిందండి. ఆమె ఎవరో నాకు తెలియదు నేను కూడా ఎవరో తెలియదు కాకపోతే నేనేదో కొన్ని వీడియోలు చేశనులేండి హ్యూమన్ రిలేషన్స్ మీద మనసుకు సంబంధించి ధర్మో రక్షతి రక్షితః అని వాటి గురించి చేస్తే ఆమె చూసింది. చూసి ఒక నిర్ణయానికి వచ్చిందట ఆ నిర్ణయం ఏంటంటే నేను ఒకచోట ఎప్పుడో ఏది చెప్పే నా 69 సంవత్సరాలు అప్పుడు ఆమె వాళ్ళ నాన్న వయసుని గుర్తుకు తెచ్చింది వాళ్ళ నాన్న కూడా అదే వయస్ అందువల్ల ఈ సార్తో మాట్లాడదాం మాట్లాడితే ఏమనా చెబుతాడేమో చూద్దాం ఈయన మాట ఏదో చాలా
(07:57) బాగుంది అని ఒక నిర్ణయానికి వచ్చి నాకు ఫోన్ చేయడం జరిగింది సో ఇది జరిగింది. మరి 28 నిమిషాలు సాగిన ఆ టాక్ అంతా రణగని దునిలో విన్నప్పుడు ఏం చెప్పాలి అన్నది ఒక విధంగా ఇబ్బందికరమైన విషయం అతే నేను ఒకటే మాట అన్నా అమ్మ ఇక్కడ మా మిత్రుడికి కొంచెం ఆరోగ్యం సరిగా లేదు మేము కొంతమంది మిత్రులను కలవాలని బయలుదేరాము మెలమెలగా ఒకళ్ళద్దరు వస్తున్నారు నేను ఓ పని చేస్తాను.
(08:24) నేను రాత్రి ఆలోచిస్తాను నీ గురించి నువ్వు పొద్దున్నే 10:30రకు ఫోన్ చేయమ్మా నేను ఎదురు చూస్తూ ఉంటాలే నువ్వేం కంగారు పడద్దు నాకు కొంచెం టైం కావాలి కదా మరి అంటే చాలా సంతోషంగా ఒప్పుకుందండి. ఒప్పుకుంది 10:30రకి ఏదో ఫోన్ చేసింది నేను వేరే కాల్లో ఉంటే ఇట్లాగే ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉంటారు కదా ఆ తర్వాత మళ్ళీ 11:30ర ఆ ప్రాంతంలో ఫోన్ చేసింది సార్ నేను గుర్తున్నానా నిన్న ఫోన్ చేశను కదా మధ్యాహ్నం అదే దేవనమ్మ గుర్తున్నావా నువ్వు చెప్పమ్మ అన్నా సరే నేను నాకు చెప్పాను వివరంగా మీరు కూడాను ఆ అంత [గొంతు సవరించుకోవడం] అడావిడిగా ఉన్నా కూడా విన్నారు సార్ అని ఏం పర్వాలేదమ్మా
(08:54) నేను ఇంకా వింటాను చెప్పమ్మ అన్నా ఆమె మళ్ళీ అదే చెప్పడం ప్రారంభించిందండి అయితే నాకు ఏంటంటే ఆమె సంస్కారం చూసి ఆమె చిన్న పిల్లలాగా మాట్లాడటం చూసి ఒక అపరాధ భావన చోటు చేసుకుంది కదా అందువల్ల ఫుల్ అపర్చునిటీ ఆమెకి ఇచ్చేసేయాలి అని చెప్పేసి చెప్పమ్మ నువ్వు చెప్పడం పూర్తి అయిన తర్వాత నేను చెప్తాను. అని చెప్పాడండి ఇంకేముంది సార్ చెప్పేది తప్పు చేశనేమో అనిపిస్తున్నది అని చెప్పిందండి రకరకాలుగా చెప్పింది.
(09:25) సరే అమ్మా నువ్వు ఓకే అంటే నాకు తెలిసిన నాలుగు ముక్కలు చెప్తాను అనిఅంటే చెప్పండి సార్ నేను వింటాను సార్ అని అందండి. అయితే ఈ మధ్యలో రాత్రి నేను ఏం చేశనంటే చాలా సీరియస్ గా ఆలోచించి నేను రాసుకున్నాను కూడా ఎందుకంటే ఒక మనిషి కుదేలు అయిపోయినప్పుడు ఆమె స్వాంతన కలగజేయాలి అంటే నేను సైకాలజిస్ట్ కాదు పెద్ద కౌన్సిలర్ని కూడా కాదు కానీ నా మీద ఒక గొప్ప నమ్మకం ఉంచి ఆమె ఈ విధంగా మాట్లాడడం జరిగింది కదా నా ధర్మం కదా కాబట్టి రాత్రి 12 12 దాకా ఏదో కాసేపు అలాగే రాసి సీరియస్ గా ఆలోచించి ఏదో నాలుగు పాయింట్లు రాసుకున్నారండి స్వామికి నేను చెప్పడం ప్రారంభించాను
(10:03) ఇది మీరు కూడాను కొంచెం జాగ్రత్తగా వినాలి ఎందుకంటే ఏదో చిన్న తప్పు చేస్తారు. దాని వల్లే అసలు ప్రమాదం జరిగిందని బాధపడే అమాయక మహిళలు మాతృమూర్తులు ఇంకా ఉన్న సమాజంలో మనం బతుకుతున్నామండి. అసలు ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఇప్పుడు మీరు కూడా విన్నారు అనుకోండి మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ విషయాన్ని రేపు పొద్దున ఎవరికన్నా ఎటువంటి సమస్యలో ఎరుకున్న వాళ్ళకి మీరు దగ్గర ఉంటే మీరు వాళ్ళకి స్వాంతన కలగజేస్తారు అన్న ఉద్దేశంతోనే చేస్తున్నానుండి అంతకంటే ఏం లేదండి సో నేను ఆమెక ఏం చెప్పానంటే అమ్మ నేను చెప్పేది మటుకు జాగ్రత్తగా విను
(10:39) నేను చెప్పడం అయిపోయిన తర్వాత నువ్వు ఏమనా అడిగితే నేను మళ్ళీ చెప్తాను అంటే చెప్పండి సార్ నేను వినటానికి సిద్ధంగా ఉన్నాను అంటే నేను ఏం చెప్పానంటే [గొంతు సవరించుకోవడం] అమ్మ రాత్రి చాలా సీరియస్ గా ఆలోచించాను నీ మీద నాకు ఎనలేని అభిమానం కలిగింది తల్లి ఒక మాటలో చెప్పాలంటే నిజంగా నువ్వు చాలా గొప్పదానివి ఎందుకో తెలుసా మొత్తం మీరు నలుగురు ఉన్నా నువ్వే అమ్మకు సేవ చేసే భాగ్యాన్ని తక్కించుకున్నావు అమ్మవారు నీకు అవకాశం ఇచ్చింది మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అన్నది ఇప్పుడు మనం చర్చించుకునే ప్రయోజనం లేదు.
(11:12) అంటే అమ్మటం లేదు కాబట్టి కాబట్టి ఆ విధంగా నువ్వు చాలా అదృష్టవంతుడవి నీ మీద నమ్మకం ఉంచి మరి అమ్మవారు లేదా భగవంతుడు నీకు అవకాశం ఇచ్చారమ్మా దీన్ని మటకు నువ్వు విశ్వసించాలి ఎటు పరిస్థితులో అయినా అని చెప్తూ భగవంతుడు నీ మీద అపారమైన కరుణతో ఉండబట్టి నువ్వు సమర్ధురాలివి అని చెప్పేసి ఇచ్చిన అవకాశాన్ని మటుకు నువ్వు ఎందుకో పెద్దగా పట్టించుకోలేదు అనిపించింది కాబట్టి కొంతవరకు సంతృప్తి పడువు అని చెప్పానండి చెప్తూ ఇంకా ఏమన్నానుఅంటే ఇంత గొప్ప అవకాశం నీ మీద గొప్ప నమ్మకంతో ఇచ్చిన భగవంతుడు నిన్ను నిజంగా అపరాధిగా భావిస్తాడా అపరాధిగా
(11:50) నిన్ను భోన్లో నిలబెడతాడా భగవంతుడు నిజంగా అంత కఠినాత్ముడా ఇంత కరుణ లేనివాడా [గొంతు సవరించుకోవడం] చెప్పమ్మా లేకపోతే అసలు అవకాశం నీకు ఇచ్చేవాడు కాదు కదా అన్నానండి ఆమె చాలా నిశబ్దంగా వింటున్నదండి అమ్మ వింటున్నావా నేను చెప్పింది అన్నా వింటున్నాను సార్ వింటున్నాను సార్ అంది మా ఒక విషయం అడుకు నిజాయితిగా ఆలోచించు దాదాపు ఆరు ఏడు నెలలుగా ఎవరు చూస్తున్నారు అమ్మని ఎవరు నడిపించారు ఎవరు మందులు వేశరు మంచంలో ఉన్నప్పుడు ఎవరు బట్టలు మార్చారు దగ్గర ఉండి తల్లిలాగా ఎవరు అన్నం తినపెట్టారు ఎవరు రాత్రి మగళలు కష్టపడ్డారమ్మా నువ్వే కదా
(12:31) ఒక్కడి మటుకు నిదం తల్లి డాక్టర్లు కూడాను నూటికిన శాతం ప్రాణాలు నిలబెట్టలేరమ్మ అప్పటికే అమ్మకి బ్రైన్ ప్రాబ్లం ఉంది. నర్వస్ సిస్టం కూడా నువ్వు పూర్తిగా క్షీణించింది. కదా ఊరు వదిలే నగరానికి వచ్చి రెండు వారాలు ఉండి ఓఆరుఏడు లక్షలు ఖర్చుపెట్టి అమ్మకి వైద్యం చేయించావు. చాలా గొప్ప విషయం ఇది కానీ మీ చేతిలో లేని పనిని మీకు తెలియని పనిని డాక్టర్లు చేశారు.
(13:02) వాళ్ళు వైద్యం సరిగా చేశారా లేదా పోనీ అశ్రద్ధ ఏమనా వహించారా అన్న అనుమానం గనుక ఉంటే అది ఎటు నీ చేతిలో లేదు కాబట్టి వాళ్ళ శ్రద్ధకి వాళ్ళే శిక్షణ అనుభవిస్తారు రేపు [గొంతు సవరించుకోవడం] భగవంతుడు చూసుకుంటాడమ్మా అని చెప్పానండి ఆ నిజంగా [గొంతు సవరించుకోవడం] అసలు అలా వింటూ ఉండిపోయిందండి అమ్మ ఇంకొక విషయం చెప్తాను తర్వాత అమ్మకి నడుము దగ్గర కూడా నువ్వు ఫ్రాక్చర్ అయిపోయింది కదా శరీరం బలహీనం అయిపోయింది మానసికంగా శారీరకంగా ఆమె చాలా కుదేలు అయిపోయింది.
(13:38) ఇలాంటి పరిస్థితుల్లో అసలు ముగింపు ఎప్పుడు వస్తుందో అన్నది ఎవ్వరు కరెక్ట్ గా చెప్పలేరమ్మ ఆ మాటక వస్తే అలా మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్ గా పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి అమ్మకి సమయం ముంచుక వచ్చేసింది. అంతేనమ్మ అది ఎవరి చేతిలో ఉండదు కాబట్టి అమ్మ తుది శ్వాస తీసుకునే టైం వచ్చేసింది పోయింది అంతే [గొంతు సవరించుకోవడం] కానీ ఒక్కటి మటుకు నిజం చెప్తున్నానఅమ్మ నువ్వు నమ్మాలి నీ వల్ల అమ్మ చనిపోలేదు.
(14:11) నీ వల్లే అమ్మ చివరి రోజుల్లో ప్రేమను అనుభవించి అద్భుతమైన సేవను పొందిందమ్మ ఈ అవకాశాన్ని కోల్పోయిన నీ తోబుట్టులు ఉన్నారు కదా మిగతా ముగ్గురు కూడాను నిశశబ్దంగా జీవితాంతం అంతా అపరాధ భావంతో బాధపడిపోయే అవకాశం కూడా ఉందమ్మా వాళ్ళకి కాకపోతే వాళ్ళు పైకి చెప్పరు సరే అది నీకు అనవసరం కానీ ఒకటి ఆలోచించు అసలు నువ్వు లేకపోతే అమ్మ పరిస్థితి ఏంటి అమ్మ అనాధగా ఏ వృద్ధాశ్రమంలోనో ఎక్కడో చేరిపోయేది కదా ఆ వృద్ధాశ్రమంలో గనక అమ్మ పోయి ఉంటే ఈరోజు నిజంగా నీ బాధ వర్ణాతీతం కదా బంధువులు ఊళ్ళవాళ్ళు దోబుటూలు ఆ మాటక వస్తే అందరూ తప్పు పట్టేవాళ్ళు కదమ్మా నిన్ను
(14:51) ఏంటి ఆ మాత్రం అమ్మని చూసుకుపోయారు అని చెప్పేసి సే ఇప్పుడు నేను ఎవరు ఏమి అనలేరు అంటే నిజం సార్ మా తోటులు గాని ఊళలో వాళ్ళు గాని ఎవరు ఏమ అనటంలేదు సార్ అందరూ బాగా చూసుకున్నావ అమ్మా నువ్వు కాబట్టి చూసుకున్నావ అని అంటున్నారు సార్ అని నిజాయితిగా ఒప్పేసుకుందండి ఆమె నేను నీ గురించి చాలా సీరియస్ గా ఆలోచించాను రాత్రి నీ మీద నాకుఎందుకో చాలా గౌరవం కూడా కలిగింది.
(15:13) అందువల్లనే నేను ఇంత బాధ్యతగా మాట్లాడుతున్నానమ్మా ఏదేమైనా నువ్వు చాలా గొప్పదానివి తల్లి అంటూ మనిషి జననము మరణము పూర్తిగా మన చేతిలో ఉండదమ్మ మన చేతిలో ఉండేది ఏమన్నా ఉంది అంటే ప్రేమతో సేవ చేయడం మాత్రమే అది నువ్వు చేశవు అందుకే నీ అమ్మ చివరి రోజుల్లో అనాధలాగా కాకుండా నీలాంటి అద్భుతమైన ప్రేమాన్వితమైన కూతురి వళళలో జీవించిందమ్మా స్తుతిశ తీసుకుంది అని చెప్పానండి అప్పుడు ఆమె కొంచెం [గొంతు సవరించుకోవడం] ఆమెకు దుఃఖం తను వచ్చిందండి అమ్మ ఇంక ఒక్క నిమిషం నేను చెప్తాను తల్లి అంతకంటే ఏం లేదు నువ్వు ఏ తప్పు చేయలేదు ఒక మాట చెప్పనా అదేంటంటే నీ బాధ అనేది నీ ప్రేమకి ఒక గుర్తుమ్మ అది
(15:59) నువ్వు ఎందుకు ఇంత బాధపడుతున్నావ్ చెప్పు అమ్మని అత్యంత ప్రేమగా చూసుకున్నావు కాబట్టే ఆ ప్రేమ విలువ నీకు తెలుసు అది బాధ రూపంలో నీకు గుర్తుప వచ్చి నేను బాధ పెడుతున్నది కాబట్టి నీ బాధ అనేది నీ ప్రేమకి ఓ గుర్తమ్మ కానీ అమాయకంగా నువ్వు ఆ ప్రేమను ఇప్పుడు నీ మీద నీకు నువ్వు శిక్షగా వేసుకుంటున్నావు అలా మార్చేసుకుంటున్నావు ఏదో ఒక 10 15 రోజులు నువ్వఏదో మందు సరిగా ఇవ్వలేదుఅని చెప్పి నువ్వు ఆలోచించావు తప్ప ఆమె సమస్య అది కాదు కదా మోషన్ ఫ్రీగా కావడం కాదు కదా నర్వస్ సిస్టం పూర్తిగా ధ్వంసం అయిపోయింది అప్పుడప్పుడు అపస్మారక స్థితిలో వెళ్ళిపోతుంది దానికి తగ్గట్టు
(16:40) హిప్పు బోను కూడాను విరిగిపోయింది. కాబట్టి జీవితాంతం నిన్ను నీవు మటుకు ఈ చిన్న విషయాన్ని పదే పదే గుర్తు తెచ్చుకొని శిక్షించుకోవద్దమ్మ ఆలోచించు నా ఉద్దేశంలో నువ్వేమి తప్పు చేయలేదు నేనుేదో ఓదర్దామని నీకు స్వాతంత్రం కలిగిద్దామని మటకు నేను చెప్పట్లేదమ్మా నా మాట నమ్ము తల్లి అంటూ ఇప్పుడు నీ ముందు ఉన్న అర్థం ఏమిటో తెలుసా మీ ఇద్దరు పిల్లల్ని బాగా చూసుకోవడం మీ మనవళ్ళు మనవరాళ్ళని బాగా చూసుకోవడం ఇంతకంటే ముఖ్యంగా మీ ఆయనకి కొంచెం అనారోగ్యం ఉందన్నావు కదా ఆయన కూడా జాగ్రత్తగా చూసుకోవాల లేదు నీ బాధ్యత లేదంటావా ఒక పని చెయ్ ప్రతి రోజు ఒక రూపాయ
(17:18) రెండు రూపాయలో ఖర్చు పెట్టి అమ్మ పేరు మీద ఎవరో ఒకరికి ఏదో ఒక రకంగా సహాయం చేయ తల్లి అప్పుడు నీ మీద ప్రేమ బాధగా కాదు అదిఒక గొప్ప ఆశీర్వాదంగా మారుతుంది తల్లి రోడ్డు మీద అడుక్కు తినే వాళ్ళు ఎంత మంది ఉంటారు మీ అమ్మ లాంటి ముసలమ్మలు ఉంటారు అవసరమైతే నువ్వు సొంతగా రెండు చపాతీలు చేసి వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపో ఇది నా అమ్మ తరఫం చేస్తున్నాను అని అనుకో అమ్మ నీకు చాలా సాటిస్ఫా ఉంటుంది తల్లి ఇలా నువ్వు అమ్మని గుర్తుకు తెచ్చుకుంటూ అమ్మ ద్వారా సేవ చేయి తల్లి ఇది గొప్ప అవకాశం ఇది అమ్మాయి లేకపోతే నువ్వు లేవు కదా ఎందుకంటే నువ్వు ఏదో నన్ను తండ్రిగా భావించావు కాబట్టి
(17:54) నేను చెప్తున్నాను ఈ విషయాలన్నీ కూడాను నువ్వఏం తప్పు చేయలేదు తల్లి నిజంగా గనుక నిన్ను నేను ఏదో మాటలతో గారడీ చేసి నేను వాదరుస్తున్నాను అంటే నేను తప్పు చేస్తున్నా అసలు లెక్క నాకు నువ్వు ఎక్కడా తప్పు చేస్తున్నట్టు కనపడలేదు ఒక విధంగా అది విధి నిర్ణయించిన ఆ విషయం అమ్మా అది సమయం వచ్చేసింది ఆమె వెళ్ళిపోయింది అంతే అంతకంటే ఏదో అనాధలాగా వెళ్ళిపోలేదు కదా అని చెప్పి నేను రకరకాలుగా [గొంతు సవరించుకోవడం] చెప్పానండి దాదాపు నేను ఆమెకి ఒక 25 నిమిషాలు ఏమన్నా చెప్పాను చివరికి ఆమె నిజమే సార్ నాకు ఇలాగ ఎవరు చెప్పలేదు మీరు చెప్పారు కొంచెం టైం పడుతుంది అమ్మా నేను ఎన్ని
(18:29) చెప్పినా నీకు టైం పడుతుంది కాబట్టి మెల్లమెలగా కోరుకుంటావు కోరుకుంటావు నువ్వు నీ మనవళ్ళు మనవరాళ్ళు నీకు ముఖ్యం ఇప్పుడే జీవితాన్ని ప్రారంభించారు. వైవాహిక జీవితాన్ని నీ పిల్లలు వాళ్ళకి నీ అండ ఉండాలి వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు అన్నావు నా అమ్మ అక్కడ అన్నం తినటంలేదు బాధపడిపోతుంది బరువు తగ్గిపోతుందని రోజు తలుసుకుంటారు కదా పిల్లలు కాబట్టి నువ్వు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళకి సంతోషం నువ్వు హెల్ప్ చేస్తావు చేయ తర్వాత సంగతి కాబట్టి వాళ్ళ కోసం నువ్వు అద్భుతంగా జీవించాలమ్మా రేపు వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి మరి నీ తల్లికి నువ్వు ఆదుకున్నట్టు మరి నీ
(18:59) పిల్లలకి నువ్వు ఆదుకోవాలి కదా కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు నిర్వహించు తల్లి అని నేను చాలా జాగ్రత్తగా చెప్పానండి ఎందుకంటే నేను ప్రిపేర్ అయ్యి మాట్లాడాను కాబట్టి చివరికి ఆమె మంచి సార్ తప్పకుండా సార్ నేను జాగ్రత్తగా ఉంటానండి అని చెప్పిందండి నేను చెప్పా ఈ క్షణం నుంచే నువ్వు నవ్వటం ప్రారంభిస్తావు బాధ్యతగా ఉంటావు అభాగ్యులకి నీకు చేతనేంత సేవ చేస్తే అవుతుంది ఈ రోజు నుంచి నీ జీవితం మారాలని నేను అమ్మవారిని ప్రార్థిస్తున్నాను.
(19:24) అంత హాయిగా ఉంటుంది ఇబ్బందిఏం లేదు నేను చెప్పానండి నేను చెప్పాను చెప్తే నిజంగానండి ఆమెలో ఆ మాటలో ఒక విధమైన కాన్ఫిడెన్స్ వచ్చింది నిజమే సార్ నిజమే సార్ పోయిన అమ్మ తిరిగి రాదు కదా ఇప్పుడు నేను ఏం చేయాలి అనేది చెప్పారు మీరు ఆ ఇంక నేను పెద్దగా ఆలోచించను లేండి అని ఒకటి రెండు సార్లు అని అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది.
(19:43) ఎప్పుడనా మాట్లాడాలి అనిపిస్తే మాట్లాడ తల్లి ఇబ్బంది లేదు అన్నారండి. మంచి సారందండి నాకుఎందుకో ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె కొంత సంతోషపడిన తర్వాత నాకు చాలా సంతృప్తిగా అనిపించి సంతోషంగా అనిపించిందండి ఈ విషయాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి వీడియో పెద్దగా వచ్చింది నేను కాదనంలేదు కానీ ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఎలాగ ఎవరితో మాట్లాడాలి అన్నది కూడాను మీకు కూడా తెలుస్తుంది కదా అన్న ఉద్దేశంతోనే చేస్తున్న వీడియోనండి.
(20:05) అదండి వీడియోలో సంగతి నాతో మాట్లాడాలనిపిస్తే హాయిగా మాట్లాడొచ్చు నా ఫోన్ నెంబర్ 9491063089 నా పేరు మారుతి కిరణ ఓరూరి YouTube లోకి వెళ్లి ఎంఏ ఆర్ యు టిహెచ్ ఐ స్పేస్ ఇచ్చికే ఐ ఆర్ఏఎన్ అని టైప్ చేస్తే పి ఓ ఆర్ యు ఆర్ అని ఆటోమేటిక్ గా నా ఛానల్ వచ్చేస్తుందండి. చూడండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. మంచి మెసేజ్ పెడితే అమ్మయ్యా నా సబ్స్క్రైబర్స్ నా మాట నమ్మి మంచి మెసేజ్ పెట్టారని చూసుకుంటానండి.
(20:31) ఈ లైక్లు బెల్ ఐకాన్ నొక్కడం అనేది అది మీ ఇష్టం. ఉంటానండి, నమస్కారం.

No comments:

Post a Comment