The Hidden Psychology of How Men Actually Fall in Love | Nagna satyam Telugu Podcast
Author Name:Nagna Satyam
Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=dVHdt5PUyAc
Transcript:
(00:00) సాధారణంగా మనం అనుకుంటాం ప్రేమ అనేది అందరికీ ఒకేలాగా ఉంటుందని కానీ సైన్స్ చెప్తున్న నిజం ఏంటంటే ఒక మగవాడు ప్రేమని ఫీల్ అయ్యే విధానం దాన్ని కోరుకునే పద్ధతి పూర్తిగా రివర్స్ లో ఉంటుంది. మనం ఈ రోజుల్లో సోషల్ మీడియాలో బుక్స్ లో రిలేషన్షిప్స్ గురించి చాలా విషయాలు వింటుంటాం. కానీ ఒక అబ్బాయి మనసు లోపల అసలు ఏం జరుగుతుంది అతను ఫిజికల్ ఇంటిమసీని ఎందుకు అంతగా కోరుకుంటాడు అనే దానికి సమాధానం చాలా మందికి తెలియదు.
(00:29) ఈవెన్ చాలా మంది మహిళలు తమ పార్ట్నర్ ని అపార్థం చేసుకునే అతి పెద్ద ఏరియా ఇదే. ఈ ఒక్క విషయాన్ని గనుక మీరు క్లియర్ గా అర్థం చేసుకోగలిగితే మీ పార్ట్నర్ తో మీకున్న బాండింగ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. ఈ రివర్స్ ప్రాసెస్ ని అర్థం చేసుకోవాలంటే మనం మొదట స్త్రీ పురుషుల బ్రెయిన్ వైరింగ్ లో ఉండే ఒక ప్రైమరీ తేడాని గమనించాలి.
(00:51) ఒక ఉమెన్ కి రిలేషన్షిప్ లో క్లోజ్నెస్ కావాలంటే మొదట ఎమోషనల్ కనెక్షన్ అవసరం. అంటే మాటలు మాట్లాడటం మనసు విప్పి ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ ఎమోషనల్ బాండ్ ఎప్పుడైతే స్ట్రాంగ్ గా మారుతుందో అప్పుడు వాళ్ళలో నమ్మకం ఏర్పడి ఆ తర్వాతే వాళ్ళు ఫిజికల్ ఇంటిమసీ కి సిద్ధపడతారు. కానీ మెన్ విషయానికి వస్తే ఈ సైకిల్ మొత్తం కంప్లీట్ గా రివర్స్ అవుతుంది.
(01:16) ఒక అబ్బాయి తన మనసులోని బాధని కానీ, భయాన్ని కానీ లేదా ఒక డీప్ ఎమోషన్ ని కానీ బయట పెట్టాలంటే అతనికి మొదట ఫిజికల్ క్లోజ్నెస్ కావాలి. ఎందుకంటే సమాజంలో ఎప్పుడూ మగవాడు ఫిజికల్ టచ్ కోరుకుంటున్నాడు అంటే దాన్ని కేవలం ఒక శారీరక అవసరంగా లేదా కామంగా మాత్రమే చూస్తారు. కానీ దాని వెనక ఉన్న అసలైన సైకలాజికల్ గా చూస్తే అది రాంగ్. మెన్ కి చిన్నప్పటి నుంచి ఒక రకమైన సోషల్ కండిషనింగ్ జరుగుతుంది.
(01:44) అబ్బాయిలు ఎప్పుడూ గంభీరంగా ఉండాలి ఏడవకూడదు తమ బలహీనతలను బయట పెట్టుకోకూడదు అని సమాజం వాళ్ళ చుట్టూ ఒక పెద్ద గోడను నిర్మిస్తుంది. దీనివల్ల మగవాళ్ళు తమ ఎమోషన్స్ ని ఒక సేఫ్ లాకర్ లో పెట్టి దాచేస్తారు. వాళ్లకు ఒక రకమైన ఎమోషనల్ ఆర్మర్ ఏర్పడుతుంది. ఈ కవచాన్ని ముక్కలు చేయాలంటే మాటల వల్ల సాధ్యం కాదు. న్యూరోసైన్స్ ప్రకారం ఒక మెన్ తన పార్ట్నర్ ని హగ్ చేసుకున్నప్పుడు లేదా చేతులు పట్టుకున్నప్పుడు లేదంటే శారీరకంగా దగ్గరైనప్పుడు అతని బ్రెయిన్ లో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విపరీతంగా రిలీజ్ అవుతుంది.
(02:17) దీన్నే సైన్స్ లో బాండింగ్ హార్మోన్ అని పిలుస్తారు. ఈ హార్మోన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు అతని బ్రెయిన్ లో ఉన్న డిఫెన్స్ మెకానిజమ్స్ అన్ని ఒక్కసారిగా కొట్టుకుపోతాయి. అతని చుట్టూ నిర్మించుకున్న ఆ గంభీరమైన గోడలన్నీ మెల్ట్ అయిపోతాయి. అంటే ఒక మగవాడికి ఫిజికల్ టచ్ అనేది కేవలం ఒక ప్లెజర్ మాత్రమే కాదు అది అతని మనసు లోపలికి వెళ్ళడానికి ఉన్న ఏకైక సైకలాజికల్ గేట్వే చాలా మంది మహిళలు కంప్లైంట్ చేస్తుంటారు.
(02:41) మా ఆయన నాతో అస్సలు మనసు విప్పి మాట్లాడడు కానీ బెడ్రూమ్ లోకి రాగానే మాత్రం చాలా క్లోజ్ అవుతాడు అని ఇక్కడ అసలైన మ్యాజిక్ ఏంటంటే అతను ఆ ఫిజికల్ గా దగ్గరైన ఆ కొద్ది నిమిషాల్లోనే అత్యంత వీక్ గా అత్యంత ఎమోషనల్ గా మారే అవకాశం ఉంటుంది. ఆ సమయంలోనే అతను తన నిజమైన భయాలను మీతో పంచుకోగలడు. అందుకే బెడ్రూమ్ లో మగాడి కంటే ఆడదాని మాటే శాసనం.
(03:06) ఇక్కడ మనం టచ్ డిప్రివేషన్ అనే ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఆడవాళ్ళు తమ ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీతో కానీ చాలా ఈజీగా హగ్స్ ఇచ్చుకోవడమో చేతులు పట్టుకోవడమో చేస్తారు. వాళ్ళకి ఎమోషనల్ కంఫర్ట్ అనేది సొసైటీలో చాలా ఈజీగా దొరుకుతుంది. కానీ మగవారికి ఆ ఛాన్స్ అస్సలు ఉండదు. ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయిని హగ్ చేసుకుంటే ఈ సమాజం దాన్ని వింతగా చూస్తుంది.
(03:29) దీనివల్ల మగవాళ్ళు తమ జీవితాంతం ఒక రకమైన శారీరక సాన్నిహిత్య క్షామానికి గురవుతారు. ఇలాంటి స్థితిలో ఉన్న ఒక మగవాడికి తన లైఫ్ లో ఆ ఫిజికల్ అఫెక్షన్ ఆ టచ్ దొరికే ఏకైక ఏరియా తన రొమాంటిక్ పార్ట్నర్ మాత్రమే. అందుకే వాళ్ళు ఆ క్లోజ్నెస్ ని అంతగా కోరుకుంటారు. ఆ టచ్ దొరికినప్పుడే వాళ్ళ బ్రెయిన్ కి ఒక సిగ్నల్ వెళ్తుంది. ఇక్కడ నువ్వు సేఫ్ గా ఉన్నావు నీ కవచాన్ని తీసేయొచ్చు అని దీన్ని కేవలం ఒక లస్ట్ లాగా చూడడం వల్లే రిలేషన్షిప్స్ లో పెద్ద పెద్ద గ్యాప్స్ వస్తుంటాయి.
(03:57) ఈ రివర్స్ ప్రాసెస్ ని మనం లవ్ లాంగ్వేజెస్ తో కనెక్ట్ చేసి చూస్తే ఇంకొక అద్భుతమైన నిజం బయటపడుతుంది. మగవాళ్ళు ప్రేమను వ్యక్తపరిచే విధానాన్ని సైకాలజీలో ఇన్స్ట్రుమెంటల్ లవ్ అని అంటారు. అంటే మాటల ద్వారా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడం కంటే చేతల ద్వారా బాధ్యతల ద్వారా దాన్ని నిరూపించడం. పార్ట్నర్ కి ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయడం, ఆమెను ప్రొటెక్ట్ చేయడం, ఆమె నీడ్స్ ని తీర్చడం ఇవన్నీ వాళ్ళకి తెలిసిన ప్రేమ భాషలు.
(04:25) కానీ ఇక్కడే ఒక విచిత్రమైన కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. ఒక భార్యా భర్తల మధ్య గొడవ జరిగినప్పుడు భార్య ఏమనుకుంటుందంటే అతను నా పక్కన కూర్చోవాలి నన్ను కన్సోల్ చేయాలి సారీ చెప్పాలి అని కోరుకుంటుంది. అది ఎమోషనల్ డిమాండ్ కానీ ఆ భర్త ఏం చేస్తాడు అతను సైలెంట్ గా వెళ్లి ఆమె బండిని రిపేర్ చేయించడమో లేదా ఆమెకు ఇష్టమైన ఫుడ్ తెచ్చి ఇవ్వడమో లేదంటే దగ్గరిక వచ్చి ఒక హగ్ ఇవ్వడానికో ట్రై చేస్తాడు.
(04:49) ఫిజికల్ లేదా యాక్షన్ డిమాండ్ ఈ సమయంలో ఆ భార్యకి ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. నేను ఇక్కడ బాధపడుతుంటే ఈ పనులుఏంటి ఈ టచ్ ఏంటి అని ఆమె విసుక్కుంటుంది. కానీ ఆ భర్త బ్రెయిన్ లో ఏం నడుస్తుందంటే నేను మాటలతో ఈ గొడవని సర్దలేను అందుకే నా టచ్ ద్వారా నా చేతల ద్వారా ఆమెకు దగ్గర అవ్వాలి అని అతను అనుకుంటాడు. ఇద్దరిలోనూ ప్రేమే ఉంది కానీ ఒకరు ఒక తలుపు ద్వారా లోపలికి రావాలని చూస్తుంటే ఇంకొకరు ఇంకో తలుపు దగ్గర వెయిట్ చేస్తున్నారు.
(05:17) ఇదే ద గ్రేట్ రిలేషన్షిప్ మిస్టరీ ఎప్పుడైతే ఒక మహిళ తన పార్ట్నర్ యొక్క ఈ ఫిజికల్ డ్రైవ్ వెనుక ఉన్న సైకలాజికల్ నీడ్ ని అర్థం చేసుకుంటుందో అప్పుడు ఆమె తన్ని జడ్జ్ చేయడం ఆపేస్తుంది. అలాగే మగవాళ్ళు కూడా ఒక విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీ బ్రెయిన్ వైరింగ్ అలా ఉందని చెప్పి ఎప్పుడూ ఫిజికల్ టచ్ మీదే డిపెండ్ అవ్వకూడదు.
(05:37) అవతలి వ్యక్తికి మాటలు ఎమోషనల్ కనెక్షన్ ఎంత ముఖ్యమో అర్థం చేసుకుని నార్మల్ టైమ్స్ లో కూడా మీ మనసులోని భావాలను మాటల రూపంలో చెప్పడానికి ప్రయత్నించాలి. చివరిగా సైన్స్ చెప్పేది ఏంటంటే మగవారి ఈ రివర్స్ ఇంటిమసీ ప్రాసెస్ అనేది ప్రకృతి సృష్టించిన ఒక బ్యూటిఫుల్ బాలెన్సింగ్ యాక్ట్ బయట ప్రపంచంలో ఎంతో కఠినంగా గంభీరంగా ఉండే ఒక మగవాడు తన పార్ట్నర్ యొక్క చిన్న స్పర్శతో ఒక చిన్న హగ్ తో ఎంత ప్రశాంతంగా మారిపోతాడు అనేది ఒక అద్భుతమైన మానసిక ప్రక్రియ.
(06:04) మెన్ ఈ సైలెంట్ లవ్ లాంగ్వేజ్ ని వాళ్ళ మనసు లోపలికి వెళ్ళే ఈ రివర్స్ రూట్ ని అర్థం చేసుకున్నప్పుడే రిలేషన్షిప్స్ లో ఎలాంటి గొడవలు లేకుండా హ్యాపీగా ఉండగలం. లేదంటే కట్టుకున్న పెళ్ళాన్ని వదిలి ఎదురింటి వాడి పెళ్లనో లేదా పక్కింటి వాడి పెళ్ళను మనక ఏం కావాలో వెతుక్కుంటాం. తస్మాత్ జాగ్రత్త బాస్
No comments:
Post a Comment