Wednesday, May 27, 2026

మోహం ఎలా మన శాంతిని దూరం చేస్తుంది? | How Attachment Steals Inner Peace

మోహం ఎలా మన శాంతిని దూరం చేస్తుంది? | How Attachment Steals Inner Peace

Author Name:Jeevantharyami

Youtube Channel Url:https://www.youtube.com/@WithUG

Youtube Video URL:https://www.youtube.com/watch?v=SmLZOC7e4L4



Transcript:
(00:02) ఓం ఈ మాటలు ఎవరి కోసమో అనిపించవచ్చు. కానీ నిజంగా చెప్పాలంటే ఇవి బయట ఎవరికీ కాదు ఇది మన ప్రతి ఒక్కరి లోపల నిశ్శబ్దంగా జరుగుతున్న యుద్ధం ఇప్పుడు మనం చూడబోయేది మోహం ఎలా జీవితంలో చిన్న చిన్న రూపాలుగా దాగి పని చేస్తుందో అది ఎలా మన మనశశాంతిని మనకే తెలియకుండా దూరం చేస్తుందో మనం పట్టుకున్నదే మన శాంతి అనుకుంటాం కానీ అది మన శ్వాసని బెగపెడుతుంది అనేది ఎప్పుడైనా
(00:49) గమనించామా ఇక్కడే క్షణం ఆగి నిజంగా చూసే ధైర్యం అవసరం. ముందుకు వెళ్దామా మొహం మనసుని ఎలా బంధిస్తుంది దశల వారుగా వివరించుకుందామా మొదటి దశ ఆకర్షణ ఏదో ఒకటి మనసును అట్రాక్షన్ తాకుతుంది. వ్యక్తి కావచ్చు ఆలోచన కావచ్చు భావన కావచ్చు ఇక్కడ తప్పు లేదు అది సహజం మొహం మొదలు కావడం తప్పుతో కాదు ఒక ఆకర్షణతో మొదలవుతుంది. ఇక రెండవ దశలో పునరావృత్త ఆలోచన రిపిటేటివ్ థింకింగ్ ఆ ఆకర్షణ అనేది మనసులోకి మళ్ళీ మళ్ళీ
(01:37) వస్తుంది. ఖాళీగా ఉన్నప్పుడు నిద్రకు ముందు పనిలో ఉన్నప్పుడు ఇక్కడ విత్తనం పడుతుంది. మనసు ఒక్కసారి తాగిన దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది. ఇక మూడవ దశలో ఆశ ఎక్స్పెక్టేషన్ ఇక్కడ ఆకర్షణ ఆశగా మారుతుంది. ఇలా అయితే బాగుండు ఇలా జరగాలి ఇదే కావాలి మనసు భవిష్యత్తులోకి జారుతుంది. ఆకర్షణ ఆశగా మారినప్పుడు మనసు ఇప్పటి క్షణాన్ని వదిలేస్తుంది.
(02:14) ఇక నాలుగవ దశలో ఆధారపాడం అటాచ్మెంట్ ఆశ నెరవేరితే ఆనందం నెరవేరకపోతే బాధ ఆనందం బాధ అనేవి ఇప్పుడు పరిస్థితులపై ఆధారపడతాయి. ఇక్కడే మోహ మొదలవుతుంది. నా శాంతి నా చేతిలో ఉండదు. ఇక ఐదవ దశలో నియంత్రణ కోల్పోవడం లాస్ ఆఫ్ కంట్రోల్ ఇప్పుడు మనసు మన మాట వినదు మన విషయాలను ప్రభావితం చేస్తుంది. స్పందన మార్చేస్తుంది. మనం జీవించడం కాదు మనసునే నడిపిస్తుంది.
(02:54) మనసు సాధనం కాదు యజమానిగా మారిపోతుంది. ఇక ఆరవ దశలో భయం ఏర్పడుతుంది ఫియర్ పోతుందేమో దూరం అవుతుందేమో మారిపోతుందేమో మొహం చివరికి భయాన్ని పుట్టిస్తుంది. మొహం చివరికి భయాన్ని ప్రసాదిస్తుంది. ఇక చివరికి ఏడవ దశలో బాధ మరియు కలవరాన్ని రేపత్తిస్తుంది. సఫరింగ్ ఇదే ఫలితం అంతర్గత అలసట ఏర్పడుతుంది శాంతి లేకపోవడం సాధనలో నిలక లేకపోవడం జరుగుతుంది.
(03:31) సాధకుడికి ఇక్కడే బాధ బయట జీవితం నడుస్తూనే ఉంటుంది లోపల మాత్రం కలవరమే అసలు సాధకుడు అంటే ఏమిటి? మన లోపల కలవరాన్ని గుర్తించిన వ్యక్తి బయట విజయం ఉన్నా లోపల శాంతి లేని స్థితిని ప్రశ్నిస్తున్న మనిషి అతను ఉద్యోగం చేస్తున్న వాడైనా ఉండొచ్చు కుటుంబ బాధ్యతలు ఉన్నవాడైనా ఉండొచ్చు ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉన్నవాడైనా ఉండవచ్చు ఇంకేదో లోటు ఉంది అని అనుభూతి చెందుతున్న వాడైనా ఉండవచ్చు.
(04:07) నేటి సాధకుడు ప్రపంచాన్ని వదిలినవాడు కాదు ప్రపంచంలో ఉంటూనే తన మనసును శుద్ధి చేసుకోవాలనుకునే వ్యక్తి మొహం మనసును బంధించదు మన అవగాహన లేకపోవడమే మనసును బంధిస్తుంది. తదుపరి భాగంలో మోహం యొక్క సూక్ష్మ ప్రభావం ఎటువంటి మానసిక స్థితిలో మరియు ఎలాంటి జీవిత పరిస్థితిలో ఎక్కువగా పనిచేస్తుందో చూద్దాం. స్వస్తి నిజమైన జ్ఞానం తెలుసుకోవాలంటే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.
(04:42) మోహం ఎప్పుడు ఎక్కువగా పనిచేస్తుంది. ఒక సత్యం ఏమిటంటే మోహం బలముగా ఉండే సమయం మనం బలహీనంగా ఉన్న సమయం మాత్రమే పనిచేస్తుంది. మోహం ఎక్కువగా పనిచేసే మానసిక స్థితులు మరియు జీవిత పరిస్థితుల గురించి తెలుసుకుందాం. మొహం ఎక్కువగా పనిచేసే మానసిక స్థితులు ఒకటి ఖాళీతనం ఉన్నప్పుడు ఇన్నర్ ఎక్స్పెక్టేషన్ బయట పనులు ఉన్న లోపల ఖాళీగా అనిపించినప్పుడు మనసు ఏదో ఒకటి పట్టుకోవాలనిపిస్తుంది.
(05:13) ఖాళీ మనసుని మొహాన్ని తెరిచి ఉన్న ద్వారం ఇక రెండవది అలచటంలో ఉన్నప్పుడు ఎక్కువ ఆలోచనలు నిర్ణయాల భారం బాధ్యతల ఒత్తిడి మనసు తేలికైన ఆనందం కోసం పరిగెడుతుంది. అలసిన మనసు తప్పుడు ఆధారాన్ని కోరుకుంటుంది. ఇక మూడవది బాధలో ఉన్నప్పుడు ఎమోషనల్ పెయిన్ నిరాశ ఒంటరితనం గాయపడిన భావాలు మోహం ఇక్కడ ఉగర్పులా కనిపిస్తుంది. బాధలో ఉన్న మనసుకు మోహం మందులా అనిపిస్తుంది.
(05:45) ఇక నాలుగోది భయంతో ఉన్నప్పుడు ఫియర్ స్టేట్ పోతుందేమో కోల్పోతానేమో భవిష్యత్తు అర్థం కాకపోతే మనసు పట్టుకోవడానికి ఏదైనా వెతుకుతుంది భయం ఉన్నచోట మొహం పుట్టడం సులువుగా అవుతుంది. ఇక ఐదోది అహంకారం తాకినప్పుడు ఇగో హట్టు నన్ను అర్థం చేయలేదు నా విలువ తగ్గింది నాకు ఇది కావాలి. మోహము ఇక్కడ నేను అనే రూపంలో వస్తుంది. గాయపడిన అహంకారం మోహానికి బలం ఇస్తుంది.
(06:18) ఇక రెండవ అంశం మోహం ఎక్కువగా పని చేసే జీవిత పరిస్థితుల గురించి తెలుసుకుందాం. ఒకటవది మార్పు దశలో ట్రాన్సాక్షన్ ఫేసెస్ ఉద్యోగ మార్పు సంబంధాల మార్పు జీవన దిశ మారుతున్నప్పుడు మనసుకు భద్రత కావాలి మార్పు దశలో మొహం ఆధారం కనిపిస్తుంది. ఇక రెండవది ఒంటరితనంలో లోన్లీనెస్ చుట్టూ మనసులో ఉన్న లోపల ఒంటరితనం ఒక బావద్రేక అనుబంధాన్ని కావాలనిపిస్తుంది.
(06:48) ఒంటరితనం మోహానికి ఆహ్వానం లాంటిది. ఇక మూడవది సాధన మొదలైనప్పుడు పెళ్లి స్పిరిచువల్ ఫేస్ ఇది చాలా సూక్ష్మం కొంత శాంతి వస్తుంది కొంత అవగాహన పెరుగుతుంది. నేను ముందుకు వెళ్తున్నాను అన్న భావనలో కొంత మోహం పుడుతుంది. సాధనలో కూడా మొహం రూపం మార్చుకొని వస్తుంది. ఇక నాలుగవది విజయం తర్వాత ఆఫ్టర్ సక్సెస్ గుర్తింపు ప్రశంస పేరు మోహం నేను చుట్టూ తిరుగుతుంది.
(07:21) విజయం తర్వాత మొహం గర్వంగా మారుతుంది. ఇక ఐదవది నష్టం తర్వాత ఆఫ్టర్ లాస్ వ్యక్తి స్థానం అర్థం మనసు కోల్పోయిన దాన్ని ఇంకేదైనా నింపాలనుకుంటుంది. నష్టం తర్వాత మొహం భర్తీలా పని చేస్తుంది. ఇక సాధకులకు ప్రత్యేకంగా వెరీ ఇంపార్టెంట్ ఏమంటే సాధకుడికి మొహం తగ్గదు. అది మరింత సూక్ష్మంగా మారుతుంది. రూపం మారుతుంది లోతు పెరుగుతుంది గుర్తించడం కష్టమవుతుంది.
(07:53) మోహం వల్ల వచ్చే నిజమైన ఇబ్బందులు సాధారణంగా సంబంధాల్లో మనుషుల్లో సాధారణలో ఉంటుంది. తర్వాత అంశం ఎవరు ఎక్కువ మోహంలో పడతారు. సాధారణ వ్యక్తియా భావోద్రక వ్యక్తియా ఆధ్యాత్మిక సాధకుడా అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. స్వస్తి ఇక మూడవది ఎవరు ఎక్కువగా మోహంలో పడతారు. నిజం ఏమిటంటే మొహం అజ్ఞానులకు మాత్రమే కాదు అది అవగాహన పెంచుకున్న వారిని పరీక్షిస్తుంది.
(08:24) ఇందులో మొదటిది సాధారణ వ్యక్తి ఆర్డినరీ పర్సన్ గురించి తెలుసుకుందాం. ఎందుకు మొహంలో పడతాడు జీవితం ఫలితాలకు సమానంగా ఉందన్న నమ్మకం ఆనందం బయట దొరుకుతుందన్న భావన సమాజ ప్రయాణాల్లో ప్రభావం మోహం స్థూల రూపంలో ఇక్కడ పనిచేస్తుంది. ఉదాహరణకు డబ్బు సంబంధాలు స్థానం భోగం సాధారణ వ్యక్తి మోహాన్ని జీవితం అనుకుంటాడు.
(08:54) బాధ వచ్చినా ఇలానే ఉంటుందని అనుకుంటాడు. ఇక రెండవది భావోద్రేక వ్యక్తి ది ఎమోషనల్ పర్సన్ ఇక్కడ మోహం లోతుగా పనిచేస్తుంది. లక్షణాలు ఏమంటే ఎక్కువగా అనుభూతి చెందడం త్వరగా అటాచ్మెంట్ చేసుకోవడం వదలలేకపోవడం సంబంధాలు ఇక్కడే కేంద్రం అవుతాయి. మహోద్రేక వ్యక్తి మోహాన్ని ప్రేమగా భావిస్తాడు. సమస్య ఎక్కడ ప్రేమ అనేది ఆధారపడడం తేడా తెలియదు.
(09:25) కరోనా అనేది మోహం గీత కలిసిపోతుంది. బాధ ఎక్కువ కోలుకోవడం కష్టం. ఇక మూడవది ఆధ్యాత్మిక సాధకుడు ది స్పిరిచువల్ సీకర్ ఇది చాలా సూక్ష్మం సాధకుడు మొహం దాటాడు అనుకుంటాడు కానీ ఇక్కడే కొత్త మొహం మొదలవుతుంది. సాధకుల్లో మొహం ఎలా వస్తుంది తన సాధనపై అటాచ్మెంట్ ఉండడం వల్ల తన అవగాహనపై గర్వం ఉండడం వల్ల నేను మారిపోయాను అన్న భావన వల్ల మోహం అహంకారంగా మారుతుంది లేదా సూక్ష్మ ఆశగా మారుతుంది సాధకుడికి మోహం భోగంలా కాదు అవగాహనలో దాగి ఉంటుంది.
(10:04) ఇప్పుడు అనుకున్న మనం మూడు రకాల మోహాలు ఒకే మూలం కలిగి ఉంటాది. రూపాలు వేరైనా మూలం ఒకటే భోగం రూపంలో ఉంటుంది భావోద్రేకుడికి బంధం రూపంలో ఉంటుంది సాధకుడికి గుర్తింపు రూపంలో ఉంటుంది. మూడు చోట్ల మొహం ఒక్కటే కీలకమైన సత్యం మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే మొహం ఎవరి స్థాయిని చూసి రాదు అవగాహన లేని చోట అది తప్పకుండా వస్తుంది.
(10:36) తర్వాత అంశం తెలిసినా ఎందుకు మొహం నుండి బయటపడలేవు అది మానసిక కారణమా ఆధ్యాత్మిక అడ్డంకా వీటి గురించి తెలుసుకుందాం. స్వస్తి ఇక నాలుగవది తెలిసినా ఎందుకు మోహం నుంచి బయట పడలేము తెలుసుకోవడం వేరు విడుదల కావడం వేరు మానసిక కారణం గురించి సైకాలజీ రీజన్ గురించి తెలుసుకుందాం. అందులో ఒకటి అలవాటు శక్తి పవర్ ఆఫ్ హ్యాబిట్ మోహం ఒక ఆలోచన కాదు అది రోజులుగా పెరిగిన అలవాటు అదే ఆలోచన అదే స్పందన అదే ఊహ మనసు సత్యాన్ని కాదు అలవాటని
(11:22) అనుసరిస్తుంది. ఇక రెండవది తాత్కాలిక సుఖం షార్ట్ టర్మ్ రిలీఫ్ మోహం బాధను కొంచెం తగ్గిస్తుంది. ఖాళీతనాన్ని నింపినట్లు అనిపిస్తుంది. మనసు దీన్ని వదలదు. విషమైందని తెలిసిన తాత్కాలిక ఉపశ్రమణం మనసును మోసం చేస్తుంది. ఇక మూడవది గుర్తింపుతో కలిసిపోవడం ఐడెంటిచ్ ఇది లేకుండా నేను ఎవరు అనే ప్రశ్న లోపల దాగి ఉంటుంది.
(11:54) మోహం తన గుర్తింపులో భాగం అవుతుంది. మనసు మోహాన్ని వదిలితే తనను తాను కోల్పోతానని భయపడుతుంది. ఇక నాలుగోది భయంతో పట్టుకోవడం ఫియర్ బేస్డ్ హోల్డింగ్ పోతుందేమో మారిపోతుందేమో నష్టపోతుందేమో భయం పట్టుకోవడం మొహం ఏర్పడుతుంది. భయంతో పట్టుకున్నదే మొహంగా మారిపోతుంది. ఇక ఆధ్యాత్మిక అడ్డంకకి స్పిరిచువల్ అప్స్టైల్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా సూక్ష్మం మొదటిది బుద్ధితో తెలిసింది హృదయానికి దిగలేదు.
(12:33) శాస్త్రాలు చదివాం బోధలు విన్నాం సత్యం తెలుసుకున్నాం. కానీ అది అనుభూతి కాలేదు బుద్ధికి తెలిసిన సత్యం మోహాన్ని కోల్చదు. ఇక రెండవది త్యాగం చేస్తున్నాను అని అహంకారం నేను వదిలేస్తున్నాను నేను సాధన చేస్తున్నాను ఇదే కొత్త మొహం త్యాగం కూడా అహంకారంతో చేస్తే మోహమే అవుతుంది. ఇక మూడవది తప్పుగా అర్థం చేసుకున్న వైరాగ్యం బయట వదిలేసాం లోపల పట్టుకున్నాం. సస్పెన్షన్ నాట్ ఈక్వల్ టు ఫ్రీడమ అనిచేత అనేది స్వేచ్ఛకు సమం కాదు.
(13:12) నొక్కి పెట్టడం విముక్తి కాదు. ఇక నాలుగవది ఇప్పుడే కాదన్నా మాయ. ఇంకా టైం ఉంది తర్వాత వదిలేద్దాం. మోహం ఇదే మాటతో బతుకుతుంది. మోహం కాలాన్ని ఆయుధముగా వాడుతుంది. ఇక అత్యంత కీలకమైన సత్యం ఏమిటి మోహం పోవడానికి శత్రువుగా చూడడం కాదు స్పష్టంగా చూడడం కావాలి. సాధకుడికి మోహం ఎలా మారుతుందో అది గురువు పైన జ్ఞానం పైన లేదా శాంతి పైన మొహమా అనేది తెలుసుకుందాం.
(13:54) స్వస్తి ఇక ఐదవది సాధనకు మొహం ఎలా మారుతుంది సాధకుడి మొహం తగ్గదు అది రూపం మార్చుకుంటుంది. ఒకటి గురువు పైన మొహం అటాచ్మెంట్ టు ది గురు ఇది భక్తి కాదు సరిగా చూడాలి. ఎలా మారుతుంది గురువు మాటే చివరి సత్యం తన బుద్ధిని నిలిపి వేయడం ప్రశ్నించే శక్తి కోల్పోవడం భక్తి అనేది ఆధారపడటం గురువు మార్గం చూపాలి గానీ నడవాల్సింది సాధకుడే ప్రమాదం ఎక్కడ గురువును సత్యంగా కాదు సత్యానికి బదులుగా చూడటం గురువు యొక్క వేలి చంద్రుని చూపించాలి కానీ వేలుని పట్టుకుంటే అది మొహమే ఇక రెండోది జ్ఞానం పైన మొహం అటాచ్మెంట్ టు ది నాలెడ్జ్ ఇది చాలా కామన్
(14:41) ఎలా కనిపిస్తుంది శాస్త్రాలు కూడగట్టడం కొటేషన్లు చెప్పడం నాకు తెలుసు అన్న భావన జ్ఞానం అనుభూతిగా మారిపోతే అది అహంకారాన్ని పెంచుతుంది. జ్ఞాన మార్గం గమ్య మార్గం కాదు. ఇక్కడ మోహం ఎలా ఉంటుందంటే ఇంకా తెలుసుకోవాలి ఇంకా చదవాలి కానీ జీవితం మారదు. జ్ఞానం భారంగా మారితే అది మొహమే. ఇక మూడవది శాంతి పైన మొహం అటాచ్మెంట్ టు ది పేస్ ఇది అత్యంత సూక్ష్మం ఎలా వస్తుంది ధ్యానంలో కొంత శాంతి లోపల నిశశబ్దం ప్రశాంత అనుభూతి ఇప్పుడు మనసు కోరుకుంటుంది అదే ఉండాలి శాంతిని పట్టుకోవాలనిపించిన క్షణమే అది
(15:25) జారిపోతుంది. ప్రమాదం ఏమంటే కష్ట పరిస్థితులు తప్పించుకోవడం జీవితాన్ని దూరం పెట్టడం శాంతిగా మారి పారిపోవడం నిజమైన శాంతి పరిస్థితుల మీద ఆధారపడదు. మూడు మోహాలు ఒకే మూలాన్ని చెందుతాయి. గురువు జ్ఞానం శాంతి మూడు పవిత్రాలే కానీ పట్టుకుంటే మోహమే పవిత్రమైనదైనా పట్టుకున్న క్షణమే బంధం అవుతుంది. అత్యంత కీలకమైన ఉపనిషత్తుల సారాంశం ఏం అంటే త్యాజెత్ వదిలేయాలి కానీ ద్వేషంతో కాదు అవగాహనతో స్వస్తి ఇక చివరిది మొహం వల్ల కలిగే సూక్ష్మ బాధలు
(16:16) మరియు అంతర్గత నష్టం మొహం వల్ల కలిగే సూక్ష్మ బాధలు ఎవరు గుర్తించని అంతర్గత నష్టం ఇవన్నీ బయట కనిపించవు కానీ లోపల నష్టాలు పెరుగుతున్నాయి. మొహం బయట చూపించదు అది చిన్న చిన్న రేణువుల్లా మన లోపల నష్టాలను సృష్టిస్తుంది. అందులో మొదటిది సూక్ష్మ బాధలు సబ్టైన్ అండ్ పెయిన్స్ మోహం మనసులో సూక్ష్మైన బాధను పుట్టిస్తుంది.
(16:47) చిన్న చిన్న అసహనాలు తక్కువ గుర్తింపులో ఉన్న కోపం మన లోపల సూన్యతను పెరుగుతుంది. ఇక రెండవది లోపలికి తెలియని నష్టం ఇన్నర్ లాస్ నోబడీ నోటీస్ మొహం వల్ల వచ్చే నష్టం బయట గుర్తించరాదు అది మన మనసులో శాంతిని తగ్గిస్తుంది. మన సానుకూలతను తగ్గిస్తుంది. మరియు మనలో స్వతంత్ర చైతన్యాన్ని బలహీన పరుస్తుంది. ఇక మూడవది మన జీవితంలో చిమ్ముతూ ఉండే ప్రభావం ఈ చిన్న చిన్న నష్టాలు అన్నోటిస్డ్ ఫెయర్స్ అసహానం కంపారిజన్ వీటన్నీ సమయం తీరితే పెద్ద కష్టాలుగా మారుతాయి. ఇక నాలుగవది సాధకుడి పైన
(17:35) ప్రభావం ఎఫెక్ట్ ఆన్ ది సీకర్ సాధకుడికి కూడా మోహం తన ప్రభావాన్ని శాంతి సాధన అవగాహనలపై చూపిస్తుంది. ఇది చాలా సున్నితముగా కానీ శక్తివంతముగా ఉంటుంది. స్వస్తి ఈరోజు సమాజం విజయాన్ని కొలుస్తుంది. ఎంత సంపాదించావో ఎవరితో ఉన్నావో ఎంతో గుర్తింపు వచ్చిందో కానీ ఒక ప్రశ్న మాత్రం ఎవ్వరు అడగరు నీ లోపల శాంతి ఉందా మనము బయట జీవితం సర్దుకుంటూ లోపల మనసును కోల్పోతున్నాం.
(18:14) పట్టుకోవడమే ప్రేమ అనుకున్నాం ఆధారపడడమే భద్రత అనుకుంటున్నాం. అలవాట్లకే జీవితం ఇచ్చేసాం. అదే మోహం ఇది ఎవరి తప్పు కాదు ఇది మనసు తెలియక చేసిన ఒప్పందం కానీ ఇప్పుడు నీకు ఒక అవకాశం ఉంది ఏదైనా వదిలేయడానికి కాదు ఎవరినైనా దూరం పెట్టడానికి కాదు నీవు ఏదిని పట్టుకొని నిలబడి ఉన్నావో ఒక్కసారి నిజంగా చూడడానికి సమాజం చెప్పేదానికి కాదు మనసు వేసుకున్న బంధానికి కాదు నీ లోపల సత్యాన్ని చూడడానికి అవగాహన వచ్చిన క్షణము నుంచి మోహం బలహీన పడుతుంది. ఇదే మార్పు ఇదే మొదలు మన మెదడే
(19:04) మోసం చేస్తుందా అనే వీడియో తదుపరి భాగమే ఈ వీడియో స్వస్తి మరిన్ని సత్యాలు తెలుసుకోవాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఓం ఓం

No comments:

Post a Comment