🚨 BREAKING 7000 Students HIV Positive? | SHOCKING Truth Behind Karnataka College Camps | VR Raja
Author Name:V R RAJA
Youtube Channel Url:https://www.youtube.com/@iamvrraja
Youtube Video URL:https://www.youtube.com/watch?v=wddnrDgYdJk
Transcript:
(00:00) రీసెంట్ గా సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్స్ లో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే కర్ణాటకలోని కాలేజెస్ లో ఏకంగా 7000 మందికి పైగా స్టూడెంట్స్ కి హెచ్ఐవ పాజిటివ్ అని తెలిసిందని అందుకే గవర్నమెంట్ కాలేజెస్ లో కాంపాక్ట్ హెల్త్ క్యాంప్స్ పెట్టి టెస్ట్‌లు చేయడం తప్పనిసరి చేసింది అని అండ్ ఈ న్యూస్ చూడంగానే చాలా మంది షాక్ అయ్యారు.
(00:18) అసలు కాలేజ్ చదివే యంగ్‌స్టర్స్ లో ఇన్ని వేల మందికి ఎట్ ఏ టైం హెచ్ఐవ ఎలా వచ్చింది అండ్ అక్కడ స్టూడెంట్స్ అంతా రక్లెస్ గా ఉంటున్నారా ఇలాంటి క్వశ్చన్స్ చాలా వచ్చి ఉంటాయి కదా బట్ మనకి బయటికి కనిపించే సగం సగం న్యూస్ హెడ్‌లైన్స్ కి గ్రౌండ్ లెవెల్ లో ఉన్న నిజాలకి కొంచెం తేడా ఉంది. ఈరోజు మనం ఈ వీడియోలో కర్ణాటక కాలేజ్ క్యాంప్స్ వెనుకున్న అసలు డేటా ఫాక్ట్ చెక్ గురించి అలాగే బెంగళూర్ లాంటి సిటీస్ లో డేటింగ్ యాప్స్ ద్వారా సైలెంట్ గా స్ప్రెడ్ అవుతున్న కొత్త త్రెడ్ గురించి మాట్లాడుకుందాం.
(00:45) అంతే కాదు ఈ హెచ్ఐవ బాడీలోకి వచ్చాక ఏ విధమైన డామేజ్ చేస్తది ఎలాంటి సింటమ్స్ ఉంటాయి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ప్రతి ఒక్క పాయింట్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇలాంటి వీడియో అంటే స్పెసిఫిక్ గా స్టూడెంట్స్ కి ఉపయోగపడేలా ఇష్యూ మీద ఒక వీడియో ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా లైక్ సెక్స్ ఎడ్యుకేషన్ లాగా బట్ ఎప్పుడూ ప్రాపర్ టైం దొరకలేదు కానీ ఇప్పుడు చేయడం అవసరం అనిపించింది.
(01:04) అండ్ మీలో ప్రతి స్టూడెంట్స్ తప్పక చూడాల్సిన వీడియో ఇది. సో వీడియో ఫుల్ గా చూడండి అండ్ వీలైనంత మందికి షేర్ చేయండి. ఇంకా టాపిక్ లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 7000 స్టూడెంట్ కేసెస్ హెడ్లైన్ వెనుకున్న నిజం ఏంటంటే రీసెంట్ గా డెకన్ క్రానికల్ న్యూస్ 18 కలీస్ టైమ్స్ లాంటి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీడియా అవుట్‌లెట్స్ లో ఓవర్ 7000 స్టూడెంట్స్ టెస్ట్ హెచ్ఐవ పాజిటివ్ ఇన్ కర్ణాటక అని ఆర్టికల్స్ వచ్చాయి.
(01:25) ఇది చూడంగానే జనాలు కాలేజెస్ లో వేల మందికి వైరస్ వచ్చిందేమో అని కంగారుపడ్డారు. కానీ మనం కేఎస్ఏపిఎస్ అంటే కర్ణాటక స్టేట్ రైట్స్ ప్రివెన్షన్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ పద్మ బసవంతప్ప గారు ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇంకా ద హిందూ పేపర్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఏం చెప్పారంటే ఒక క్లారిటీ ఇచ్చారు. అవఏం చెప్తున్నారంటే మేము మెడికల్ కాలేజెస్ అండ్ డిగ్రీ కాలేజెస్ తో సహా వేరే వేరే కాలేజెస్ ని సర్వే చేసినప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ లో కేవలం ఒకటి లేదా రెండు పాజిటివ్ కేసెస్ మాత్రమే గమనించాం.
(01:50) మరి అలాంటప్పుడు ఈ 7000 నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడే ప్రెస్ అండ్ మీడియా ఒక చిన్న మిస్టేక్ చేసే హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చిన డేటాలో 18 నుంచి 25 సంవత్సరాల వయసున్న మొత్తం యూత్ పాపులేషన్ లో రీసెంట్ గా నమోదైన హెచ్ఐవ పాజిటివ్ కేసెస్ కౌంట్ అనేది 7000 కంటే ఎక్కువ ఉంది. అంటే 18 ట 25 ఏజ్ గ్రూప్ లో డ్రైవర్స్ కావచ్చు, వర్కర్స్ కావచ్చు, అన్ఎంప్లాయీస్ కావచ్చు లేదా వేరే రంగాల్లో ఉన్న యూత్ కావచ్చు వీళ్ళందరి డేటా ఇంకా కాలేజ్ స్టూడెంట్స్ ని కలిపి మీడియా రిపోర్ట్ చేసింది.
(02:16) అంతే తప్ప 7000 మంది కాలేజ్ చదివే స్టూడెంట్స్ కి మాత్రమే పాజిటివ్ వచ్చిందని చెప్పడానికి ఎలాంటి స్పెసిఫిక్ అంటే స్టూడెంట్స్ స్పెసిఫిక్ డేటా సెట్ లేదు. అండ్ హెడ్‌లైన్స్ చూసి చాలా మంది స్టూడెంట్స్ అయినా ఫిక్స్ అయిపోయారు అని చెప్పారు. అలాని కాలేజెస్ లో కేసులు లేవు కదా అని రిలాక్స్ అవ్వడానికి కూడా వీలు లేదు ఎందుకంటే కర్ణాటకలో ఓవరాల్ యంగ్ పాపులేషన్ లో కేసెస్ పెరిగిన మాట మాత్రం వాస్తవం.
(02:34) అండ్ డేటా ప్రకారం 18 నుంచి 35 సంవత్సరాల వయసున్న యూత్ లో హెచ్ఐవ పాజిటివ్ కౌంట్ వ్యక్తుల సంఖ్య 2023 24 లో 44,500 ఉంటే అది 2025 26 నాటికి 66,600కు పెరిగింది. అండ్ ఈ పెరిగిన నెంబర్స్ ని హెల్త్ అథారిటీస్ అలర్ట్ అయ్యాయి. అందుకే విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ విటియు అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కాలేజట్ ఎడ్యుకేషన్ సహాయంతో కర్ణాటకలో గవర్నమెంట్ ఎయిడెడ్ అండ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ కాలేజెస్ లో ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంప్స్ లేదా ఐహెచ్సిస్ ని ఏర్పాటు చేయడం స్టార్ట్ చేశారు.
(03:03) ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కాలేజెస్ లో ఈ క్యాంపస్ పెడుతున్నారు కదా అని ఏ స్టూడెంట్ కి వాళ్ళ పర్మిషన్ లేకుండా ఫోర్స్ చేసి టెస్టింగ్ చేయరు. ఇండియాస్ హెచ్ ఐవ అండ్ ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యక్ట్ 2017 ప్రకారం ఇన్ఫార్మడ్ కన్సెంట్ ఉంటే అంటే వ్యక్తి పూర్తి అనుమతి ఉంటేనే ఈ ప్రీ టెస్ట్ ఆర్ పోస్ట్ టెస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత టెస్టింగ్ చేయడం జరుగుద్ది.
(03:23) కాబట్టి కాలేజ్ క్యాంప్స్ అనేది భయపెట్టడానికి కాదు కేవలం అవేర్నెస్ పెంచడానికి అండ్ వాలంటరీ టెస్టింగ్ ని ప్రోత్సహించడానికి మాత్రమే ఇప్పుడు మనం కర్ణాటకలోని ఓవరాల్ గ్రౌండ్ రియాలిటీ అండ్ స్టేట్ లెవెల్ హెచ్ఐవ సిచువేషన్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రెసెంట్ ఈ కర్ణాటకని ఎక్కువగా బ్యాడ్ లైట్ లో చూపిస్తున్నారు బట్ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అంటేఎన్ఏసిఓ యొక్క శంక్లాక్ రిపోర్ట్ 2024 అండ్ ఇంకా 2025 26 అఫీషియల్ డేటా ప్రకారం ఇండియాలోనే అత్యధికంగా హెచ్ఐవ ఇన్ఫెక్టెడ్ ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక థర్డ్ ప్లేస్ లో ఉంది. మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తర్వాత
(03:52) కర్ణాటకలో ఎక్కువ కేసులు ఉన్నాయి. అంటే కర్ణాటక కంటే ముందే మన స్టేట్ ఉంది. అండ్ కర్ణాటకలో ప్రెసెంట్ 2,91,000 మంది పిఎల్ హెచ్ ఐవ అంటే పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవ ఉన్నారు. ఇక్కడ అడల్ట్ ప్రివలెన్స్ రేట్ వచ్చేసి 0.44% ఉంది. ఇది నేషనల్ యవరేజ్ అయిన 0.2% కంటే టూ టైమ్స్ ఎక్కువ. ఇందులో దాదాపు 25,350 మందికి పైగా ఏఆర్టి ట్రీట్మెంట్ ని ఫ్రీగా తీసుకుంటా హెల్తీగానే ఉన్నారు.
(04:16) కానీ హెల్త్ డిపార్ట్మెంట్ మాత్రం బాగా భయపెడుతున్న ప్రాబ్లం ఏంటంటే అదే కర్ణాటకలో దాదాపు 56,406 మందికి వాళ్ళ బాడీలో హెచ్ఐవ పాజిటివ్ ఉందనే విషయమే తెలియదు. వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉందనే విషయం తెలియకపోవడం వల్ల వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోలేకపోతున్నారు. పైగా వాళ్ళకి తెలియకుండానే వేరే వాళ్ళకి వైరస్ స్ప్రెడ్ చేసే ఛాన్స్ ఉంది. వాళ్ళ స్టాట్స్ వాళ్ళకి తెలియని పీపుల్ సంఖ్య ఇండియాలో అత్యధికంగా ఉన్న రాష్ట్రం కర్ణాటకనే అందుకే ఈ 56వేల మందిని త్వరగా గుర్తించి వాళ్ళకి ట్రీట్మెంట్ అందించడమే ఇప్పుడు గవర్నమెంట్ ఉందన్న ప్రైమరీ టార్గెట్ అండ్ ఇంకొక పెద్ద ఇష్యూ ఏంటంటే
(04:44) కర్ణాటక లేదా బెంగళూర్ లాంటి మెట్రో సిటీస్ లో ఈ మధ్యకాలంలో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడానికి హెల్త్ ఆఫీసర్స్ే కారణాలను ఐడెంటిఫై చేశారు. ముఖ్యంగా డేటింగ్ యాప్స్ ని వాడేవాళ్ళ నెంబర్ పెరగడం కేఎస్ఏ పిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పద్మ గారు చెప్పిన దాని ప్రకారం గతంలో ఒక వ్యక్తికి హెచ్ఐవ పాజిటివ్ అని తెలితే హెల్త్ ఆఫీసర్స్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ సెక్షువల్ పార్ట్నర్స్ వివరాలు తెలుసుకొని వాళ్ళని కూడా పిలిపించి టెస్టింగ్ చేసి కాంటాక్ట్ ట్రేసింగ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు కాలం మారింది.
(05:09) బెంగళూర్ లాంటి ఐటి హబ్స్ లో అండ్ పెద్ద పెద్ద సిటీస్ లో యూత్ టెండర్ బంబుల్ అండ్ ఇంకా వేరే వేరే డేటింగ్ యప్స్ ఇంకా డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ ద్వారా కలుస్తున్నారు. ఇలా డేటింగ్ యప్స్ ద్వారా కలిసే క్యాజువల్ ఎన్కౌంటర్స్ లో చాలా మందికి ఒకళ్ళ అసలు పేరు అడ్రెస్ లేదా ఐడెంటిటీ కూడా తెలియదు. కేవలం ఆన్లైన్ ప్రొఫైల్స్ ఆధారంగానే కలుస్తారు. దీనివల్ల ఒకళ్ళకి ఇన్ఫెక్షన్ డిటెక్ట్ అయినా వాళ్ళ పార్ట్నర్స్ ఎవరో వాళ్ళు ఎక్కడఉన్నారు అనేది కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడం అధికారులకు కూడా నెక్స్ట్ ఇంపాసిబుల్ గా మారిపోయింది.
(05:34) పైగా ఇప్పటికీ చాలా మంది యూత్ లో హోమోసెక్షువల్ సంబంధాల వల్ల లేదా అన్ఎక్స్పెక్టెడ్ సెక్స్ వల్ల కూడా హెచ్ఐవ వచ్చే రిస్క్ ఉందని అవేర్నెస్ తక్కువ ఉండడం వల్ల కూడా ఈ గ్యాప్ పెరుగుతుంది. ఈ డిజిటల్ ప్రాబ్లం్ ని కౌంటర్ చేయడానికి కేఎస్ఏపిఎస్ ఒక కొత్త స్ట్రాటజీ తీసుకొచ్చింది. అదేంటంటే పీర్ ఎడ్యుకేటర్స్ చేత డైరెక్ట్ గా డేటింగ్ యప్స్ లో ప్రొఫైల్స్ క్రియేట్ చేసి వల్నరబుల్ గ్రూప్స్ ని సీక్రెట్ గా కాంటాక్ట్ అవ్వడం వాళ్ళకి ఆన్లైన్ లోనే అవేర్నెస్ క్రియేట్ చేసి కాన్ఫిడెన్షియల్ టెస్టింగ్ కి ఒప్పించడం.
(05:56) దీంతో పాటు మొబిలైజేషన్ ఫర్ ఎయిడ్స్ సురక్ష లేదాఎస్ అనే క్యాంపెయిన్ ని లాంచ్ చేసి బ్రేక్ ఫ్రీ క్యూఆర్ కోడ్ అనే ఒక డిజిటల్ టూల్ ని తీసుకొచ్చారు. ఈ బ్రేక్ ఫ్రీ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే బ్రేక్ఫ్రీయాజ అనే ఒక వెబ్సైట్ కి వెళ్తది. అక్కడ ఎవరైనా సరే వాళ్ళ పేరు లేదా ఫోన్ నెంబర్ ఇవ్వకుండానే కేవలంసెవెన్ అనానిమస్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడం ద్వారా వాళ్ళకి హెచ్ఐవ రిస్క్ ఎంత ఉందో సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవచ్చు.
(06:17) ఒకవేళ రిస్క్ ఎక్కువగా ఉంటే ఆ సిస్టం దగ్గరలో ఫ్రీ టెస్టింగ్ సెంటర్ కి గైడెన్స్ చేస్తది. ఇంతవరకు మనం కర్ణాటకలోని కాలేజ్ న్యూస్ అనుకున్న రియాలిటీ ఏంటి డేటింగ్ యప్స్ ద్వారా ఎదురవుతున్న కొత్త సవాలు ఏంటి అనే విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం దీనికి ఉన్న బిగ్గెస్ట్ పిక్చర్ చూద్దాం. మన దేశంలో మొదటిసారిగా హెచ్ఐవ ఇన్ఫెక్షన్ ఎప్పుడు గుర్తించారో తెలుసా 1986లో అంతకంటే ముందు అంటే ఏప్రిల్ 1986 కంటే ముందు వరకు భారతదేశంలో హెచ్ఐవ కేసెస్ కేవలం విదేశాలకు వెళ్ళవచ్చిన భారతీయుల్లో లేదా ఇక్కడ టూరిస్టులుగా వచ్చిన ఫారనర్స్ కి మాత్రమే కనిపించేవి. దానివల్ల అప్పట్లో
(06:47) చాలా మంది ఇండియన్స్ కూడా హెచ్ఐవ అనేది మన దేశానికి రాని సమస్య అని ఇది కేవలం వెస్టరన్ కంట్రీస్ యొక్క ప్రజలకు మాత్రమే వస్తుందని అనుకునేవాళ్ళు. కానీ 1986 ఏప్రిల్ లో తమిళనాడు రాష్ట్రంలో ఫీమేల్ సెక్స్ వర్కర్స్ లో మొదటిసారిగా లోకల్‌గా స్ప్రెడ్ అయిన హెచ్ఐవ పాజిటివ్ కేసెస్ ని సైంటిస్ట్‌లు ఐడెంటిఫై చేశారు. అదే సంవత్సరం మహారాష్ట్రలోని ముంబై సిటీలో ఫస్ట్ క్లినికల్ ఎయిడ్స్ పేషెంట్ ని డాక్టర్స్ రిజిస్టర్ కూడా చేశారు.
(07:09) అండ్ ఈ ఇన్సిడెంట్ జరంగానే మన ఇండియన్ గవర్నమెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అండ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్ వెంటనే అలర్ట్ అయ్యాయి. 1986 లోనే నేషనల్ లెవెల్ లో హెచ్ఐవ సర్వైవలెన్స్ ని స్టార్ట్ చేశయి. స్టార్టింగ్ లో చేసిన స్టడీస్ లో ప్రొఫెషనల్ బ్లడ్ డోనర్స్ గాని బ్లడ్ ప్రొడక్ట్స్ ఇంకా సెక్స్ వర్కర్స్ లో ఈ వైరస్ ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది.
(07:27) ఆ తర్వాత 1991 లో మణిపూర్ లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. మణిపూర్ లో డ్రగ్స్ ని ఇంజెక్షన్స్ ద్వారా తీసుకునే ఇంట్రావీనస్ డ్రగ్స్ యూసర్స్ లేదా ఐడియూస్ లో హెచ్ఐవ చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అయింది. ఇక్కడ హెరైన్ తో పాటు లీగల్ గా దొరికే వేరే కూడా ఉన్నాయి కదా వేరే వేరే ఫార్మస్యూటికల్ డ్రగ్స్ ని ఇంజెక్ట్ చేసుకునే వాళ్ళు అండ్ ఈ ఇన్ఫెక్టెడ్ ఒకే నీడిల్ ని లేదా ఒకే సిరంజ్ ని చాలా మందికి మార్చి మార్చి వాడడం వల్ల అక్కడ కేసెస్ బీవత్సంగా స్పీడ్ తో పెరిగిపోయాయి.
(07:51) దీని అర్జెన్సీని అర్థం చేసుకొని 1992 లో సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ ఎయిడ్స్ కౌన్సిల్ ఆర్గనైజేషన్ అంటే ఎన్జఏసిఓ ని స్టార్ట్ చేసింది.ఎన్జసిపి అంటే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేసింది. దీనికి వరల్డ్ బ్యాంక్ చాలా ఫండింగ్ ఇచ్చింది కూడాఎన్జసిబి ఫేజ్ వన్ లో వరల్డ్ బ్యాంక్స్ 84 మిలియన్ డాలర్ సపోర్ట్ తో రక్తాన్ని అమ్ముకునే ప్రొఫెషనల్ బ్లడ్ డొనేషన్స్ ని ఇల్లీగల్ చేశారు.
(08:10) అంటే అప్పట్లో బ్లడ్ అమ్ముకునే వాళ్ళు దాన్ని ఇల్లీగల్ చేసేసారు. అండ్ ఆ తర్వాత బ్లడ్ బ్యాంక్స్ లో ప్రతి బ్లడ్ శాంపుల్ ని స్క్రీనింగ్ చేయడం మాండేటరీ చేశారు. ఆ తర్వాత 1999 నుంచి 2006 వరకు నడిచినఎన్జసిపి ఫేస్ 2 కి వరల్డ్ బ్యాంక్ 191 మిలియన్ డాలర్స్ ఇచ్చింది. ఈ ఫేజ్ లోనే స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీస్ లేదా ఎస్‌సిఎస్ ని ఏర్పాటు చేశారు.
(08:29) 2007 నుంచి 2012 వరకు నడిచేఎన్సిపి ఫేస్త్ర కి వరల్డ్ బ్యాంక్ 250 మిలియన్ డాలర్ సపోర్ట్ ఇచ్చింది. ఇందులో హై రిస్క్ గ్రూప్స్ లో కవరేజ్ ని 80% కి పెంచడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇకఎన్ఏసిపి ఫేస్ 4 కి వచ్చేసరికి 80% ఫండ్స్ ని ఇండియన్ గవర్నమెంటే స్వయంగా సమకూర్చుకొని ఈ ప్రోగ్రాం ని నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అంటేఎన్ఆర్ హెచ్ఎం తో పూర్తిగా కంబైన్ చేసింది.
(08:48) ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఇంకో సక్సెస్ఫుల్ మోడల్ ని కోల్‌కత్తాలోని సోనాగంచి మోడల్ ఏషియాలోనే బిగ్గెస్ట్ రెడ్ లైట్ ఏరియా అనుకుంటా సో ఆబవియస్ గా అక్కడ హెచ్ఐవ చాలా ఎక్కువ ఉంటది. అయితే అక్కడ సెక్స్ వర్కర్స్ అందరూ కలిసి ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసుకొని కొన్ని రూల్స్ ప్రాక్టీస్ చేశారు. అంటే కండం వాడకని తప్పనిసరి చేసుకోవడం ఇంకా సేఫ్ ప్రాక్టీసెస్ ని పాటించడం ద్వారా హెచ్ఐవ స్ప్రెడ్ ని మంచిగా కంట్రోల్ చేసేసారు.
(09:08) సో ఈ సోనాగచి ప్రయోగాన్ని వరల్డ్ బ్యాంక్ అండ్ unైట్స్ వంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా ఒక మోడల్ గా ప్రైస్ చేశయి. సో ఇలాంటి వాటితో ఇండియా దీన్ని కౌంటర్ చేస్తుంది. మనం 2025 26 నాటి లేటెస్ట్ అఫీషియల్ నేషనల్ డేటాని చూసుకుంటే యూనియన్ హెల్త్ మినిస్టర్ జగత్ ప్రకాష్ నడ్డా గారు రిలీజ్ చేసిన ఇండియా హెచ్ఐవ ఎస్టిమేట్స్ 2025 రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో దాదాపు ప్రెసెంట్ 25.
(09:29) 61 లాక్ పీపుల్ హెచ్ఐవ పాజిటివ్ తో ఉన్నారు. ఇందులో మగవాళ్ళు దాదాపు 14 లాక్ మెంబర్స్ కాగా దాదాపు 11 లాక్ మెంబర్స్ ఆడవాళ్ళు ఉన్నారు. అండ్ మన కంట్రీలో అడల్ట్ ప్రివలెన్స్ రేట్ 0.20% కాక కాన్స్టెంట్ గా ఉంది. ఇక 15 ట 24 మధ్య ఉన్న యూత్ లో ఈ ప్రివలెన్స్ కేవలం 0.0 06% మాత్రమే ఉంది. అయితే నేషనల్ యవరేజ్ తక్కువగా ఉన్నప్పటికి కొన్ని ప్రాంతాల్లో సిచువేషన్ డేంజర్ గా మారింది.
(09:50) ఇండియాలో మొత్తం పిఎల్ హెచ్ఐవ కేసెస్ లో ఏకంగా 74% కేసెస్ కేవలంనైన్ స్టేట్స్ లోనే ఉన్నాయి. ఫస్ట్ స్టేట్ లో మహారాష్ట్ర 3.99 లాక్ కేసెస్ తో ఉంది. రెండో ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ 3.10 లాక్ కేసెస్ తో ఉంది. మూడో ప్లేస్ లో కర్ణాటక 2.91 లాక్ కేసెస్ తో ఉంది. వీటితో పాటు ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, బీహార్, గుజరాత్, పంజాబ్ స్టేట్స్ టాప్ లిస్ట్ లో ఉన్నాయి.
(10:10) ఇక నార్త్ స్టేట్స్ విషయానికి వస్తే సిచువేషన్ కొంచెం సీరియస్ గా ఉంది. మిజోరం ఇంకా నాగాలాండ్ రాష్ట్రాల్లో అడల్ట్ ప్రివలెన్స్ రేట్ ఏకంగా 1% కంటే ఎక్కువ ఉంది. ముఖ్యంగా మిజోరం లో కొత్తగా వచ్చే న్యూ ఇన్ఫెక్షన్ రేట్ 0.90 పర్ 1000 గా ఉంది. ఇది నేషనల్ యవరేజ్ కన్నా ఏకంగా 18 రేట్లు ఎక్కువ అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, పంజాబ్ స్టేట్స్ లో కూడా ఈ డ్రగ్స్ యూసేజ్ వల్ల కొత్త కేసెస్ పెరిగినట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి.
(10:32) అయితే గ్లోబల్ ట్రెండ్స్ తో పోలిస్తే ఇండియా అజీవ్ చేసిన రిజల్ట్స్ చాలా గొప్పవి. 2010 నుంచి 2024 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా కొత్త కేసెస్ 40% తగ్గితే ఇండియాలో మాత్రం ఏకంగా 49% తగ్గాయి. అలాగే ప్రపంచంలో ఎయిడ్స్ మరణాలు 54% తగ్గితే ఇండియాలో 81.4% పడిపోయాయి. తల్లి నుంచి పుట్టే బిడ్డకు వైరస్ తోకే వర్టికల్ ట్రాన్స్మిషన్ రేట్ కూడా మన కంట్రీలో 63.7% 7% తగ్గింది.
(10:54) మరి రాబోయే రోజుల్లో ఇన్ఫెక్షన్స్ ని పూర్తిగా జీరో స్థాయికి తీసుకెళ్ళడానికి గవర్నమెంట్ ఒక స్పెసిఫిక్ యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తుంది. మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రెసెంట్ మిషన్ ఎయిడ్స్ సురక్ష అనే ఒక పెద్ద కొంచెం ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాం్ ని కూడా స్టార్ట్ చేసింది. అలాగే నాకో డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాకేష్ గుప్త గారు ఇంకా కర్ణాటక హెల్త్ సెక్రెటరీ హర్ష గుప్త గారు మార్చ్ 2026 లో బెంగళూరులో జరిగిన సురక్ష సంకల్ప వర్క్‌షాప్ లో ఒక కీ అనౌన్స్మెంట్ చేశారు.
(11:16) అదేంటంటే డిసెంబర్ ఫస్ 2027 నాటికి రాబోయే వరల్డ్స్ ఎయిడ్స్ డే రోజు భారతదేశంలో హెచ్ఐవ పాండమిక్ ని పూర్తిగా కంట్రోల్ లోకి తీసుకురావాలని సెంట్రల్ గవర్నమెంట్ ఒక బిగ్ డెడ్ లైన్ ని ఫిక్స్ చేసుకుంది. ఈ గోల్ సాధించడానికి నాకో ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తున్న 95 95 99 టార్గెట్ ఎంచుకుంది. అసలుఏంటి 95 95 99 టార్గెట్ ఏంటంటే ఫస్ట్ 95% దేశంలో హెచ్ఐవ ఉన్న వారిలో కనీసం 95% మంది వాళ్ళ హెచ్ఐవ స్టేటస్ ని తెలుసుకోవాలి.
(11:40) సెకండ్ 95% స్టేటస్ తెలిసిన వారిలో 95% మంది క్రమం తప్పకుండా ఏఆర్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి. థర్డ్ 99% ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారిలో 99% మంది ఈ వైరల్ సప్రెషన్ ని సాధించాలి అంటే వాళ్ళ రక్తంలో వైరస్ లోడ్ ని పూర్తిగా కంట్రోల్ చేసి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా చేయాలి. ఈ టార్గెట్ ని సాధించడానికి నాకో దేశంంతా అత్యధిక ఇన్ఫెక్షన్ రేట్ ఇంకా రిస్క్ ఉన్న 219 ప్రయారిటీ డిస్ట్రిక్ట్స్ ని ఐడెంటిఫై చేసింది.
(12:03) ఒక్క కర్ణాటకలోనే ఉన్న ఈ 31 జిల్లాల్లో ఏకంగా 27 జిల్లాల్ని హై ప్రయారిటీ డిస్ట్రిక్ట్ గా ఎంచుకున్నారు. కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ రాష్ట్రంలో జిల్లాల్ని త్రీ టైర్స్ గా డివైడ్ చేశారు. తక్కువ పర్ఫార్మెన్స్ ఉన్న టైర్ త్రీ డిస్ట్రిక్ట్స్ పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే కర్ణాటకలో కర్వార్, ఉడిపి, కొప్పల్ ఇంకా మన్యా జిల్లాలు ఫస్ట్ 95 టార్గెట్ ని రీచ్ అయ్యాయి.
(12:22) ఇంకా రాయచూర్ ఇంకా చమరజానగర్ జిల్లాలు సెకండ్ 95% ని హిట్ చేశాయి. మిగిలిన జిల్లాలు కూడా రాబోయే జిల్లాల్లో సురక్షిత్ ప్లస్ జోన్స్ గా మార్చడానికి జిల్లా కలెక్టర్స్ నాకో ప్రత్యేకమైన గైడ్ బుక్ మాన్యువల్స్ ని కూడా అందించింది. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ కి ప్రతి జిల్లా స్థాయిలో టెస్టింగ్ చేసి పుట్టబోయే పిల్లలకి ఇన్ఫెక్షన్ రాకుండా చూడడానికి స్పెషల్ మెడికల్ కిట్స్ కూడా అందుబాటులో ఉంచారు. అండ్ 2025 26 లో కర్ణాటకలో 11.
(12:43) 98 లాక్ మందికి గర్భిణీ స్త్రీలకి ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ కి టెస్ట్ చేస్తే కేవలం 451 మందికి మాత్రమే కొత్తగా పాజిటివ్ డిటెక్ట్ అయింది.క కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా గారు తెలిపిన వివరాల ప్రకారం ప్రెజెంట్ మన కంట్రీలో హెచ్ఐవ టిబి కో ఇన్ఫెక్షన్ అంటే హెచ్ఐవ ఉన్న రోగులకి ట్యుబర్క్యులోసిస్ వ్యాధి రావడం ఇంకా కొందరు రోగులు ఏఆర్టి మెడిసిన్స్ ని మధ్యలోనే ఆపేయడం లేదా సరిగ్గా వాడకపోవడం లాంటివి మెయిన్ ఇష్యూస్ గా మారాయంట.
(13:03) అండ్ వీటిని అధిగమించడానికి కమ్యూనిటీ సపోర్ట్ అండ్ కౌన్సిలింగ్ ని పెంచుతున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అతి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే సొసైటీలో హెచ్ఐవ పట్ల ఉన్న స్టిగ్మా అంటే వివక్ష ఇంకా భయం చాలా మందికి వాళ్ళకి ఏమైనా సింటమ్స్ ఉన్నాయా లేదా రిస్క్ ఎక్స్పోజర్ జరిగినా హాస్పిటల్ కి వెళ్తే ఎక్కడ వాళ్ళ పేరు బయటపడుతుందో కుటుంబంలో లేదా ఫ్రెండ్స్ లో వాళ్ళని ఎలా చూస్తారఅనే భయంతో వాలంటరీ టెస్టింగ్ కి ముందుకు రావడంలే ఈ భయాన్ని డిస్క్రిమినేషన్ ని పోగొట్టడానికి ఇండియన్ గవర్నమెంట్ హెచ్ఐవ అండ్ ఎయిడ్స్ యాక్ట్ 2017 ని చట్టంగా తీసుకొచ్చింది. ఈ చట్టం
(13:30) ప్రకారం ఏ వ్యక్తి యొక్క హెచ్ఐవ స్టేటస్ ని వాళ్ళ పర్మిషన్ లేకుండా బయట పెట్టడం తీవ్రమైన నేరం. హెచ్ఐవ ఉన్న వ్యక్తుల మీద విద్యా సంస్థల్లో ఉద్యోగాల్లో హెల్త్ కేర్ సెంటర్స్ లో లేదా నివాస ప్రాంతాల్లో ఎలాంటి డిస్క్రిమినేషన్ ని చూపించకూడదు. ఒకవేళ ఎవరైనా డిస్క్రిమినేషన్ చూపిస్తే కంప్లైంట్ చేయడానికి ప్రత్యేకంగా ఆఫీసర్స్ కూడా అందుబాటులో ఉంటారు.
(13:48) అండ్ 2021 నుంచి ఒక కర్ణాటకలోనే 108 కంప్లైంట్స్ ని ఎంక్వయిరీ కూడా చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరి కాన్ఫిడెన్షియాలిటీని కాపాడడం గవర్నమెంట్ బాధ్యత కూడా. అండ్ అలాగే ప్రతి ఒక్కరు దీని గురించి తెలుసుకోవడం కూడా మీ బాధ్యత. ఎందుకంటే అలా తెలుసుకుంటేనే మీరు ఇంకొకళ్ళ మీద డిస్క్రిమినేషన్ చూపించకుండా ఉంటారు.
(14:04) సో ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ మెడికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుందాం. అసలు హెచ్ఐవ అంటే ఏంటి అది మన బాడీలోకి వచ్చాక బయాలాజికల్ గా ఎలాంటి మార్పులు తీసుకొస్తది. హెచ్ఐవ అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఈ వైరస్ మన శరీరంలోకి ఎంటర్ అవ్వంగానే డైరెక్ట్ గా మన ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక వ్యవస్థలోని మేజర్ సెల్స్ అయినసిడి4 సెల్స్ లేదా టి సెల్స్ ని టార్గెట్ చేస్తది.
(14:23) ఈసిడి4 సెల్స్ అనేవి మన బాడీలో ఇన్ఫెక్షన్స్ మీద పోరాడే ఆర్మీ లాంటివి.హెచ్ఐవ హెచ్ఐవ వైరస్ ఈసిడి4 సెల్స్ లోకి దూరి వాటిని డిస్ట్రాయ్ చేస్తూ వాటి కాపీస్ ని వేల సంఖ్యలో తయారు చేసుకుంటుంది. ట్రీట్మెంట్ తీసుకోకపోతే కాలక్రమైన సిడి4 కౌంట్ పడిపోయి మన ఇమ్యూన్ సిస్టం పూర్తిగా బలహీనపడుద్ది. అండ్ హెచ్ ఐవ ఇన్ఫెక్షన్ ని మెయిన్ గా త్రీ స్టేజెస్ గా డివైడ్ చేయొచ్చు.
(14:40) ఫస్ట్ ది స్టేజ్ వన్ ఎక్యూట్ హెచ్ఐవ ఇన్ఫెక్షన్ వైరస్ బాడీలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇందులో జ్వరం గొంతునొప్పి రాత్రి పూట చమటలు పట్టడం అంటే నైట్ స్వెట్స్ చర్మం దద్దుర్లు రావడం కొంచెం వాపు నోట్లో లేదా ప్రైవేట్ పార్ట్స్ మీద పుండ్లు రావడం లాంటి సింటమ్స్ వస్తాయి. ఈ స్టేజ్ లో రక్తంలో వైరల్ లోడ్ చాలా ఎక్కువ ఉంటది.
(14:56) అండ్ స్టేజ్ 2 క్రోనిక్ హెచ్ఐవ ఇన్ఫెక్షన్ దాదాపు 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఎలాంటి పెద్దల పెద్ద లక్షణాలు లేకుండా సైలెంట్ గా ఉండొచ్చు. కానీ లోపలసిడిఫో సెల్స్ కౌంట్ రోజు రోజుకి తగ్గుతా ఉంటది. మూడోది స్టేజ్త్ర లేదా ఎయిడ్స్ అంటే ఎక్వైర్డ్ ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్ ఇక్కడ ఇమ్యూనిటీ పూర్తిగా జీరో లెవెల్ కి పడిపోద్ది.
(15:14) ఈ స్టేజ్ లో ఆపర్చునిటిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అటాక్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబర్క్యులోసిస్ లేదా టీబి హెచ్ఐవ ఉన్న వాళ్ళలో మరణానికి మెయిన్ కారణం టీబి ఇన్ఫెక్షన్. అలాగే పిజేప అనే ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ లంగ్స్ ని దెబ్బతీస్తది. కపోసి సర్కోమ అనే ఒక రేర్ కాన్సర్ వచ్చి చర్మంపై నోటిపై ఎర్రటి లేదా కొంచెం వేరే కలర్ లో కొంచెం మచ్చలు వస్తాయి.
(15:32) సిఎంవై వల్ల చూపు కూడా తగ్గిద్ది. అండ్ మీకు పేగుల్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓరల్ త్రష్ వల్ల నోట్లో నాలుగు పై తెల్లడి మచ్చలు ఏర్పడి ఫుడ్ మెంగడం కూడా కష్టమైద్ది. ఇలా ఈ వైరస్ మనల్ని చంపదు. కానీ మనల్ని వీక్ చేసి మనక అన్ని రకాల రోగాలు వచ్చేలా చేస్తది. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే హెచ్ఐవ ఉన్న ప్రతి ఒక్కరికి ఎయిడ్స్ రాదు.
(15:50) సరైన టైం లో డయాగ్నోసిస్ జరిగి యాంట్రీ రెట్రో వైరల్ థెరపీ లేదా ఏఆర్టి ట్రీట్మెంట్స్ రోజు వేసుకుంటే ఆ వైరస్ కంట్రోల్ లోకి వస్తది. ఇక్కడ మెడికల్ ఫీల్డ్ లో సెన్సేషనల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మొదటిది పిఈపి అంటే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రోఫిలాక్సిస్ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ లేదా యాక్సిడెంటల్ ఎక్స్పోజర్ జరిగిన 72 గంటలలోపు అంటే మూడు రోజుల లోపు గనుక వైచుల సలహాతో ఈ పిఈపి మెడిసిన్స్ వాడడం ప్రారంభిస్తే వైరస్ బాడీలో సెటిల్ అవ్వకుండా ఇన్ఫెక్షన్ ఆపొచ్చు.
(16:12) రెండోది పిఆర్జపి అంటే ప్రీ ఎక్స్పోజర్ అంటే ఎక్కువ రిస్క్ ఉన్నారు ముందుగానే టాబ్లెట్స్ వాడి వాళ్ళని వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మూడోది అన్డిటెక్టబుల్ ఈక్వల్ టు అన్ట్రాన్స్మిటబుల్ లేదా అంటే యు = యు అంటారు. అంటే ఒక వ్యక్తి ఏఆర్టి ట్రీట్మెంట్ ని క్రమం తప్పకుండా వాడి తన రక్తంలో వైరల్ లోడ్ ని కనపడినంత తక్కువ స్థాయికి తీస్తే ఆ వ్యక్తి ద్వారా తన సెక్షువల్ పార్ట్నర్ కి హెచ్ఐవ అసలు స్ప్రెడ్ అవుతుంది.
(16:31) చివరిగా హెచ్ఐవ ఎలా స్ప్రెడ్ అయిది ఎలా వ్యాపించదనే క్లారిటీ అందరికీ కావాలి. అన్ ప్రొటెక్టెడ్ సెక్షువల్ కాంటాక్ట్ గాని లేదా కొంచెం అన్ హైజినిక్ ఇంజెక్షన్ నీడిల్స్ షేర్ చేసుకోవడం గానీ లేదా సరైన ట్రీట్మెంట్స్ లేకపోతే హెచ్ఐవ ఉన్న తల్లి నుంచి పుట్టే బిడ్డకి మాత్రమే అది స్ప్రెడ్ అయిద్ది. అంతే తప్ప హెచ్ఐవ ఉన్న వ్యక్తితో హ్యాండ్ షేక్ చేయడం వల్ల హగ్ చేసుకోవడం వల్ల ఒకే ఒకే ప్లేట్ లో కలిసి తినడం వల్ల ఒకే వాష్ రూమ్ వాడడం వల్ల దోమలు కొట్టడం వల్ల హెచ్ఐవ స్ప్రెడ్ అవ్వదు.
(16:54) సో సేఫ్ గా ఉండండి అందరినీ సేఫ్ గా ఉంచండి. ముఖ్యంగా స్టూడెంట్స్ కి చెప్పేది ఏంటంటే ఈ టైం లో చాలా రకాల కోరికలు వస్తా ఉంటాయి. బట్ ఇలాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి ఎవరికి హెచ్ఐవ ఉందో ఎవరికి లేదో మనం చెప్పలేం. సో దయచేసి సేఫ్ గా ఉండండి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి షేరింగ్ ఇస్ కేరింగ్ అండ్ మీ లైఫ్ లో మేమ ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసామ అనుకుంటున్నాం.
(17:13) మీరు కూడా మా లైఫ్ లో వాల్యూ యాడ్ చేయాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకుంటే మేము పోస్ట్ చేసే ప్రతి ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. ఈ ఇన్ఫర్మేషన్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ కి చాలా అవసరం కాబట్టి దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో ఈ వీడియోని షేర్ చేయండి.
(17:32) అండ్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యు సో మచ్ దిస్ ఈస్ యువిఆర్ సైనింగ్ ఆఫ్
No comments:
Post a Comment