Tuesday, May 26, 2026

 265f6;```వందేమాతరం!
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀. సావడి కబుర్లు- 17```


       *ఏది ఎక్కడుంది కులం?*
                  ➖➖➖✍️```
(శ్రీకస్తూరి రాకా సుధాకర్ గారి ప్రేరణతో)

భారతీయ సంస్కృతి అనేది కేవలం పూజలు, పండుగలు, ఆలయాలు, ఆచారాలు మాత్రమే కాదు. అది మనిషిని మనిషితో కట్టిపడేసే జీవన తత్వం. “నేను” అనే భావాన్ని “మనము”గా మార్చే గొప్ప సామాజిక వ్యవస్థ. ప్రపంచంలో ఎన్నో నాగరికతలు అధికారంతో నిలిచాయి, సంపదతో వెలిగాయి, యుద్ధాలతో విస్తరించాయి. కానీ భారతీయ సనాతన జీవన విధానం మాత్రం “పరస్పర ఆధారిత జీవనం” అనే అద్భుతమైన విలువపై నిలిచింది.

ఈ పుణ్యభూమిపై ఒక మనిషి జన్మిస్తే, అతని పుట్టుక ఒక్క కుటుంబానికి సంబంధించినది కాదు, మొత్తం సమాజానికి సంబంధించిన పండుగ. ఒకరి ఇంట్లో శుభం జరిగితే పల్లె అంతా ఆనందించేది. ఒకరి ఇంట్లో దుఃఖం వచ్చినా ఊరు మొత్తం తోడుగా నిలబడేది. ఇదే సనాతన భారతీయ జీవన విధానం.

ఈ సమాజంలో ఎవ్వరూ అంటరానివారు కాదు. ఎవరి పనీ చిన్నది కాదు. ప్రతి వృత్తి సమాజ శరీరంలోని ఒక అవయవంలాంటిది. 

*కుండ చేసేవాడు లేకుంటే గృహజీవితం గడవదు. *వ్యవసాయానికి పనిముట్లు తయారు చేసేవాడు లేకుంటే పంట పండదు. *వస్త్రం నేసేవాడు లేకుంటే నాగరికతకు రూపమే ఉండదు. 
*పూజలు చేసే బ్రాహ్మణుడు ధర్మాన్ని నిలబెడితే, 
*నేలను దున్నే రైతు జీవనాన్ని నిలబెట్టాడు. 
*కంసాలి చేతి చాతుర్యం లేకుంటే ఆలయంలో ఘంటలు మోగవు. *మేదరి లేకుంటే పంట కోత జరగదు. 
*చాకలి లేకుంటే శుచిత్వం నిలబడదు. 
*మంగలి లేకుంటే శుభకార్యాలు పూర్తికావు.

*ఇది ఎవరు పైవారు? ఎవరు కిందివారు?, అనే సమాజం కాదు. *ఎవరి సేవ సమాజానికి అవసరం? అనే భావనతో నడిచిన సమాజం.

*ఒక శిశువు జన్మించిన క్షణం నుంచే ఈ సమన్వయం కనిపించేది. 
*ప్రసవ సమయంలో మాయ(ఉమ్మనీరు)కు అవసరమైన కుండను కుమ్మరి తయారు చేసేవాడు. *బొడ్డు కోసే వెదురు పనిముట్ల కోసం మేదరి అవసరం. 
*శిశువుకి కొత్త వస్త్రం కోసం నేతవాడు, శుభాశుభ క్రియల కోసం పండితులు. ఇలా ఒక పసిబిడ్డ ఈ భూమిపైకి రావడం అనేది మొత్తం సమాజం చేతుల మీదుగా జరిగే పవిత్ర ప్రక్రియగా ఉండేది.

*అలాగే ఒక మనిషి చివరి ప్రయాణం కూడా సమాజ సమిష్టి బాధ్యతగానే భావించబడేది. 
*అంతిమయాత్రలో గ్రామంలోని ప్రతి వృత్తి వారికి పాత్ర ఉండేది. అక్కడ కులద్వేషం కాదు, మనవాడు వెళ్లిపోయాడు  అనే మానవీయ భావన ఉండేది.

*ఇదే సనాతన భారతీయ సమాజపు అసలు స్వరూపం.

*మన సమాజంలో జాతరలు ఎందుకు అంత ప్రాధాన్యం సంపాదించాయో ఆలోచిస్తే కూడా ఈ సత్యం స్పష్టమవుతుంది. 
*జాతర అనేది కేవలం ఉత్సవం కాదు. అది సమాజ ఐక్యతకు నిలువెత్తు రూపం. అమ్మవారి గుడి ముందు ధనికుడు, పేదవాడు, రైతు, కూలీ, వృద్ధుడు, బాలుడు అందరూ ఒకే నేలపై నిలబడి ప్రార్ధన చేస్తారు. డప్పుల శబ్దంలో ఎవరి కులం వినిపించేది కాదు, భక్తి మాత్రమే వినిపించేది. హారతుల వెలుగులో ఎవరి స్థాయి కనిపించేది కాదు. భగవద్భావం మాత్రమే కనిపించేది.

*పల్లె వీధుల్లో తిరిగే హరికథలు, బుర్రకథలు,...ఇవి  కేవలం వినోదం కాదు. అవి సమాజాన్ని కలిపి ఉంచిన ఆత్మస్వరాలు. పండుగ రోజు ఊరు మొత్తం ఒకే ఇంటిలా మారిపోవడం యాదృచ్ఛికం కాదు, అది భారతీయ సంస్కృతికి ప్రాణం.

_*అయితే ప్రశ్న ఒక్కటే. ఇంత సమన్వయంతో ఉన్న సమాజంలో ఈ విభేదాలు ఎక్కడి నుండి వచ్చాయి?

*కాలక్రమేణా విదేశీ దాడులు, అధికార రాజకీయాలు, మత మార్పిడి వ్యూహాలు, సామాజిక అసూయలు, స్వార్థ ప్రయోజనాలు కలిసి భారతీయ సమాజాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు ప్రారంభించాయి. వృత్తి ఆధారిత సామాజిక నిర్మాణాన్ని *శాశ్వత కుల బంధనం* గా చిత్రీకరించారు. పరస్పర గౌరవాన్ని అణచివేతగా చూపించారు. ఒకరిపై ఒకరికి అనుమానాలు పెంచారు. చిన్న చిన్న భేదాలను పెంచి శత్రుత్వాలుగా మార్చారు.

అసలు సనాతన ధర్మం చెప్పింది *సమాజ సమతుల్యత, కానీ దాన్ని *సామాజిక అసమానత గా చూపించే ప్రయత్నాలు జరిగాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి.

ఒకప్పుడు ఒకరి ఇంటి శుభకార్యానికి పరుగెత్తి వెళ్లినవాళ్లు, నేడు వారి పేర్లు, వర్గాలు, రాజకీయాలు చూసుకుని మాట్లాడే స్థితికి రావడం ఎంతో దురదృష్టకరం.

*ఈ విచ్ఛిన్నం ఒక్కరోజులో రాలేదు. మన చరిత్రను మనకే అపార్థం చేయించడం ద్వారా వచ్చింది. మన వృత్తులను అవమానంగా చూపించడం ద్వారా వచ్చింది. మన సంస్కృతిని వెనుకబాటుతనంగా చిత్రీకరించడం ద్వారా వచ్చింది.

*కానీ ఇంకా ఆలస్యం కాలేదు.

*సనాతన హిందూ సమాజం తిరిగి సంఘటితంగా నిలబడాలంటే మొదట మనలో మనమే మారాలి. పిల్లలకు కుల గర్వం కాదు కర్మ గౌరవం నేర్పాలి. వృత్తిని తక్కువగా చూడకూడదని చెప్పాలి. ప్రతి దేవాలయం సమాజ ఐక్యతకు కేంద్రంగా మారాలి. జాతరలు, పండుగలు, వేదపారాయణాలు, భజనలు, అన్నదానాలు ఇవన్నీ మళ్ళీ సమాజాన్ని కలిపే వేదికలుగా మారాలి.

*సామాజిక మాధ్యమాల్లో ద్వేషం పంచేవారి మాటలకు లోనుకాకుండా, చరిత్రను చదవాలి. గ్రామీణ భారతీయ జీవన నిర్మాణాన్ని అర్థం చేసుకోవాలి. మన పూర్వీకులు ఎందుకు ప్రతి వృత్తిని పవిత్రంగా భావించారో తెలుసుకోవాలి.

*ఒక రైతు లేకుంటే ఆకలికి మందు లేదు.
*ఒక కార్మికుడు లేకుంటే పనిముట్లు లేవు.
*ఒక నేతవాడు లేకుంటే వస్త్రం లేదు.
*ఒక గురువు లేకుంటే జ్ఞానం లేదు.
*ఒక పూజారి లేకుంటే ఆధ్యాత్మికత నిలబడదు.
#అందుకే, హిందూ సమాజంలో అందరూ అవసరమే.
అందరూ సమాజ శరీరంలోని అవయవాలే.

అసలైన హిందూ సమాజం “ఎవరు గొప్ప?” అని కాదు, “ఎవరు సమాజానికి ఉపయోగపడుతున్నారు?” అని చూసింది.

*కాబట్టి సనాతన ధర్మాన్ని కాపాడటం అంటే కేవలం ఆలయాలను దర్శించుకోవడం, వాటిని కాపాడటం కాదు, మన మధ్య బంధాలకు కాపాడటం. పరస్పర గౌరవాన్ని కాపాడటం. మన సంస్కృతి యొక్క సమన్వయ ఆత్మను కాపాడటం.

*మనము మళ్ళీ ఒకటిగా నిలబడాలి.
విభేదాల కన్నా విలువలను పెద్దవిగా చూడాలి. కులాల పేర్లతో విడిపోకుండా, సంస్కృతి పేరుతో కలవాలి.

*ఎందుకంటే, 
ఈ నేల మన అందరిదీ.
ఈ ధర్మం మన అందరినీ కలిపేదే.
సనాతన హిందూ సమాజం యొక్క అసలైన స్వరూపంలో కుల కల్మషాలకు స్థానం లేదు. అక్కడ ఉన్నది పరస్పర గౌరవం మాత్రమే, సహజ సహకారం మాత్రమే. “వసుధైవ కుటుంబకం” అనే మహోన్నత భావమే.

*ఆ రోజు కోసం ఈరోజు నుంచి కృషి చేద్దామని సంకల్పించి ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేద్దాం.✍️```
*గడప లోపల కులం*-                                               
                *దాటితే ధర్మం*
        జై హింద్ - జై భారత్

మృశి
(దశిక ప్రభాకరశాస్త్రి)
9849795167.
.      *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                    🌷🙏🌷```
 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.
      🌹🌹🙏```

No comments:

Post a Comment