Friday, July 31, 2026

మనల్ని రక్షించేది దేవుడా? ధర్మమా? Who Really Protects You: God or Dharma?

మనల్ని రక్షించేది దేవుడా? ధర్మమా? Who Really Protects You: God or Dharma?

Author Name:maruthi kiran Poruri

Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri

Youtube Video URL:https://www.youtube.com/watch?v=eAfSYOODaKU



Transcript:
(00:01) టైటిల్ చూశరు కదండీ మనల్ని రక్షించేది ధర్మమా భగవంతుడా ధర్మం వినండి ఇప్పుడు భాషాపరంగా ధర్మాన్ని గనుక మనం మామూలుగా అనుకుంటే అది ఒక నామవాచకం అంతే కదా అర్థం చేసుకుంటే మటుకు అద్భుతం అండి అమలుపరిచామ అనుకోండి చివరికి మనకి కలిగేది మోక్షమే నేను అన్నమాట కాదండి శాస్త్రాలు ఉపనిషత్తులు వేదాలు చెబుతూనే ఉన్నా ఉన్నాయి మనల్ని రక్షించేది ధర్మమే అనంగానే మొట్టమొదటిగా మనకు ఆశ్చర్యం వేస్తుంది కదా భగవంతుని కంటే ధర్మం గొప్పదా అన్న సందేహం కూడా వస్తుంది.
(00:46) సమాధానం ఒకటేనండి ధర్మమే భగవంతుని యొక్క స్వరూపం ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మానికి జ్ఞాని కలిగినప్పుడు భగవంతుడు అవతారం తీసుకుంటాడు. ఇప్పుడు నువ్వు ధర్మాన్ని రక్షించు ధర్మం నిన్ను రక్షిస్తుంది అన్నది ఒక పెద్ద అపోహ అండి ఎందుకో దాన్ని అలా ప్రచారం చేశారు అంతే ఎవరో కొంతమంది దాన్ని బాగా వివరించారు అనుకోండి ఈ గివ్ అండ్ టేక్ పాలసీ ధర్మానికి లేదండోయ్ బేరసారాలు ఉండవు ధర్మం దగ్గర [నవ్వు] నీ చేత రక్షింపబడే దుస్థితి నిజంగా
(01:33) ధర్మానికి ఎప్పటికీ కలగదు లేనే లేదు ధర్మాన్ని రక్షించే ఒక హైయర్ స్టాండర్డ్స్ మనకు లెవ్వండి. మరి ఏంటి ఇది కదా మనం వేసుకోవాల్సిన ప్రశ్న [గొంతు సవరించుకోవడం] ఇప్పుడు ధర్మాన్ని గనుక నువ్వు ఆచరిస్తే నీకు ఆపద కలిగినప్పుడు నీ చేత ఆచరించబడిన ధర్మమే నిన్ను కాపాడుతుంది నిన్ను రక్షిస్తుంది. అది ధర్మో రక్షతి రక్షితః అంటే అంటే ధర్మాన్ని పరమాత్ముడు మాత్రమే ఉద్ధరించగలడండోయ్ ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే ముప్పవరపు సింహాచల శాస్త్రి గారని గొప్ప
(02:22) హరికథకులు ఉన్నారండి ఈ మధ్య వారి వీడియోలు బాగా వస్తున్నాయి. వారి ఈ మాటలు వింటే ఆ మనం కూడాను అసలు మంత్రముగ్ధం అయిపోతామండి వారు అన్న మాటల్ని నేను రాసుకొని మీకు ప్రస్తావిస్తున్నాను అన్నమాట అది అసలు ఈ ధర్మో రక్షతి రక్షితః అన్నది ఇదొక సృష్టి నియమం అండి అంతే మన దగ్గరికి వచ్చేటప్పటికి అది ఒక లా ఆఫ్ లైఫ్ అంతే మీకు తెలుసు కదా నేను ఉదాహరణ ఇవ్వందే అసలు వీడియో చేయనుని చెప్పేసి ఇప్పుడు మీకు ఒక పోలీసు అధికారి బాగా తెలుసండి ఎలా సిగ్నల్ పడ్డా కూడాను మీరు దాన్ని
(03:06) దాటేశరు. అప్పుడు మిమ్మల్ని కాపాడేది ఆయన పరిచయమా కాదు కదండీ ఈ ట్రాఫిక్ నియమమే మిమ్మల్ని కాపాడుతుంది. అంటే ఆ నియమాన్ని గనుక పాటిస్తే కాబట్టి అదే ధర్మం అండి అదే ధర్మం మహా అయితే మీకు పరిచయం ఉన్న పోలీస్ అధికారి ఉన్నాడు కదా మీ జరిమానాని మాఫీ చేయొచ్చు అంతకంటే ఆయనఏం చేయలేడండి కానీ అదే ఒక ఆటిట్యూడ్ గా గనక మీరు బయలుదేరితే ఎప్పుడో ఒకప్పుడు ధర్మాన్ని ఉల్లంగించిన వాళ్ళు అయతారు ప్రమాదంలో ఇరుక్కునే అవకాశం ఉంటుంది ఇక్కడ ఇంకో ప్రశ్న అండి భగవంతుడు కూడా ధర్మానికి కట్టుబడి ఉంటాడా ఇంతకు మించిన అమాయకపు ప్రశ్న లేదండి ఇంతకు
(03:53) మించిన ఆ అసంబద్ధపు ప్రశ్న కూడాను లేదు [నవ్వు] భగవంతుడే ధర్మం అండి ధర్మం ఉన్నచోటే ఆయన ప్రత్యక్షమైతాడు అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు కదా యదా యదాహి ధర్మస్య జ్ఞానిర్భవ తి భారత అని చెప్పాడు కదా ఇప్పుడు నన్ను పూజించిన వాళ్ళందరినీ నేను కాపాడతాను అని చెప్పేసి భగవంతుడు అనలేదండి ఆయన ఏమన్నాడంటే ధర్మానికి హాని జరిగినప్పుడు తప్పకుండా వస్తాను అని అన్నాడండి ఇప్పుడు కృత యుగం త్రేతా యుగం ద్వాపర యుగాల్లో కూడాను అలాగే వచ్చాడు కదా మన పురాణాలన్నీ [గొంతు సవరించుకోవడం] అవే చెప్తున్నాయి కదండి
(04:37) ఇప్పుడు రామో విగ్రహం ధర్మః అన్నారు ఆయన చేసింది ఏంటండి తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలేశడు ఎందుకు వదిలేశడు ధర్మాన్ని కాపాడటానికి రామాయణం అలా చదువుతూ ఉంటే అడవులకి వెళ్ళిన తర్వాత ఆయన చేసింది ఇదే కదండీ ధర్మాన్ని కదా కాపాడింది రాముని రక్షించింది కేవలం ఆయన విల్లు కాదండి ఆయన ధర్మమే ఆయన్ని రక్షించింది. ఎందుకంటే మానవ స్వరూపంగా త్రేతా యుగంలో భూమిమీద అవతరించాడు కదా ఆయన మీరు ధర్మవేదల వృత్తాంతం చదివినా కూడాను ఇంతేనండి ఆయన స్వధర్మాన్ని పటించాడు కాబట్టి అంత మహాజ్ఞాని అయ్యాడు అన్నమాట అంతే
(05:24) ఇప్పుడు దీని క్వైట్ రివర్స్ ఇంకొక ఉదాహరణ చెప్తాను రావణుడు ఉన్నాడు ధర్మాన్ని విడిచిపెట్టాడు ఏమైంది చివరికి శిక్షింపబడ్డాడా లేదా ఇప్పుడు ఆయన జ్ఞానము పూజలు అభిషేకాలు ఆయన ఏమనా రక్షించాయా రక్షించలేదు కదండీ సేమ్ ఇస్ ద కేస్ విత్ దుర్యోధన అంతేనండి [గొంతు సవరించుకోవడం] ప్రహలాదుడు కూడా చూడండి తండ్రి తప్పు చేస్తున్నప్పుడు తండ్రికి నో చెప్పేసాడు.
(05:51) చిన్న పిల్లవాడైనా సరే ధర్మాన్ని పట్టుకున్నాడు చివరికి నరసింహ స్వామి ప్రత్యక్షమయ్యాడు అంటే భగవంతుే ప్రత్యక్షం చేసుకున్నాడు. ధర్మాన్ని పెట్టుకుంటే అదే ండి జరిగేది ఈ కలియుగంలో ఆ ధర్మం మానుష రూపేణ అన్నట్టుగా నడుస్తూ ఉంటుంది ఇది మన అనుభవంలోకి వస్తున్నది అనండి ఇప్పుడు ఇంకా ముఖ్యమైన విషయం కూడా ఉందండి ఇక్కడ ఏంటంటే ప్రకృతి కూడా ధర్మమే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు రోజు ఉదయిస్తాడు భూమి తన కక్షలో చాలా సిన్సియర్ గా తిరుగుతూ ఉంటుంది గాలి తన పని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నీరు ఉంది.
(06:29) కదా అది పళ్లానికి ప్రవహిస్తూ ఉంటుంది అందుకనే కదా నీరు పల్లం ఎరుగు నిజం దేవుడు ఎరుగు అని చెప్పేసి ఇప్పుడు అగ్ని ఉందండి భక్తుడు ముట్టుకున్న నాస్తికుడు ముట్టుకున్నా కూడా అది కాలుతుంది కదా అది దాని ధర్మం అంతే ఎవరనా వీటికి ఆదేశాలు ఇస్తున్నారా ఇవ్వట్లేదండి ప్రకృతి తన ధర్మాన్ని ఇలా నిర్వర్తించుకుంటూ పోతున్నది అంతే అలా మనిషి కూడాను తన ధర్మాన్ని పాటిస్తే జీవితం కొంచెం బ్యాలెన్స్డ్ గా ఉంటుందండి కష్టాలు అంటారా మనం బోధిమలో ఏదో చేసుకున్నాము వాటిని మనం అనుభవిస్తున్నామ అనుకోండి అది వేరు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉంది ఇక్కడ భగవంతుని మనం చూసామా ఆయన్ని వ్యక్తి అని
(07:13) అనడానికి చూడలేదు కదండీ రూపాలని మనం క్రియేట్ చేసుకున్నాం అంతే కదా అయితే వ్యక్తి అని అనుకోవడంలో తప్పేమ లేదు లేండి అదేమో అపనింద కాదు కదా అయితే ఒక్కటి మటుకు మనం చూసి గా విశ్లేషించాలి అది ఏంటంటే భగవంతుడు ధర్మం ద్వారా పని చేసే ఒక చైతన్యం మీరు అవసరమైతే రాసుకోవచ్చుండి భగవంతుడు ధర్మం ద్వారా పని చేసే ఒక గొప్ప చైతన్యం అంతే ఇప్పుడు ధర్మం అంటే కేవలం పూజలు కాదండి ధర్మం అంటే ఏంటంటే సత్యం మాట్లాడటం ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం అన్యాయం చేయకపోవటం కర్తవ్యాన్ని నిర్వహించడం కరుణతో జీవి జీవించటం
(07:58) అలాగే కలిగిన మనం నలిగిన వాడని ఆదుకోవడం అసలు మనకు ఉన్న సంపద అంతా కూడాను భగవంతుడు ఇచ్చిందే కదండీ పూర్వ జన్మలో ఏదో చేశమో దాని ఫలితాన్ని మనకి సంపద రూపంలో భగవంతుడు ఇచ్చాడు అంతే కదండ ఇప్పుడు చాలా సందర్భాల్లో భగవంతుని పిలవవలసిన అవసరం కూడా ఉండదండి ఎందుకంటే మీరు గనుక ధర్మాన్ని పాటిస్తే భగవంతుడు ధర్మ రూపంలో మీతోనే ఉంటాడు.
(08:32) భగవంతుడు కోరికలను తీర్చే శక్తి కాదండి ధర్మాన్ని నడిపించే శక్తి ఇప్పుడు ధర్మాన్ని పాటించిన వాడికి భగవంతుని వెతకవలసిన అవసరం లేదు అని నేను అనను గానీ అవసరం తగ్గుతుందండి ఎందుకంటే ధర్మం ఉన్నచోటే దైవం ఉంటుంది కదా ఆ నమ్మకంతోనే కదండీ మనం పూజలు చేసినా వ్రతాలు చేసినా తీర్థయాత్రలు చేసినా గోళ్ళక వెళ్ళినా కూడాను భగవంతుడు మనల్ని రక్షిస్తాడు అని అంటే ఇన్ని చేసినా కూడాను మనం ధర్మాన్ని డెవలప్ చేసుకోవడానికి మనం చేస్తున్నామ అన్న భావనతో చేయాలండి అంతకంటే
(09:18) ఏం లేదండి ఇప్పుడు ధర్మం అన్నది మతం కాదండి ధర్మం అంటే సృష్టిని ఆ మాటక వస్తే మానవాళని నడిపించే ఒక గొప్ప విశ్వ నియమం అంతే అంతేనండి ఇప్పుడు సంస్కృతంలో ధర్మ అనే పదానికి ఒక అద్భుతమైన అర్థం ఉందండి అదేంటంటే [గొంతు సవరించుకోవడం] అందరూ చెప్తూ ఉంటారు కదా పండితులు ధారయతి ఇతి ధర్మ అంటే ఏదైతే ఈ ప్రపంచాన్ని నిలబెడుతుందో అదే ధర్మం ఈ వాక్యం కూడా రాసుకోవాల్సిన వాక్యం అండి ఏదైతే ఈ ప్రపంచాన్ని నిలబెడుతుందో అదే ధర్మము అంతేనండి ఇప్పుడు గ్రావిటీ ఉందండి దాన్ని మనం
(10:06) తెలుగులో ఏమంటాం గురుత్వాకర్షణ శక్తి అంటాం కదా మంచి వ్యక్తి అయినా చెడ్డ వ్యక్తి అయినా భక్తుడైనా నాస్తికుడైనా ఓ 10 అంతస్తుల బిల్డింగ్ నుంచి కిందకి పడ్డాడు అనుకోండి ఏమైతాడు ఇద గాయాలు అవుతాయి కిందకి పడిపోతాడా లేదా సో ఇక్కడ గ్రావిటీకి పక్షపాతం ఉందా అండి లేదు కదా ప్రకృతి నియమాల్లో గ్రావిటీ అనేది కూడాను ఒక విషయం అండి అదే ధర్మం అందుకంటే ఏం లేదు ఇప్పుడు గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పింది ఇదే కదా నేను నీ బదులు యుద్ధం చేస్తాను అని అన్నాడా అనలేదు కదండీ నువ్వు స్వధర్మాన్ని అనుసరించు నీ పక్కనే నేను ఉంటాను అన్నాడు అలా
(10:51) ఉన్నాడు ధర్మాన్ని రక్షించాడు మళ్ళీ లౌకికంగా ఒక ఎగ్జాంపుల్ కి వద్దాంండి ఎందుకంటే మనంఅంతా కూడా లౌకిక జీవులం కదా నేను కోర్ట్లో పని చేశను కాబట్టి ఉదాహరణ ఇస్తానండి జడ్జి తన కొడుకుకి కూడాను శిక్ష విధించాడని అనుకుందాం. ఇప్పుడు అతను ధర్మాన్ని నిలబెట్టినట్టే కదా తన కొడుకుని ద్వేషించాడా ద్వేషించలేదు కదా భగవంతుడు కూడా అంతేనండి ఆయన దృష్టిలో జనాల్ని శిక్షించడం కాదు ధర్మాన్ని నిలబెట్టడమే భగవంతుడి యొక్క ఏకైక కర్తవ్యం ఇందాక నేను అన్నాను కదా మనం చేసుకున్నవన్నీ మన పూర్వజన్మ కర్మలే వాటి ఫలితమే మనం అనుభవిస్తూ ఉంటాం మంచి అయితే
(11:36) మంచి అనుభవిస్తాం చెడైతే చెడు అనుభవిస్తూ ఉంటాం నాటుకున్నాం కోసుకున్నాం అంతే కదండీ ఇప్పుడు గుడికి వెళ్ళండి భక్తితో వెళ్ళండి భగవంతుడు కేవలం సంతోషపడతాడు అంతేనండి మళ్ళీ బయటికవచ్చి స్వార్ధానికి పోయామ అనుకోండి కొబ్బరికాయలు అమ్మేవాడి దగ్గరో లేకపోతే ఆ అడుక్కునే వాడి దగ్గర మనం చెప్పులు పెడతాం చెప్పులు పెడితే కొంచం చూసుకోవయ్యా అంటాం అతను చూసుకుంటాడు చెప్పులు వేసుకొని అలా వెళ్ళిపోతే ఎలాగండి ఇక్కడ ధర్మాన్ని మనం అధికమించినట్టే కదా కాబట్టి బయటిక వచ్చి గనుక ఇలా స్వార్ధానికి పోతే ఎప్పుడో ఒకప్పుడు మనం శిక్షని అనుభవించక తప్పదం అంటే
(12:21) ఇవి ఒక ఆటిట్యూడ్ గా మారి వాసనలుగా మారి బతికిన్నప్పుడే మనల్ని శిక్షిస్తాయి లేకపోతే మన శ్వాసల సంఖ్య అయిపోయిన తర్వాత కొంత బాలెన్స్ మిగులుతుంది కదా అది వచ్చే జన్మకి క్యారీ ఫార్వర్డ్ అయి మళ్ళీ మనం శిక్షణ అనుభవిస్తామండి. మంచి చేసినప్పుడు కూడా ఇదే జరుగుతుందండి ఇదే ప్రిన్సిపల్ ఇప్పుడు ధర్మం అనేది ఒక విశ్వ నియమం అండి ఆ నియమంతో ఆ నియమబద్ధంగా జీవించినప్పుడు ప్రకృతి మనకి తప్పకుండా హెల్పర్ గా మారుతుందండి అంతకంటే ఏం లేదు ఇంకో ఉదాహరణ ఇస్తానండి చాలా ముఖ్యమైన ఉదాహరణ దీన్ని కూడా మనందరం పట్టుకోవాలి.
(13:03) ఇప్పుడు నది సముద్రం వైపు ప్రవహిస్తుంది. కదండీ ఈ సముద్రం అనేది సత్యం అండి నోట్స్ రాసుకుంటే నాకు దొరికిన విషయం అన్నమాట ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ ప్రవహించే దారి ఉంది చూశరా అంటే ఈ నది యొక్క ప్రయాణం ఉంది చూసారా అది ధర్మం అండి ఈ ప్రవహించే చర్య ఉంది కదా అది కర్మ చివరికి సముద్రంలో కలవడం అనేది మోక్షం అండి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి వేదాంతం అనుకోండి ఆధ్యాత్మికం అనుకోండి ఇక్కడ నది కొత్తగా సముద్రంలోకి వెళ్ళలేదండోయ్ తన మూలానికి తిరిగి మళ్ళీ చేరుకుంది.
(13:47) అంతేనండి సముద్రము ఆవిరైపోయి మేఘాలుగా ఏర్పడి అది మళ్ళీ భూమిమీద పెల్లకాలువలాగా నదిలాగా ఏర్పడి మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగించి ఆటోమేటిక్ గా మళ్ళీ కలిసేది ఎక్కడండి సముద్రంలోనే కదా అంటే తన మూలానికి చేరుకుందని అర్థం అంతే కదండీ అట్లాగే మోక్షం అంటే కొత్త ప్రపంచానికి వెళ్ళటం కాదండోయ్ మనం మన అసల స్వరూపాన్ని తెలుసుకోవడమే మన మూలాన్ని తెలుసుకోవడమే ఆ మూలానికి చేసే ప్రయాణం వేగవంతంగా ఉండాలి అంటే మనం ధర్మాన్ని ఎట్టి పరిస్థితులో కూడాను అతిక్రమించకూడదు ధర్మాన్ని పాటించాలి అంతే అంటే ధర్మాన్ని అతిక్రమిస్తున్నాము అంటే
(14:32) మనం సృష్టి ప్రవాహానికి ఎదురెదుతున్నామ అని అర్థంఅండి అప్పుడు మనకి బాధ తప్పదు. అటండి సృష్టి ఎప్పుడు మనకు వ్యతిరేకం కాదండోయ్ సృష్టి ఎప్పుడు మనకు వ్యతిరేకం కాదు మనల్ని జీవింపచేయడానికి అద్భుతంగా మోక్షం వైపుకి మనల్ని తీసుకెళ్ళడానికి ఏర్పడిన సృష్టి ఇది భగవంతుడు అంత దయామయుడు ఎంత కరుణామయుడు ఇలా గనుక మనం ధర్మ వ్యవస్థని అర్థం చేసుకోగలిగితే భగవంతుని అర్థం చేసుకోవడమేనండి ఎందుకంటే వేరేది ఏమీ లేదు సో ఇప్పుడు చెప్పండి మనల్ని రక్షిస్తున్నది రక్షించేది ధర్మమా భగవంతుడా
(15:18) ధర్మంలో జీవించటమే అసలైన ఆ భగవంతుడికి మనం చేసే ప్రార్థన అండి అంతే ఇదే గనుక ఈ ధర్మంలో జీవించటమే గనుక కృతజ్ఞతగా గనక మారితే అంతకు మించిన భక్తి లేదండి అంతకుమించిన భక్తి లేదు భగవంతుడా నువ్వు ఉన్నావు నువ్వు నన్ను నడిపిస్తున్నావు నేను కూడాను ధర్మ మార్గంలో ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడుతున్నాను. ఇదంతా నీదయే అని త్రికరణ శుద్ధిగా నమ్మి అలా గనుక ప్రయాణం గనుక సాగిస్తే అంతకుమించిన భక్తి లేదండి.
(15:53) అంతేనండి ఈ వీడియోని ఒకటికి రెండు సార్లు గనక విన్నట్లయితే మనలో ఉన్న కాఠిన్యం కొంత కాకపోతే కొంత కలుగుతుందండి. కోపతాపాలకి దూరంగా ఉంటాం. పరిషెడ్ వర్గాలని జయించడానికి బహుశా ఈ వీడియో ఏమన్నా మొదటి మెట్టు అవుతుందేమో కదండీ ఏదో చదువుకుంటున్నాను నాకు కొన్ని వాక్యాలు కనపడ్డాయి దాని మీద నేను పుస్తకాలు అవి వెతికి కొంత ఇంటర్నెట్ లో చూసి ఇలాగా నోట్స్ తయారు చేసుకొని మీ ముందుకి వచ్చానండి ఈ వీడియో చేయడానికి సో ఇదండీ ఈ వీడియోలో సంగతి ఇవన్నందుకు కృతజ్ఞతలు నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎంతో మందికి షేర్ చేయండి నాతో మాట్లాడాలి
(16:34) అనుకుంటే హాయిగా మాట్లాడండి నాకు ఫోన్ నెంబర్ 9491063089 బెల్ ఐకాన్ లైక్ బటన్ అంటారా మీరు ఏటో నొక్కుతూనే ఉన్నారు. కాబట్టి అలా నొక్కటం కూడా భగవంతుడి దయనండి కిరణ్ గారు మంచి వీడియోలు చేస్తున్నారు ఆ మనం ఎంకరేజ్ చేయకపోతే ఎలాగా అని మీరు అనుకున్నారు అనుకోండి అదే మీరు నా మీద చూపించే గొప్ప దయ అండి.
(17:01) అయితే ఒక చిన్న రిక్వెస్ట్ కూడా ఉంది నేను కూడా మానవ మాత్రుని కదా నేను ఎక్కడున్నాను ఏమిటి అన్నది నాకు తెలవాలి అంటే మీరు నా భుజం తట్టాలండి ఆ భుజం తట్టడం అంటే ఏమిటో కాదు కామెంట్ బాక్స్ లో మంచి మెసేజ్ పెట్టడమే [నవ్వు] అంతకంటే ఏం లేదండి నమస్కారం థాంక్యూ

No comments:

Post a Comment