నీకు తెలియకుండానే నీ మైండ్‌తో ఆడుకుంటున్నారు! | 7 Signs Someone is Secretly Using You | Psychology
Author Name:Bujji Creations
Youtube Channel Url:https://www.youtube.com/@bujjicreations1999
Youtube Video URL:https://www.youtube.com/watch?v=g0esBCvhA_4
Transcript:
(00:00) మనం అనుకుంటాం మనల్ని వాడుకునే వాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటారని కానీ అసలు నిజం ఏంటంటే మీ పక్కనే కూర్చొని మీతో నవ్వుతూ మాట్లాడే మీ క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు రిలేటివ్ కావచ్చు లేదా మీ పార్ట్నర్ కూడా కావచ్చు. వాళ్ళు పైకి చాలా మంచి వాళ్ళలా నటిస్తూనే మీకు తెలియకుండానే మిమ్మల్ని మానసికంగా వాళ్ళ కంట్రోల్ లోకి తెచ్చుకుంటారు.
(00:32) సైకాలజీ పరంగా మీ మైండ్ తో ఆడుకుంటూ వాళ్ళు మిమ్మల్ని ఎలా వాడుకుంటారో చెప్పే ఏడు పక్కా సంకేతాలే ఇవి. ఇది వింటుంటే ప్రతి పాయింట్ మీ లైఫ్ లో ఎక్కడో అక్కడ జరిగినట్టే అనిపిస్తుంది. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మీకే తెలుస్తుంది. నెంబర్ వన్ వాళ్ళు మీలో ఎప్పుడూ ఒక రకమైన గిల్ట్ క్రియేట్ చేస్తారు. వాళ్ళకు ఏదైనా హెల్ప్ చేయకపోతే నేరుగా కోప్పడరు.
(01:03) పర్లేదులే నా రాత ఇంతే నేనే చూసుకుంటా అని సెంటిమెంట్ డైలాగులు కొడతారు. దాంతో మీకేమనిపిస్తుంది అయ్యో నేను చాలా తప్పు చేశాను వాళ్ళను బాధ పెట్టాను అనిపించి మీ పనులన్నీ పక్కన పెట్టి మరి వాళ్ళ పని చేసి పెడతారు. మీ మంచి మనసును వాళ్ళకు అనుకూలంగా వాడుకునే సైకలాజికల్ ట్రిక్కే ఇది. నెంబర్ టూ అతిగా పొగడటం నీ అంత మంచోళ్ళు ఈ ప్రపంచంలోనే లేరు ఈ పని నువ్వు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అంటూ మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తారు.
(01:46) ఆ పొగడతలు వినడానికి చాలా బాగుంటాయి. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ మాటల వెనక వాళ్ళ పనులను మీ నెత్తిన రుద్దే ప్లాన్ ఉంటుంది. మీరు ఆ మంచోడు అనే ఇమేజ్ ని కాపాడుకోవడం కోసం ఇష్టం లేకపోయినా వాళ్ళు చెప్పినవన్నీ చేసుకుంటూ వెళ్తారు. నెంబర్ త్రీ గ్యాస్ లైటింగ్ ఇది చాలా డేంజరస్ సైకలాజికల్ గేమ్ ఒకప్పుడు వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టిన విషయం గురించి మీరు గొంతు విప్పితే నేను అలా అనలేదు నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నావు నీకు అన్నీ అనుమానాలే అని రివర్స్ బ్లేమ్ చేస్తారు. ఎంతలా అంటే చివరికి నీ మెమరీని
(02:35) మీ ఆలోచనలనే మీరు అనుమానించేలా చేస్తారు. తప్పు వాళ్ళు చేసి మీరు సారీ చెప్పేలా మార్చేస్తారు. నెంబర్ ఫోర్ వాళ్ళకు మూడు భాగాలైనప్పుడు వాళ్ళ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చి గంటలు గంటలు ఏడుస్తారు. మీరు కూడా ఎంతో కేర్ తీసుకుంటారు. కానీ సేమ్ సిచువేషన్ మీకొక మెంటల్ టెన్షన్ వచ్చి వాళ్ళతో షేర్ చేసుకుంటే చాలా లైట్ గా తీసుకుంటారు.
(03:11) ఓ ఇదా దీనికే అంత ఫీల్ అయిపోతావా లైట్ తీసుకో అని చాలా ఈజీగా అనేస్తారు. మీ ఎమోషన్స్ కి వాళ్ళ దగ్గర వాల్యూ ఉండదు. కానీ వాళ్ళ ఎమోషన్స్ మాత్రం మీరు మొయ్యాలి. నెంబర్ ఫైవ్ సైలెంట్ ట్రీట్మెంట్ వాళ్ళకు నచ్చని పని మీరు ఏదైనా చేస్తే కోప్పడరు గొడవపడరు. సింపుల్ గా మీతో మాట్లాడడం బంద్ చేస్తారు. మొహం మార్చుకొని తిరుగుతారు. ఈ సైలెన్స్ మిమ్మల్ని చాలా బాధ పెడుతుంది.
(03:46) నేనేం తప్పు చేశానో అని మీ అంతట మీరే వెళ్లి వాళ్ళను బ్రతిమలాడే వరకు వాళ్ళు నార్మల్ అవ్వరు. మిమ్మల్ని మానసికంగా లొంగతీసుకోవడానికి వాడే సైలెంట్ వెపన్ ఇది నెంబర్ సిక్స్ మీకున్న ఒక మంచి క్వాలిటీని వాళ్ళకు అనుకూలంగా వాడుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరినైనా త్వరగా క్షమిస్తారు. వాళ్ళు కావాలనే తప్పులు చేస్తూ నువ్వు చాలా గ్రేట్ కదా నన్ను క్షమిస్తావులే అని ఈజీగా ఎస్కేప్ అవుతారు.
(04:21) మీరు ఎవరికైనా నో చెప్పలేరన్న విషయం వాళ్ళకు బాగా తెలుసు అందుకే మీ అమాయకత్వాన్ని చేతకానితనంగా మార్చి వాడుకుంటారు. ఇక చివరిది నెంబర్ సెవెన్ వాళ్ళ ప్రేమ ఎప్పుడూ స్థిరంగా ఉండదు. వాళ్ళు చెప్పినట్టు మీరు విన్నంత కాలం మీ అంత గొప్పవాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు. మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు. కానీ ఒక్కసారి వాళ్ళ మాటకు ఎదురు చెప్పినా లేదా మీ సొంత నిర్ణయాలు తీసుకున్నా వెంటనే వాళ్ళ ప్రేమంతా మాయమైపోతుంది.
(05:03) అంటే వాళ్ళు మిమ్మల్ని కాదు ప్రేమిస్తుంది. మీ వల్ల వాళ్ళకు జరిగే ఉపయోగాలను మాత్రమే ఫిజికల్ గా వాడుకునే వాళ్ళ కంటే ఇలా మానసికంగా మీ మైండ్ తో ఆడుకునే వాళ్ళతోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడు సంకేతాల్లో మీ పక్కన ఉన్న వాళ్ళలో ఏవైనా కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి. బంధాల పేరుతో మీ మనశశాంతిని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టకండి.
(05:37) మీ లైఫ్ మీ మైండ్ కంట్రోల్ మీ చేతుల్లోనే ఉండాలి. ఇలాంటి మైండ్ గేమ్స్ ఆడేవాళ్ళకు రివర్స్ షాక్ ఇచ్చి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలుసా అసలు వీళ్ళకి బుద్ధి చెప్పే ఆ పవర్ఫుల్ సైకలాజికల్ సీక్రెట్స్ ఏంటో రేపటి వీడియోలో అస్సలు మిస్ కాకండి. ఈ సైకలాజికల్ నిజాలు మీకు కనెక్ట్ అయితే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ క్లోజ్ సర్కిల్ కి షేర్ చేయండి.
(06:06) మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో నాతో షేర్ చేసుకోండి. మరెన్నో ఇలాంటి లైఫ్ చేంజింగ్ వీడియోస్ కోసం బుజ్జి క్రియేషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.
No comments:
Post a Comment