Tuesday, May 26, 2026

జ్ఞాని యొక్క స్థితి ఎలా ఉంటుంది.?#devotional #spirituality #education #bhakti #ఇండియా #reels

జ్ఞాని యొక్క స్థితి ఎలా ఉంటుంది.?#devotional #spirituality #education #bhakti #ఇండియా #reels

Author Name:ajju-baipalli

Youtube Channel Url:https://www.youtube.com/@ajju-baipalli

Youtube Video URL:https://www.youtube.com/watch?v=QwCsNFdqbTk



Transcript:
(00:01) ఒకరోజు రమణాశ్రమంలో భగవాన్ రమణులు కూర్చొని ఉండగా ఒక వ్యక్తి రమణుల దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడుగుతాడు భగవాన్ జ్ఞాని అనేవాడు ఎలా ఉంటాడు జ్ఞాని యొక్క స్థితి ఎలా ఉంటుంది జ్ఞాని యొక్క దృష్టికోణం ఎలా ఉంటుంది సమాజం పట్ల జ్ఞాని యొక్క చేష్టలు ఎలా ఉంటాయి అని ఒక ప్రశ్న అడుగుతాడు సో దానికి రమణ మహర్షి కూర్చొని ఒక సమాధానం చెప్తాడు ఒక చిన్న పిట్ట కథ చెప్తాడు ఒక కథ సో ఆ కథ ఏంటి అనేది ఈరోజు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం.
(00:37) సో రమణలు ఏం చెప్తారంటే అనగనగా ఒక ఊరు ఉంది ఆ ఊరికి పైన ఒక కొండ ఉంది అంటే ఊరు ఇలా ఉంది అంటే కొండ ఇలా ఉంది. సో కొండ పైన ఒక ఆశ్రమం అనేది ఉంది అంటే ఒక ఇల్లే ఎవరైనా వచ్చి అందులో విడిదిగా ఉండొచ్చు. బయట ఊరు నుంచి ఎవరైనా వస్తే ఆ పైన కొండ పైన ఉన్న ఇంట్లో విడిది చేయొచ్చు ఉండొచ్చు కొన్ని రోజులు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు. కింద భోజనానికి ఆ ఊర్లోకి రావచ్చు ఎవరి ఇంట్లో అయినా తినొచ్చు అంత మంచి ఊరు అన్నమాట [గురకలు] సో ఒకరోజు ఆ ఊరికి కొత్త వ్యక్తి బయట నుండి ఒక వ్యక్తి వస్తాడు.
(01:10) వస్తాడు కచ్చితంగా ఆ ఊర్లో ఉన్న ప్రజలందరినీ ఊరు పెద్ద మనుషులని అడుగుతాడు పర్మిషన్ అడుగుతాడు. ఆ పెద్ద మనుషులారా ఇలా నేను మీ ఊర్లో ఉండొచ్చా కొన్ని రోజులు అని సో ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులందరూ చాలా మంచివాళ్ళు కాబట్టి స్వామి మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు కాకపోతే ఊర్లో ఉండడానికి అవ్వదు ఏ ఇంట్లో కూడా ఉండడానికి అవ్వదు పైన విడిదిలు ఒకటి ఉంది చిన్న చిన్న గదులు ఈ ఊర్లో ఉన్న ప్రతి ఇల్లు కూడా చిన్న చిన్న గదులతో నిండి ఉంది సో మీరు అంత ఎడ్జిస్ట్ అవ్వలేరు సో పైన కొండపైన ఒక విడిదిల్లు ఉంది సో మీరు దాంట్లో ఉండొచ్చు భోజనాలు
(01:42) టైం సరికి వస్తాయి. ఓకే నో ప్రాబ్లం ఆ వ్యక్తి ఆ బయట నుండి వచ్చిన వ్యక్తి ఆ స్వామి కాసేపు కాసేపట్లో ఆ కొండెక్కి కొండపైన ఉంటాడు. సో అలా కొన్ని రోజులు అలా గడుపుతూ ఉండగా మాక్సిమం ఆ స్వామి ఎక్కువ మాట్లాడరు ఎప్పుడు మౌనంగానే ఉంటారు. సో తద్వారా ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన మౌనస్వామి మౌనస్వామి అనేవాళ్ళు అంటే ఇప్పుడు మౌనంగా ఉంటాడు.
(02:08) ఏదో రేర్ ఒకటో రెండో మాట్లాడతారు రమణ మహర్షి లాగా [గురకలు] సో బయటూరు నుండి వచ్చిన వాళ్ళు కూడా ఆ ఊరికి వచ్చిన వాళ్ళు ఆ వ్యక్తిని చూసిన వాళ్ళు చాలా గొప్పగా చూడడం మొదలు పెడతారు ఎందుకంటే మాక్సిమం ఎక్కువగా మౌనంగా ఉంటారు కాబట్టి మౌనస్వామి మౌనస్వామి ఆయన్ని ఒక బాబాలా చూడడం మొదలు పెడతారు. సో ఆబవియస్లీ బయటకి ఆ ఊరికి ఈ ఊరికి పాకుతుంది ఈ న్యూస్ సో చాలా మంది జనాలు చూడడానికి వచ్చేవాళ్ళు సో అలా రావడం వల్ల ఆ ఊర్లో ఉన్న ప్రజలకి కాస్త మనసులో చిన్న ఒక అసూయ అనేది ఏర్పడుతుంది అరే నిన్న కాక మొన్న వచ్చాడు మా ఊరికి ఏమి మాట్లాడడు ఏమి చేయడు కానీ ఆయనకి ఇంత పెద్ద ఇంత మంచి పేరు వస్తుంది అని
(02:49) తట్టుకోలేక కొంతమంది ఏం చేస్తారంటే గ్రూప్ గా ఏర్పడి ఒక ఆ ఊర్లో డెలివరీకి రెడీగా ఉన్న ఒక అమ్మాయిని తీసుకొని బయటూరు నుండి వచ్చిన ప్రజలందరూ ఆ స్వామి ముందు ఉండగా ఈ అమ్మాయిని తీసుకొని వెళ్లి ఇదిగో మీరందరూ కూడా ఈ వ్యక్తిని మౌనస్వామి బాబా అని పిలుస్తున్నారు కదా ఈయన మీరు అనుకున్నంత గొప్పోడుఏం కాదు చూడండి ఒక అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశడు ఇంకో రెండు మూడు మూడు రోజుల్లో ఈ అమ్మాయి డెలివరీ కాబోతుంది.
(03:15) ఇలాంటి వాడిని పెట్టుకొని మీరు గొప్పోడు మహానుభావుడు స్వామి అది ఇది అంటున్నారు ఈయన యొక్క అసలు రూపం ఇది అని అంటారు. అందరూ అడుగుతారు ఏంటి స్వామి ఇది నిజమా ఇది నిజమా అని చెప్పి ఆయన ఏమి మాట్లాడరు సైలెంట్ గా ఉంటారు. సో ఉన్న తర్వాత ఆ ఊరి పెద్దలందరూ చూసి నిజంగా ఆయన మాట్లాడట్లేదు కాబట్టి తప్పుని ఒప్పుకున్నట్టే అని వాళ్ళ వాళ్ళు దాన్ని తీసుకొని స్వామి ఏంటి మీరు దీని మీద ఏంటి సమాధానం ఏంటి చెప్పండి ఆ అమ్మాయిని మీరు మోసం చేశారా అంటే ఆయన ఏం మాట్లాడరు.
(03:46) సరే మీరు మోసం చేసినట్టు మేము తీసుకుంటున్నాం కాబట్టి మీరు అంగీకరించినట్టు మేము మేము తీసుకుంటున్నాం కాబట్టి ఆ అమ్మాయికి పుట్టబోయే బిడ్డకి ఇక పైన మీరే తండ్రి మీరే ఆ బిడ్డని మీరే సాకాలి మీరే చూసుకోవాలి. అంటే ఆయన ఏమి మాట్లాడరు అప్పుడు కూడా ఏమి మాట్లాడరు అదేంటయ్యా నేను చేయలేదు అని కూడా అనరు నేను చేశాను చేయలేదు ఏమి అనరు. ఆ అమ్మాయికి ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డని తీసుకొచ్చి ఊరి పెద్ద మనుషులందరూ కూడా ప్రజల సమక్షంలో ఆయన చేతిలో పెడతారు.
(04:09) ఆయన కనీసం కోపం గాని చిరాకు గాని మొఖంలో ఏమీ కనబడదు. బిడ్డని చేతిలో పెడితే ఆ బిడ్డని సొంత తండ్రి కన్న తండ్రి ఎలా పెంచుతారో అంత జాగ్రత్తగా అంత ప్రేమగా పెంచుతాడు. ఒక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఎంతైనా కన్నతల్లి కదండీ తొమ్మిది నెలలు కడుపులో మోస్తుంది చిన్న ప్రేమ అనేది ఒకటి ఉంటుంది. సో ప్రతిరోజు వచ్చి చూస్తూ ఉంటది. గోడ ఇవతల నుండి చూస్తూ ఉంటది.
(04:35) అరేయ్ ఎంత బాగా ఆడిస్తున్నాడురా ఆయన కనలేదే కానీ ఎంత బాగా ఆడిస్తున్నాడు కన్న తండ్రి కూడా ఏ రోజు ఇంత బాగా చూసుకోడు నిజంగా నా మొగుడు కూడా ఇంత బాగా చూసుకోడు కదా బిడ్డని ఇంత బాగా చూసుకుంటున్నాడు ఇలాంటి వాడిని మోసం చేయడం ఏంటి అని ఊరు పెద్ద మనుషుల్ని అక్కడికి వచ్చిన వ్యక్తులందరినీ పిలిపించి ఆయన యొక్క తప్పుఏమి లేదు మా ఊర్లో ఉన్న పెద్ద మనుషులు ఇలా చేయించారు ఇందులో ఆయన తప్పుఏమి లేదు ఆ బిడ్డ నాకు పుట్టిన వాళ్లే ఆయనకి నాకు కాదు నాకు నా భర్తకు పుట్టారు ఆ బిడ్డ సో ఇందులో ఆయన యొక్క తప్పు ఏమీ లేదు అని అందరి ముందు చెప్తే అందరూ వెళ్లి
(05:08) స్వామీజీ దగ్గరికి వెళ్లి మౌన స్వామి దగ్గరికి వెళ్లి ఆవిడ బిడ్డని ఆవిడకి ఇచ్చేయండి మరి ఇన్ని రోజులు మీకు ఇన్ని మాటలు అన్నా కదా మీరు ఎందుకు ఏమి చెప్పలేదుఅంటే అప్పుడు ఏం మాట్లాడదు ఆయన బిడ్డని ఆ తల్లికి ఇచ్చేయండి స్వామి అంటే కనీసం ఇప్పుడు [గొంతు సవరించుకోవడం] అన్ని సంవత్సరాలు పెంచాడు కదండీ ఒక బంధం ఉంటుంది కదా ఇప్పుడు మూడు నాలుగు సంవత్సరాలు పెంచారు ఎంతో ప్రేమగా చూసుకున్నాడు పాలు పెట్టాడు స్నానం చేయించాడు డైపర్లు మార్చాడు అన్నీ చేశాడు కానీ ఏమాత్రం మన్నం లేకుండా తృణ ప్రాయంగా అలా చేతిలో పెట్టేసాడు.
(05:39) ఈ కథ చెప్తాడు రమణ మహర్షి అంటే జ్ఞాని అనేవాడు ఇలా ఉంటాడు అంటాడు అంటే జ్ఞాని యొక్క స్థితి ఎలా ఉంటుందంటే తనలో తాను నిరంతరం రమిస్తూ ఉంటాడు ఎవరైనా సరే అతన్ని పొగిడినా ఆయన స్వీకరిస్తాడు తిట్టినా స్వీకరిస్తాడు. అందరి అందరి పట్ల ఎరు ఎవరైనా నన్ను పొగుడుతున్నారో వాళ్ళని దూరం పెట్టాలి వాళ్ళని దగ్గర పెట్టాలి ఎవరెవరైతే నన్ను తిడుతున్నారో వాళ్ళని దూరం పెట్టాలి అనే భావన ఉండదు డిఫరెన్షియేషన్ ఉండదు.
(06:07) ఏదైనా ఒక వస్తువుని గాని ఒక వ్యక్తిని గాని ఒక ప్రాంతం పట్ల వాళ్ళకి బేద అంటే అటాచ్మెంట్ అనేది ఉండదు. ఇప్పుడు అన్ని సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు పెంచాడండి బిడ్డని కనీసం ఒక బంధం అనేది ఉంటుంది కదా ఎంతో కొంత నేను పెంచాను నా చేతుల్లో నేను పెంచాను అని ఒక బంధం లేకుండా అంత తృణప్రాయంగా ఇచ్చేస్తాడు.
(06:27) అది వ్యక్తినైనా సరే వస్తువునైనా సరే ప్రాంతాన్ని అయినా సరే అలా ఇచ్చేస్తాడు జ్ఞాని అనేవాడు. అంటే ప్రతిదాని పట్ల తృణప్రాయం అనేది ఒకటి ఉంటుంది. ఈజీగా ఇచ్చేస్తారు టేక్ ఇట్ ఈజీ అన్నట్టు సో దేని పట్ల కూడా మమకారం అనేది ఉండదు. సో జ్ఞాని యొక్క దృష్టి అనేది జ్ఞాని యొక్క చేష్టలు అనేవి ఇలా ఉంటాయని రమణ మహర్షి చెప్తాడు. రమణ మహర్షి జీవితం కూడా ఇలాగే ఉంటుంది.
(06:50) ఎవరవచ్చి తిట్టినా ఎవరువచ్చి పొగిడిన ఆయనే స్వీకరించాడు. దొంగలు వచ్చి రమణాసరంలో పడి అన్ని తీసుకెళ్ళిపోతున్నా ఆయన స్వీకరించాడు నాది ఏముంది ఈ భూమి మీద ఈ భూమి మీద నాకు సంబంధించిన వస్తువు అంటూ ఏదైనా ఉంటే కదా వాళ్ళు తీసుకెళ్ళడానికి నేను బాధపడడానికి అసలు నాదంటూ ఒకటి ఉంటేనే కదా పోతుందని బాధపడడానికి అని సో జ్ఞాని యొక్క దృష్టికోణం అలా ఉంటుంది.
(07:10) సో ఇది రమణ మహర్షి చెప్పిన కథ నాకు చాలా చాలా ఇష్టం. సో ఇది అనుభవిస్తే ఈ స్థితిని అనుభవిస్తే ప్రతి ఒక్కరు కూడా రమణ మహర్షి సో మీకు ఎలా అనిపించింది కథ ఈ [గురకలు] ఘట్టం మీకు ఎలాంటో తెలిసిన ఏమైనా స్టోరీస్ ఉంటే ఘట్టాలు ఉంటే మీరు పెట్టొచ్చు చెప్పొచ్చు నో ప్రాబ్లం ఓకేనా అరుణాచల శివ [గురకలు]

No comments:

Post a Comment