Wednesday, August 19, 2026

A166. అహంకారమును ఎలా పోగొట్టుకోవాలి ??

A166. అహంకారమును ఎలా పోగొట్టుకోవాలి ??

Author Name:adhyatmika chaduvu-study of true self

Youtube Channel Url:https://www.youtube.com/@atmaadhyayanam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=pFb5xLfdzhc



Transcript:
(00:01) శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది ఆ ప్రశ్న అహంకారమును ఎలా పోగొట్టుకోవాలి ఇది ప్రశ్న ఏదైనా అసలు ముందు పొందాలన్నా పోగొట్టుకోవాలన్నా దానిని గూర్చి మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఇక్కడ అహంకారం అంటున్నప్పుడు వీరి ఉద్దేశం మనలో ఉన్నటువంటి గర్వము కోపము అంటే ఇతరుల మీదకి దూసుకెళ్ళిపోతాం అటువంటి భావన కావచ్చు అంటే అహంకారం అంటే కొంచెం ఎక్కువ కోపం ఎక్కువ ఇతరుల మీద మనమే దాడి చేస్తాం ఇతరుల మీదకి వెళ్ళిపోతాం
(00:46) అన్ని రకాలుగా అది కావచ్చు లేదా అహంకారంకి డౌట్స్ స్టేజ్ ఉంటది ఎవరో మనని ఏదో అన్నారు ఏదో చేశారని వాళ్ళని తిరిగి ఏమి చేయలేక మనం బాధపడిపోతుంటాం అది కూడా అహంకారమే పొగరు మదం ఇతరుల మీదకి వెళ్ళడం అది అహంకారమే దానికి డౌన్ స్టేజీలో ఏడవడం దుఃఖపడటం భయపడటం ఇది అహంకారమే అయితే మనం వాడుకలో జనరల్గా అహంకారం అంటే ఆ పొగరెక్కురా ఆమెకు పొగరెక్కురా ఇలా వాడుతున్నాం కానీ ఆధ్యాత్మికతలోకి వచ్చేటప్పటికి అసలు ఈ అహంకారం అంటే ఏంటి అంటే అహం దాల్చిన ఆకారము ఆకారం మన శరీరం
(01:35) అహం అంటే ఏంటి నేను అనేటువంటి ఒక శరీర భావన అహం అనేది నేను అనేటువంటి ఒక శరీర పరమైనటువంటి భావన అహం మరి అహం అనే సంస్కృత పదం నేను తెలుగులో అయితే జీవన విధానంలో ఈ అహంకారం అనేది అసలు నేను అనేది ఎలా ఏర్పడుతుంది ముందు అహం అనేది ఎలా ఏర్పడుతుంది ఆకారం అనేది అహం దాల్చిన ఆకారం మన శరీరం ఆ కోపం వచ్చినప్పుడు అది కోప రూపం దాల్చింది అరిసి కరిసినప్పుడు అలా అరుస్తా ఉంటం కరుస్తా ఉంటాం అహంకారం అంటే అది పొగరు మాదము ఇతరుల దుర్భాషలు అడం
(02:21) మీద దాడి చేయడం ఇలా భావించుకోవడం కానీ అసలు అహం అనేది ఎలా తయారయింది ఇది గమనిస్తే దాన్ని ఉంచుకోవచ్చా పోగొట్టుకోవచ్చా తెలుస్తది. ఒకవేళ పోగొట్టుకోవాలంటే ఎలా పోగొట్టుకోవాలో తెలుస్తది ఎందుకంటే అది ఎలా తయారయిందో తెలియాలిగా పసిబిడ్డగా మనం మన తల్లిదండ్రులకు జన్మించాం భూమిమీద మనిషిగా వచ్చిన ఎవరైనా అంతే అలా పసిబిడ్డగా జన్మించిన దగ్గర నుంచి శరీర నిర్మాణం ఎలా ఉంది మనిషిది అంటే శరీరంలో ఉన్నటువంటి కన్ను ముక్కు చెవులు చర్మము నాలుక ఇలా వీటి ద్వారా పంచేంద్రియములు అంటారు అంటే ఐదు రకములుగా
(03:07) మనం గ్రహించగలుగుతాం. కంటితో చూస్తాం ఆ చూసింది మనకు కనబడిందో నిజం ఉన్నట్టు మనకు కనబడింది మనకు తెలియంది మన దృష్టిలో లేనట్టే అలాగే మనం విన్న శబ్దాలు మన దృష్టిలో ఉన్నట్టు మనం వినని శబ్దాలు మన దృష్టిలో లేనట్లే స్పష్టంగా మిమ్మల్ని మీరు చూసుకోండి అంతే అలాగే మనకు తెలిసిన వాసనలు మన దృష్టిలో ఉన్నట్టు మనకు తెలియని వాసనలు మన దృష్టిలో లేనట్టే అలాగే మనకు తెలిసిన రుచులు అలాగే మనకు తెలిసిన స్పర్శ సుఖాలు [గొంతు సవరించుకోవడం] ఇవి మనకి ఎన్ని తెలుసో ఆ తెలుసు అన్నవన్నీ మన సృష్టిలో మన దృష్టిలో ఉన్నాయి అంటే
(03:52) దృష్టిని బట్టి సృష్టి ఇవన్నీ మన దృష్టిలో ఉన్నాయి మనం గ్రహించాం కాబట్టి అది మన సృష్టి అందుకే ప్రతి వ్యక్తికి సృష్టి మారిపోతా ఉంటది ఎవరి సృష్టి వాళ్ళకి ఉంటది. ఆ ఎవరి సృష్టి వాళ్ళకే వాళ్ళ మనసు ఏంటది ఎవరు తెలుసుకున్న విషయాలు అంతే ఇంకేం అద్భుతం లేదు అసలు అందులో అక్కడేమో అది గొప్పతనం కూడా లేదు ఎవరు తెలుసుకున్న విషయాలు వాళ్ళకి వాళ్ళ మనసే కూర్చున్నాయి అవ తెలుసుకున్న విషయాలు అయితే అహంకారం ఏంటండి అంటే తెలుసుకున్నవి ఇప్పుడు నేను కంటితో చూసినవన్నీ నాకు తెలిసినవన్నీ నాకు నిజాలు ఆ నిజాల ఆధార రంగానే నేను బ్రతుకుతాను నాకు తెలియని ఎలా బ్రతుకుతాను అలాగే నేను
(04:36) చెవులతో ఉన్నవన్నీ నా నిజాలు నాకు తెలిసిన నిజాల ఆధారంగానే బ్రతుకుతాను. అలా నేను ఈ శరీరంతో నేను గ్రహించిన నిజాల ఆధారంగానే నేను బతుకుతాను అలా గ్రహించేటప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తున్నాను నా చుట్టూ ఉన్న వాటిని చూస్తున్నాను. వినేటప్పుడు చూసేటప్పుడు వాళ్ళ ప్రవర్తన చూస్తున్నాను వాళ్ళ శబ్దాలు వింటున్నాను. అంటే ఇలా గుణములు కూడా నేర్చుకుంటున్నాను ఇలా నడవాలి ఇలా పరిగెత్తాలి ఇలా కూర్చోవాలి ఇలా లేవాలి ఇలా పడుకోవాలి ఇలా తినాలి ఇలా తాగాలి ఇలా మాట్లాడాలి ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు ఇందులో
(05:20) ఇప్పుడు ఏదైనా ఇలా ఉండొచ్చు ఇలా ఉండకూడదు అనేది మన భావన విశ్లేషణ అనుకోండి కానీ మనం అన్ని చూసాం తెలుసుకున్నాం ఇప్పుడు ఒక వ్యక్తి మాట తీరు ఉంది అంటే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వ్యక్తి తెలుగు మాట్లాడుతున్నాడు. మళ్ళీ తెలుగులోనే శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఒక రకమైన యాసలో తెలుగు మాట్లాడుతారు. అక్కడి నుంచి మళ్ళీ మీకు కోనసీమకి వచ్చేటప్పటికి అంటే ఈస్ట్ గోదావరికి వచ్చి వెస్ట్ గోదావరికి వచ్చేటప్పటికి యాసలు మారుతాయి కృష్ణా జిల్లాకి వెళ్ళేటప్పటికి యాస యాస అంటే ఉచ్చారణ తీరు మారుతది.
(05:58) కృష్ణ గుంటూరు ఇవన్నీ మారుతాయి మళ్ళీ రాయలసీమ అటు ఆ ప్రాంతాలకి వెళ్ళేటప్పటికి ఉచ్చారణ మారుతది మళ్ళీ తెలంగాణకి వెళ్ళేటప్పటికి పూర్తిగా ఇంకొక భిన్న ఉచ్చారణ అన్ని తెలిగే తెలుగు పదాలనే తెలుగు భాషనే అందరూ అర్థం చేసుకోగలిగిన తెలుగు భాషనే అనేక ఉచ్చారణలతో మాట్లాడతారు. ఆ ఉచ్చారణ అనేది ఆ ప్రాంతీయతను బట్టి వచ్చింది. ఇది మనం పుట్టుకుతో నేర్చుకుంది కాదు చుట్టూ ఉన్నవాళ్ళని చూసి నేర్చుకున్నాం అంతే వాళ్ళలా అక్షరాలని [గొంతు సవరించుకోవడం] ఎలా పలికారో మనం ఎలా పలికాం పదాలని ఎలా పలికారో అలా పలికాం అంటే అది సహజంగా గ్రహించడం నేర్చుకోవడం అనే తత్వమే మన
(06:40) శరీరంలో ఉంది. అసలు శరీరం ఏంటి అంటే అనుభవిస్తున్నానని మనం అనుకుంటున్నాం. జీవించేటప్పుడు అనుభవించాలని జీవిస్తున్నాం అని మనం అనుకుంటున్నాం కాదు అన్ని నేర్చుకుంటుంది తెలుసుకుంటుంది ఆ నేర్చుకున్నవి తెలుసుకున్నవి గ్రహించినవి అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఐదు రకాల గ్రహణేంద్రియములు కన్ను గ్రహిస్తది చెవు గ్రహిస్తది ముక్కు గ్రహిస్తది చర్మం గ్రహిస్తది నాలుక రుచిని గ్రహిస్తది స్త్రీ పురుష శారీరక సుఖములు జననంద్రియం స్పర్శకంగా వస్తది గ్రహిస్తది.
(07:19) ఇవే మనకు గ్రహించినవే మనకు తెలుసు అనంత విశ్వం ఉంది ఎన్నో దేశాలు ఉన్నాయండి సుమారు 200 దేశాలు ఉన్నాయి అసలు మనం చూసామా ఎప్పుడన్నా ఏ అమెరికానో లేదో వెళ్లివచ్చారు కొంతమంది కొన్ని ఇద్దర దేశాలు చూశరు అనుకోండి వాళ్ళు ఎలా మాట్లాడుతారు చూసాం మాకు తెలుసని అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళ సృష్టిలో అది కూడా ఉంది మనకు లేదు నేను ఇప్పుడు నేను ఉన్నాను నేను అసలు ఏ దేశం అనలేదు మన దేశంలోనే అనేక ప్రాంతాలు నేను చూడలేదు మన దేశంలో ఉన్న అనేక ప్రాంతాలు అసలు నాకు తెలియదు నేను చూడలేదు నేను చూడనప్పుడు నాకు ఏది సత్యం నేను చూసినవే నా సత్యం అందుకని నా చుట్టూ ఉన్న భాషను ఎలా
(07:59) ఉచ్చారణతో మాట్లాడానో అలా నా తల్లిదండ్రుల నుంచి అంటే నన్ను పెంచుతూ పసిబిడ్డగా నాకు అందుబాటులో ఉండి నన్ను పెంచుతూ ఉన్న నా తల్లిదండ్రులు నా చుట్టూ ఉన్న నా కుటుంబ సభ్యులు నా బంధు మిత్రులు నేను చదువు సంధ్యలకు వృత్తి వ్యాపార మీదకి వెళ్తే తారసపడేటువంటి మనుషులు వీటన్నిటిని బట్టి నేను ఉండే ప్రాంతంలో అధికంగా నేను వినేటువంటి ఉచ్చారణ భాష అది కనుక నాకు ఆ భాష ఆ ఉచ్చారణ శైలి వచ్చింది.
(08:31) ఇంకో చోట ఇంకో ఉచ్చారణ శైలి ఉంటది నేను అక్కడికి వెళ్ళిపోయే రోజులు ఉండొచ్చు కానీ నాకు అది రాదు ఇది అలవాటు అయిపోయింది. నేను ఇలాగే మాట్లాడగలను. అలా తెలుగు ప్రాంతంలో ఉన్నవాళ్ళు తెలుగు మాట్లాడుతారు ఇది మా మాతృభాష అంటారు మాతృభాష అంటే మనం నేర్చుకోక్కర్లే సహజంగా వచ్చేసింది. అలాగే కర్ణాటకలో కన్నడ తమిళనాడులో తమిళము మహారాష్ట్రలో మరాఠి అలా అనేక ప్రాంతాలలో మన దేశంలోనే ఎన్నో భాషలు ఉన్నాయి అలా ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని భాషలు మాట్లాడుకుంటారు మళళ ఆ భాషలకు ఉచ్చారణ శైలి మారుతా ఉంటది ప్రాంతీయతను బట్టి ఇది ఎందుకు చెప్పాను అంటే దీన్ని అర్థం
(09:12) చేసుకుంటే మిగిలినది అలాగే ఉంది మనకు వచ్చిన అలవాట్లు మన గుణాలు మన స్వభావం మనకున్న కోపతాపాలు ఈర్షలు అసూయలు ద్వేషాలు ఇవన్నీ మన తల్లిదండ్రులు మొదలుకొని మన చుట్టూ ఉన్న మనుషుల నుంచి మంచి గుణాలు చెడ్డ గుణాలు సమస్తం నేర్చుకున్నాం. ఇప్పుడు చెడైనా ఉందని తెలియకపోతే ఎలా తెలుసు ఎవడఒకడు చెడు నేర్పాలి ఇప్పుడు సిగరెట్ ఉందని ప్రపంచంలో తెలియాలిగా ఎవడొకడు కాలుస్తుండు నువ్వు చూడాలిగా అలాగే సినిమా ఒకటి ఉంది ప్రపంచంలో నీకు తెలియాలిగా అప్పుడే పుట్టింది తల్లి పక్కన ఉన్న బిడ్డకి సినిమా ఒకటి ఉందని తెలియదుగా సిగరెట్ ఒకటి ఉందని తెలియదుగా అసలు
(09:47) ప్రపంచం ఎంత ఉందని తెలియదుగా ఇప్పటికీ కూడా భూమిమీద ఉన్న మానవులకి మొత్తం ప్రపంచం విశ్వం ఎంత ఉందో ఎవరికీ తెలియదు అసలు అసలు మామూలు మనుషులందరికీ అసలు ఎన్ని దేశాలు అన్ని దేశాలు తిరిగినోడు ఎవడో అన్ని భాషలు చూసినోళ్ళు ఎవరు ఆ 200 దేశాలు తిరిగినోళ్ళు ఉండనే ఉండరు ఎక్కడ చూసినా అన్ని భాషలు వచ్చినోళ్ళు ఉండరే ఉండరు ఏ కొన్ని భాషలు నేర్చుకుంటారు అంటే ఏంటి అసలు ప్రపంచంలో మనకు తెలిసిన సత్యం వన్ పర్సెంట్ కూడా లేదు కానీ అదే మొత్తం సత్యం మనం జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం మనకు తెలియంది అనంతంగా ఉంది.
(10:28) ఏది మామూలు ప్రపంచంలో 200 దేశాలు వాళ్ళ భాషలు వాళ్ళ కట్టు బొట్టు తీరు తినులు వాళ్ళ స్వభావాలు వాళ్ళ ప్రవర్తనలు మనుషులని తీసుకుంటే ఇంకా విశ్వం అంటే అసలు మనకి తెలుసు అనే భావన కూడా మనం తెలుసు అని అనకూడదు. దూతనం అంత కూడా తెలియదు మనకి కానీ మరి మన నేను ఎలా ఏర్పడింది అంటే శరీరము గ్రహణ యంత్రము పుట్టిన దగ్గర నుంచి అది గ్రహిస్తూ ఉంటది తెలుసుకుంటూ ఉంటది అంతే చనిపోయే వరకు తెలుసుకుంటూనే ఉంటది ఇప్పుడు అహం అనేది ఏంటంటే ఏ స్టేజికి ఆ స్టేజికి మనని మనం గమనించుకుంటే మనకు తెలిసిన విషయాలు ఏమున్నాయో మనుషులు చాలా జాగ్రత్తగా గమనించుకోండి మనకు తెలిసిన విషయాలు ఏమున్నాయో
(11:14) వాటిలో ఉండటం భద్రత అనుకుంటారు మనుషులందరూ కొత్త విషయాలు అభద్రత అనుకుంటారు. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా కొత్త మనుషులు వచ్చి తలుపు కొట్టి ఏదో అడ్రెస్లు అడిగి రకరకాలుగా మాట్లాడి కొంచెం అడ్డదిడ్డంగా మాట్లాడి వెళ్ళిపోయారు అనుకోండి కంగారుపడతాం ఎవరు వచ్చారు ఎందుకు వచ్చారు అసలు ఏంటి వీళ్ళు ఏ ప్లాన్తో వచ్చారు అదే అడ్డదెడ్డపు మాటలు అయే చెత్త మాటలో మనకు తెలిసినోళ్ళు వచ్చి మాట్లాడారు అనుకోండి ఏం కంగారుపడం వాళ్ళు మనకు తెలిసినోళ్ళ మనం కూడా వాళ్ళతో అడ్డదడ్డంగా మాట్లాడుకుంటూ కూర్చుంటాం విషయాసక్తి అంటే తెలిసినది ప్రతిదీ భద్రతగా ఉంటది మా
(11:54) అమ్మ నాకు తెలుసు భద్రత మా నాన్న నాకు తెలుసు భద్రత అమ్మ అన్నం పెట్టేటప్పుడు నువ్వు అన్నం తినపోతే పూచోడికి అప్ప చెబుతానుఅంటే ఆ తెలియనోడు ఎవడికి అప్ప చెప్పు దాని మీద భయం చాలా జాగ్రత్తగా గమనించుకోండి భయం ఎక్కడ పుట్టింది అంటే తెలియని తనం భయం అక్కడ అసలు నిజంగా తెలియని ధనంలో ఏమి లేదు కానీ భయం ప్రతి కొత్తదే ఏది కొత్తది చేద్దాం అన్నా ముందు టెన్షన్ ఫీల్ అవుతాం నెర్వస్ ఫీల్ అవుతాం స్ట్రెస్ ఫీల్ అవుతాం కొంతమంది చాలా హైయెస్ట్ లో ఫీల్ అయిపోతారు దాన్ని అంటే అహం ఒక భద్రతగా ఉంటది మనకి తెలిసిందంతా ఒక భద్రతగా ఉంటది.
(12:40) అందుకే చాలామంది తెలిసిన పనులే చేద్దాం తెలిసిన దాంట్లోనే ఉందాం తెలిసిందే జీవిద్దాం మళ్ళీ కొత్త కొత్త ప్రయోగాలు ఇన్ని జీవితం ఏమైపోద్దని భయపడతా ఉంటారు తెలిసిన దాంట్లో ఉండటానికి ఇష్టపడతా ఉంటారు. కానీ [గొంతు సవరించుకోవడం] నిజంగా చిన్నతనం నుంచి గమనించుకుంటూ వస్తే ఇప్పటివరకు తెలుసుకుంటున్నది తెలిసింది అంతా కూడా చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి గ్రహించి మనం తయారు చేసుకొని మనం అనుకుంటున్న మనం నమ్ముతున్నది నేనే తప్ప అసలు మనకు తెలియంది అనంతంగా ఉందా తెలియని దాంట్లో మనకు మేలు చేసేది చాలా ఉండొచ్చు తెలియని అంత భయపడాల్సిన అవసరం లేదు అందుకే
(13:16) ఇప్పుడు కొత్తని ఆహ్వానించడానికి మనిషి సిద్దపడి ఉంటే అహం అసలు దానంతటి అది నిర్మూలనం అయిపోద్ది మీరు ఎప్పుడు కొత్తని ఆహ్వానించడానికి ఇష్టపడండి ఇది తెలుసుకోండి ఇది నాకు తెలిసింది మాత్రమే ఇప్పుడు కోపం ఉందనుకోండి తెలుసుకున్న మా నాన్న ఎలా అరుస్తాడా పక్కవాళ్ళు ఎలా అరుస్తారు వీళ్ళ ఎలా అరుస్తారు అరిస మీరు చూడండి కోపిస్టోళ్ళ అందరూ అంటే అహంగారాన్ని ఎలా పోగొట్టుకోవాలి అన్నప్పుడు కచ్చితంగా చెడుగులను పోగొట్టుకోవాలని సోదరుడు అడిగి ఉంటారు అవి కోపతాపాలు ఇలాంటివి తప్ప ఏమఉంటాయి కానీ అవి మీరు గమనించండి మనం పోగొట్టుకునే ప్రయ ప్రయత్నం చేయక్కర్లేదు అసలు
(13:54) గమనించండి చాలు వాటిని ఈ అహంకారం సపోజ కోపదాతాపాలు అరుస్తాం కరుస్తాం వాళ్ళ మీద వీళ్ళ మీద పెత్తనాలు దాడులు చేస్తాం అనుకోండి అవన్నీ మనకు సాగిన చోట పడేవాళ్ళు ఉన్న చోట మనకంటే తక్కువ ఉన్న చోట మాత్రమే చేస్తాం. మనకంటే ఎక్కువ ఉన్న చోట నోరు మూసుకుని కూర్చుండి. అహంకారం అంటే పొగరని అనుకుంటే అహంకారం ఒక మదం అనుకుంటే అది మాట్లాడకుండా కూర్చుంటది ఏది తను సాగన చోట దానికంటే అధికులు ఉన్న చోట మరి అక్కడ అహంకారం ఎందుకు పని చేయట్లేదు అన్ని చోట ఒకే రకంగా పని చేయాలిగా కాదు మనిషికి తెలుసు సాగిన చోట సాగించుకోవాలి సాగని చోట ప్రమాదం తలదించుకోవాలి
(14:41) దీన్ని గమనిస్తే అసలు నేను పోగొట్టుకోవాల్సిన అవసరమే లేదు నేను అక్కడ తలదించుకొని శాంతంగా ఎలా ఉంటున్నానో సాగిన చోట కూడా నేను అర్థం చేసుకొని అలా శాంతంగా ఉండొచ్చు అలా ఉండొచ్చు అనే ఆధ్యాత్మికత ఆత్మ జ్ఞానం అనేది వచ్చింది ఏంటంటే నీ గురించి తెలుసుకో నాయనా నువ్వు ఉండగలుగుతున్నావ్ నీకు సాగని చోట ఉండగలుగుతున్నావ్ నీ ఆధిపత్యం సాగని చోట ఉండగలుగుతున్నావ్ నీ పెత్తనం సాగిని చోట ఉండగలుగుతున్నావ్ నువ్వు అనుకున్నది చేయడం కుదరని చోట ఉండగలుగుతున్నావ్ తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వు నష్టపోయినా లాభపడినా ఉండగలుగుతున్నావు తప్పనిసరి పరిస్థితి అయితే
(15:20) కానీ సాగుతూ దాని చోట నేను ఉండలేను అంటున్నాం కాదు అసలు నేను అంటే నేను అనే ఏ భావం ఉందో దాన్ని సృష్టికి కలపకండి ఇవి గ్రహించిన విషయాలు అంతే కన్ను చూసిన విషయాలు అవన్నీ బయటివి కన్ను చూసిన దృశ్యాలలో మన వాళ్ళు కూడా ఉండొచ్చు నేను నాది నా వాళ్ళు కూడా ఉండొచ్చు కానీ వాళ్ళు బయటే ఉన్నారు మా నాన్న బయటే ఉన్నాడు మా అమ్మ బయటే ఉంది నా డబ్బు బయటే ఉంది నా సంపదలు బయటే ఉన్నాయి నా భార్య బయటే ఉంది నా భర్త బయటే ఉన్నాడు నా పిల్లలు బయటే ఉన్నారు అన్నీ నాకు భిన్నమైన ఇప్పుడు వాటిని నాలో కలిపేసుకొని నా గుణాలు నా స్వభావాలు నేను ఇంతే అని అనుకునేటటుగా తుక్కుపోవడం ఎందుకు డబ్బండో
(16:02) పిచ్చ ఎందుకు డబ్బుండో లోపత్తం ఎందుకు ఆడోళ్ళు కనపడగానే వెర్ర ఎందుకు లేదా మగోళ్ళు కనపడగానే వెర్రి ఎందుకు లేని తినే కనపడగానే గుర్తు రాగానే వెర్రి ఎందుకు బట్టలు కనపడగానే వెర్రి ఎందుకు షాపింగ్లు వెర్రి ఎందుకు వెర్రి ఎందుకు అని నీకు నువ్వే ప్రశ్న వేసుకో వేసుకోవాలంటే అసలు నేను ఎలా ఏర్పడిందో తెలుసుకో అని చెప్పే చెబుతుంది ఆధ్యాత్మికత ఎవరు దేవుని పోగొట్టుకోక్కర్ల తామరాకు పై నీటి బొట్టులా ఉండు అని చెప్పారు అంటే ఏంటి అన్ని నీకు ఏం కావాలి అనుభవించి ప్రపంచంలో నుంచే తెచ్చుకోవాలి గనీ కాబట్టి చూడు కాబట్టి విను కాబట్టి తెలుసుకో అన్ని కానీ తెలుసు తెలుసుకున్నవి
(16:41) నేను అనుకోబాక నాకు తెలుసుకున్నవన్నీ నా సత్యాలు అనుకోబాక అంటిం చేసుకోబాక నీకు తెలియంది కూడా ప్రపంచం ఉంది నువ్వు తెలుసుకుంది కూడా అవసరార్థం అవి నువ్వు తెలుసుకున్నవి నీవు కాదు మనం ఏది తెలుసుకున్న కోపతాపాలు కావచ్చు ఈర్షువులు కావచ్చు ద్వేషాలు కావచ్చు ఇవన్నీ శుద్ధ ఉన్న నుంచి నేర్చుకుంది ఎందుకంటే పసి బిడ్డకి ఏది ఉండదు అక్కడి నుంచి నేర్చుకుంటారు కొంతమంది మంచివాళ్ళుగా ఉంటారు అంటే ఏంటి ఇతరులకు పెట్టడం ఇతరులతో మంచిగా ఉండడం ఇతరులకు ఏదైనా సహాయాలు చేయడం చిన్నప్పటి నుంచి ఉంటది ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అలా ఉంటారు వాళ్ళ
(17:18) తల్లిదండ్రులు ఎవరో అలాగే ఉంటారు. వాళ్ళని చూసి నేర్చుకుంటారు. అలా తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల నుంచి నేర్చుకునే వాళ్ళు చిన్నతనం నుంచి మంచిగానే ఉంటారు. ఇదే తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారు ఇప్పుడు ఏ భోజనం చేస్తున్నప్పుడు ఇంత మిగిలిపోయింది అనుకోండి ఇంత కూర ఇంత అన్నం వెంటనే తండ్రి తల్లిలో ఫ్రిడ్జ్ లో పెట్టి దాసి తినేద్దాం అంటారు.
(17:40) అదే వింట అటు బిడ్డ మన పిల్లలు లేదండి అవే వాళ్ళు కొంచెం పెద్దోళ్ళయినా కొంచెం మిగిలిపోయింది మనం ఎవరికన్నా పెడదామని మనం ఒకవేళ మనసు మార్చుకున్న వీళ్ళు దాసే ఫ్రిడ్జ్లో పెట్టి అంటా ఉంటారు అన్ని చోట్ల అంతే నీ జిరాక్స్ కాపీ నేర్చుకున్నారు అందుకే అదేమి పెద్ద విషయం కాదు అందుకే పిల్లలు బాగుండాలంటే ఎప్పుడు తల్లిదండ్రులు ముందు మంచోళ్ళై ఉండాలి.
(18:05) ఎవరు తల్లిదండ్రులు మంచోళ్ళు కాదో కచ్చితంగా వాళ్ళ పిల్లలు చెడిపోతారు. అని చెడిపోతారండి అది స్థాయిల బేదం ఉంటది మండి ఇప్పుడు తల్లిదండ్రులు లౌక్యంగా మంచోళ్ళలాగా కనబడుతూ లోపల చెడ్డోళ్ళు అనుకోండి పిల్లలు కూడా అలాగే ఉంటారు. అందుకని అహం అనేది అహంకారం అనేది అది అన్ని చోట్ల ఒకేలా ఉండదు మనకంటే బలవంతుడు వచ్చినప్పుడు ఆగిపోద్ది మన పెత్తనం సాగిన చోట ఆగిపోద్ది.
(18:32) నేను అహంకారాన్ని ప్రదర్శిస్తాను అన్ని చోట్ల ఒకలా ఉంటాను అని చెప్పదు కాబట్టి దాన్ని మనం పోగొట్టుకోవాల్సిన అవసరమే లేదు అర్థం చేసుకుంటే చాలు ఇక్కడ నాకు సాగుతుంది కాబట్టి వీళ్ళ మీద దాడి చేస్తున్నాను వీళ్ళ మీద పెత్తనం చేస్తున్నాను వీళ్ళని కోపగించుకుంటున్నాను వీళ్ళ మీద అరుస్తున్నాను కరుస్తున్నాను నాకు సాగిన చోట మౌనంగానే ఉన్నాగా అనేక చోట్ల అలా సాగిన చోట్ల దాన్ని సద్దుకొని వెళ్ళాక కొన్ని చోట్ల అసలు నేనే బతిమలాడతాను.
(18:58) కొన్ని చోట్ల నా అవసరాలకి నేను తలవగ్గా ఉంటాను వాళ్ళతో మంచిగా ఉంటాను మృదువుగా ఉంటాను ప్రేమగా ఉంటాను లేదా దాన్ని సాగించిన చోట కరుస్తా ఉంటాను అరుస్తా ఉంటాను అంటే నేను మార్పులు చెందిపోతూ ఏర్పరుచుకున్న భావాలు తప్ప నాకు సాగుదాలని అహంకారంలో పొరపాటు కాదు అది అహంలో పొరపాటుఏమ లేదు సాగిన చోట ఆగుతుంది అక్కడ ఆగాలని ఎవరు నేర్చుకున్నారు మనమే సాగే చోట సాగిపోవాలి పెత్తనాలు చేయాలి అధికారాలు చేయాలి అరవాలి కరవాల నేర్చుకోవాలి మనమే అన్ని చుట్టూ చూసి నేర్చుకున్నాం ఈ రెండిటిని అర్థం చేసుకొని ఇప్పుడు ఈ చక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి అదే ఆధ్యాత్మికత
(19:37) ఇప్పుడు నేను ఎలా ఉండాలి అంటే నువ్వు మంచిగా ఉండాలంటే కచ్చితంగా ఉండొచ్చు ఎందుకని నాకు సాగని చోట ఆగిపోతున్నాను సాగిన చోట అరుస్తున్నాను అప్పుడు సాగిన చోట కూడా అలాగే ఉండొచ్చుగా నేను ఉండగలుగుతున్నాగా సాగని చోట ఆగగలిగినప్పుడు సాగుతున్న చోట ఎందుకు ఆగగలను అంటే నేను ఆగాలని అనుకోవట్లేదు నాకు సాగుతుంది గనుక నాకు ఎదురు జరగరు గనుక నన్ను ఏమి చేయలేరు గనుక వాళ్ళ మీద నేను ఇష్ట రాజ్యం వచ్చినట్టు పెత్తనాలు చేస్తాను.
(20:06) ఇది భౌతిక ప్రపంచం దీన్ని అజ్ఞానం అన్నారు అజ్ఞానం అంటే నిన్ను నువ్వే చూసుకోకుండా వెళ్ళిపోతున్నావ్ నువ్వు ఏది కొత్తగా నేర్చుకోక్కర్లే ఆల్రెడీ నువ్వు నేర్చుకున్నటిలోనే అన్ని ఉన్నాయి ఆ మంచి నీలోనే ఉంది ఆ చెడు నీలోనే ఉంది కానీ అది సమయాన్ని బట్టి ప్రదర్శిస్తున్నావ్ నువ్వు ఇప్పుడు ఆ మంచి కూడా నీలోనే ఉంది ఆ చెడు కూడా నీలోనే ఉంది.
(20:31) కాబట్టి ఇప్పుడు దాన్ని ఎలా వినియోగించాలి అనేది ఆల్రెడీ నీకు తెలిసిన దాంట్లోనే ఉంది అహంలోనే అన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉన్నాయి. నిన్ను నువ్వు తెలుసుకుంటే నువ్వు తెలుసుకుంటే నీకు అదే అర్థమైపోద్ది. నాకు సాగిన చోట ఆగుతున్నాను సాగిన చోట వాగుతున్నాను అనేది నాకు అర్థమయింది అనుకో అప్పుడు నేను సాగిన చోట కూడా వాగకుండా ఉండగలను కదా ఆమె మీద పెత్తనాలు చేయకుండా ఉండొచ్చు కదా ఎందుకంటే ఇక్కడ సాగిన చోట ఉంటున్నావు కదా అని తెలుసుకోవచ్చు నిన్ను నువ్వు తెలుసుకోవడం అనేది ప్రాథమిక స్థాయిలో నీ మాటలు నీ చాష్టలు నీ గుణాలు నీ బుద్ధులు నీ ప్రవర్తనల నుంచి మొదలుకొని
(21:05) అనంత ఆత్మ శక్తి వరకు సాగుతానే ఉంటది. అందుకే నీ ఎరుకతో బతుకు స్పృహతో బతుకు నిన్ను నువ్వు తెలుసుకొని బతుకు యదాలాభంగా బతికే బాక నీకు అనిపించిన అభిప్రాయాలతో బతికే బాక ఇప్పుడు కొంతమంది ఇంట్లో ఉంటారు భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్లు అభిప్రాయాలు [గురకలు] ఏర్పడిపోయి ఉంటాయి ఈ మనుషులు ఇలాంటిోళ్ళు ఈ మనుషులు ఇలాంటోళ్ళు ఈ మనుషులు ఇలాంటిోళ్ళు ఇంకా అదే ఫిక్స్ అయిపోయి బతుకుతా ఉంటారు.
(21:32) అభిప్రాయం నువ్వు ఏర్పరచుకున్నది అభిప్రాయం ప్రకారం ఎదుటోళ్ళు ఉండరు రోజు అలా ఎందుకు ఉంటారు ఎప్పుడో ఒక రోజు నువ్వు ఏర్పరచుకుంది అసలు అభిప్రాయాలు ఏర్పరుచుకోబాక జడ్జిమెంట్లు ఇవ్వబాక ఎప్పుడు నేర్చుకుంటానే ఉండు ఎప్పుడు తెలుసుకుంటానే ఉండు ఎప్పుడు గ్రహిస్తానే ఉండు గ్రహింపుని అతికించుకుంటే అహంకారం అవుతుంది. మనం చిన్నదనం నుంచి బిడ్డగా పుట్టిన కాడినుంచి ఈ శరీరం అన్నీ తెలుసుకునేలా ఇంద్రియాలు ఇచ్చి ఎందుకు పెట్టబడింది అంటే సృష్టిలో నువ్వు బతకడానికి అది అవసరం కళ్ళు చూడాలి కాళ్ళు నడవాలి చేతులు పని చేయాలి ముక్కుకు వాసనలు తెలియాలి చెవులకు శబ్దాలు వినబడాలి నాలుక రుచులు తెలియాలి
(22:09) చర్మానికి స్పర్శలు తెలియాలి ఇలా అన్నీ తెలియపోతే ఈ ప్రపంచంలో బ్రతకడం కష్టమైపోతుంది. అలా ఈ ప్రపంచంలో నేను బ్రతకాలి అంటే నాకు తెలియాలి తెలియాలి అంటే కానీ తెలుసుకున్నది నేనే అని ఎందుకు అతికించుకుంటున్నావ్ తెలుసుకున్నవన్నీ నావే అని ఎందుకు అతికించుకుంటున్నావ్ ఓ భార్య వచ్చింది భర్త వచ్చాడు అక్కడ కూడా నావి అనుకోక్కర్లేదు నా సుఖం కోసం తెచ్చుకున్న ఈవిడని కాకుండా ఈమెని కాకుండా ఎవరిని తెచ్చుకున్న ఇలాగే ఉండేవాడిని ఇప్పుడు నా పిల్లలు పుట్టారు ఈవిడ దాకా ఎవరు పుట్టిన ఇలాగే చూసేవాడిని అందుకని ఆ రిలేషన్స్ అలాగే సాగుతాయి దానికి ఆ దుఃఖ పోగాక వాడుకో ఉపయోగించుకో
(22:50) ఆ బంధాలలో సక్రమంగా జీవించు బాధ్యతలు చేయ కరెక్ట్ గా చెయి తామరకుపై నీటి బొట్టులో ఉండు ఇది ఆధ్యాత్మిక చెప్పేది ఈ భార్య కాకపోతే ఏ భార్య వచ్చినా అలాగే ఉంటాను ఈ భర్త కాకపోతే ఏ భర్త వచ్చినా ఇలాగే ఉంటాను ఈ పిల్లలు కాకపోతే ఏ పిల్లలు పుట్టినా ఇలాగే ఉండేవాడిని అలాగే ప్రవర్తిస్తాను ఎందుకని ఎందుకది నా బ్రతుకు కోసం నేను చేసుకున్న ఏర్పాటు ఇదంతా బ్రతుకు కోసం జరుగు జరుగుతున్న పోరాటం ఇందులో పోరాటంలో ఆరాటంలో ఏముందంటే ఏమి లేదు తెలుసుకోవడం ఉంది.
(23:23) చచ్చే వరకు తెలుసుకోవాల్సిందే చచ్చే వరకు ఎప్పుడైనా మధ్యలో లేదండి అక్కర్లేదు కళ్ళు అక్కర్లేదు చూడక్కర్లేదు అని చెబుతామా అబ్బోబో చూసేసానండి 60 70 ఏళ్ళ నుంచి చూస్తున్నాను ఇంకా చూడక్కర్లేదు లేండి ఇంకే ఇంకేం చూస్తాను అంటామా కళ్ళు అక్కర్లేదు అంటామా అనంగా చనిపోయే చివరి నిమిషం వరకు కన్ను లేకపోతే అసలు నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియదు. అలాగే చెవులు అక్కర్లేదు లేండి అంటాం అనంగా అవి కూడా చనిపోయే చివరి నిమిషం వరకు వినపడపోతే నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కాదు నా చుట్టూ ఆగమీ గోచరంగా ఉంటది.
(23:56) ఒక్క ఇంద్రియం పోయిందంటే మనిషి జీవితం అగమీ గోచరం అయిపోద్ది. అందుకే వృద్ధాప్యంలో చూడండి వినికిడి శక్తి తగ్గిపోయి చూపు మందగించిన వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతుంటారు అందుకని ఏదేమైనా వద్దనం కన్ను వద్దనం మరణించే వరకు కన్ను కావాలి మరణించే వరకు చెవ్వు కావాలి మరణించే వరకు ముక్కు కావాలి మరణించే వరకు గొంతు మాట కావాలి మరణించే వరకు శరీరానికి స్పర్శలు తెలుస్తూనే ఉండాలి.
(24:24) మరణించే వరకుని ఎందుకు అంటున్నాం అంటే మరణం తప్పదు కాబట్టి కాబట్టి అహం అని ఒక పరిధి కట్టేసుకొని ఒక గీత గీసేసుకొని ఇదే నిజం అనుకొని ఇదే సత్యం అనుకొని ఇది నా క్యారెక్టర్ ఇది నా గుణం ఇది నా బుద్ధి నేను ఎలాగే ఉంటాను నాకు ఎలాగే వచ్చు నేను ఇంతే అని చెప్పకుండా చిన్నతనం నుంచి ఎలా తెలుసుకుంటున్నావో అలాగే చనిపోయే వరకు తెలుసుకో దేన్ని పట్టు కూర్చోకు దేన్ని ఆలాడుకో ఈవెని కుటుంబ సభ్యులతో సహా అయ కుటుంబ సభ్యులని వదిలేయ మండల తామరాకుపై నీటి కొట్టి ఏంటండి అక్కడే ఉండు దాంతోనే ఉండు కానీ అంటుకోబాక ఎందుకు అంటుకోబాక ఈ భార్య కాదు ఈ భర్త కాదు ఎవరు వచ్చినా ఇలాగే ఉండేవాడిని
(25:04) ఎవరితోయనా ఇదే సుఖం ఉండటం జీవితం ఇంతే ఏ పిల్లలు పుట్టినా ఇలాగే ఉండేవాడిని ఏ వృత్తి వ్యాపార ఉద్యోగాలు కాకపోయినా ఏదో ఒక వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసేవాడిని ఈ ఉద్యోగం కాదు ఇంకోటి ఇంకో వృత్తి ఈ వృత్తి కాదు ఇంకో వృత్తి ఎందుకంటే బ్రతకాలకి డబ్బు కావాలి. కాబట్టి నువ్వుఏదో ఇది భద్రత అనుకొని ఆ తెలిసిన దాంట్లోనే కూర్చోవడం భద్రత అనుకొని ఆ తెలిసినట్టుగానే ప్రవర్తించడం నా కూర్చు అనుకొని అదే నేను అనుకున్న భావన అహంకారం అయింది.
(25:32) ఒక పరిమితిని పెట్టేసుకున్నాం ఆ పరిమితిలో అహం ఏర్పరుచుకొని దాని లోపలికి ఎవరిని రానివ్వో నువ్వు దాంట్లో నుంచి బయటికి రావు ప్రాబ్లం అది కాదు అసలు అహం అనేదే లేదు అహం అనేదే లేదు పుట్టుకతో ఈ శరీరంతో నేనే అనే మనిషిని ఉన్నా నా తల్లి పక్కన పసి బిడ్డగా పడుకొని ఉన్నా అది నా పుట్టుక అక్కడి నుంచి ఈ శరీరంతో ఇంక అంతా తెలుసు సుకోవటమే ఎప్పటి వరకు అంటే శరీరం నశించిపోయే వరకు శరీరం పుట్టింది శరీరం మరణిస్తది.
(26:08) కాబట్టి ఇప్పుడు అంటుకోవడం ఎందుకు నశించే వరకు పుట్టిన కానుంచి పుట్టినప్పుడు ఏం చేసావు ఏమి చేయలేని అసహాయురాలివి అసహాయుడివి అప్పుడు అహం ఉందా లేదు అప్పటి నుంచి తెలుసుకోవడం మొదలు పెట్టావు అమ్మ గొంతు తిన్నావ్ గుర్తుపట్టావు నాన్న గొం తిన్నావు గుర్తుపడుతున్నావ్ ఆ శబ్దాలు వాళ్ళ స్పర్శలు గుర్తుపడుతున్నావ్ వాళ్ళు పాలు తాగిస్తున్నారు ఎలా తాగాలో చూసావు అవన్నీ నేర్చుకుంటున్నావ్ అలా పెరుగుతూ వచ్చావు అలా ఎంత పెరుగుతూ వచ్చినా ఇక నేనని ఒక స్వభ స్వభావం ఏమ లేదు పెట్టుకోబాక ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండు ఎప్పుడు మంచిగా ఉండు ఇది పెట్టుకో ఎందుకని
(26:47) మంచిగా ఉండంటే అందరూ నాలాంటి మనుషులేక నాకు మంచి కావాలని కోరుకుంటాగా మొత్తం నాకు అంతా మంచే కావాలని కోరుకుంటా చూడటం గాన వినటం గాన తినటం గాన తాగటం గాన కట్టుకోవడం గాన జీవించడంలో ఏదైనా నాకు మంచిగా ఉండాలని కోరుకుంటా అన్ని నాకు మంచి జరగాలని కోరుకుంటా అప్పుడు ఇప్పుడు నేను మంచిగా ఉండడం అనేది ధర్మం కదా కనీసం సత్యం కదా మంచిగా ఉండా అతుక్కుపోబాక అందుకే నిన్ను నువ్వు తెలుసుకుంటే అన్నిటికీ అన్ని ప్రశ్నలకు అక్కడే సమాధానం ఉంది.
(27:21) నిన్ను ఎవరో గురువులు వచ్చి నీకు కొత్తగా సాధనలు నేర్పి ఆధ్యాత్మికం బోధించి దేవుని గురించి బోధించి జ్ఞాన గ్రంథాలు చూపించి నువ్వు ఈ చెడు పనులన్నీ చేయకు మారు మారిపో అని నీకు పెద్ద పెద్ద సాధనలు నేర్పి దీక్షలు ఇచ్చేయక్కర్లే ఆడిది అవసరాలే లేవు నిన్ను నువ్వు చూసుకోవట్లేదు కాబట్టి అన్ని సృష్టింపబడినాయి అక్కడ జస్ట్ నిన్ను నువ్వు చూసుకుంటే నీలోనే మొత్తం సమస్త సమాధానాలు ఉన్నాయి.
(27:47) ఎందుకని నువ్వు అలా ఉంటున్నావ్ ఇ దొంగ దొంగతనాలు చేస్తాడు అన్నావ్ దొంగ దొంగతనాలు ఎప్పుడు చేస్తాడు ఎప్పుడు చేస్తానే ఉంటాడా దొంగతనాలు చేసిన దొంగ దుర్మార్గుడుండి [గొంతు సవరించుకోవడం] కొట్టి కట్టేసి వాళ్ళని చిత్రహింసలు పెట్టి లాకెళ్ళాడండి అన్నాం అన్నాం ఊరుకనే అంటే ఎప్పుడు దుర్మార్గుడైనా అన్ని చోట్ల అలాంటి దుర్మార్గుడైనా ఎప్పుడు అలాగే ఉంటాడా ఉండడు దొంగతనం చేసే ఒక్క చోట అలా ఉంటాడు ఎందుక నా డబ్బు కావాలి కానీ ఈ డబ్బును తీసుకెళ్లి తనకు ఖర్చు పెట్టే తన స్నేహితుల దగ్గర తన కుటుంబ సభ్యుల దగ్గర తన పిల్లల దగ్గర చాలా ప్రేమగా ఉంటాడు. చాలా మంచిగా ఉంటాడు.
(28:29) ఇప్పుడు ఆ దొంగ నేను ఎందుకు ఇలా దొంగన అయపోయానని స్వాముల చుట్టూ గురువుల చుట్టూ మతాల చుట్టూ దేవుళ్ళ చుట్టూ దేవతల చుట్టూ నాలో దొంగ బుద్ది పోవాలని తిరుగుతున్నాడు అనుకోండి ఊరికి నేను అనుకుందాం. నువ్వు అసలు ఎప్పుడు 24 గంటలు దొంగవైతే అలా తిరగొచ్చు. నీకు మంచి అసలు తెలియకపోతే నీకు ప్రేమ అసలు తెలియకపోతే నీలో కరుణ అసలు లేకపోతే దయ అసలు లేకపోతే జాలి అసలు లేకపోతే కానీ దొంగతనం ఒక్క చోట నువ్వు అలా ఉంటున్నావ్ మిగిలిన అన్ని చోట్ల మామూలు మనిషిలానే ఉంటున్నావ్ స్నేహితులతో అభిమానంగా స్నేహం చేస్తున్నావ్ కుటుంబ సభ్యులకి దొంగలించుక వెళ్ళింది ప్రేమగా పెడుతున్నావ్ కుటుంబ
(29:06) సభ్యులని ప్రేమతో చూస్తున్నావ్ వాళ్ళ పట్ల అభిమానం ఉంది ప్రేమ ఉంది దయ ఉంది జాలి ఉంది కరుణ ఉంది అన్ని ఉన్నాయి నేను నాది నా వాళ్ళు అన్ని ఉన్నాయి అంటే అంటే ఇప్పుడు నీలో మంచి ఉంది ఆ మంచిని నువ్వు అన్ని చోట్ల చూపించట్లే ఆ మంచిని నువ్వు అనుకున్న నీ వాళ్ళ దగ్గరే చూపిస్తున్నావ్ బయట చూపించట్లే నువ్వు దానికి నువ్వు చూపించట్లేదు నేను అని అనుకోకుండా నేను మారలేకపోతున్నాను నేను మారలేకపోతున్నాను అని అంటున్నావ్ మనందరం అలాగే అంటున్నాం నాతో సహా ఎందుకని అంటే మనం ఎక్కడెక్కడ ఏ ఏ ప్రదేశాలలో మనకి మనకి మన ఇష్టం వచ్చినట్టు సాగుతుందో ఆయా ప్రదేశాలలో మన ఇష్టం వచ్చినట్టు
(29:49) ఉండటానికి అలవాటు పడిపోయాం. అసలు ఆ మనిషి కనపడగానే అలా ప్రవర్తించేస్తాం ఆ ప్రదేశంలోకి వెళ్ళగానే అలా ఉండిపోతాం. ఇప్పుడు సపోజ ఒకచోట మనం యజమాని అనుకోండి అక్కడికి ఆ ప్రదేశం గుర్తురాగానే యజమానిత్వం భావన గుర్తవచ్చేస్తది యజమాని అయిపోతాను నా కిందోళ్ళందరూ పనివాళ్ళు అయిపోతారు నా భావన మారిపోద్ది అక్కడికి వెళ్ళినాక నా ఇష్ట రాజ్యంగా ఉండాలనిపిస్తది అలా భార్య కావచ్చు భర్త కావచ్చు కొడుకు కావచ్చు కూతురు కావచ్చు తండ్రి కావచ్చు తల్లి కావచ్చు ఏ బంధంలో అయినా ఆ బంధం గుర్తు రాగానే నేను అలా అయిపోతాను ఆ మనిషితో అలా ఉంటాను అదే మళ్ళీ నాకు
(30:26) అనుకూలతలు లేని చోట లేదా నా పైవాళ్ళు ఉన్న చోట ఇప్పుడు నేను పనివాడిని అనుకోండి నేను పనివాడిని అనే ప్రదేశంలో అక్కడ యజమానిత్వం ఇంకొకరికి ఉంటది అక్కడ వినయం వచ్చేస్తది. నాకంటే వీళ్ళు పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు అన్న చోట వినయం వచ్చేస్తది వాళ్ళనిఏమ అననుం వాళ్ళఏం మాట్లాడను వాళ్ళు ఎంతన్నా మౌనంగా ఉంటాను ధరిస్తాను ఓర్చుకుంటాను నచ్చకపోతే లోపల లోపల కుమిలిపోతాను తప్ప పైకి మాట్లాడను వ్యక్తీకరించను లేదా సద్దుకుపోతాను లేదా అసలు పట్టించుకొని శాంతంగా ఉంటాను ఎందుకని అక్కడ నా అవసరం అవసరం ఉన్న చోట చేతులు కట్టుకొని ఉండటం అనుకూలతలు ఉన్న చోట అందరినీ చేతులు
(31:08) కొట్టుకొని నా దగ్గర ఉండండి అని కోరుకోవటం ఇవన్నీ కూడా మనం గమనించుకుంటే నాకేదో అహంకారము పొగరు ఉంది అనే పాయింట్ కాదు మనం గమనించుకుంటే మనం మనల్ని ఫిక్స్ చేసుకుంటున్నాం ఈ ప్రదేశంలో ఇలా ఉండాలి ఈ మనిషితో ఇలా ఉండాలి మనం ఫిక్స్ అయిపోతున్నాం సాగిన చోట ఇలా ఉండాలి సాగని చోట ఇలా ఉండాలి అలవాటైన చోట ఇలా ఉండాలి కొత్త ప్రదేశంలో ఇలా ఉండాలి ఇలా ఫిక్స్ చేసుకుంటున్నాం అంటే భార్య దగ్గర ఇలా ఉండాలి భార్య కనపడగానే అలా అయిపోతాను భర్త కనపడగానే అలా అయిపోతాను చాలా మందిని గమనించాను నేను మగవాళ్ళు ఇంట్లోకి రాగానే ఇంటికి రాగానే వెర్రెక్కిపోతారు
(31:54) నేను చూసాను చాలా చోట్ల చూసాను ఇంకా ఎవరు ఏంటని చెప్పడం బాగోదు ఎందుకు ఇంట్లోకి వస్తే వెర్రెక్కిపోతారు ఎందుకంటే యజమానిత్వ భావన వచ్చేస్తుంది అలాంటి దుర్మార్గుడైన వ్యక్తిని నేను చూశాను ఒక 50 సంవత్సరాల సుదీర్ఘ పర్యంతం చూశాను యజమానిత్వం విపరీతమైన యజమానిత్వం ఆ ఒంటి నిండ ఆ అహంకారం ఆ కొవ్వు ఆ పొగరు ఆ మదం అయన్నీ ఉంటాయి మళ్ళీ ఎంత విచిత్రమైన వ్యక్తి అంటే అతను ఇంటిలోనే అలా ఉంటాడు ఇంట్లో వాళ్ళతోనే అలా ఉంటాడు మిగిలిన వాళ్ళందరితో వాళ్ళందరికీ అనుకూలంగా ఉంటాడు వాళ్ళకఅన్నీ చేసి పెడతా ఉంటాడు ఎక్కడ వాళ్ళు తన్ని వదిలేస్తారు వెళ్ళిపోతారు
(32:35) అని వాళ్ళు వెనకబడి వాళ్ళక అన్ని రకాలు చేసి పెడుతూ అదిఒక పెద్ద గొప్ప టాక్ఫుల్ జీవితం జీవిస్తున్నట్టుగా భావించుకుంటాడు కానీ కుటుంబాన్ని కోల్పోయాడు కోల్పోతాడు కోల్పోయాడు ఇంతే జీవితం ఆ మనిషిని వదిలేశరు వాళ్ళ కుటుంబ సభ్యులు వదిలేసారు ఆ మనిషిని కానీ అతను ఆ యజమానిత్వపు జీవితానికి అలవాటు పడిపోయి ఇప్పుడు తన దగ్గర ఎవరున్నారో వాళ్ళని పెట్టుకు తిరుగుతా ఉంటాడు కుటుంబ సభ్యులు అంత మంచిోళ్ళు కాదని చెప్పి తిరుగుతా ఉంటాడు.
(33:07) ఇలా ఇంట్లో అత్త కోడలక వచ్చే గొడవు ఇదే అప్పటివరకు ఆ ఇంటికి యజమానిత్వము అనేది ఎవరు వహిస్తున్నారు ఆవిడ నా ఇల్లు అని భావించుకుంటుంది తన భర్త యజమాని అయి ఉండొచ్చు కానీ నా ఇల్లు అని భావించుకుంటుంది. ఇదంతా నా ఇల్లు నా భర్త నా పిల్లలు కొత్తగా కోడలు ఇంటికి వచ్చింది. కొత్తగా కోడళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు కోడలు ఏమవుతుంది ఆ ఇంటిలోనే ఒక సభ్యురాలు అవుతుంది.
(33:36) ఈవిడికి యజమానిత్వం ఉన్నప్పుడు అక్కడ యజమానిత్వపు భావన తనకు అలవాటు పడిపోయింది ఇల్లంతా నాదిని ఇప్పుడు కొడుకు పెళ్లి అంటే పాతికేళ్ళ సుమారుగా 30 ఏళ్ళ అవ్వాలి. అంటే పాతికి 30 ఏళ్ళు ఒక భావన స్థిరపడిపోయింది అక్కడ అంటే ఉదాహరణకి కొన్ని చెబుతున్నాను ఇంకా మిగిలినవన్నీ మీరు అన్వయించుకోవాలి అహంకారం ఎలా వెళ్తుంది అని ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే వందల వందలు వందల గ్రంథాలు రాయొచ్చు ఒక్క అహంకారం మీద మీరు అన్వయించుకోండి ఇప్పుడు కొత్త మనిషి వచ్చేటప్పటికి ఆ కొత్త మనిషి ఏమనుకుంటది తన ఇంట్లో ఎలా ఉందో తనకు అలాగే ఇక్కడ ఉంటది అన్న భావంతో
(34:13) వస్తది పైగా ఇంకొంచెం బెటర్ గా ఉంటదేమో ఎందుకంటే భర్త అనేవాడు కూడా నా జీవితంలోకి వచ్చాడు కదా ఇంతకుముందు తన ఇంట్లో తల్లి తండ్రి అన్నదమ్ములు అక్క చెల్లెలు ఈ బంధాలే ఉన్నాయి. ఇప్పుడు జీవితంలోకి కొత్తగా భర్త అనే ఒకతను వచ్చేసాడు ఈ బంధాలు అన్నింటికీ దగ్గరగా కాబట్టి ఇంకా బాగా స్వేచ్ఛగా ఇంకా బాగా హాయిగా ఇంకా బాగా ఆనందంగా ఉంటదేమో అక్కడనే ఆవిడ వెళ్తది.
(34:36) ఇప్పుడు ఆ కొడుకు కోడలు అన్యోన్యంగా ఉండంటే చెంగు పట్టుకు తిరిగేస్తున్నాడు ఇన్నాళ్ళు నాదే నా చెంగు పట్టుకు తిరిగేవాడు తల్లి భావన భార్య చెంగు పట్టుకు తిరిగేస్తున్నాడు ప్రతిదానికి అమ్మ అమ్మ అమ్మ అని అడిగేవాడు ఇప్పుడు వెళ్లి ప్రతిదానికి వాళ్ళ ఆవిడ వెనక వెళ్ళిపోతున్నాడు అన్న భావాన్ని క్రియేట్ చేసుకుంటది కానీ అసలు పెళ్లి చేసింది ఎందుకు అలా తిరగమనే అలా ఉండమనే వాళ్ళ జీవితానికి వాళ్ళ వయసుకు తగ్గ ఒక సహచర్యాన్ని అందిస్తే మనం ముందు వెళ్ళిపోతాం పెద్దోళ్ళం కను గనుక ప్లస్ ఆ శారీరక అవసరాలు కూడా అక్కడ ఉన్నాయి గనుక వాళ్ళకి జీవితాంతం
(35:11) ఈడు జోడుగా తోడుగా ఒకరికొకరు ఉండేలా ఏర్పాటు చేశం అది వివాహ వ్యవస్థ ఇది పెద్దలు ఋషులు ముల్లులు పెట్టింది ఇదేమో ఆకాశంలో నుంచి వచ్చింది కాదు లేకపోతే మనం జంతువులు అని ఉండేవాళ్ళం కానీ ఆ యజమానిత్వపు భావన ఇల్లు నాదన్న భావన నువ్వు ఎక్కడో బయట నుంచి వచ్చావు అన్న భావన అత్త కోడలకి ఎప్పుడు పడదు కోడల స్థానంలో ఉన్నామ ఏమనుకుంటది ఇల్లు నా ఇల్లుని ఎందుకని అప్పటికి కొడుకు సంపాదనలోకి వచ్చేస్తేనే వివాహం చేస్తాం.
(35:40) కలిసి ఉన్నా తల్లిదండ్రులు కొడుకు కోడలు కలిసి ఉన్నా విడిపోయి ఉన్నా నా ఇల్లు అన్న భావనలోకి వస్తది నా భర్త నా మొగుడు నా మొగుడు సంపాదన మేము సంపాదించుకుంటున్నాం అని భావన ఈమెకు ఉంటది. నిజమే అది వాళ్ళలే అందుకే పెళ్లి చేసాం మనం పెళ్లి చేసిందే నువ్వు కుటుంబం ఏర్పరుచుకోమని అలా అక్కడి నుంచి ఇంకా ఘర్షణలు పెంచుకుంటూ పోతారు అన్ని రిలేషన్స్ లో కానీ వాస్తవికతను ఆలోచిస్తే అసలు వివాహం అనేది మనం చేస్తుందే మన ఇంటికి ఒక కూలీ మనిషిని తెచ్చుకోవడానికి కాదు మన కొడుకో మన కూతురుకో మన వాళ్ళకి ఒక జీవితాన్ని ప్రారంభింప చేయడానికి నూతన జీవితాన్ని
(36:19) నూతన ఇంటిని వాళ్ళ నూతన స్వతంత్రత వాళ్ళ సొంత జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నాం పెళ్లి పేరుతో ఇప్పటిదాకా వాళ్ళ జీవితం అంతా ముడిపడిపోయింది మన జీవితంలో కలిసిపోయింది. కాదు ఇక్కడి నుంచి మీ జీవితం వేరు జీవితం మీరు స్వతంత్రంగా హాయిగా బతకండి అనేదే వివాహ బంధం ఇవన్నీ అహంకారం అనేది ప్రత్యేకంగా ఎక్కడో ఉండిపోయిలేదు నువ్వు ఫిక్స్ అయిపోయావు ఇప్పుడు అత్తగారు కోళ్ళకు ఘర్షణ అంటే అత్తగారు ఫిక్స్ అయిపోయింది.
(36:48) ఉదాహరణకి చెబుతున్నాను అన్ని చోట్ల అలా ఉండదు మిగిలినయి మీరు ఎక్కడెక్కడ ఏ ప్లేసుల్లో ఫిక్స్ అవుతున్నారో చూసుకోండి. నేను ఉదాహరణగా ఎక్కడ ఫిక్స్ అవుతున్నావ్ అని చెబుతున్నాను. ఇక్కడ ఈ పోర్షన్ నేను ఇలాగే యాక్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయిఉంది. ఆ ఫిక్స్ అయిపోయినటువంటి యాక్షన్లో ఇంక నువ్వు నేను మార్చుకోవచ్చు మార్చుకోగలను అనుకోవట్లే దాన్ని తాళం వేసావు ఫిక్స్ అయిపోవడం అంటే ఏంటి తాళం వేసి తాళం చెప్పి పారేసావు ఇక తీయక్కర్లేదు ఎప్పటికి నేను ఇలాగే ఉంటాను మార్చుకో అక్కర్లేదు నన్ను ఒక జీవితం అంతా నువ్వు అత్తగారిగా ఉండటానికి ఇష్టపడుతున్నావ్
(37:20) అమ్మగా ఉండడానికి ఇష్టపడుతున్నావ్ కొడుకునేమో అమ్మలా చూస్తావ్ ఆ వచ్చిన కోడల్ని అత్తగారిలా చూస్తావ్ అత్తగారు అంటే ఏంటి దూరపు బంధం కానీ మీరు గమనిస్తే ఈ ఎక్కువ ఈ హిందీ సినిమాలు హిందీ సీరియల్స్ లో మీరు వీటిలో చూస్తే అత్తగారు మామగారిని కూడా అమ్మ నాన్న అనే పిలుస్తారు వాళ్ళు మీరు కొన్ని సీరియల్స్ లో చూడండి వచ్చిన కోడలు గాని అల్లుడు గాని అమ్మ నాన్న అనే పిలుస్తారు.
(37:49) రియల్ గా అలాగే పిలిపించాలి అమ్మ నాన్న అనే పిలిపించాలి. ఎందుకని అలా ఉండాలి మీ బంధం ఎందుకని ఇక్కడి నుంచి మీరు మళ్ళీ కొత్త లైఫ్ ప్రారంభం అవుతుంది మీరంతా కలిసి ఉంటారు. మీ బిడ్డతో ఎలా అయితే మీరు చివరి వరకు విడిపోరో అలాగే మీ కోడలతో మీ అల్లుడితో మీరు చివరి వరకు విడిపోరు కలిసి ఉంటారు. చివరి దశ వరకు వాళ్ళందరూ మీరు కలిసి ఉంటారు.
(38:14) ఒకవేళ వాళ్ళు మీకు ఆధారం కూడా అవ్వచ్చు వృద్ధాప్యంలో ఇవన్నీ ఎవరో చెప్పాలా ఇప్పుడు ఇప్పుడు మాట్లాడే మాటలు ఎవరు చెప్పారు ఏ గ్రంథంలో ఉన్నాయి విశ్లేషించుకుంటే మనకే తెలుస్తది మనం ఎక్కడ ఫిక్స్ అయ్యామో అక్కడ అహంకారం ఇలాగే నేను ఉంటాను అని చెబుతుంది. అది చెబుతుంది ఎవరు నా అహంకారమే నేనేగా ఫిక్స్ అయింది. నేనేగా ఫిక్స్ అయింది. ఇప్పుడు నా భార్య గయ్యాలి అని ఒక భావం ఏర్పరచుకున్నాడు అనుకోండి ఇంకా భార్యని చూసినప్పుడు అల్లా అదే రిపీట్ అయిపోతా ఉంటది.
(38:48) ఇంట్లోకి వస్తే నాకు మనశశాంతి ఉండదు ఎందుకంటే నేను చూసాక ఇలాంటి మనిషిని ఒకడిని చూశను నేను ఇల్లు దాటెళ్తే యమానందంగా ఉంటాడు ఇంటికి వచ్చాడంటే అంతే ఇంకా నరకం చూపిస్తాడు ఇంట్లో వాళ్ళందరికీ తాను నరకం అనుభవిస్తా ఉంటాడు ఏమి లేదు అతని మనస్తత్వం నేను అనేక శీర్షికల్లో ఇతను ఉదాహరణలు చెబుతా ఉంటాడు ఎందుకంటే నేను స్వయంగా చూశ ఇంటికి రాంగానే వీళ్ళందరూ నా పనిోళ్ళు నేను చెప్పినట్టు అనాలి నాకు ఎవరు ఎదురు చెప్పకూడదు ఎందుకంటే నా డబ్బు తింటున్నారు నేను సంపాదించింది తింటున్నారు ఎవరో సొంత భార్య పిల్లల్ని ఇంకా అంతకంటే దుర్మార్గుడు ప్రపంచంలో
(39:19) ఉంటాడు అక్కడన్నా అతను ఎంత దుర్మార్గుడు అంటే తన చిన్న పిల్లలైన కొడుకు కూతురు ఆరేళ్ళ పిల్లలు అదే ఓ తెలిసేది అప్పటి నుంచేగా చిన్నప్పుడు ఏమనేవాడో తెలిీదు ఆరేళ్ళ పిల్లలు ఓ తెలిసినవాళ్ళని నేను చెప్పినట్టు వింటే ఉండండి ఇంట్లో లేకోతే బయటికి వెళ్ళిపోండి అని చెప్పేవాడు దారికి అదే చెప్తాడు నేను చెప్పినట్టు ఉంటే ఉండు లేకపోతే వెళ్ళపో నీ దారి నువ్వు చూసుకో ఇంకా ఇంకా అసలు మాట్లాడటానికి అవకాశమే దేవుడు అటువంటి వ్యక్తితో ఓ 50 60 ఏళ్ళు జీవించినోళ్ళ జీవితం ఎంత నరక ప్రాయంగా ఉంటది వాళ్ళ మానసికంగా ఎంత సంఘర్షణలకు లోన అయి ఉంటారు ఎంత సైకలాజికల్
(39:59) పేషెంట్లు అయి ఉంటారు అసలు అటువంటి వ్యక్తిని ఎవరైనా కోరుకుంటారా అంటే ఇక్కడ అహంకారమే అంతుంది కానీ అది ఇంటికి వస్తేనే ఉంటది ఇంట్లో వాళ్ళ మీదే ఉంటది ఎందుకో తెలుసా నా మీద మీరు ఆధారపడి ఉన్నారు మీరు నన్ను భర్త అనకూడదు మీరు నన్ను తండ్రి తండ్ర అనకూడదు మీరు నన్ను తండ్రిలా చూడకూడదు మీరు నన్ను ఒక దేవునిలా చూడాలి మీరు ఎప్పుడు నా కాళ్ళ మీద పడి ఉండాలి.
(40:26) అంతే తప్ప హక్కులు చూపించకూడదు తండ్రి అనే హక్కు చూపించకూడదు భర్త అనే హక్కు చూపించకూడదు నన్ను ఒక దేవుడిలో కొలవండి నేను అక్కడ కూర్చోమంటే కూర్చోండి నుంచోమంటే నుంచోండి అప్పుడు మీకు అన్నం పెడతా అప్పుడు మీకు బట్టలు కొట్టిస్తా అహంకారానికి మదానికి పొగరికి పరాకాష్ట అతను అతని చివరి దశను చూడాలనుకుంటున్నాను నేను ఎలా ఉంటది ఎందుకంటే అతను నిజమా నా అభిప్రాయాలు నిజమా కూడా తెలియదుగా నేనేమ ఎవరిని శపించట్లే ఎవరు కష్టపడాలని అసలు కోరుకోవట్లే ఆత్మజ్ఞాన మార్గంలో అందరూ సుఖ ప్రయాణమే చేయాలి అందరి జీవితాలు హాయిగా ముగియాలి ఇక్కడ ఎందుకంటే ఆత్మవతి సర్వభూత అని కానీ అహంకారం యొక్క
(41:08) పరాకాష్టలు చాలా చోట్ల చూశను అతన్ని చూసినాక నా జీవితాన్ని నేను చాలా మార్చుకున్నాను ఎంత మార్చుకున్నాను అంటే అసలు నా కుటుంబ సభ్యులని ఒక్క మాట కూడా అన్నాను ఇల్లు మీదే అని చెబుతాను కోపం వస్తే మీకు అప్ప చెప్పేసి ఇవన్నీ నేను వెళ్ళిపోతాను అని చెప్తాను అలా చెప్పిన సందర్భాలు ఉన్నాయి నేనేమి అంత గొప్పోడినిఏం కాదు నేను ఘర్షణలు పడ్డాను నేను గొడవలు పడ్డాను నేను కానీ నేను ఏం చెబుతానుఅంటే ఇక్కడ ఉన్నాయన్ని మీ అతనికి రివర్స్ లో చెబుతాను మీకు అన్నీ అప్ప చెప్పేసి ఇల్లు అప్ప చెప్పేసి నేను బికారులాగా పోతాను నచ్చితే కలిసి ఉందాం లేకపోతే పోతానుని కోపం వచ్చినప్పుడు
(41:44) అంటాను అవి కూడా మానేసాను ఇప్పుడు ఇప్పుడు లేదు నేను చెబుతుంది కొత్తలో పెళ్లయిన కొత్తలో పిల్లలు పుట్టిన కొత్తలో మిడిమిడి జ్ఞానంతో సాగుతా న్న అహంకారపు అహంకారం ఆగని చోట ఎందుకంటే అది ఎవరికీ ఆగదు దాన్ని అర్థం చేసుకుంటే ఆగు నన్ను నేనే అర్థం చేసుకున్నాను అవే మీకు చెబుతున్నాను సాగని చోట ఆగుతున్నాను కదా సాగిన చోట ఎందుకు ఆగలేకపోతున్నాను ఇంతే నా పాయింట్ అంటే సాగని చోట ఆగుతున్నాను అనుభవని చోట ఆగుతున్నాను అవసరమైన చోట చేతులు కట్టుకొని నిలబడుతున్నాను అది వినయంగా ఉంటున్నాను అహంకారం వినయం కింద మారిపోతుంది పొగరు వినయం కింద మారిపోతుంది
(42:22) కోపం అరుపులు కేకలు అన్నీ కూడా చాలా వినయం కింద మారిపోతున్నాయి కానీ అవే మళ్ళీ తనకు సాగిన చోట వీళ్ళు నా మీద ఆధారపడి ఉన్నారు అన్న భావన వాళ్ళ నుంచి మనక ఏదో కావాలి వాళ్ళు మనకు నచ్చినట్టు అవన్నీ ఇవ్వకపోతే వాళ్ళు మనకు నచ్చినట్టు ఉండకపోతే గౌరవాలో కోరికలో కీర్తి ప్రతిష్టలో అలా ఉండాలి అవన్నీ ఇవ్వాలి వాళ్ళు మనక ఎందుకు మన మీద ఆధార రపడి ఉన్నారు ఇవ్వకపోతే ఇష్టరాజ్యంగా ప్రవర్తిస్తాను.
(42:57) అయితే ఇది ఒకే శైలిలో ఒకే రకంగా ఉంటే నేను మారలేకపోతున్నాను అనుకోవచ్చు ఇందాక మనం స్టార్టింగ్ లో ఇదే శీర్షికల్లో చెప్పుకున్నాం ముందు ఒక దొంగ దొంగతనాలు చేసేటప్పుడు ఎదుటి వ్యక్తులని చంపేయొచ్చు కొట్టొచ్చు తిట్టొచ్చు ఎత్తుకుపోవచ్చు కానీ కనీసం కొట్టకుండా తిట్టకుండా ఎత్తుకుపోయినా కూడా అది కాఠిన్యతే ఎందుకని వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ కోసం సంపాదించుకున్న వాళ్ళ కుటుంబం కోసం సంపాదించుకున్న వాళ్ళ ధనాన్ని నేను ఎత్తుకుపోతున్నాను అది కూడా దాటిన్యతే [గొంతు సవరించుకోవడం] అది కూడా అహంకారమే కానీ దాన్ని తెచ్చి మళ్ళీ పెట్టేటప్పుడు నా కుటుంబ సభ్యులకు
(43:34) పెట్టేటప్పుడు ఎంతో ప్రేమగా పెడుతున్నా నా కుటుంబ సభ్యుల కోసం ఇద్దరు కుటుంబ సభ్యులనే ఇబ్బంది పెట్టేస్తున్నా కానీ ఇక్కడ ప్రేమ ఉంది నా కుటుంబ సభ్యుల మీద ప్రేమ ఉంది నా మీద మీద ప్రేమ ఉంది నా స్నేహితుల మీద ప్రేమ ఉంది నాకు సంబంధించిన నా వాళ్ళందరి మీద ప్రేమ ఉంది. అంటే ప్రేమ అనేది నాకు తెలుసు దయ అనేది నాకు తెలుసు కరుణ అనేది నాకు తెలుసు ప్రేమించడం నాకు వచ్చు అభిమానం నాకు వచ్చు కానీ నేను దొంగ అన్న ప్లేస్ లో దాన్ని చూపించను చూపించను కాబట్టి దొంగన అవ్వను లేకోతే అసలు నేను దొంగనే అవ్వను ఎవరైతే తమ అహంకారాన్ని గమనించుకొని నాలో
(44:09) వినయం ఉన్నది సాగన చోట వినయంగానే ఉంటున్నాను నాలో మంచి ఉన్నది సాగిన చోట మంచిగానే ఉంటున్నాను అవసరమైన చోట మంచిగా వినయంగానే ఉంటున్నాను చేతులు కట్టుకొని ఉంటున్నాను నాకు సాగిన చోట మాత్రమే రాక్షసుడులా రాక్షసిలా పేట్రేకిపోతున్నాను దీన్ని మార్చుకోలేకపోతున్నాను అని నేను చెబుతున్నాను కానీ గమనించుకుంటే నాలో రెండు లక్షణాలు ఉన్నాయి.
(44:34) పేటరేకిపోయి అహంకారంతో మదమెక్కినట్టు ప్రవర్తించేవి ఉన్నాయి. వినయంగా మంచిగా చేతులు కట్టుకొని ప్రశాంతంగా ప్రేమిస్తూ మంచిగా ఉండే లక్షణాలు ఉన్నాయి. సర్దుకోగలిగిన లక్షణాలు ఉన్నాయి సాగిన చోటల్లో సద్దుకుంటున్నాం గా మరి అది నేను ఇక్కడ ఎందుకు చేయలేను ఎక్కడెక్కడైతే అహంకార ప్రదర్శన జరుగుతుందో అక్కడక్కడ నేను ఎందుకు ఇలా ఉండలేను వినయంగా ఎందుకు ఉండలేను ప్రేమగా ఎందుకు ఉండలేను దయగా ఎందుకు ఉండలేను పద్ధతిగా మంచిగా ఎందుకు ఉండలేను ఎందుకు సద్దుకోలేను ఒకవేళ ఎదుటివాళ్ళదే తప్పు అయినా నేను ఎందుకు సర్దుకోలేను చాలా చోట్ల సద్దుకుంటున్నాక చూడ ఒక రోడ్డు మీదకి వాహనం వేసి వెళ్లి
(45:15) వెళ్ళామ అనుకోండి వాహనం వేసుకొని ఒక రోడ్డు మీదకి వెళ్ళాం కొన్ని వందల వేల లక్షల వాహనాలు రోడ్ల మీద తిరుగుతా ఉంటాయి. వాళ్ళందరూ మనకి దారి ఇచ్చేస్తారు నువ్వు వెళ్ళిపో బాబు లేకోతే నువ్వు వెళ్ళిపో అమ్మ అని ఎవరెవరో ఎవరో దోవలాళ్ళు అసలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పోతుంటారు. మన వరకు తీసుకుంటే మనం సద్దుకొని వెళ్తా ఉంటాం ఎవరు మనల్ని వాళ్ళ వాహనంతో డీ కొట్టేయకుండా మనం ఎవరిని డీ కొట్టేయకుండా ఎవరి ఇష్ట రాజ్యంగా వాళ్ళు ఎవరు రోడ్లు కళ్ళ వెళ్ళిపోతుంటారు అనేక దారులు ఉంటాయి హైట తిరుగుతారు లెఫ్ట్ తిరుగుతారు రైట్ తిరుగుతారు ఇటు తిరుగుతారు ఎటు పడితే అటు
(45:53) పోతా ఉంటారు. అలా వెళ్ళేవాళ్ళందరినీ సద్దుకుంటూ జాగ్రత్త పడుతూ మన వాహనాన్ని నడుపుకొని వెళ్తాం అలా అన్ని చోట్ల ఉండొచ్చుగా అది నీకు తెలిస్తే అదే జ్ఞానం అదే ఆధ్యాత్మికత ఏమి లేదు ఆధ్యాత్మికం అంటే నీకు లైఫ్ డ్రైవింగ్ తెలియట్లేదు లైఫ్ డ్రైవింగ్ తెలియని చోట అహంకార ప్రదర్శన వచ్చేసింది అంతే తప్ప నిజంగా అహంకారం అనేది అహం అంటే మదము పొగరు మాచర్యం ఎటువంటివి లేవు అసలు నువ్వు కావాలని నేర్చుకున్న అలవాట్లు చిన్నప్పటి నుంచి మీ నాన్న అలా అరిసి ఉంటాడు కరిసి ఉంటాడు అది నీకు వచ్చేసింది మీ నాన్నకుి డబ్బు పిచ్చి ఉండి ఉంటది అది నీకు వచ్చేసింది మీ
(46:32) నాన్నకో మీ అమ్మకో ఉన్న అలవాట్లు అన్ని నీకు వచ్చేసినయి నీ చుట్టూ పెరిగిన వాళ్ళలో నీ స్నేహితులు ఏ సిగరెట్లో మందో కొట్టి ఉంటారు నువ్వు కూడా వాళ్ళతో పాటు కొట్టు ఉంటావు నిన్ను తీసుకెళ్లి ఉంటారు ఐ నీకి వచ్చేసింది ఇలా నువ్వు అలవాటు చేసుకున్నటువంటి మంచి లక్షణాలు గాని చెడు లక్షణాలు గాని అన్ని నీ చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి ఒకసారి పరిశీలించుకెళ్ళు వెళ్తే నా తండ్రి ఎలా ఉన్నాడు నా తల్లి ఎలా ఉంది ముందు ఇంట్లో చూసుకో నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్లు ఎలా ఉన్నారు తర్వాత నేను స్నేహం చేసినటువంటి స్నేహితులు ఎలా ఉన్నారు నాతో బాగా క్లోజ్
(47:02) గా ఉన్న నా బంధు మిత్రులు ఎలా ఉన్నారు ఈ గుణ గుణాలన్నీ నువ్వు ఆపాదించుకొని ఉంటావు ఎలా అయితే శీర్షిక స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం భాషలో భాష ఉచ్చారణ తెలుగుని అనేక రకాల యాసలతో ప్రాసలతో మాట్లాడుతారు అంటే ఉచ్చారణ శైలి మారిపోద్ది తెలుగే శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఒకలా మాట్లాడుతారు అక్కడి నుంచి విశాఖపట్నం దాటి పక్కక వస్తుంటే ఇంకోలా మాట్లాడతారు అక్కడి నుంచి ఈస్ట్ గోదావరికి వస్తే ఒకలా మాట్లాడుతారు వెస్ట్ గోదావరికి వెళ్తే ఇంకోలా మాట్లాడుతారు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో ఒకలా మాట్లాడతారు రాయలసీమల వెళ్తే ఇంకోలా మాట్లాడతారు
(47:35) అక్కడినుంచి తెలంగాణకి వెళ్ళిపోతే ఇంకోలా మాట్లాడతారు. ఇలా సరిహద్దు ప్రాంతాలు కర్ణాటక ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో ఇంకోలా మాట్లాడుతారు సగం కన్నడ సగం తెలుగుే ఉంటాయి తమిళ ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో ఇంకోలా మాట్లాడుతారు తమిళ తెలుగు కలిసిపోయి ఉంటది. అలా సరిహద్దు ప్రాంతాల రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయో ఆ భాష ఈ భాష కలిప కలిసిపోయి ఉంటది రెండిట్లో ఇప్పుడు అసలు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ మన తెలుగు భాషలో ముఖ్యంగా మిగిలిన భాషలు తీసి పక్కన పెట్టండి ఇంగ్లీష్ పదాలు ఉచ్చారణ కలిసిపోయింది ఆల్రెడీ టీ తాగుతా ఉంటాం టీ అనేది ఇంగ్లీష్ పదం కాఫీ తాగుదా ఉంటాం కాఫీ
(48:14) అనేది ఇంగ్లీష్ పదం అనేక పదాలు ఇంగ్లీష్ పదాలు వాడుక తెలుగు భాషలోకి వచ్చేసినాయి మామూలుగా అసలు ఏ చదువు రాని ఇంగ్లీష్ రానివాళ్ళు కూడా టిషాల్ అని బోర్డు పెడతారు. ఇవన్నీ పదాలు మనవి కాదు తెలుగు పదాలు కాదు హోటల్ అనేది తెలుగు పదం కాదు. అవి సామాన్యమైన తెలుగులో ఇంగ్లీష్ కలిసిపోయింది. అలా మొత్తం అన్ని భాషల్లో కలిసిపోయింది అది ఎందుకంటే ఇంగ్లీష్ అనేది అంతర్జాతీయ భాషగా ఉంది చాలా దేశాల్లో ఇంగ్లీష్ వస్తే ఈ దేశస్తులు ఆ దేశంలో ఆ దేశస్తులు ఈ దేశంలో కలిసి మెలిసి ఉండొచ్చు తిరగొచ్చు.
(48:51) చదువుకున్న వాళ్ళు అందుకని ఆ చదువుకున్న వాళ్ళు తిరిగిన ప్రాంతాలలో సామాన్య భాషలు వాడుకు భాషల్లోకి వెళ్ళిపోయింది కలిసిపోయిన కొన్ని పదాలు అలా అహంకారం అనేక విషయాలతో కలిసిపోతూ ఉంటది కానీ జస్ట్ ఆధ్యాత్మికత అంటే ఏంటి అంటే నీ అహంకారం అసలు ఎలా ఏర్పడిందో తెలుసుకో అహం నేను ఎలా ఏర్పడింది అంటే అసలు నేను పుట్టినప్పుడు అహం లేదు నేను అన్న భావనే లేదు నేను పుట్టినప్పుడు ఏముంది శరీరం ఉంది చక్కటి ప్రాణశక్తి ఉంది.
(49:24) శరీరాన్ని బ్రతికించి ఉంచిన ప్రాణశక్తి ఉందంతే అసలు మనసు అనేది ఇంకా ఏర్పడలేదు. ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి ఏర్పడింది ఆ మనసు అది పుట్టుకతో నాకు వచ్చిన అవయవం కాదు కాళ్ళు చేతులు కన్ను ముక్కు చెవులు లాగా లేదా లోపల ప్రాణశక్తి లాగా వచ్చింది కాదు మనసు ఏర్పడింది శరీర ఎదుగుదలలో ఏర్పడింది అలా ఏర్పడినటువంటి మనసు అంటే ఏంటి మనం గ్రహించిన విషయాలన్నీ అదే నేను అదే అహం అహం అంటే ఏమి లేదు నేనుఅన్న మొట్టమొదటి భావం మనసు అంటే ఏమి లేదు మొత్తంగా అందులో ఉన్న ఆలోచనలతో కలిపి సర్వస్వము మనసు అహం అన్నా మనసన్నా ఒకటే ఉన్న విడివిడిగా అర్థం చేసుకోవడానికి పేర్లు పెట్టుకొని
(50:08) చెప్పుకుంటాం. ఆ అహంలో నేనులోనే సమస్త భావాలు ఉంటాయి. కాబట్టి నా గుణాలు నా స్వభావము నా ప్రవర్తన నా మంచి నా చెడు నా పొగరు నా మదం నా మత్సరం నా ఈర్ష నా అసూయ నా ద్వేషం నా మంచి నా దయ నా కరుణ నా ప్రేమ నా జాలి ఇటువంటి సద్గుణాలు దుర్గుణాలు అన్నీ కూడా నేను చుట్టూ ఉన్న సమాజం నుంచి నేర్చుకొని అహంలో పెట్టుకున్నాను ఇవన్నీ కలిపి నేను నేను నాది నా వాళ్ళతో పాటు ఇవన్నీ నాలో ఉన్నాయి ఇవి నా సొంత ప్రత్యేకతలు ఇప్పుడు ఇందులో నేను దేన్నైనా బ్రదర్స్ ంచగలను కోపాన్ని ప్రదర్శించగలను దయను ప్రదర్శించగలను ఈశువులని ప్రదర్శించగలను ప్రేమను ప్రదర్శించగలను కానీ నేను
(50:52) ప్రదర్శించాలని అనుకోవట్లే నేను అభిప్రాయాలు ఏర్పాటు చేసేసుకున్నా కొన్ని అభిప్రాయాలు బలంగా ఉండిపోయినాయి నా కొడుకు ఇలాంటోడే నా తండ్రి ఇలాంటోడే నా తల్లి ఇలాంటిదే నా కూతురు ఇలాంటిదే నా భర్త ఇలాంటోడే నా భార్య ఇలాంటోడే ఇలాంటిదే నా పిల్లలు ఇలాంటోళ్లే మా అమ్మ నాన్న ఇలాంటోళ్లే ఇలా అన్ని రిలేషన్స్ లోన నాకు కొన్ని అభిప్రాయాలు ఏర్పడిపోయినాయి ఎందుకు ఏర్పడిపోయినాయి అసలు అభిప్రాయాలు ఎందుకు ఏర్పడతాయి అంటే వాళ్ళు అలాంటిోళ్ళు కాదు వాళ్ళ నుంచి నేను ఆశించడం అని వాళ్ళు ఎలాంటిోళ్ళఅని అవసరం అసలు నాకు తెలియని కూడా తెలియదు. ఎవరికైనా ఇప్పుడు
(51:28) నా భార్య ఇలాంటిదే అనుకుందాం నా భర్త ఇలాంటోడే అనుకుందాం లేదా నా తండ్రి ఇలాంటోడే లేదా నా తల్లిదండ్రులు ఇలాంటోళ్లే నా బిడ్డలు ఇలాంటిోళ్లే ఏ రిలేషన్లో అనుకున్నా అసలు ఎదుటి వ్యక్తి మనసులో ఉంది ఎవరికైనా తెలుసా ప్రపంచంలో అప్పుడు మనం ఇలాంటిోళ్ళఅని ఎందుకు అనుకుంటున్నాం వాళ్ళ నుంచి మనం ఏదో ఆశిస్తున్నాం మనం ఆశించినంత మనకు వాళ్ళు అందించినప్పుడు మంచోళ్ళు అందించినప్పుడు చెడ్డోళ్ళు ఇప్పుడు మన ఆశలు ఎప్పుడు కోరుకోవడంలోనే అధికంగా ఉన్నాయి అందించేది తక్కువ ఉంది అనుకోండి వాళ్ళ మీద నెగటివిటీ వచ్చేస్తుంది.
(52:03) ఎప్పుడు అనుకూలతలే కోరుకుంటున్నాం వాళ్ళు మనని అనుసరించాలని కోరుకుంటున్నాం మనకన్నీ అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నాం కానీ అనుకూలతలు తగ్గినవి మనం కోరుకునేది ఎక్కువ ఉంది. వాళ్ళు ఇవ్వకపోవడం లేదు మన కోరిక ఎక్కువ ఉంది అప్పుడు కచ్చితంగా నీ కోరిక ఎక్కువ ఉన్నప్పుడు ఎదుటివాళ్ళు ఎప్పుడ నీకు అనుకూలంగా లేరు చెడ్డవాళ్ళు అని అనిపిస్తది.
(52:24) అది ఇంతకి ప్రాబ్లం నీ మనసులో ఉంది వాళ్ళలో లేదు నువ్వు కోరుకోవటం వలన వాళ్ళ ఇంజనీరింగ్ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు అందిచ్చి నీకు అన్ని సహకరిస్తే మంచివాళ్ళు అంటున్నావ్ నీకు సహకరించకపోతే చెడ్డోళ్ళు అంటున్నావ్ కానీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఏం చేయగలరు చేస్తున్నారు అంతే ఎవరైనా అంతే నువ్వైనా అంతే నేనైనా అంతే ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళకి ఏం చేయగలం మన కుటుంబ సభ్యులే కావచ్చు మొట్టమొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఏం చేయగలమో అది చేస్తాం చివరి రోజు వరకు ఏం చేయగలం అది చేస్తాం.
(52:56) కానీ మన ఎదుట వాళ్ళ కోరిక అంటే మన ఇంట్లో వాళ్ళ మన అన్నదమ్ములో మన అక్క చెల్లెలు మన తల్లిదండ్రులు మన స్నేహితులు మన ఎదుట వాళ్ళ కోరికలు అధికమైనప్పుడు మనం ఎప్పుడు చేయగలిగినంతగా చేస్తాం చేయలేని ఎక్కడ ఏం చేస్తాం వాళ్ళ కోరికలు అధికమైనప్పుడు మనం వాళ్ళకి శత్రువుల్లా కనపడతాం మేము అడిగినంత చేయట్లేదని మనం నచ్చం అప్పుడు వాళ్ళకి మనం వాళ్ళ కోరికలు తక్కువగా ఉన్నప్పుడు మనం చేసేది వాళ్ళకి ఎక్కువైపోయింది అనుకో మనం చాలా మంచిోళ్ళం అంటారు.
(53:31) మనం ఎప్పుడు మనం చేయగలిగినంతే చేస్తున్నాం అది వాళ్ళకి ఎక్కువైపోతే మనం చాలా మంచిోళ్ళం వాళ్ళకి సరిపోతే మనం మంచోళ్ళం వాళ్ళకి చాలకపోతే మనం చెడ్డోళ్ళం సేమ్ మన వాళ్ళు అలాగే భావించుకుంటున్నారు. కానీ ఏ మనిషి అయినా తాను ఎంత చేయగలరో అంతే చేయగలరు అంతకుమించి ఎవరు ఏమి చేయలేరు. కాబట్టి ఎక్కడైనా అహంకారానికి దెబ్బ తగిలేది ఎక్కడ అసలు అహంకారం ఇబ్బంది పడేది ఎక్కడ అంటే ఎదుటి వ్యక్తి నుంచి ఆశించినప్పుడు ఏ రిలేషన్లో అయినా మళ్ళీ ఇదంతా గుండ్రంగా జరిగి ఎక్కడికి వెళ్తదో తెలుసా నిష్కామ కర్మ యోగము అద్భుతంగా మళ్ళీ భగవద్గీతలో దీని మీద ఒక అధ్యాయం ఉంది మొత్తం ప్రపంచంలోకి వచ్చిన
(54:13) మహాత్ములు అందరూ చెప్పారు ఈ ఆధ్యాత్మిక మార్గాల్లోనే కాదు మీరు భౌతికంలో మోటివేషనల్ స్పీకర్స్ కొంచెంజ్ఞ జ్ఞానం తెలిసిన ఎవరైనా చెబుతారు ఏమనో తెలుసా ఆశించకుండా పని చేయ అందుకే బాధ్యతలని పెట్టారు కర్తవ్యములని పెట్టారు డ్యూటీస్ అన్నాడు నువ్వు చేయవలసినవి ముందు కరెక్ట్ గా చెయ్ చేస్తే కదా అసలు ఫలితం వచ్చేది నువ్వు చేసేటప్పుడే ఇంత ఫలితం రావాలని కోరుకోబాక ఎంతైనా ఏదో ఒకటి చేయటం అంటూ ఉంటే ఫలితం తప్పకుండా వస్తది ఎంత వస్తది తీసుకో నువ్వు ఊహించావ అనుకో అంటే ఇంత ఫలితం రావాలి అని ఊహించావ అనుకో అంతకంటే ఎక్కువ రావచ్చు అప్పుడు నీకు ఆనందం వస్తది.
(54:55) నువ్వు అనుకున్నంత రావచ్చు పర్లే సంతోషంగా ఉంటావ్ నేను అనుకున్నంత వచ్చింది కాదు దానికంటే తక్కువ వచ్చింది వస్తువ అయితే వచ్చింది కానీ నువ్వు దుఃఖపడతావ్ బాధపడతావ్ అది ధన రూపంలో అయినా అభిమాన రూపంలోయినా ప్రేమ రూపంలోయినా ఎదుటి మనిషి నుంచి ఆశించినప్పుడు నువ్వు అనుకున్న దానికంటే వాళ్ళు ఎక్కువ ఇస్తే అప్పుడు ఆ ఆ సమయంలో వాళ్ళు నీకు మంచిోళ్ళు మళ్ళ తర్వాత ఇవ్వకపోతే చెడ్డోళ్ళే ఎప్పుడు అడుగుతానే ఉం ఉండవుగా బతికినన్నాళ్ళ అవసరతలు ఉంటాయి.
(55:29) అహంకారపు చర్యలు గమనించు ఆశించిన దానికంటే ఎక్కువ ఇస్తే వాళ్ళు మంచోళ్ళు ఆశించినంతే ఇస్తే పర్వాలేదు మంచోళ్ళ లిస్ట్లో వేసుకోవచ్చు ఆశించిన దానికంటే తక్కువ వస్తే వాళ్ళు చెడ్డోళ్ళు అసలు ఇవ్వకపోతే మహా చెడ్డోళ్ళు దుర్మార్గులు అంతే శత్రువులు అన్ని సమయాలలో ఇవ్వటం నీకు కుదురుద్దా ఒకసారి ఆలోచించు ఎదుటి వ్యక్తులకి నీ జీవితంలోని అన్ని సమయాలలో ఎదుటి వ్యక్తులకు ప్రేమ గాని అభిమానం గాన డబ్బు గాని ఏదైనా ఎదుటి వ్యక్తులకి అన్ని ఇవ్వటం నీకు కుదురుతుదా అన్ని సమయాలలో అన్ని ఇవ్వగలవా అన్ని సమయాలలో అందరికీ
(56:15) అన్ని ఇవ్వగలవా కాదు ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటాం పరిస్థితులు మారుతా ఉంటాయి ఆరోగ్యాలు ఉండొచ్చు అనారోగ్యాలు ఉండొచ్చు మనసు బాగుండొచ్చు మనసు బాగోకపోయి ఉండొచ్చు అసలు ఇవ్వగలిగిన సామర్థ్యం కంటే ఎదుటివాళ్ళు కోరుకునేది ఎక్కువై ఉండొచ్చు అనేక పరిస్థితులు తారశలత ఎందుకంటే 100 సంవత్సరాల సుదీర్ఘ జీవితం మంది అలాగే వందల మందితో సంబంధ బాంధవ్యాలు ఎన్నో సమస్యలు ఉంటాయి శారీరక మానసిక ఆర్థిక సామాజిక కుటుంబిక ఎన్నో సమస్యలు ఉంటాయి వృత్తి వ్యాపార ఉద్యోగ సమస్యలు ఎన్నో ఎన్నో రకాలుగా ఉంటాయి.
(56:52) ఎన్ని సమస్యలలో నుంచి ఒక ట్రాఫిక్ రోడ్డు మీదకి బండ వేసుక వెళ్ళినటువంటి వ్యక్తి అనేక వందల వేల మందిని తప్పించుకుంటూ తన ప్రదేశానికి ఎలా వెళ్ళాలో అక్కడ మనకఏమ ఇబ్బంది అనిపించదు ఎందుకో తెలుసని ఒప్పుకుందాం ఎందుకని ఆ రోడ్డు మందు కాదు అసలు ప్రాబ్లం ఏంటంటే మనకి హక్కు లేని చోట అహంకారం ఎగిరెగిరి పడదు ఆ రోడ్డు మందు కాదు అక్కడ కూడా ఎదురు బెదురు గొడవలు పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు అది మూర్ఖులు మూడులు నువ్వు నువ్వు ఎదురు వచ్చావు నువ్వు ఎదురు వచ్చావు నీ తప్పు నీ తప్పు అని కొట్టుకునేవాళ్ళు రోడ్ల మీద చాలా మంది ఉన్నారు ట్రాఫిక్ జామలు చేసేస్తుంటారు
(57:27) వాళ్ళు మూర్ఖులు కానీ సామాన్యంగా రోడ్డు ఎక్కినప్పుడు రోడ్డు అనేది మొత్తం అందరికీ సంబంధించింది అది గవర్నమెంట్ వేసింది దాని మీద నా పెత్తనం లేదు. అందుకని అందరిని తప్పుకొని మనమే వెళ్ళిపోతుంటాం. కానీ నాకు దాని మీద హక్కు ఉంది పెత్తనం ఉంది నాది నేను నాది నావాళ్ళు అన్న చోట ఎగిరిగిరి పడిపోతుంటాయి ఏదో ఒకోసారి బయటకి కూడా వచ్చేస్తుంటది అహంకారం మదం బాగా పెరిగిపోద్ది బయటకి కూడా వచ్చేస్తుంటది కానీ ఏమవచ్చినా దాని పర్యవసానాలు అనుభవించేది నువ్వే అందుకే నేను మార్చుకోలేకపోతున్నాను నేను మార్చుకోలేకపోతున్నాను అని ఎవరు అడుగుతారో తెలుసా అది తప్పుఅని తెలిసి దాని
(58:08) పర్యవసానాలు అనుభవిస్తూ దుఖ దుఃఖపడిపోతున్నాడు వాళ్ళు దుఃఖపడిపోతున్నారు అందుకని మార్చుకోలే ఎలా మార్చుకోవాలి ఎందుకు మార్చుకోలేకపోతున్నాను అని అడుగుతున్నారు ఎందుకు మార్చుకోలేవు నీ దగ్గరే ఉన్నాయి రెండు రకాల యాక్షన్లు జస్ట్ ని నువ్వు చూసుకో చాలు నీకు సాగిన చోటే నువ్వు అలా మార్చుకోలేకపోతున్నాను అని చెబుతున్నావ్ నీకు సాగన చోట సలాములు కొడుతున్నావ్ ఉమ్మొంగి దండాలు పెడుతున్నావ్ అది చూసుకుంటే చాలు ప్లస్ అసలు అహంకారం ఈ అహం అనేది మనం తయారు చేసుకున్నది దాన్ని ఎప్పుడైనా మ్యాప్ చేయొచ్చు ఎందుకంటే అది మన స్వస్వరూపం కాదు మన కాలు కాదు మన
(58:43) చెయ్యి కాదు. ఇది ఈ మోడల్ లోనే ఉంటది ఇంకా మార్చడం కుదరదుని ఇప్పుడు ప్రతి మనిషికి ముఖం రూపురేఖలు ఉంటాయి మార్చడం కుదరదు దాని డిజైన్ ప్రకారం ఆ శరీరం వెళ్ళిపోతా ఉంటది. కానీ స్వభావం గుణం అలాంటిది కాదు అది మార్చడం కుదురుతది ఎందుకంటే తయారు చేసుకుంది నువ్వే మనసు మార్చడం కుదురుతది అది తయారు చేసుకుంది నువ్వే అందుకే మారుమనసు పొందుడి అని చెప్పారు మారుమనసు అంటే ఏంటి కొత్త మనసు పాత మనసు తీసిపారే మంచిదయతే ఉంచుకోవాలి అందుకని అహంకారం ఎలా మార్చుకోవాలిఅని అడగబాకండి అహంకారాన్ని పరిశీలిస్తే అసలు అహంకారమే లేదు అక్కడ నేను అనేది మొత్తం మనం పోగేసుకున్న
(59:23) ఆలో ఆలోచనల విషయముల సమూహము చుట్టూ ఉన్నవాళ్ళని చూసి నేర్చుకున్నాం ఏదైనా కానివ్వండి మీరు ఏం వేసుకున్నా అందులో ఇప్పుడు ఇది ఎలాంటిది అంటే ఒక దుప్పట ఉంది ఒక చీర ఉంది లేదా ఒక షర్ట్ పీస్ ఉంది ఒక ఫ్యాంట్ పీస్ ఉంది ఒక టవల్ ఉంది ఇవన్నీ కూడా దారాలక దారాలు తలుతారు అలితే దాని పేరు టవలు దాని పేరు లుంగి దాని పేరు చీర దాని పేరు బెడ్ షీట్ దుప్పట మొత్తం అందులో ఏమున్నాయండి ఏమ లేదు దారాలక దారాలు అవి ఈ దారాలు ఎక్కడి నుంచి వచ్చినయి పత్తి చెట్ల నుంచి వచ్చినయి దూది చెట్లు పత్తి పంట పండిస్తారు దూదిని దారంగా చేస్తారు దానికి ఆ గుణం ఉంది
(1:00:10) దారాలతో వస్త్రాలు చేస్తారు. ఇప్పుడు మీరు ఒక టవల్ తీసుకొని ఆ టవల్ లోనుంచి ఒక్కొక్క దారాన్ని తీసి కింద పడేశరు అనుకోండి అప్పుడు టవల్ అనేది ఉంటదా తుండు అనేది ఉంటదా అక్కడ ఉండదు ఒక షేప్ లో ఈ దారాలన్నింటిని అల్లితే అది తుండు అయింది. ఇంకో షేప్లో వెళ్లితే దుప్పుట అయింది ఇంకో షేప్లో వెళ్లితే చీర అయింది ఇంకో షేప్లో వెళ్తే లుంగ అయింది ఇంకో షేప్లో వెళ్తే షాంట్ అయింది ఇంకో షేప్లో వెళ్తే షర్ట్ అయింది మనం పేర్లు పెట్టుకున్నాం దానికి అనేకం ఉన్నాయట ఒక బట్టలకు సంబంధించి ధారాళలికతో తయారయ్యే కోటాను కోట్ల వెరైటీలు ఉన్నాయి కట్ చేపుల
(1:00:53) దగ్గర నుంచి ఎన్నో ఉన్నాయి కానీ అన్నింటిలో ఉన్నవి ఏంటి దారములే ఈ దారములు ఎక్కడి నుంచి వచ్చినయి మూలం పత్తే పత్తి ఎక్కడి నుంచి వచ్చింది చెట్ల నుంచి వచ్చింది చెట్లు ఎక్కడి నుంచి వచ్చినయి పంచభూతాల నుంచి వచ్చినయి ఇప్పుడు దారాలన్నీ తీసేస్తే తుండు ఉంటదా దుప్పట ఉంటదా లుంగి ఉంటదా ఉంటదా చీర ఉంటదా దారాలన్నీ తీసేయండి అందులోనుంచి ఆ చీర అనేది షేప్ పేరు దుప్పట అనేది షేప్ పేరు అలాగే అహంకారం అనేది షేప్ పేరు కోపం అనేది ఒక షేప్ పేరు దుర్గుణాలు అనేది ఒక షేప్ పేరు అది పర్ఫెక్ట్ షేప్ గా నీకుఏమ లేదు నువ్వు అలా ఏర్పాటు చేసుకున్నావు అందులోనే
(1:01:33) ధారాలు ఆ షేప్ ఎలానా మార్చేసుకోవచ్చు అలా మార్చుకోవచ్చు కాబట్టి ఆధ్యాత్మికత నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు మార్చుకోగలవు ఎందుకంటే నువ్వు ఒక చోట మంచిగా ఉంటున్నావు ఒకచోట ప్రేమగా ఉంటున్నావు నీలో ఆ మంచి ఉంది నీకు సాగని చోట నీకు అనుకూలత లేని చోట నువ్వు ఉండవలసిన విధానంలోనే ఉంటున్నావు నీకు అవసరత ఉన్న చోట ఉండవలసిన విధానంలోనే ఉంటున్నావు నీకు సాగిన చోట మాత్రమే అహంకారం విర్రవీకి పెట్టరేగుతున్నది నువ్వు ఇక్కడ మంచిగా ఉండగలిగినప్పుడు అక్కడ కూడా మంచిగా ఉండగలవు అసలు మంచి అనేది నీకు తెలియకపోతే అప్పుడు మంచి తెలుసుకోవచ్చు ఎవరు నన్న అడిగి అసలు మనకు
(1:02:15) పచ్చి మిరపకాయ అనేది ఎలా ఉంటదో తెలియదు అనుకోండి అప్పుడు ఏమండీ పచ్చి మిరపకాయ అంటే ఏంటి అసలు దాని లక్షణాలు ఏంటి దాని క్వాలిటీస్ ఏంటి అది ఎలా ఉంటది ఎన్ని రకాల పచ్చి మిరపకాయలు ఉంటాయి అని తెలుసుకోవచ్చు అప్పుడు చెప్తారు బాబు అది కారానికి సంబంధించింది ఫస్ట్ దాని గుణం కారం నువ్వు కొరికితే కారంగా ఉంటది. పచ్చిమిరపకాయలు రకరకాలు ఉన్నాయి.
(1:02:37) అవి ఆడే పండినప్పుడు పండు మిరపకాయలు అంటారు అవే ఎండ పెట్టేస్తే ఎండు మిరపకాయలు అంటారు అన్ని ఎండబెట్టి కారం తయారు చేస్తారు కారానికి మూలం పచ్చిమిరపకాయలే మనం ఇంట్లో వేసుకునే వంటల్లో వేసుకునే కారం అంతా అదే మనం హార్ట్లుగా ఉపయోగించుకునే అన్ని వస్తువుల్లో ఉండే కారం అదే ఇలా అసలు తెలియకపోతే దాని గురించి తెలుసుకోవచ్చు దాని లక్షణాలు దాని స్వభావం తెలుసుకోవచ్చు నీకు తెలిసిందే మంచి నీకు తెలుసు కానీ నీ చెడు ఉంటున్నాం ఎందుకంటే సాగుతుంది గనుక అక్కడ నువ్వు వాళ్ళు అలాగే ఉండాలని కోరుకుంటున్నావ్ అక్కడ సాగదు గనుక నువ్వే వాళ్ళకి అనుకూలంగా ఉంటున్నావ్
(1:03:17) ఇంకా దానికి ఇప్పుడు నిన్ను నువ్వే మార్చుకోగలవు గానీ ఎలా మారాలి అన్నదానికి ఏ దేవుడు వచ్చి మారుస్తాడు ఏ మతం వచ్చి మారుస్తది ఏ గురువో వచ్చి మారుస్తాడు ఏ తాళలో తాయిత్తులో రంగురాళ్లో ఉంగరాలో మార్చేస్తాయి లేదా ఏ ఆధ్యాత్మిక సాధన విధానంలో పదములో గురువులో వాళ్ళని అనుసరించి వాళ్ళు మార్చేస్తారు నీలో అహంకారం మొత్తం పోగొట్టేస్తారు అని ఎలా కుదురుతుది చెప్పడం ఆల్రెడీ నీలో ఉంది కదా అది మంచి ఉంది చెడు ఉంది నీ ఎంపిక నేను ఇలాగే ఉండాలని ఎంపిక చేసుకుంటున్నావ్ అక్కడ నిన్ను ఫిక్స్ చేసుకుంటున్నావ్ ఆ ఎంపికని గమనించుకో నీలో ఉన్న మంచిని
(1:03:55) మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించుకుంటే అది ఆధ్యాత్మికం అహంకారం అంతం అయిపోద్ది నీకే తెలుసు అహంకారం అంతం అంటే నేను అన్న భావన అంతం కాదు చెడు అంతం అయిపోద్ది అహం మొత్తం చెడు అనుకోకూడదు అహం అంటే మొత్తం అన్ని కలిపి మంచి చెడు కలిపి సమస్తం చెడు అంతం అయపోద్ది పొగర అంతం అయపోద్ది మదమాశ్చర్యాలు అంతమయపోతాయి కోపం అంతమయపోద్ది కోపం ఎల్లప్పుడూ అంతం అవ్వాల్సిన అవసరం కూడా లేదు కోపంలో మళ్ళీ మంచి ఉంది ఇప్పుడు చిన్న పిల్లలకు చెప్పేటప్పుడు వినని వాళ్ళకి చెప్పేటప్పుడు పదే పదే చెబుతున్నా విననప్పుడు అక్కడ అవసరమైనప్పుడు ఆ కోపాన్ని ప్రదర్శించాలి అందుకే సృష్టి
(1:04:34) మనకు పెట్టిన గుణాలన్నీ అవలక్షణాలు కాదు దేన్ని ఎక్కడ ఎలా ఉపయోగించాలో తెలియాలి మంచిగా ఉపయోగించండి. మంచిగా ఉపయోగిస్తే కోపం మంచిదే మంచిగా ఉపయోగిస్తే అన్ని చోట్ల చెడు గుణాలుగా మనం భావిస్తున్నవన్నీ మంచిగా ఉపయోగించొచ్చు మంచిగా ఉపయోగిస్తే అన్ని మంచివే వాటిని చెడు ప్రదేశంలో చెడుగా ఉపయోగిస్తే చెడ్డవ అవుతున్నాయి. కాబట్టి సృష్టి ఒక మనిషికి శరీరాన్ని నిర్మించి ఇస్తున్నప్పుడే మానవ శరీరం ఎలా ఉండాలని ఏ భావాలు ఏ గుణాలు ఏ స్వభావం ఎలా విస్తరించాలని నిర్ణయించిందో దాన్ని నువ్వు ఉపయోగించే తీరును బట్టి అది చెడ్డద అవుతుంది తప్ప సృష్టి అసలు చెడు చేయదు.
(1:05:18) నీకు స్వతంత్రత ఇవ్వడం వల్ల స్వతంత్రతలో నువ్వు నీ గుణాలను ఉపయోగించే తీరు నీ భావాలను ఉపయోగించే తీరు నీ శరీర మనసులను ఉపయోగించే తీరుతెన్నులు నీ భావోద్వేగాలను ఉపయోగించే తీరు తెన్నులు చెడ్డవిగా ఉంటున్నాయి కానీ అవన్నీ మంచివే సరైన చోట సరైన ప్రదేశంలో సరైన విధంగా ఉపయోగిస్తాయి సృష్టిలో చెడు ఎక్కడ ఉండదు అసలు సృష్టిని చెడు చేయబాక నిన్ను నువ్వు గమనించుకొని నీకు అన్నీ తెలిస్తే నీలోమ మంచి ఉంది గనుక నువ్వు ఎప్పుడు మంచివాడిగా బతకొచ్చు మంచిదానిగా బతకొచ్చు ఎంత రాక్షసుడైనా ఎంత క్రూరుడైనా ఎంత హింసాత్మకుడైనా మీరు చరిత్రలోకి వెళ్లి చూసుకోండి తన వాళ్ళ దగ్గరికి
(1:06:00) వచ్చేటప్పటికి తన కొంతమంది దగ్గరైన వాళ్ళు చాలా మంచిగా ఉన్నారు. పాండవులను నానా ఏడుపులు ఏడిపించుకు తిన్నటువంటి దుర్యోధనుడు కర్ణుడికి తన రాజ్యాన్ని ఇచ్చాడు అసలు కర్ణుడిని విపరీతంగా ప్రేమించేవాడు కర్ణుడితో ఏ సంబంధం లేదు పాండవుల మీద ద్వేషాన్ని కర్ణుడి మీద విపరీత మైత్రిగా పెట్టుకున్నాడు. మరి విపరీత మైత్రిగా కర్ణుడితో ఉండగలిగినవాడు తన సొంత అన్నదమ్ములు పాండవులతో ఉండలేడా ఉండకూడదని నిర్ణయించుకున్నాడు.
(1:06:33) అందుకని ఎక్కడ ఎలా ఉండాలో మనం నిర్ణయం చేసుకొని నేను ఇలాగే ఉంటాను అన్నది నువ్వు అనుకుంటున్న భావన తప్ప ఎదుటి మనుషుల భావన కాదు కర్ణుడి కంటే మంచిోళ్ళు పాండవులు పాండవులు దుర్యోధనుని ప్రేమిస్తున్నారు. అలాగే నిన్ను ప్రేమించేవాళ్ళు ప్రేమిస్తున్నారు గనుక నీకు చులకన అయపోయారు నీకు చులకనైన వాళ్ళని ఇష్టరాజ్యంగా తొక్కిన ఆరదీయాల అనుకుంటున్నావ్ అదే అహంకారం ఇవే మనకి మహాత్ములు చరిత్రలుగా చూపించారు కాబట్టి ఎవరిలోనైనా ఎవరిని ఎవరో వచ్చి ఎక్కడి నుంచో మార్పులు తీసుకురావడం వాళ్ళ అంతరంగంలో దూరిపోయి కుదరదు నీలో సమస్తం ఉన్నాయి ఒక మనిషిలో మంచికి
(1:07:14) సంబంధించిన సమస్తం ఉన్నాయి చెడుకి సంబంధించిన సమస్తం ఉన్నాయి చెడుకు సంబంధించిన సమస్తం అనేవి ఎందుకుఉన్నాయి అవి కూడా మంచిలే కానీ అటి ప్రదేశం ఉపయోగించే తీరుతెన్నులు వల్ల చెడయింది. సృష్టిలో చెడు లేదు నువ్వు చెడుగా దాన్ని నీకు ఇవ్వబడిన స్వేచ్ఛను చెడుగా వాడుకుంటున్నావ్. అందుకని అది గమనించి నిన్ను నువ్వే మార్చుకోగలవు అలా మార్చుకోవాలంటే నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు గమనించుకో కచ్చితంగా నిన్ను నువ్వు మార్చుకోగలవు చెళలోనుంచి మంచిగా రావటమే నన్ను నేను మార్చుకోవడం అక్కడ అహంకారం హాయిగా ఉంటది ఆనందంగా ఉంటది సంతృప్తిగా ఉంటది. అది ఓహో విజృంబణగా
(1:07:57) ఉండదు అది మంచి అహంకారం మంచి అహంకారాన్ని పెంచుకుందాం ఒకవేళ అర్థమైతే ఓకే అర్థం కాకపోతే మళ్ళీ తప్పకుండా మీకు ఎక్కడెక్కడ అర్థం కాలేదు ఏ విషయం అర్థం కాలేదు స్పష్టంగా మళ్ళీ ప్రశ్న రూపంలో సందేహం రూపంలో అడిగే ప్రయత్నం చేయండి విశ్లేషించి తప్పకుండా చెప్పుకుందాం ఇవన్నీ కూడా మనకి ఒక చదువు ఆధ్యాత్మిక చదువు ఆత్మజ్ఞాన చదువు నన్ను నేను సంస్కరించుకునే చదువు నన్ను నేను చూసుకునే చదువు నన్ను నేను గమనించుకునే చదువు అసలు నేను ఎలా మాట్లాడుతున్నాను నేను ఎలా బ్రతుకుతున్నాను నేను ఎలా జీవిస్తున్నాను నేను ఎలా దుఃఖపడుతున్నాను నేను ఎలా సుఖపడుతున్నాను నేను ఎలా ఇతరులని
(1:08:36) కష్టపెడుతున్నాను నేను ఎలా ఇతరులకి మేలు చేస్తున్నాను ఇలా మొత్తంగా నిన్ను నువ్వు ప్రతిరోజు మెలుకవు నుంచి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయే రాత్రి పడుకునే ముందు వరకు గమనించుకుంటావు గమనించుకుంటే నువ్వు నీకు అర్థమైపోతావు నువ్వు ప్రతి గుణం మార్చుకోగలవు జస్ట్ ఊరికన ఫిక్స్ అయ్యావు అలవాటు చేసుకున్నాం అంతే స్వభావము గుణము అనేది ఎప్పుడు మార్చుకోగలిగిందే అది పర్మనెంట్ శరీరం లాగా కాళ్ళు చేతులు లాగా కాదు అది మార్చుకోవచ్చు ఆ ఫెసిలిటీ ఉంది అందుకే ఆధ్యాత్మికత ఎప్పుడు నువ్వు మార్చుకునే ఫెసిలిటీ ఉంది గనుక నీకు మంచి మంచికి సంబంధించిన విషయాలను జ్ఞాన రూపంలో
(1:09:17) అందిస్తా ఉంటది అదే మహాత్ములు చేసినటువంటి అద్భుతమైనటువంటి మేలు మానవజాతికి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఆత్మజ్ఞానం ఆలోచించి చూడండి చక్కగా మీ జీవితంలో దీన్ని ఆచరించుకోండి ప్రతి మనిషిలో మంచి ఉంది ఎవరో మీకు సహాయం చేయక్కర్లే మీరు మీకు సహాయం చేసుకోండి చాలు మిమ్మల్ని మీరు గమనించుకోండి చాలు చెడు ఉపయోగిస్తున్న ప్రతి చోట మంచిగా ఉండడానికి ప్రయత్నించండి అది సాధన అయిపోద్ది ఆధ్యాత్మిక సాధన అయిపోద్ది అంతకుమించి సాధనలు ఏమ ఉండవు ఎన్ని ప్రపంచంలో ఎన్ని మతాలు వచ్చినా ఎంతమంది దేవుళ్ళ వచ్చినా ఎన్ని సాధనలు వచ్చినాయన్ని ఎన్ని రకాల విధానాలు వచ్చినా
(1:09:54) ఎన్ని పద్ధతులు ఉన్నా అవన్నీ కేవలం నిన్ను నీలో మంచి పెంచుకోమని చెప్పడానికే తప్ప ఆ సాధనల్లో ఏ అద్భుతం లేదు ఆ మతాల్లో ఆ దేవులో ఆ గురువుల్లో ఆ విధానాల్లో ఏమి ప్రత్యేకత లేదు అవన్నీ నీలో మంచిని పెంచడానికి వచ్చినాయి నీకోసమే ఉన్నాయి అయన్నీ నాకోసమే ఉన్నాయి అవన్నీ మనకోసమే ఉన్నాయి అయన్నీ ఉపయోగించుకొని మంచోళ్ళు ఇక ఇది నచ్చని వాళ్ళు ఇది మెచ్చని వాళ్ళు అకారణ ద్వేషాలు పెంచు కునేవాళ్ళు అయ్యా మీ పాదాలకు నమస్కారం అమ్మ మీ పాదాలకు నమస్కారం నేను అతి సామాన్య మానవుడిని నేను ఎటువంటి ఆత్మానుభవం పొందలేదు జ్ఞానోదయం కలగలేదు నాకు ఎటువంటి అద్భుతమైన
(1:10:36) అనుభవాలు లేవు సామాన్య మానవుడిని నన్ను నేను మంచిగా ఉంచుకోవడానికి పూర్వపు మహాత్ములందరూ అందించినటువంటి గ్రంథాలను చదువుకుంటూ వాళ్ళ బోధలు వింటూ నన్ను నేను మంచిగా ఉంచుకునే ప్రయత్నం చేసుకుంటున్న ఆ ప్రయత్నంలో లో భాగంగానే శీర్షికులు నలుగురితో పంచుకుంటున్న అది కూడా నా సత్కాలక్షేపం కోసం నా సజ్జన సాంగత్యం కోసం నేను కాసేపు సద్భావాలలో ఉండటం కోసం అందువలన అకారణ ద్వేషాలు పెంచుకోకుండా నచ్చని వాళ్ళు ఇది వినకండి చక్కగా మీ మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి నేను అతి సామాన్యుడిని మళ్ళీ చెబుతున్నాను నన్ను క్షమించి వదిలివేసి మీ మీ
(1:11:16) మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి శుభమస్తు మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరు గాక మరల మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను ఆధ్యాత్మిక విద్యాలయము ఆత్మజ్ఞాన చదువు ఆధ్యాత్మిక చదువు అనేటువంటి పదాలని ఈ శీర్షికల్లో వాడుతూ ఉంటాను. ఎందుకంటే చదువు అనేది సహజమైనది ఒక ప్రత్యేకమైనది కాదు భౌతిక చదువులు చదువుకోవట్లే అందరం అలాగే ఇది ఆధ్యాత్మిక చదువు మన గూర్చిన మన సంపూర్ణ చదువు మనం మన గురించి మనం తెలుసుకుంటున్నాం తెలుసుకోకపోతే ఎలా జీవిస్తాం అసలు కాబట్టి ఈ చదువు అందరం చదువుకోవాలి ఇది అసలు ఆధ్యాత్మిక విద్యాలయం అంటే ఏంటి ఆత్మజ్ఞాన చదువు అంటే ఏంటి ఆధ్యాత్మిక
(1:11:57) చదువు అంటే ఏంటి అనేదాన్ని నా అభిప్రాయాలను నా ఉద్దేశాలను ఆధ్యాత్మిక విద్యాలయము అనేటువంటి ఒక పేరుతో ఒక శీర్షిక చెప్పాను డెవన్ ప్లానెట్ ఛానల్లో 1920వ శీర్షిక ఆధ్యాత్మిక చదువు అనేటువంటి మన రెండో ఛానల్ లోనే 140వ శీర్షిక రెండు శీర్షికలు ఒకటే ఆధ్యాత్మిక విద్యాలయము అనే పేరుతో ఉంటాయి. రెండింటిలో ఉన్న మేటర్ సబ్జెక్ట్ ఒకటే ఏదో ఒకటి వింటే చాలు అవకాశం ఉన్నవాళ్ళు ఆసక్తి ఉన్నవాళ్ళు అది వినండి ఆసక్తి ఉన్నవాళ్ళు మాత్రమే అసలు నేను చెప్పే శీర్షికలు వినండి ఈ ఛానల్ లోకి రండి లేకోతే అసలు ఈ ఛానల్ ఓపెన్ చేయబాకండి ఆసక్తి లేని వాళ్ళకి ఇది పనికి రాదు
(1:12:41) ఎందుకంటే ఇది కాలక్షేపపు కబుర్లకు సంబంధించింది కాదు నా వ్యక్తిత్వాన్ని నేను మార్చుకోవాలి నన్ను నేను గమనించుకోవాలి నన్ను నేను చెడులోనుంచి మంచికి తెచ్చు కోవాలి చక్కగా మంచిగా హాయిగా నేను జీవించాలి నా చుట్టూ ఉన్న వాళ్ళని జీవించనివ్వాలి అనేటువంటి సద్భావన ఉన్నవాళ్ళ కోసం మాత్రమే ఈ శీర్షికలు చెప్పబడుతున్నవి శుభమస్తు మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక మరల మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం

No comments:

Post a Comment