Friday, July 31, 2026

ఉదయాన్నే టీ తాగుతున్నారా? ఇది తెలిస్తే ఇక టీ జోలికి వెళ్లరు - TV9

ఉదయాన్నే టీ తాగుతున్నారా? ఇది తెలిస్తే ఇక టీ జోలికి వెళ్లరు - TV9

Author Name:TV9 Telugu Digital

Youtube Channel Url:https://www.youtube.com/@TV9TeluguDigital

Youtube Video URL:https://www.youtube.com/watch?v=2_hSOVZh3eQ



Transcript:
(00:00) ఉదయం లేవగానే వేడి వేడి టీ తాగడం చాలా మందికి అలవాటు అయితే ఈ చిన్న అలవాటే మన ఆరోగ్యానికి ఎంత పెద్ద హాని చేస్తుందో మీకు తెలుసా ఉదయం మాత్రమే కాదు మధ్యాహ్నం భోజనం తర్వాత లేదంటే ఉదయం టిఫన్ చేసిన వెంటనే చాలా మంది టీ లేదా కాఫీ తాగుతుంటారు. ఈ అలవాటు మరీ డేంజర్ అంటున్నారు ఆరోగ్య నిపునులు. నిపుణల ప్రకారం లేవగానే టీ తాగడం కాఫీ లేదా భోజనం చేసిన తర్వాత టీ తాగడం వల్ల మన శరీరంలో ఐరన్ లోపానికి దారి తీస్తుందని ఆరోగ్య నిపుణలు హెచ్చరిస్తున్నారు.
(00:26) ముఖ్యంగా అల్పాహారం లేదా భోజనంతో పాటు అలాగే భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల ఆహారంలోని ఐరన్ను శరీరం గ్రహించే శక్తి గణనీయంగా తగ్గిపోతుంది. టీలో ఉండే టానిన్లు, పాలిఫెనాల్స్ అనే సహజ సమ్మేళనాలు మనం తినే ఆకుకూరలు, పప్పు ధాన్యాలు విత్తనాలలో ఉండే నాన్హీమ్ ఐరన్ తో సంబంధం ఏర్పరచుకుంటాయి. దీనివల్ల జీర్ణ వ్యవస్థ ఐరన్ ను సరిగ్గా పీల్చుకోలేదు అయితే మాంసాహారం నుంచి లభించే ఐరన్ పై టీ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది.
(00:53) భారతదేశంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ఇప్పటికే మహిళలు చిన్నారల్లో రక్తహీనత తీవ్రంగా ఉంది. ఇలాంటి సమయంలో టీ తాగే సమయంపై అవగాహన లేకపోతే ఐరన్ లోపం మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. శరీరంలో ఐరన్ తగ్గితే తీవ్రమైన అలసట, నీరసం, ఏకాగ్రత లోపించడం, చర్మం పాలిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి టీ ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని నిపునులు చెబుతున్నారు.
(01:16) భోజనానికి టీ తాగడానికి మధ్య కనీసం ఒకటి నుంచి రెండు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. అలాగే ఆకుకూరలతో పాటు నిమ్మ ఉసిరి వంటి విటమిన్ సి లభించే ఆహారాన్ని తీసుకుంటే ఐరన్ శోషణ పెరుగుతుంది. టీ తాగే సమయాన్ని కాస్త సర్దుపాటు చేసుకుంటే టీ ప్రయోజనాలను పొందుతూనే ఐరన్ లోపాన్ని సులభంగా అరికట్టవచ్చు.

No comments:

Post a Comment