తాళం వేసిన సైకిల్కు తుప్పు… కుర్చీలో కూర్చున్న శరీరానికి? | Dr M S S Mukharjee
Author Name:Dr M S S Mukharjee | Pulse Heart
Youtube Channel Url:https://www.youtube.com/@DrMukharjeeOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=cGrFRES4hdw
Transcript:
(00:00) కొత్త సైకిల్ కొనుక్కొని ఏడాది పాటు తాళం వేసి ఉంచితే ఏమవుతుంది తుప్పు పడుతుంది చైన్ గట్టిపడుతుంది టైర్ లో గాలి తగ్గిపోతుంది. మన శరీరం కూడా అంతే అది కదలటానికి తయారైంది కదలకుండా ఉంచితే నెమ్మదిగా సమస్యలు మొదలవుతాయి. నమస్తే నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ని కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
(00:18) ఈ రోజుల్లో ఒక మాట చాలా వినిపిస్తుంది సిటింగ్ ఇస్ ద న్యూ స్మోకింగ్ అని అంటే కూర్చోవడం సిగరెట్ తాగినంత ప్రమాదం అని కాదు కానీ గంటల తరబడి కదలకుండా కూర్చోవడం మన ఆరోగ్యానికి ఒక పెద్ద శత్రువుగా మారుతుంది. ఒక్కసారి ఆలోచించండి ఉదయం కార్లో ఆఫీస రోజంతా కంప్యూటర్ ముందు కూర్చోవడం ఇంటికి వచ్చాక సోఫా పడుకునే ముందు మొబైల్ రోజంతా శరీరం కదలట్లేదు కానీ గుండె మాత్రం ఆ నష్టాన్ని భరిస్తోంది.
(00:42) ఎందుకంటే శరీరం కదలకపోతే షుగర్ ఎక్కువ సేపు రక్తంలోనే ఉంటుంది. ఫ్యాట్స్ సరిగ్గా ఖర్చు కావు రక్త ప్రసారం మందగిస్తుంది. బరువు బీపి షుగరు గుండె దబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది మన రోజువారి చిన్న చిన్న కదలికలనుఎఏటి అంటారు అంటే నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ ధర్మోజెనసిస్ అంటే వ్యాయామం కాకుండా మనం చేసే నడక నిలబడటం చిన్న చిన్న పనులు ఇవన్నీ మేటర్ అవుతాయి.
(01:10) ఈ నీట్ తగ్గిపోతే మన ఆరోగ్యం పైన ప్రభావం పడుతుంది. శాస్త్రం కూడా ఇదే చెప్తుంది. రోజుకు ఎనిమిది గంటల కంటే ఎక్కువ సేపు కూర్చునే వాళ్ళలో గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా కనబడుతుంది. మరొక విషయం ఏంటంటే ప్రతి 30 నుంచి 60 నిమిషాలకు కేవలం ఒకటూ టు త్రీ మినిట్స్ లేచి నడిచినా కూడా ఉపయోగం ఉంటుంది. మీరు రోజు వ్యాయామం చేస్తున్న సరే మధ్య మధ్యలో కదలడం చాలా అవసరం.
(01:32) అందుకే ప్రతి అరగంటకు ఒకసారి లేచి నడవండి. ఫోన్ లో మాట్లాడేటప్పుడు నిలబడి లేదా అని నడుస్తూ మాట్లాడండి. లిఫ్ట్ బదులు తక్కువ అంతస్తులు ఉంటే మెట్లుఎక్కి వెళ్ళండి నీళ్లు తాగడానికి కూడా లేచి వెళ్లి తీసుకోండి తాళం వేసి పెట్టిన సైకిల్ కి తుప్పు పడుతుంది. కదలకుండా ఉంచిన శరీరానికి జబ్బులు వస్తాయి. మీ శరీరానికి ప్రతిరోజు కదలిక అనే బహుమతిని ఇవ్వండి మీ గుండె దానికి తప్పకుండా మీకు ధన్యవాదాలు చెప్తుంది. నమస్తే.
No comments:
Post a Comment