మానవ హక్కుల సంఘాలు నిద్ర పోతున్నాయి! || @sridevi_vlogs515
Author Name:RAJAHMAHENDRI__SRIDEVI
Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515
Youtube Video URL:https://www.youtube.com/watch?v=CTAPqwgMM9Y
Transcript:
(00:00) హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక వీడియో చూశనండి ఆ వీడియో పాతదా కొత్తదా కాదు అందులో ఏం జరిగిందో అన్న విషయంపై మనం చర్చించుకుందాం ఎందుకంటే ఈ సమస్య ఎక్కడితో పోదు ఎప్పటికప్పుడు సమస్య తలెత్తుతూనే ఉంటుంది అప్పటికప్పుడు పోలీసు వారు వచ్చి తక్షణ చర్యలు చేపడతారు బాధితులకి న్యాయం జరుగుద్ది అన్న భరోసా ఇస్తారు ఎప్పటికో అరాచకాలని చేసిన వాళ్ళని శిక్షిస్తారు ఇవన్నీ పక్కన పెడితే వారికి సరైన శిక్షలు అసలు పడక మళ్ళీ ఇటువంటి దృశ్యాలే మనకి కనిపిస్తాయి ఇటువంటి ఇబ్బందులే తలెత్తుతూ ఉంటాయి.
(00:38) ఇంతకీ దేని గురించి మాట్లాడుతున్నారు మీరు అని నన్ను అడగొచ్చు. ఈరోజు చూసిన వీడియో ఏంటంటే ఒక ఆరుగురు అబ్బాయిలు కలిసి ఒక అమ్మాయిని చిత్ర హింసలు పెట్టి మానభంగం చేశారు అంటే ఆ అమ్మాయి ఉత్తరప్రదేశ్ కి చెందిన అమ్మాయి చిత్రకూట్ జిల్లా అంట మరి ఊరి పేరు నాకు సరిగ్గా గుర్తులేదు మీరు కూడా ఆ వీడియో చూసే ఉంటారు వేటగాడ చేతిలో పావురం ఎలాగా గిలగిలా కొట్టుకుంటుందో ఆ పాప అందులో అంత ఇబ్బంది పడింది అన్నమాట మరి ఆ అమ్మాయి ఒక్కదే వచ్చిందా అంత నిర్మానుషమైన ప్రదేశానికి లేదా బాయ్‌ఫ్రెండ్ తో వచ్చిందా కొంతమంది ఆకతాయలు వాళ్ళని చూసి ఆ బాయ్‌ఫ్రెండ్ ని కొట్టి లేదా చంపేసి ఈ
(01:20) అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారా అవన్నీ నాకు తెలియదు ఇవన్నీ నేను మాట్లాడటానికి చేయలేదు ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతుంది అసలు సమస్య ఎక్కడ తలెత్తుతుంది అని చెప్పడానికి మిమ్మల్ని అడగటానికి ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఎప్పటికప్పుడు ఇటువంటి విషయాలే ఆడపిల్లలకి మనం ఒక అవగాహన కల్పించట్లేదా అంటే ఎవరితో పడితే వాళ్ళతో బయటికి వెళ్ళకూడదు ఇంట్లో చెప్పి వెళ్ళాలి తల్లిదండ్రులు మాట వినాలి ఫ్రెండ్స్ అని లేదా ఎక్కడో అడవుల్లోకి కొండల్లోకి రీల్స్ చేసుకోవటానికి వెళ్ళటాకని ఆ పిక్నిక్ కానీ ఒక మంచి ప్రదేశాలు చూడటాకని టూర్లక ఇటువంటి ఆట్లన్నిటికీ ఆడపిల్లని ఊరికి
(02:02) ఈజీగా పంపించేస్తున్నారు. ఇదివరకు రోజుల్లో ఆడపిల్లని గుమ్మం కూడా దాటనిచ్చేవారు కాదు తర్వాత చదువులు ట్యూషన్లు కట్టడిలోనే ఉంచుకునేవాళ్ళం కానీ ఈ జనరేషన్ పిల్లలు మరి ఎందుకు పాడవుతున్నారు ఎక్కడికి పంపించాలి పంపించకూడదు కొంతకాలం అంటే ఒక ఏజ్ వచ్చేంతవరకు పిల్లల్ని అంటిపెట్టుకొని ఉండాలి వాళ్ళకి మంచి చెడ్డలు చెప్పాలి అని కూడా తెలియట్లే ఇప్పుడు పిల్లలకి జ్ఞానోదయం అవ్వట్లేదు అంటే మెచూరిటీ లెవెల్స్ అసలు పెరగట్లేదు 25 28 30 దగ్గరలోకి గాని వాళ్ళక ఒక అవగాహన రావట్లేదు నిర్మానుషమైన ప్రదేశాలకి ఎందుకు వెళ్తున్నారు ఎవరితో పడితే వాళ్ళతో ఎందుకు
(02:38) వెళ్తున్నారు వెళ్ళినప్పుడు ఆడపిల్లని ఎందుకు వదులుతారు దొండకలు గాని ఇలా రౌడీలు గాని కుర్రోలు గాని తాగుబోతులు గాని గంజాయి కొట్టినోళ్ళు గాన ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. మన బిడ్డని మనం రక్షించుకోవడం తప్పేం కాదు కదా మంచి మాటలు చెప్పడం పిల్లలకి ఒక అవగాహన కల్పించే తీరిక కూడా మీకు లేదా సమయం లేక మీరు మీ జాబులు మీ ఇంటి పనులు మీ ఫోన్లు మీ సీరియల్స్ వీటిల్లోనే ఉంటారా అయితే ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలని ఎలా ప్రేరేపిస్తున్నారు వాళ్ళకి జోబిలో చిల్లు గవ్వ కూడా ఉండదు.
(03:11) ఎక్కడో అప్పో సపోజ చేసి 500లో 1000ో కొట్టుకొచ్చి ఆ పిల్లలకి ఆ ఫోన్లో బాలెన్స్ వేయడమో ఒక బండి మీద తిప్పడమో ఎవడో అద్ది బట్టలు వేసుకొని వస్తాడు. ఫ్రెండ్ బట్టలు తీసుకొని వస్తారు మంచి జీను ఖరీదైన బట్టలు వేయడం కళ్ళజోళ్లు పెట్టడం వాళ్ళ స్టైల్ చూసి ఈ అమ్మాయిలు పడిపోతారు ఎక్కడో బుల్లెట్ అరువు తీసుకొచ్చి దాని మీద చక్కరలు కొడుతూ ఉంటారు ఆ బుల్లెట్ ని చూసి ఈ అమ్మాయి పడిపోతూ ఉంటుంది.
(03:36) మనం ఏం చేసినా మన అవసరాలకి అమ్మ నాన్న డబ్బులు ఇవ్వట్లేదుగా ఎందుకు అని ప్రశ్నిస్తారు. ఈవిడైతే మనకి అన్ని పెడుతున్నాడు వీడితో వెళ్లొచ్చు ఎక్కడికైనా తిరగొచ్చు తినొచ్చు అవసరాలు తీచుకోవచ్చు షాపింగ్ చేయించొచ్చు అన్న అపోహలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరు ఎలాంటోళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళకి డబ్బు వస్తుంది ఆ అద్ది బట్టలా బుల్లెట్ అద్దిదా ఇవన్నీ వాళ్ళకి చెప్పండి అర్థమైనట్టు వాళ్ళకి వివరించండి అప్పుడే ఆ చిన్న వయసు పిల్లలు అంటే పసి మనసు పిల్లలు వాళ్ళకి ఇంకా మెచూరిటీ లెవెల్స్ పెరగవు ఇంకా ఎన్ని సినిమాలు వచ్చినా ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు ఎన్ని జరిగినా వాళ్ళు అర్థం
(04:09) చేసుకోలేకపోతున్నారు. ఆ అమ్మాయిని ఆ వీడియోలో ఎంతగా హింసించారో తెలుసా ఒక్కొక్క డ్రెస్సు తీయటం మొత్తానికి వాళ్ళు భారతదేశ రాజ్యాంగం మీద సవాలు విసిరారు. ఎందుకు విసిరారు వాళ్ళకి భయభక్తులు లేవు పోలీసులు చూస్తారు మనల్ని శిక్షిస్తారు ఉరి శిక్షలు పడతాయి అన్న భయం కూడా లేదు ఎందుకంటే కేవలం మన చట్టాల్లో కఠినమైన శిక్షలు లేకపోవటం ఎవరు పట్టించుకోకపోవటం ఇక్కడ దుబాయి సౌదీ అరబ్ దేశాల్లో లాగా నడి రోడ్డు మీద తల నరికితేనే ఆడపిల్ల మీద చెయ్యి వేయకుండా ఉంటారు ఇది మీరందరూ గమనించాలి ఈ వీడియో ఎక్కువమందికి చేరవేయండి అంటే షేర్ చేయండి అప్పుడే అందరూ ప్రొటెక్ట్ చేసు కుంటారు
(04:50) ఆడపిల్లని కఠినమైన శిక్షలు లేకుండా అప్పటికప్పుడు సంఘటన జరగడం పోలీసు వాళ్ళు వచ్చి కవర్ చేయడం మీకు న్యాయం జరుగుద్దని చెప్పడం వాదాచడం అక్కడికి అయిపోద్ది మళ్ళీ కొత్త కథ తెరలోకి వస్తది. ఎటు వెళ్ళిపోతుంది ఈ సమాజం ప్రతి ఆడపిల్ల ఇటువంటి సంఘటనలకి బలైపోతుంది. ఫలితంగా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఎప్పుడో వీడియో కాదు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఆడపిల్లల్ని ఎక్కడికి పంపించకండి.
(05:17) పనిపాట లేనోళ్ళు ప్రతి సందు సందు చివర ప్రతి గల్లీ చివర ప్రతి షాప్ దగ్గర స్కూల్ల దగ్గర కాలేజీల దగ్గర కాపు కాస్తూనే ఉంటారు ఆడపిల్లలకి వలలు వేస్తూనే ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోండి ఇటువంటి గోరాలు జరిగినప్పుడు ఆడపిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్న విషయం ఒకటి మర్చిపోగా నీచమైన పనులు జరిగిన మానవ సంఘాలు నిద్రపోతూ ఉంటాయి అసలు మానవ సంఘాలు ఏం చేస్తున్నాయి ఎందుకు ప్రశ్నించవు అదే ఈ అత్యాచారం చేసిన అబ్బాయిల్ని ఊరితీయాలి అని కఠినమైన శిక్ష వేసిన యావజీవ కారాగారి శిక్ష వేసిన మానవ సంఘాలు నిద్రలేస్తాయి.
(05:51) అప్పుడు మేము ఉన్నామని వస్తారు అసలు ఏదో చిన్న పొరపాటు జరిగిపోయింది దానికి ఊరి శిక్ష వేస్తారా యవద్య కారాకారి శిక్ష వేస్తారా ఆ వాళ్ళ వయసు ఏమైపోద్ది వాళ్ళ జీవితం ఏమైపోద్ది వాళ్ళ లైఫ్ ఏమైపోద్ది అని ప్రశ్నిస్తారు కాబట్టి ఇటువంటి పనికిమాలిని కబుర్లు చెప్పే వాళ్ళని నమ్మకుండా మీ ఆడపిల్లల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి తప్పు జరిగిపోయిన తర్వాత మనల్ని కాపాడే వాళ్ళు రక్షించే వాళ్ళు ఎవరో ఉండరు మనకి న్యాయం చేసేవాళ్ళు ఉండరు దయచేసి అందరూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఎందుకంటే అంటే మన రాజ్యాంగంలో కొన్ని మార్పులు చాలా అవసరం అది ఆడపిల్లల
(06:27) మీద పసిపిల్లలు చిన్న పిల్లలు అన్యాయం అయిపోతున్నారు బలైపోతున్నారు సమాజం ఎప్పటికీ మారదేమో అని భయమేస్తుంది. ఈరోజు మీ ఇంట్లో రేపు నా ఇంట్లో అన్నట్టు పరిస్థితి ఉందన్నమాట. కఠినమైన శిక్షలు వేయాలని కామెంట్ చేయండి. ముఖ్యంగా మీ ఫ్యామిలీకి బాగా ఉపయోగపడుతుంది. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి బాగా ఉపయోగపడుతుంది.
No comments:
Post a Comment