Tuesday, May 26, 2026

మన ఇంట్లోవాళ్లే మీమీద చెడు ప్రచారం చేస్తే?chanakya niti@nandurihemamalini

మన ఇంట్లోవాళ్లే మీమీద చెడు ప్రచారం చేస్తే?chanakya niti@nandurihemamalini

Author Name:nanduri hemamalini

Youtube Channel Url:https://www.youtube.com/@nandurihemamalini

Youtube Video URL:https://www.youtube.com/watch?v=jOw2lhr6yZU



Transcript:
(00:00) శ్రీమతం నమః మనల్ని అవమానించారు అని అనుకోండి ఎవరైనా మనం మాట్లాడితేనేమో మనల్ని రెట్టిస్తారు మాట్లాడకుండా మౌనంగా ఉంటేనేమో చేత కాని వారిలాగా మనల్ని చూస్తారు అయితే ఎప్పుడు మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎక్కడ తగ్గాలి ఇంట్లో వాళ్ళు మనల్ని అవమానిస్తే ఏ విధంగా మనం ప్రవర్తించాలి బయట వాళ్ళు మనల్ని అవమానిస్తే ఏ విధంగా ప్రవర్తించాలి అనేది ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం ఎప్పుడు భగవన్ నామ స్మరణ చేసుకుంటాం కదా ఏ పని చేసినా భగవంతుడితో లింక్ అప్ పెట్టుకుంటాం కదా మరి ఈ వీడియోని చూడడం కూడా భగవత్ సేవ కిందే భావిస్తూ మన
(00:41) పిల్లలకి ఈ కథని చెప్తూ కింద కామెంట్ లో మీ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో పూర్తిగా వింటే ఎంతోమందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామంది ఇలాంటి సమస్యతోటే కుమిలిపోతూ ఉంటారు మానసికంగా. మగధ రాజధాని పాటలి పుత్రం ఈ మగధను ధననందుడు అనే అతను పరిపాలిస్తూ ఉండేవాడు ఈ ధననందుడు అహంకారి అలాగే వ్యసనపరుడు నోటికి ఎంతవస్తే అంత మాట్లాడేస్తాడు ఎవ్వరిని గౌరవించడు ప్రజల్నేమో పీడిస్తూ ఉంటాడు అన్నమాట అలాంటి ధననందుడు దగ్గరికి ఒకసారి చాణిక్యుడు వెళ్తారు ఎందుకు అంటే భారతదేశం మీదకి అలెగ్జాండర్ దండయాత్రకు వస్తున్నాడు
(01:27) జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి ఆ స్థానానికి వెళ్తారు. ఈ ధననందుడు ఈ చాణక్యుడిని చూసి అవమానిస్తాడు అన్నమాట. ఎందుకంటే చాణిక్యుడు కాస్త నల్లగా ఉంటాడు రూపం అంతగా బాగుండదు. రూపం బాగుండనంత మాత్రాన మనం ఇంకొకరిని దూషణ చేయకూడదు కదా అందులోనూ వ్యక్తిగత దూషణ చేస్తాడు అన్నమాట ఈ ధననందుడు. సరే అంతటితో ఆగిపోకుండా అక్కడ సైనికులతో చెప్తాడు ఇతనిని జుట్టు పట్టుకొని బయటికి గెంటేయండి అంటాడు ఎందుకంటే ఈ ధననందుడి సభలో ఉన్న మిగతా వాళ్ళందరూ ధననందుడు కోసం తానా అంటే తన్నానా అనేవారు కానీ చాణక్యుడు అలా కాదు ధర్మం కోసం నిలబడ్డాడు చాణక్యుడు ధననందుడు
(02:06) మాట వినేవారు కాదన్నమాట ఆ కోపంతోటే ఈ చాణక్యుడిని అవమానిస్తాడు. ఈ సైనికులేమో చాణిక్యుడిని బయటకి గెంటేసేటప్పుడు శిఖ ఊడిపోతుంది. అప్పుడు బయట నిలబడి చాణిక్యుడు ఒక శపదం చేస్తాడు అంత నిండు సభలో అంత అంతమంది ముందు అవమానించకూడదు కదా వ్యక్తిగత దూషణం చేయకూడదు కదా అంత నోరు ఎందుకు ఎప్పుడైనా సరే వ్యక్తిగత దోషం చేస్తూ అవతల వాళ్ళని తక్కువ అంచనా వేసి మనం నోటికి వచ్చినట్టు మాట్లాడామని అనుకోండి వాళ్ళ పతనం ఎలా ఉంటుందో తెలుసా ధననందుడిలాగా ఉంటుందన్నమాట సరే ఆ శిఖ ఊడిపోతుంది కదా చాణక్యుడు ఆ సభ వైపు చూస్తూ అంటాడన్నమాట నందా ఏ అహంకారం చూసుకొని నన్ను నువ్వు అవమానించావో
(02:50) అదే సామ్రాజ్యం నుంచి నిన్ను ఓడించి ఆ సింహాసనం మీద ధర్మాన్ని కాపాడే ఒక వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెడతాను ఇది నా శపధం అప్పటివరకు ఈ ఊడిన శిఖని ముడివేయను అని చెప్పి శపధం చేసి వెళ్ళిపోతారు. శపథం అయితే చేసేసారు కానీ చాణక్యుడి దగ్గర ఏమైనా సైనిక శక్తి ఇవన్నీ ఉన్నాయా ఆర్థికంగా ఏమైనా ఉందా ఏమీ లేదు ఒక్క మేధస్సు తప్ప ఆ మేధస్సుని సరిగ్గా వాడాము అని అనుకోండి ఎదుటివాడికి కోలుకోలేని దెబ్బ కొట్టొచ్చు అన్నమాట చాణక్యుడు అదే చేశాడు.
(03:27) సరే చాణక్యుడు దగ్గర మేధస్సు మాత్రమే ఉంది ఆ మేధస్సుని వాడాడు ఈయనేమో పర్వతక రాజు అని హిమాలయ పర్వతాలని పరిపాలించే ఆ రాజు అన్నమాట అక్కడికి వెళ్తారు అన్నమాట చాణకుడు ఇదిగో ఇది పరిస్థితి నువ్వు నాకు సహాయం చేయాలి అని చెప్పి అడిగితే పర్వతక రాజు ఏమంటాడంటే ఆ సూపర్ గా చేస్తాను నీకు కాకపోతే ఎవరికీ చేస్తాను మనఇద్దరం స్నేహితులం సరే అయితే డీల్ మాట్లాడుకుందాం ఏం చేసినా ఒక ఒప్పందం అంటూ ఉండాలి కదా కాబట్టి నువ్వు ఆ రాజ్యం మీదకి దండయాత్రకి నన్ను సహాయం అడిగావు కదా గెలిస్తే నాకు అర్థం బాగ కావాలి అంటాడు సరే చాణికుడు అంటారు సరే అని చెప్పి చెప్తారున్నమాట సరే ఈ పర్వతకరాజేమో ఈ
(04:02) ధననందుడు ఏ సామ్రాజ్యం మీద దండయాత్రకి సహాయానికి వస్తారు వీళ్ళద్దరూ కలిసి ధననందుడిని ఓడిస్తారు ఈ చాణక్యుడేమో చిన్నప్పటినుంచి చంద్రగుప్తుడు అనే ఒక సామాన్య వ్యక్తిని అన్ని విషయాల్లోనూ తేచిదిద్ది ధననందుడిని ఏమో రాజ్యం నుంచి దింపేసిన తర్వాత ఓడించేసిన తర్వాత ఆ సామ్రాజ్యం మీద అధిపతిగా ఈ చంద్రగుప్తుని పట్టాభిషిక్తుని చేస్తారు.
(04:26) ఈలోపు మరి పర్వతకరాజు సహాయానికి వచ్చాడు కదా కుళ్ళ బుద్ధి వచ్చిందన్నమాట అంతే కదా మనం ఏదైనా కావాలి అని అనుకున్నప్పుడు అంతవరకు ఉంటే బాగుంటుంది అత్యాసకి పోయామ అని అనుకోండి ఎలా ఉంటుంది అంటే ఈ పర్వతకరాజు మొత్తం ఈ మగధ సామ్రాజ్యం అంతా కావాలి అని అనుకుంటాడు మగధ సామ్రాజ్యం కావాలి అంటే చంద్రగుప్తుడు ప్రాణాలు తీసేయాలి అందుకని చెప్పి కుట్ర పన్నుతాడు.
(04:48) ఆ కుట్ర చాణక్యుడికి తెలుస్తుందన్నమాట ఏ విధంగా కుట్ర పన్నుతాడు అంటే అసలు ఈ పర్వతకరాజు మగధ సామ్రాజ్యంలో సగభాగం తీసుకోవటం ధననందుడు మంత్రి రాక్షసుడికి అస్సలు ఇష్టం ఉండదు ఈ రాక్షసుడు గురించి మనం తర్వాత తెలుసుకుందాం అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకని ఈ రాక్షసుడు ఏం చేస్తాడు అంటే ఈ పర్వతకరాజుని ప్రాణాలు తీసేయడం కోసం అప్పట్లో సామ్రాజ్యాన్ని కాపాడడం కోసం గూఢచారులు ఎక్కువగా ఉండేవారు అన్నమాట అందులో ఆడవాళ్ళు కూడా ఎక్కువగా ఉండేవారు వాళ్ళు కూడా దేశాన్ని కాపాడడం కోసం ఎంతో సేవ చేసేవారు నిజంగా చెప్పాలి అంటే ప్రాణాలని
(05:24) పణంగా పెట్టేసేవారు వాళ్ళందరూ ఒక ఆయుధాల్లాగా ఉండేవారు అన్నమాట సరే ఈ రాక్షస మంత్రి ఏం చేస్తాడు అంటే ఒక కన్యని ఈ పర్వతక రాజు మీద ప్రయోగించాలిఅని అనుకుంటా ఈ పర్వతక రాజు ఏం చేయాలనుకుంటాడు చంద్రగుప్తుడు ప్రాణాలు తీసేయాలని అనుకుంటాడు అంటే అందరూ దుష్టులందరూ ఒకే చోటకి చేరుతారు అని అంటారు చూసారా అలా ఈ రాక్షస మంత్రి చాలా తెలివైనవాడు కానీ ధననందుడికి మాత్రం లోబడి ఉండేవాడు అన్నమాట ధననందుడు అంటే చాలా ఇష్టం మన దగ్గర ఎంత తెలివి ఉన్నా ఆ తెలివి తేటలని సక్రమంగా వినియోగించకపోతే ఎలా ఉంటుంది అనేది రాక్షస మంత్రి గురించి తర్వాత తెలుసుకుందాం అయితే
(06:01) ఈ ఒకళ్ళు మీద ఒకళ్ళు ఇలా కుట్రలు పన్నుకుంటున్నారు కదా ఈ పర్వతక రాజు ఏమో ఈ చంద్రగుప్తుడు మీద ఈ కన్యను ప్రయోగించాలని అనుకుంటారు. ఈ విషయం చాణక్యుడికి తెలుస్తుంది చాణిక్యుడు ఏం చేస్తారు అంటే రూట్ మార్చేసి ఎవరినైతే ఏ కన్యనైతే ఈ చంద్రగుప్తుడి మీద ప్రయోగించాలి అని అనుకున్నారో అదే కన్యని పర్వతకరాజు మీదకి పంపిస్తాడు అన్నమాట.
(06:24) ఈ పర్వతకరాజు ఏమో ఆ కన్య అందం అది చూసి మొత్తానికి ప్రాణాలు పోగొట్టుకుంటాడు. పోగొట్టుకున్న తర్వాత చాణక్యుడు ఏం చెప్తాడంటే చూసారా పరవక్త రాజు చంద్రగుప్తుడు ప్రాణాలు తీసేయాలని అనుకున్నాడు కానీ అది వికటించింది అని చెప్పి అక్కడ ఒక వ్యూహాన్ని పన్నుతాడు వ్యూహాన్ని పందితే ఈ పరవక్త రాజు యొక్క కొడుకు మలయకేతుడు అన్నమాట ఈ మలయకేతుడికి తెలిసి అతను దూరంగా వెళ్ళిపోతాడు.
(06:49) అంటే మనం ఎవరికైనా అన్యాయం చేయాలి అని అనుకున్నాము అని అనుకోండి అది తిప్పి మనకి కొడుతుంది. ఇక్కడ బయట వ్యక్తి కాబట్టి చాణుక్యుడు ఏం చేశారు మంచి స్ట్రాటజీని ఉపయోగించారు స్ట్రాటజీని ఉపయోగించి ఒక మైండ్ గేమ్ ఆడారు అలా ఆడి చంద్రగుప్తుడిని ఆ సింహాసనం మీద కూర్చునేలాగా ఉండేలాగా చూశారు. కుట్రల పన్నాలని అనుకున్న వాళ్ళు నాశనం అయిపోయారు ఎప్పటికైనా అంతే కుట్ర కొన్నాళ్ళు మాత్రమే దాగి ఉంటుంది ఎప్పటికీ అది కొనసాగదు మనం ఎంత బురద జల్లాలని ప్రయత్నించినా సరే అక్కడ బయట వాళ్ళు కాబట్టి మంచి మైండ్ గేమ్ ఆడారు కానీ చాణక్యుడు జీవితంలో కూడా
(07:31) తన పెంచి పెద్ద చేసిన వాళ్లే చాణక్యుడు జీవితాన్ని అంతం చేయాలని అనుకుంటారన్నమాట ఈ చంద్రగుప్తుడి భార్య గర్భవతి అస్తమాను రాజులు కుటుంబాల్లో లో కుట్రలు అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా ఈ చంద్రగుప్తుడి యొక్క కొడుకు బిందుసారుడు ఈ బిందుసారుడికి కూడా మంత్రి చాణక్యుడే అయితే ఈ చాణక్యుడు బిందుసారుడిని పెంచుతూనే సుబేందు అనే అతనికి అన్ని విద్యలు నేర్పించి అతన్ని కూడా మంత్రిగా చేస్తారు.
(08:02) ఈ సుబేందుకి కుళ్ళు బుద్ధి వస్తుందన్నమాట. ఎందుకంటే చాణక్యుడు అక్కడ ఉన్నంత కాలం తన యొక్క ఆటలుఏమి కొనసాగవు అని చెప్పి చాణక్యున్ని అంతం చేయాలి అని అనుకుంటాడు. పాపం చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన చాణుక్యే అంతం చేయాలి అని అనుకుంటారు. అనుకొని బిందుసారుడు దగ్గరికి వెళ్లి చెప్తాడు అన్నమాట. అసలు ఈ బిందుసారుడు జన్మించడానికి ముందే ఏమవుతుందంటే వీళ్ళ అమ్మగారు ప్రాణాలు కోల్పోతారు ఎందుకంటే ఆవిడ మీద విష ప్రయోగం జరుగుతుంది.
(08:29) ఆవిడ ప్రాణాలు కోల్పోతే చాణిక్యుడు ఏం చేస్తారంటే ఆవిడ పొట్ట కోసి చికిత్స చేసి ఈ బిందుసారుడిని బయటకి తీసుకొస్తారు. ఒక విధంగా బిందుసారుడికి ప్రాణం పోసారన్నమాట. అలా ప్రాణం పోసి పెంచి పెద్ద చేస్తే ఈ సుబేందు అంటాడు ఇదిగో మీ అమ్మ మీద విష ప్రయోగం చేసి నిన్ను మీ అమ్మని చంపేయాలని అనుకున్నాడు చాణక్యుడు అలాంటివాడు అని చెప్పి లేనిపోనివన్నీ చెప్తాడు అన్నమాట లేనిపోనివన్నీ చెప్తే బిందుసరుడేమో చాణక్యుడిని అవమానిస్తాడు అతన్ని అపార్థం చేసుకుంటాడు.
(08:59) పెంచి పెద్ద చేసిన తన మనవడి లాంటి బిందుసరుడు తనని దూరం చేస్తున్నాడు అవమానిస్తున్నాడు అనుమానిస్తున్నాడు అని తెలుసుకొని ఈ చాణిక్యుడు దూరమైపోవాలి తనే దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకుంటారు అన్నమాట రాజ్యం వదిలిపెట్టేసి అడవిలోకి వెళ్ళిపోతారు అక్కడ ఆయన ఉపవాస దీక్ష చేసి ప్రాణాలు వదిలేయాలని అనుకుంటారు. ఈ సుబేందు ఆహా నేను వేసిన పన్నాగం చాలా బాగా అదేంటి వర్కవుట్ అయింది కాబట్టి ఇంకా రాజ్యం నాదే అని చెప్పి అక్కడ చక్రం తిప్పాలి అని అనుకుంటాడు కానీ ఎప్పటికైనా సరే చాణక్యుడు బ్రతికి ఉంటే తనకి కష్టం కలుగుతుంది తనకి నష్టం కలుగుతుంది బిందుసరుడు నిజం తెలుసుకునేటట్లు అవుతుంది
(09:35) కాబట్టి చాణక్యున్ని అంతం వందించేయాలని అనుకుంటాడు. ఒకరోజు చాణక్యుడేమో తన పర్ణశాలలో ఆయన ధ్యానం చేసుకుంటూ ఉండగా పర్ణశాలకి నిప్పు పెట్టేస్తారు. నిప్పు పెట్టేస్తే అప్పుడు చాణక్యుడు అరవలేదు గెంత లేదు ఏమి అనలేదు ఆ మంటల్లో అలా నవ్వుతూ కాలిపోతారు అన్నమాట. పసువేందకి అనుమానం వస్తుంది అదేంటి అతను బయటికి వచ్చే ఆస్కారం ఉన్న బయటికి రాకుండా ఎందుకు అలా ఉండిపోయాడు అనేది అర్థం కాలేదు.
(10:03) కానీ అంతకుముందే చాణక్యుడు ఏం చేసాడో తెలుసా ఈ సువేందు కుట్రల్ని అన్ని ఆధారాలతో ఈ బిందుసరుడికి తెలిసేలాగా చేశారు. బిందుసరుడికి తెలిసింది అన్ని విషయాలు అప్పుడు బాధపడతాడు బాధపడి ప్రయోజనం ఏముంది తనని కంటికి రెప్పల పెంచి పెద్ద చేసిన చాణుక్యుడి ప్రాణాలు పోయాయి అని చెప్పి బిందుసారుడు బాధపడుతూ ఈ సువేందుకేమో శిక్షని విధిస్తాడు.
(10:28) అంటే అందరి జీవితాల్లో జరిగినట్లే చాణక్యుడికి కూడా జరిగింది చాణక్యుడు కూడా తను పెంచిన వాళ్లే అనుమానిస్తే అవమానిస్తే దాన్ని భరించలేకపోయాడు. ఈ రెండు సంఘటనలు కూడా చాణక్యుడు అరిచేసి గోల పెట్టేసి తనఏంటో తాను నిరూపించాలి అని అనుకోలేదు మొదటి సంఘటనలో చక్కగా బుద్ధి చెప్పేసాడు కానీ రెండో సిచువేషన్ లో బిందుసరుడు తను పెంచి పెద్ద చేశాడు.
(10:52) ఈ సుబేందు కూడా తను పెంచి పెద్ద చేశాడు. సరే సుబేందని పక్కన పెడితే బిందుసారుని తనే ప్రాణం పోసి సింహాసనం మీద కూర్చోపెట్టాడు కదా తాత అని పిలిచేవాడు బిందుసారుడు చాణుక్యన్ని అయితే అలాంటి మనవడు తన మీద అనుమానం పెడితే అప్పుడు కూడా తనని తాను నిరూపించుకోవాలని ప్రయత్నించలేదు ఎందుకంటే ఎలా అలాంటి సమయాల్లో ఇంట్లో వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే బయట వాళ్ళతో అయితే సంబంధం మనం తెంపేసుకుంటాం కానీ ఇంట్లో వాళ్ళతో అలా రిలేషన్స్ కనుక కొంచెం బ్రేక్ అవుతున్నాయి అనుకున్నాం అనుకోండి అప్పుడు అవతల వాళ్ళు మన మీద నింద వేశరు అని అనుకోండి మనం సమాధానం చెప్పినా వాళ్ళు
(11:29) వినరు వాళ్ళు అర్థం చేసుకోరు ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు మన మీద ఒక అనుమానం ఉండిపోయింది కాబట్టి అస్తమాను వాళ్ళు మనల్ని నిందిస్తూనే ఉంటారు అయితే ఇక్కడ చాణక్యుడి లాగా బయటికి వచ్చేసి ప్రాణాలు తీసుకోమని నేనేం చెప్పను కానీ సమయం వచ్చేవరకు మౌనంగా ఉంటే ఇంట్లో వాళ్ళతో ఆ బంధం ఎప్పటికైనా నిలబడుతుంది. మనం సమాధానం చెప్పక్కర్లే మౌనంగా ఉండాలంతే ఇంట్లో వాళ్ళతో మాత్రమే ఇంకా భరించలేక మన ఆత్మవిశ్వాసాన్ని మన వ్యక్తిత్వాన్ని దూషణ చేస్తూ మాట్లాడితే అప్పటికప్పుడు మౌనంగా ఉండండి ఇంట్లో వాళ్ళతో కానీ ఆ తర్వాత వాళ్ళకి అర్థమయ్యేలా అసలు తప్పఏంటి ఏం
(12:08) జరిగింది అని సామరస్యంగా వివరించే ప్రయత్నం చేయండి. ఎదుటివాడు ఇంట్లో వాళ్ళు మనల్ని తిడుతుంటే అప్పుడు సమాధానం మాత్రం దయచేసి చెప్పొద్దు అలా చెప్తే బంధం బ్రేక్ అయిపోతుంది. అలా అని మనల్ని వ్యక్తిగతంగా దూషం చేస్తే మనం మాట్లాడలేదు అని అనుకోండి అది నిజం అనుకుంటాను అది అలాగే ఉండిపోతుంది. మనం అన్ని ఆధారాలతో మనం ఏంటో నిరూపించుకునే వరకు మనం ఇంట్లో వాళ్ళతో ఏమాత్రమూ గొడవ పడకుండా మనం ఏంటో నిరూపించుకుంటే కచ్చితంగా ఎదుట వాళ్ళు అర్థం చేసుకుంటారు.
(12:41) దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బయట వాడు మనల్ని నిందించిన మనతో వాదన చేసిన మనల్ని మోసం చేయాలని ప్రయత్నించిన వాడికి మనం సమాధానం చెప్పవలసిన అవసరం లేదు మన మీద బయట వాడు వ్యక్తిగతంగా దోషం చేస్తున్నాడు అని అనుకోండి ఒక సమాధానం చెప్పాలి అదేంటంటే నువ్వు అనుకుంటున్నట్లు నేనేం చేత కాని వాడిని కాదు నేనేంటో నిరూపిస్తాను అని కచ్చితంగా ఒక సమాధానం చెప్పియాలి బయట వాడు మన మీద బురద చలువుతున్నాడు అని అనుకోండి వాడిని ఏమి మనం ఎదిరించక్కర్ల అలాంటి వాడి కోసం మన సమయాన్ని వృధా చేసుకుని వాడి స్థితికి మనం దిగజారక్కర్ల కానీ మనం ఏంటో మనం ఎదిగిన
(13:22) రోజున మనం బాగా ఒక స్థితికి వచ్చిన రోజున అదే వాడి ఓటమి అయిపోతుంది అప్పుడు వాడి మాటలు కూడా మనం ఉండే ఆ స్థాయికి ఆ స్థానానికి చేరుకోలేవు మనం ఇక్కడ ఉన్నామ అనుకోండి వీడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అనుకోండి కొండ పైన ఉన్నవాడికి కొండ కింద ఉన్నవాడు ఏం మాట్లాడు మాట్లాడుతున్నాడు వినిపించలేదు కదా అందుకే శిఖరం మీద నువ్వు ఉండాలి నిన్ను నిందించినవాడు నిన్ను ఏడిపించినవాడు శిఖరం కింద ఉండాలి.
(13:50) కాబట్టి ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ ఎలా ఉండాలో ఎక్కడ వాదించాలో ఎక్కడ తగ్గి ఉండాలో తెలుసుకుంటే మన బంధాలు నిలబడతాయి. బయటవాడు ఎన్ని వాక్కు ఉన్నా డోంట్ కేర్ మాస్టర్ లా వదిలేయండి. అప్పుడు చాణక్యుడి లాగా చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతారు. చాణక్యుడు జీవితంలోనే ఎంతో మంది ద్రోహులు ఉన్నారు. ఎన్నో ద్రోహాలని ఆయన తట్టుకొని చివరి స్థితిలో ఆయన మనసు వికలం అయిపోయింది.
(14:19) అది కూడా చేతకానితనం లాగా ఆయన ఏమి మరణించలే. మరణించే ముందు కూడా నిజాన్ని అక్కడ చెప్పే నిజాన్ని నిరూపించే ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆయనేమి ఆత్మహత్య చేసుకోలా. కానీ వాడు మోసం చేసి చాణిక్యుడి ప్రాణాలు తీశాడు. కాబట్టి తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళ చెయ్యి నరకాల్సిన అవసరం లేదు అది ఆ చేతిని భగవంతుడే తీసేస్తాడు

No comments:

Post a Comment