Wednesday, August 19, 2026

Kapala Moksham Part 20

Kapala Moksham Part 20

Author Name:Telugu Books

Youtube Channel Url:https://www.youtube.com/@telugubooks1031

Youtube Video URL:https://www.youtube.com/watch?v=KM0niChsWGw



Transcript:
(00:00) కపాల మోక్షం దైవ విగ్రహాలకి శక్తి ఉన్నదా నేను చేసిన విగ్రహారాధన విగ్రహాలు ఏనాడు కూడా నాకు స్వస్వరూపంగా అనగా సజీవ మూర్తిగా కనిపించేవి కావు మాట్లాడేవి కావు కానీ వివిధ యోగుల భక్తుల అనుభవాలు చూస్తే అనగా రామకృష్ణ పరమహంస తన పూజించే కాళీమాత విగ్రహం నుంచి కాళీమాత సజీవమూర్తిగా కనిపించి మాట్లాడేది అని తెలుసుకున్నాను. అలాగే నామదేవుడు అనే ఆయన కూడా పూజించే పాండురంగడు విగ్రహమూర్తి నుండి ఆయన సజీవమూర్తిగా కనిపించి మాట్లాడేవారని తెలుసుకొని ఆశ్చర్యం చెందాను.
(00:39) అసలు నిజంగానే విగ్రహాలకు శక్తి ఉన్నదా లేదా వీరు భ్రమపడి సజీవ శక్తి ఉందని చెబుతున్నారా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి నాకు అగుపించిన శివమూర్తిని బాలాదేవి హనుమంతుని వీరభద్రుని గణపతిని కుమారస్వామిని సుబ్రహ్మణ్య స్వామిని నవగ్రహాలను అభిషేకాలు చేస్తున్నాను నిత్య ఆరాధనలు చేస్తున్నాను నిత్య పూజలు చేస్తున్నాను కానీ నాకు ఏ ఒక్క దేవుడు కూడా నేను ఉన్నాను అని సజీవంగా కనిపించలేదు కలలో కూడా నాకు ఎన్నడూ కనిపించలేదు.
(01:11) వాళ్ళకేమో ఏకంగా మనుషులతో మాట్లాడినట్టుగా మాట్లాడారని వారి చరిత్ర చెబుతుంటే మరి నా విషయంలో ఎందుకు అలా జరగటం లేదు అని అర్థం కాలేదు. దానితో నేను పూజించే విగ్రహమూర్తులు నాకు కనిపించట్లేదని నాతో మాట్లాడటం లేదని మనోవేదన నన్ను బాగా బాధ పెట్టేది. విగ్రహాలు మాత్రం చాలా సజీవ కళలతో ఉండేవి కానీ వాటిలో సజీవము ఉన్నదో లేదో అనే ధర్మ సందేహం నన్ను వెంటాడేది.
(01:36) నా భక్తిలో ఏదైనా లోపం ఉంటే గుడికి వచ్చే భక్తుల్లో ఎవరికో ఒకరికైనా కనిపించాలి కదా వారితో మాట్లాడాలి కదా వారికి కనిపించక నాకు కనిపించకపోతే విగ్రహాల్లో ఏదైనా లోపం ఉండాలి లేదా విగ్రహారాధనలో ఏదైనా లోపం ఉండాలనుకని ఇష్టం లేని భక్తి లేని విగ్రహారాధన చేసేవాడిని విగ్రహాల్లో లోపం ఉంటే అనగా ద్వారకా క్షేత్రంలో శ్రీకృష్ణ విగ్రహమూర్తి చెయ్యి విరిగిపోతే దాన్ని కనకదాసు అనే మహా భక్తయోగి అతికించి శ్రీకృష్ణ కృష్ణ విగ్రహమూర్తిని అలాగే ఉంచి ఇప్పటికీ పూజలో ఉంచినారు అని తెలుసుకున్నాను.
(02:11) చెయ్యి విరిగిపోయిన విగ్రహమూర్తిలోనే లోపం లేకపోతే ఏమి ఎక్కడ ఏమి దెబ్బ తినని నేను పూజించే విగ్రహ మూర్తుల్లో ఎలాంటి లోపం లేదని తెలుసుకున్నాను. పైగా అన్ని చోట్ల ఉన్న శివలింగ మూర్తులనే అవే పంచామృత అభిషేకాలు అవే రుద్ర నమ్మక చమక మంత్రాలు కాబట్టి మనలో కూడా అనగా విగ్రహారాధన లోపాలు కూడా లేవని తెలుసుకున్నాను.
(02:35) దానితో మరి ఎందుకు వీళ్ళు నాకు కనపడి మాట్లాడడం లేదు అని అయోమయ స్థితిలో ఉండగా ఒకరోజు అనుకోకుండా మా ఊరికి పక్క గ్రామంలో 18 మంది సిద్ధ పురుషులు పూజించిన దండి పార్వతి అమ్మవారి దేవాలయం ఉన్నదని తెలుసుకొని అక్కడికి వెళ్ళాను అక్కడ యధావిధిగా కూర్చున్న అమ్మవారి విగ్రహమూర్తి కనిపించింది. మా గుడిలో ఉన్న అమ్మవారు లాగానే ఈ అమ్మవారు కూడా ఉంది అని అనిపించింది.
(02:59) కాకపోతే ఈ గుడికి ఎందుకు సిద్ధ పురుషులు వచ్చి ఆరాధన చేసినారో నాకు అర్థం కాలేదు మా గుడిలో లేనిది ఈ గుడిలో ఏమున్నదో అర్థం కాలేదు. ముత్తైదువులకు వచ్చే ఇచ్చే వాటిని ఈ అమ్మవారికి ఇచ్చి ఈ దేవాలయ పూజారులు మా బంధువులు కావడంతో వారి ఇంటికి వెళ్ళాను. కొన్ని గంటల తర్వాత ఒక స్త్రీమూర్తి నాకు పరిచయం లేని ఆ స్త్రీ నా చుట్టూ ఏదో పని ఉన్నదానిలాగా నా కళ్ళల్లో పడాలనే తపన పడుతూ ఉండేది. ఆవిడ ఎవరో నాకు తెలియదు.
(03:28) నేను ఊరికి రావడం మొదటిసారి ఆమెను చూడడం కూడా మొదటిసారి ఆవిడ చేసే వింత ప్రవర్తన చూసి నాకు అర్థమయ్యేది కాదు పాపం మూడు గంటల పాటు ఇలాగే నా చుట్టూ తిరిగి తిరిగి ఎటో వెళ్ళిపోయింది. నేను పెద్దగా దీన్ని పట్టించుకోలేదు. మధ్యాహ్నం నాకు కునుకు తీసే అలవాటు ఉంది. అప్పుడు నిద్రపోతే కలలో నన్ను వెంటాడిన స్త్రీమూర్తి నాకు కనిపించింది.
(03:52) మళ్ళీ కొన్ని క్షణాలకే నేను చూసి వచ్చిన అమ్మవారు ఆమె స్థానంలో కనిపించేది. మళ్ళీ కొన్ని క్షణాలకి అమ్మవారి స్థానంలో అమ్మాయి కనిపించేది. మళ్ళీ కొన్ని క్షణాలకి అమ్మాయి స్థానంలో అమ్మవారు కనిపించేది. నాకు అర్థమయ్యేది కాదు అసలు ఇలా ఎందుకు కనిపిస్తున్నారు అనుకోగానే నాకు మెలుకవ వచ్చింది సాయంత్రం అయింది. ఇంతలో గుడి తలుపులు తెరవడానికి ఆ ఆలయ పూజారి వెళ్తుంటే వారితో పాటు నేను కూడా గుడికి వెళ్ళడం జరిగింది.
(04:18) విచిత్రం ఏమిటంటే నా వెంటన పడిన స్త్రీమూర్తి ఏ రంగు చీర కట్టుకొని ఉందో అదే రంగు చీరతో అమ్మవారి విగ్రహమూర్తి ఉండేసరికి నాకు నోట మాట రాలేదు. అప్పుడు అదే విషయాన్ని ఆలయ పూజారిని అడిగితే ఆలయం ఆయన ఏమాత్రం ఆశ్చర్యం చెందకుండా నాయనా ఇది మాకు మామూలే అమ్మవారి సజీవమూర్తి స్వరూపమే నీ వెంటపడిన ఆ స్త్రీమూర్తి తను నేనే అని చెప్పడానికి అమ్మవారు నీకు మధ్యాహ్నం కలలో కనిపించింది కలలో కనిపించిన చీరతో ఇలలో కనపడింది.
(04:49) ఇంతటి శక్తిమూర్తి ఇక్కడ సజీవమూర్తిగా తిరుగుతోంది కాబట్టి ఈమెను సిద్ద పురుషులు ఆరాధన చేయడం జరిగింది. పైగా జీవితంలో జరిగిన యదార్థ సంఘటన ఒకటి చెబుతాను విను నాకు పెళ్లైన కొత్తల్లో అనుకుంటాను నాకు అత్యవసరముగా ఏదో ఒక పనిపడి మహానైవేద్యం పెట్టే సమయం నాకు లేకపోయేసరికి నా దగ్గర వేద మంత్రాలు నేర్చుకోవడానికి వచ్చిన ఐదు సంవత్సరాల వయసు గల బాల పూజారిని ఆ రోజు అమ్మవారికి పులిహోర నివేదన చేయమని చెప్పి నేను వేరే ఊరికి వెళ్ళడం జరిగింది.
(05:22) వాడి వయసు చిన్నది కావడం వల్లనే వాడి అమాయకత్వం భక్తి వలన అమ్మవారు వచ్చి పులిహోర తింటుందని వాడు అనుకోవడం వలన యదావిధిగా అమ్మవారి విగ్రహమూర్తి ముందు పులిహోర పాత్రను ఉంచి ఆమె వచ్చి తింటుందని అమాయకంగా ఎదురుచూసినాడు. ఆమె ఎంతసేపటికి రాకపోయేసరికి వీడికి కోపం వచ్చి అమ్మ వచ్చి పులిహార తినేదాకా నేను ఇక్కడి నుండి వెళ్లేది లేదని అమ్మతో మాట్లాడినట్లు అమ్మవారి విగ్రహంతో మాట్లాడాడు.
(05:49) వాడి దృష్టిలో అక్కడ ఉన్నది విగ్రహమూర్తి కాదు సజీవమూర్తి అన్నమాట అమ్మ మీకు బాగా ఇష్టమైన పులిహోర తీసుకొని వస్తే నువ్వు వచ్చి తినవా నీకు బాగా ఆకలి వేస్తుంది కదా నువ్వు తిను నువ్వు తింటేనే నేను తింటాను నాకు కూడా బాగా ఆకలి వేస్తుందని బ్రతిమాలుకున్నాడట ఎంతసేపటికి అమ్మవారు తినకపోయేసరికి వీడికి ఆకలి వల్ల నీరసం వచ్చి అలసి సొలసి అక్కడే ఆ విగ్రహం మూర్తి ముందు నిద్రలోకి జారుకున్నాడు వాడికి కలలో అమ్మ అమ్మవారు కనిపించి వీడు పెట్టిన పులిహోర తినడం కనిపించేసరికి వీడికి అమాంతంగా మెలుకో వచ్చి చూస్తే వాడి కలలో అమ్మవారు కనిపించింది అక్కడ అమ్మవారి విగ్రహం
(06:28) మాత్రమే ఉన్నది. విచిత్రంగా కాళీ పులిహోర గిన్నె కనిపించేసరికి అమ్మ వచ్చి తినేసి ఉంటుంది అనుకని ఆ కాళీ పాత్రను తీసుకొని మా ఇంటికి వచ్చాడు. మా ఆవిడకి విషయం చెప్ితే నమ్మక వీడికి ఆకలి ఆగలేక అమ్మవారి పేరు చెప్పి దొంగచాటుగా తినేసి ఉంటాడని అనుమానం ఎందుకంటే ఎక్కడైనా విగ్రహమూర్తులు నైవేద్యాలు తినవు కదా ఆమె దృష్టిలో ఆవిడ విగ్రహమూర్తి ఆ పిల్లగాడు దృష్టిలో సజీవమూర్తి అన్నమాట మధ్యాహ్నం భోజనానికి నేను ఇంటికి వస్తే పులిహోర గొడవ గురించి తెలిసింది.
(07:03) దాంతో ఇందులో ఏదో మర్మం ఉన్నదని పిల్లవాడి మాట దైవవాక్కు కాబట్టి వీడిని అనుమానించకూడదని గుడి తలుపులు తీయగానే అమ్మవారి విగ్రహం నోటిలో పులిహోర ముద్ద కనిపించేసరికి ఇన్నాళ్ళు చేసిన భక్తి కేవలం విగ్రహ భక్తి అని ఆ పిల్లవాడు చేసిన భక్తి మధుర భక్తి అని అనగా ఈ విగ్రహంలో సజీవ మూర్తిని చూడగలిగే మధుర భక్తి ఉందని గ్రహించి నాకు కన్నీళ్లు వచ్చాయి విగ్రహమును విగ్రహంగానే పూజిస్తే అది విగ్రహంగానే ఉంటుంది విగ్రహముగానే కనబడుతుంది మాట్లాడదు ఎప్పుడైతే ఈ విగ్రహమూర్తిని సజీవమూర్తిగా భావన చేస్తూ ఆరాధన చేస్తే ఆ విగ్రహారాధన కాస్త విశ్వారాధన అవుతుంది వారు చెప్పి మౌనంగా పనులు చేసుకోవడానికి
(07:45) గుడి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. దానితో నేను ఇన్నాళ్లుగా చేసిన నా విగ్రహారాధన తప్పు ఏమిటో తెలిసింది అది నేను విగ్రహారాధన విశ్వారాధన కాకుండా విగ్రహారాధన చేయటం వలన నా భావనలో నా మనసులో విగ్రహాలుగానే మామూలుగానే ఉండుట వలన ఇలా విగ్రహమూర్తులుగాను ఆరాధన చేయటం వలన వాళ్ళు సజీవమూర్తిగా నాకు ఎలా కనపడతారు ఆలోచించండి అదే వీళ్ళని విగ్రహమూర్తులుగా కాకుండా సజీవమూర్తిగా మనసులో భావించి ఆరాధన చేసి ఉంటే సజీవమూర్తిగా కనిపించేవారు ఎలా అంటే రామకృష్ణ పరమహంసకి తుకారామకి నామదేవుడికి వారి ఇష్ట దైవాలను సజీవమూర్తిగా భావించి ఆరాధన చేయడం వలన
(08:26) వారికి కనిపించినట్లుగానే నాకు కనిపించేవాళ్ళు కదా ఎందుకంటే యద్భావం తద్భవతి ఏ భావం ఉంటే అదే కనబడుతుంది ఇలాంటి నిజభక్తితో ఒకాయన తిరుపతి వెంకన్న మీద పెట్టుకొని ఆయన ఎలా ఆరాధన చేశాడో తెలుసుకోవాలని ఉందా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు శుభంబు యాత గమనిక కొన్నాళ్ళ తరువాత సజీవమూర్తి భక్తి అంతా తొందరగా వచ్చేది కాదని దానికి ఎంతో భక్తి శ్రద్ధ విశ్వాసం సహనం నిష్ట ఉండాలని నేను తెలుసుకోవడం జరిగింది.
(09:02) కొన్ని సంవత్సరాలకు నా సాధనా శక్తి పరిసమాప్తి అవుతున్న సమయంలో నేను పూజించిన బాలాత్రిపుర సుందరి అమ్మవారి విగ్రహమూర్తి కాస్త సజీవ ఎనిమిది సంవత్సరాల బాలిక రూపంలో బాలమూర్తిగా కనబడి మాట్లాడుతూ ఉండేది. ఆ తర్వాత శ్రీశైల క్షేత్రంలో ఎనిమిది సంవత్సరాల బాలికా రూపంలో బాల దర్శనం అలాగే ఇదే క్షేత్రం యందు ఆ 80 సంవత్సరాల వయోవృద్ధిరాలిగా సుందరి రూపంలో దర్శనం ఇలా జొన్నవాడ కామాక్షి అలంపుర జోగులాంబ విజయవాడలో దుర్గామాత విశ్వనాథపల్లిలో గ్రామదేవత వరంగలులో భద్రకాళీ మాత కాశీ క్షేత్రంలో అన్నపూర్ణ మధుర మీనాక్షి ఐదు సంవత్సరాల బాలిక రూపంలో గాను బాలగాను కంచి కామాక్షి 35 సంవత్సరాల
(09:44) స్త్రీ శ్రీమూర్తి త్రిపురగాను కాశీ విశాలాక్షి 65 సంవత్సరాల వృద్ధిరాలుగా సుందర రూపంలో వీరి క్షేత్రముల యందు సజీవమూర్తులుగా దర్శన ప్రాప్తి మాకు కలిగింది. మృడేశ్వర క్షేత్రమునందు సాంబశివమూర్తి కాణిపాకము యందు మహాగణపతి పళని బాలకుమార స్వామి మోపిదేవి యందు నాగేంద్ర స్వామి సజీవమూర్తులుగా దర్శనమైంది.
(10:11) తిరుపతి యందు ద్వారకా తిరుమల క్షేత్రముల యందు వెంకన్న పూరీ క్షేత్రమునందు శ్రీకృష్ణుడు నైమిశారణ్యముల యందు అష్టంభుజ శ్రీవిష్ణువు ఇక్కడే శ్రీ వేదవ్యాసుడు శ్రీ లలితాదేవి వీరందరి సజీవ మూర్తి దర్శన ప్రాప్తి పొందడం కూడా జరిగింది. అటుపై కాశీ క్షేత్రంలో సద్గురువుగా జీవ సమాధి చెందిన శ్రీ త్రైలింగ స్వామి ఆత్మదర్శన ప్రాప్తి దేక్షేత్రంలో హనుమత్ సజీవ దర్శనము అలాగే పండరీపురమునందు పాండురంగడి సజీవమూర్తి దర్శనం గాపురమునందు శ్రీ దత్తస్వామి నిజరూప దర్శనం అరుణాచలమునందు శ్రీ మేధా దక్షిణామూర్తి నిజరూప దర్శనము అలాగే కైలాస పర్వతము యందు సదాశివమూర్తి నిజరూప దర్శనము
(10:57) శ్రీశైలమునందు జీవ సమాధి చెందిన శ్రీ పూర్ణానంద స్వామి ఆత్మదర్శన ప్రాప్తి కలగడం జరిగింది. ఈ దర్శన అనుభవాలు అన్నియు కూడా మాకు ఆజ్ఞ సహస్ర చక్ర స్థితి యందు జరిగాయి. ఎందుకంటే ఈ చక్రముల యందు దైవ ఆత్మ సాక్షాత్కార స్థితి ఉంటుంది. ఈ అనుభవాలు అన్నియు కూడా మా ఆజ్ఞ అలాగే సహస్ర చక్ర స్థితి యందు చెప్పడం జరిగినది. ఇలా మేము ఏ దేవాలయానికి వెళ్ళినా లేదా ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడ ఉన్న విగ్రహమూర్తి కాస్త సజీవమూర్తిగా నాకు కనిపించి నా వెంట రక్షణగా తోడుగా నాతో పాటు తిరిగేవారు అక్కడ నేను ఉన్నంతసేపు నా వెంట ఉండేవారు నాకు కలిగిన ఈ దైవ
(11:38) అనుభవాలకి సాక్ష్యముగా నా భార్యకి నాతో ఉన్న నా కుటుంబ సభ్యులకి బంధుమిత్రులకి సమక్షంలో జరుగుతూ ఉండేవి కావాలని ఇలాంటి సజీవ దైవశక్తి చూడడానికి నా వెంట వచ్చి ఆ సజీవమూర్తి రూపాలను చూసి నమ్మకం ఏర్పడి అమిత ఆనందం పడేవాళ్ళు కొన్ని సంవత్సరాల తరువాత నాకు తెలిసింది ఏమిటంటే ఇలా వీరందరూ నాకు దర్శనం ఇవ్వడానికి కారణం ఇలా వీరందరిలో ఎవరి ఎవరో ఒకరి భక్తి లేదా సాక్షాత్కారమాయలో నన్ను పడవేయాలని ప్రయత్నించినారని తెలిసింది.
(12:10) ఎందుకంటే వీరందరూ సత్యముగా కనిపించే అసత్య మూర్తులు. పైగా వీరంతా పరమ శూన్యము యొక్క స్వప్నమూర్తులు. ఈ జ్ఞానమును పొంద పొందటముతో రామకృష్ణ పరమహంస కబీర్దాసు నామదేవుడు గోరా లాంటి నిజభక్తి యోగులు వీరంతా బ్రహ్మ భ్రాంతులని వారి సద్గురువుల వద్ద తెలుసుకొని వీరి సాక్షాత్కార మాయలను దాటుకొని పోవడం జరిగింది. విచిత్రం ఏమిటంటే నాకు ఇటువైపు దైవాలు అటువైపు గురువులు నన్ను వారి మహామాయలో పడవేయాలని ప్రయత్నించడం జరిగింది.
(12:44) నాకు అప్పటికే ఈ సాక్షాత్కారాలు మహామాయలని వివిధ యోగుల జీవిత చరిత్రలు చదవడం ద్వారా మేము పొందిన శబ్ద పాండిత్యము ద్వారా తెలుసుకోవడం వీరి మాయలని చిరునవ్వుతో దాటడం జరిగింది అనగా వీరి యందు నాకు ప్రేమ మోహ వ్యామోహ మాయ భక్తి కలగకుండా ఉండటానికి నానా ఇబ్బందులు పడవలసి వచ్చింది. ఒకవేళ వీరి మాయా భక్తిలో పడితే వాళ్లే నిజమని వారికి భక్తి పూజలు చేస్తూ దాసోహాలు చేయాల్సి వచ్చేది నిజానికి ఇలా వీరంతా కూడా తమకున్న ఇష్ట కోరిక మాయ అనగా హృదయ చక్రము వద్ద ఈ మహామాయను దాటలేకపోవడంతో స్వప్న శరీరదారిగా మారడం జరిగినది దానితో మోక్ష ప్రాప్తి పొందకపోవడంతో అనగా నిశ్చల
(13:29) స్థితి పొందకపోవడంతో ఏవో సంకల్పములు పెట్టుకొని మనలాంటి సాధన జీవాత్మలకి కనిపించి మనల్ని వారి భక్తిమాయలో ఉంచి వారికి కావలసిన సేవలు చేయించుకుంటారని గ్రహించండి అంటే సోహం అంటే నేనే దేవుని అనవలసిన చోట వారికి దాసోహం అంటే నువ్వే దేవుడివి అవుతున్నామని తెలుసుకోండి అందుకే దైవ గురు భక్తి మాయలు దాటి మీరే గురుదేవుడిగా మారండి దానితో ఇలా దైవ విగ్రహ మూర్తుల వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆ క్షేత్రాలకు దేవాలయాలకు వెళ్ళడం పూర్తిగా గా మానేసాను పైగా దేహమే దేవాలయం అని గ్రహించాను ఆత్మయే ఆత్మలింగం అని తెలుసుకున్నాను ఇది నేను అహంతో
(14:13) చెప్పడం లేదు ఒక పిల్లవాడి భక్తి కూడా నాకు లేదని కసితో బాధతో ఎన్నో రకాల మాయలు మర్మాలు దాటుకొని మధుర భక్తిని అలవరుచుకొని భక్తి మార్గములో పురోగతి సాధించడం జరిగింది చేసేది ఎవరు చేయించుకునేది ఎవరు అందరూ ఒకటే కదా అంతా ఒకటే కదా ఉన్నది నేనే నేనే కదా లేనిది నేనే కదా పోయేది నేనే కదా ఉండేది నేనే కదా అంతా నేనే ఉన్నాను నేను కానిది ఏమీ లేదని అసలు నేనే లేనని సర్వం ఏమీ లేదని సర్వం శూన్యమని నా సాధన సంపూర్ణ జ్ఞాన అనుభవ అనుభూతి పొందడము జరిగింది.
(14:54) ప్రతి విగ్రహంలోనూ ప్రతి వస్తువులోనూ ప్రతి పదార్థంలోనూ ప్రతి చోట పంచభూత నిర్మితం శక్తి ఉంటుందని గ్రహించండి. ఈ పంచభూత శక్తికి మనసు యొక్క భక్తి భావ శక్తి లేదా ఆలోచన శక్తి లేదా సంకల్ప శక్తి ఇవ్వగలిగితే అది కాస్త స్పందించి భక్తి శక్తిగా మారి అనుకున్న కోరికలు తీరుస్తుంది ఇలాంటి శక్తి కలగాలి అంటే మన విగ్రహారాధన కాస్త సజీవ మూర్తి భావనా శక్తిని పెంపొందించుకోవాలి అంత తేలికైన విషయం అది కాదని గ్రహించండి ఈ మధుర భక్తి అలవడితే నిజభక్తులు లేదంటే కేవలం ప్రసాద భక్తులు అవుతామని గ్రహించండి ఇలాంటి వారికి దేవుళ్ళ అనే వాళ్ళు కోరికలు తీర్చే యంత్రాలు అన్నమాట అదే నిజభక్తి
(15:38) ఉన్నవాడి విషయానికి వస్తే తమకు కావలసింది అడగకుండానే ఇచ్చే వరాల దేవతలు అన్నమాట మనస్సుకి ఏ భావం ఇస్తే అది మనకు చూపిస్తుంది ఎందుకంటే యద్భావం తద్భవతి ఏ భావం ఉంటే అదే కనపడుతుంది ఆ చిన్న పిల్లవాడి భక్తిని పెంచుకోండి ఎందుకంటే పసిపాప మనసున్న వాడిలో పరమాత్మ ఉంటాడని శిరిడి సాయిబాబా వారు వారు అప్పటికే బోధించినారు కదా ఇంకెందుకు ఆలస్యం మీ భక్తితో విగ్రహారాధన భక్తి మాయ దగ్గర ఆగిపోకుండా దీని నుండి విశ్వారాధన చేసే స్థాయికి ఎదగండి విగ్రహారాధన అనేది అక్షరాలు లాంటిది భాషకి అక్షరాలు ఎంత అవసరమో మన ప్రారంభ సాధనకి ఈ విగ్రహారాధన అంతే అవసరం ఎందుకంటే నిగ్రహము కోసము అనగా
(16:26) మన దశేంద్రియాలు అనగా కన్ను ముక్కు చెవి నోరు చర్మము అలాగే ఇవి చేసే చూచుట వాసన వినుట రుచి స్పర్శ ఇలా పదింటిని కలిపే ఈ దశేంద్రియాలు మనకి ఈ విషయంలో సత్యముగా కనిపించే వాటి మహామాయలో పడకుండా ఉండడానికి మనకి నిగ్రహ శక్తి పొందవలసి వస్తుంది ఈ నిగ్రహము మనకి వస్తే విగ్రహముతో పని ఉండదు ఎందుకంటే భాష వచ్చిన వాడికి అక్షరముతో ఏమి పని ఉంటుంది అంటే మీరు మొదట మీ ఇష్ట విగ్రహారాధన చేసి అందులో వారి సజీవ సాక్షాత్కారమును పొంది ఆపై నిగ్రహ శక్తితో వీరి మహాభక్తి మహామాయలో పడకుండా వీరిని దాటుకొని సాధనలో ముందుకి అనగా విగ్రహారాధన నుండి విశ్వారాధన చేసే స్థాయికి ఎదగండి
(17:13) ఒకటి గుర్తుపెట్టుకోండి నా స్వానుభవ నా స్వానుభవముతో చెబుతున్నాను అదేమిటంటే మన మూలాధార చక్రము నుండి అనగా మహాగణపతి నుండి చిట్టచివరి అయిన బ్రహ్మరంద్రము దాకా ఉన్న పరమ శూన్యమైన సర్వేశ్వరుడు దాకా మనము ఇలాంటి సాక్షాత్కార మాయలు దాటవలసి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త ఈ మాయలకినూటికి 90 శాతం మంచి దాటడం లేదని మేము తెలుసుకోవడం జరిగింది మేము దాటినాము మీరు కూడా దాటాలని మీరు ఇంత వివరముగా చెప్పడం మీకు ఇంత వివరముగా చెప్పడం జరిగింది.
(17:51) ఎందుకంటే బుద్దిడి లాగా మీరు ఆగిపోకుండా అనగా ఈయన సాధన చేసి సర్వమాయలకి కోరికయే మహా కారణమని జ్ఞాన ప్రాప్తి పొంది చివరికి కోరికలు లేని సమాజమును చూడాలనే ఇష్ట కోరిక కోసం మళ్ళీ తిరిగి తనకు తెలియకుండానే కోరిక మహామాయలో పడినారని తెలుసుకోండి దీనికి కారణం మన బుద్ధుడు సాధన చేస్తున్నప్పుడు ఈ సమయంలో సుజాత అనే పల్లెపడుచు తెచ్చే కొద్ది అన్నాన్ని పాలను ఆహారంగా తీసుకునేవాడు ఈ యవ్వన స్త్రీమూర్తి రూపం లో కామమాయగా త్రిపురాదేవి అన్నమాట మాయ మన సాధనను ఆపటానికి సాక్షాత్కార సిద్ధులు దైవిక శక్తులు యోగశక్తులు ఇష్టకోరిక అనుభవ అనుభూతులలో ఏదైనా తీసుకొని మన నిగ్రహ శక్తికి పరీక్ష పెడుతుంది ఈ పరీక్షలన్నీ
(18:38) కూడా మహామాయా పరీక్షలని మీరు జ్ఞానము పొందితే మాయ మాయమవుతుంది. ఈ మాయలకు ప్రతిరూపమే ఆదిపరాశక్తి మొదట బాలికా రూపంలో కూతురిగా భక్తి మాయగా బాలగా ఈ సాక్షాత్కార మాయ దాటితే ఒక యవ్వన స్త్రీమూర్తి రూపంలో కామమాయగా త్రిపురగా ఈ సాక్షాత్కార మాయ దాటితే 65 సంవత్సరాల వృద్ధ స్త్రీమూర్తిగా ఇష్ట కోరిక మాయగా సుందరి రూపంలో వస్తుంది.
(19:09) ఈ సాక్షాత్కార మాయ దాటితే 85 సంవత్సరాల వయోవృద్ధురాలులాగా సహన శక్తి మాయతో దేవిగా ఆదిపరాశక్తిగా వస్తుంది ఈ సాక్షాత్కార మాయ దాటితే గాని మనకి మహామృత్యమైన శాశ్వత మరణ స్థితి అయిన కపాల మోక్షం మనకి కలగదు అందుకే బాలా త్రిపుర సుందరి దేవిని మన యోగ సాధనా స్థాయిలు చెప్పి అమ్మవారిగా గుర్తించడం జరిగింది అంటే మన సాధన చేస్తున్నప్పుడు బాల వస్తే మన సాధన ప్రారంభస్ స్థాయిలో అదే త్రిపురగా వస్తే మధ్యమ స్థాయిలో అదే సుందరిగా వస్తే అంతిమ స్థాయిలో అదే చిట్ట చివరి అంతిమ రూపముగా దేవిగా ఆది పరాశక్తి సాక్షాత్కారం అయితే కపాల మోక్ష స్థాయికి అనగా బ్రహ్మరంద్రం
(19:53) వద్దకి మన సాధన ఉంటుంది అని తెలుసుకోండి ఈ విధంగా మన సాధనా స్థాయిలు ఉంటాయని లోకానికి తెలియజేయడానికి ఆదిపరాశక్తికి బాలా త్రిపుర సుందరి దేవిగా నామకరణ చేసినారు అని తెలుసుకోండి అంతెందుకు మాకు ఇన్ని తెలిసినా కూడా బాలా రూపమును దాటినాము గానీ కామరూపిణ అయిన త్రిపురమాయ దాటలేకపోయినాము ఆపై త్రిపురాదేవి వలన మాకు కలిగిన కామమాయను దాటుకోవడానికి మేము దీక్షాదేవిని వివాహము చేసుకొని త్రిపుర దేవి కామమాయను దాటడం జరిగినది తరువాత సుందరి దేవీ రూపములను దాటి మహామృత్యవైన కపాల మోక్ష స్థితి ఈ సంవత్సరం అనగా 2019 మార్చి 11 మహా మహాశివరాత్రి పర్వదినమున ఉదయం
(20:39) 10గంటలఐదు నిమిషాలకి మా సూక్ష్మ కారణ సంకల్ప మా మూల కపాలము యొక్క చితాగ్నిలో ఈ మూడు శరీరాలు దహనమై విభూతిగా మారడం మోక్ష ప్రాప్తి అనగా మనోనిశ్చల స్థితి పొందడం జరిగినట్లుగా మాకు ఆ రోజు ధ్యానానుభవం అయింది ఇదే ధ్యానంలో పైగా ఎవరో అన్నట్లుగా బాబా విభూతినాథ్ కి జై అంటూ స్వయంగా గోమయ విభూతి చేసుకొని వాడుకొని అని వాడుకొని చేసుకొని వాడుకో అని ఆదేశము రావడంతో అదేరోజు బాగా ఎండిన ఆవుపేడను సేకరించి దానికి ఆవునెయ్యి కర్పూరం చేసి కాల్చడం ఆపై వచ్చిన భస్మమును కొంతమేర
(21:23) నాముపొడిని ఆవుపాలతో కలిపి ఎండబెట్టి దీన్నే విభూతిగా వాడడం జరుగుతోంది. దీనిని స్నానము చేసే నీళ్లల్లో చిటికెడు కలుపుకొని విభూతి స్నానం చేయడం అలాగే ఈ విభూతితో ధారణ చేసుకొని చేస్తున్నాము. అలాగే ప్రతి సంవత్సరం వచ్చే మహాశివరాత్రి నాడు ఈ విధంగా విభూతిని తయారు చేసుకోవాలని వీలైతే అందరికీ ఈ నిజమైన గోమయ్య విభూతిని ఉచితంగా పంచిపెట్టాలని నిశ్చయించుకోవడం జరిగింది.
(21:54) దానితో మా దీక్ష నామము అయిన శ్రీ పవనానంద సరస్వతి నామము కాస్త బాబా విభూతి నాధ్ గా మారడం జరిగినది దానితో మేము సంపూర్ణ అద్వైత సిద్ధాంతం అలాగే సమాధి గీత రచించడం జరిగింది కానీ మా స్థూల శరీరానికి నా చిట్ట చివరి ప్రారబ్ద కర్మగా మా అమ్మగారి అంతిమ యాత్ర పూర్తి అయితే గాని మాకు ఈ స్థూల దేహ విముక్తి కలుగదు అమ్మ తన ఆఖరి కోరికగా తన అంతిమ సంస్కారము మా చేతుల్లో జరగాలని ఆమె కోరడం తో నాకు ఇంతటి సంపూర్ణ సాధన జన్మ ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఆమె అడిగిన కోరికను తీర్చుకోవడం కోసం మా స్థూల శరీరం కాస్త స్వప్న శరీరముగా ఆగిపోవడం జరిగింది.
(22:36) ఆమె మరణము తరువాత ఆమె ఇచ్చిన ఈ స్థూల శరీరము ఆపై ఇది కూడా కాశీ క్షేత్రములో మా ఆస్తిక చితాభస్మము ఈ క్షేత్ర గంగా నదిలో కలిపితే ఈ శరీరమునకు బంధ విముక్తి కలిగి మనోనిశ్చల స్థితి పొంది స్థూల కపాల మోక్ష స్థితిని పొందడం జరుగుతుంది అనగా జీవ సమాధి స్థితి పొందడం జరుగుతుంది. అంటే దీనితో స్థూల సూక్ష్మ కారణ సంకల్ప శరీరాలకి కపాల మోక్ష స్థితి వచ్చినట్లే అవుతుంది.
(23:05) కానీ ఆకాశ శరీర కపాల మోక్ష స్థితి అర్హత కోసము కాశీ క్షేత్రంలో పంచకోశ ప్రాంతంలో ఆకాశకోశములో జీవ సమాధి స్థితి పొంది ఆపై మణిప్కర్ణిక గాటు యందు దహనము లేదా సమాధి చేయబడితే అటుపై ఆది గురువు విశ్వనాధుడి తారక రామ బ్రహ్మ మంత్రమును గురుపదేశముగా పొందితే రేణువు పరిమాణములో ఆకాశ శరీరముతో మన మూల కపాలములోని చితాగ్ని యొక్కప లక్షల దహన శక్తి తట్టుకోగలిగితే అప్పుడు మనకి ఆనంద రహిత సమాధి స్థితి కలిగి అటుపై పరమ ప్రశాంత స్థితి అనగా సంపూర్ణ మూల కపాల మోక్ష స్థితి పొందడం జరుగుతుంది.
(23:46) కానీ ఇట్టి కపాల స్థితిని ఇంతవరకు ఎవరు కూడా పొందలేదు కేవలం ఇట్టి కపాల స్థితిని పొందుటకు అర్హత మాత్రమే సంపాదించడం జరిగింది అనగా చితాగ్ని పది లక్షల దహన శక్తిని తట్టుకొని ఆ ఆదియోగియే నిలబడలేక పోయినాడు దానితో సంపూర్ణ మూల కపాల మోక్ష స్థితి పొందడం జరగలేదు కేవలం స్థూల సూక్ష్మ కారణ సంకల్ప శరీరాలకి కపాల మోక్ష స్థితి పొందడం జరుగుతుంది.
(24:13) మేము కూడా కాశీ క్షేత్రము నందు 41 రోజుల పాటు ఉండి ఈ చితాగ్ని దహన శక్తిని 96 నిమిషాలకి 48 నిమిషాల పాటు మాత్రమే అనగా 10 లక్షల దహన శక్తిలో 5 లక్షల శక్తిని తట్టుకొని ఆపై సహన శక్తిని ఒక లిప్త కాలము పాటు కోల్పోయి ఆకాశ శరీర కపాల మోక్ష స్థితి పొందకుండా వెనుతిరగడం జరిగినది అంటే ప్రస్తుతానికి సూక్ష్మ కారణ సంకల్ప శరీరాలకి కపాల మోక్ష స్థితి పొందడం జరిగినది.
(24:46) అలాగే ఆకాశ కపాల మోక్ష స్థితిలో విఫలం చెందడం జరిగినది ఇక స్థూల శరీర కపాల మోక్ష స్థితి కోసం రాబోవు సంవత్సరంలో అనగా జీవ సమాధి స్థితి పొందడం జరుగుతుంది. ఒకవేళ కాశీ క్షేత్రములో మరణము పొందితే ఆకాశ శరీరానికి మళ్ళీ కపాల మోక్ష స్థితి పొందడానికి అలాగే ఈ సాధన చేసుకోవడానికి అర్హత వస్తుంది అంటే ఈ లెక్కన మన పంచ శరీరాలకి అనగా సూక్ష్మ స్థూల కారణ సంకల్ప ఆకాశ శరీరాలకి పంచకపాల మోక్ష స్థితిని పొందాల్సి ఉంటుందని గ్రహించండి.
(25:21) అందులో మేము నాలుగు కపాల మోక్ష స్థితిని పొంది ఆకాశ కపాల మోక్ష స్థితిని పొందలేకపోవడం జరిగింది. మోక్షం అంటే చనిపోవడం కాదు అని తెలుసుకోండి ఆయా శరీరాలు ఆయా ప్రారబ్ధ కర్మను కర్మశేషం లేకుండా పూర్తి చేసుకొని వాటి నుంచి విముక్తిని పొంది ఆ శరీరము మనోనిశ్చల స్థితి పొందినట్లు అన్నమాట అనగా ఎక్కడైతే చనిపోయి వెళ్ళాలో అక్కడికి బ్రతికి ఉండగానే మరణించి వెళ్ళడమే అన్నమాట ఇలా మన శరీరంలో ఉన్న పంచ శరీరాలు అనగా స్థూల సూక్ష్మ కారణ సంకల్ప ఆకాశ శరీరాలకి కి మోక్ష స్థితిని పొందాలన్నమాట అదే జీవ సమాధిని అంటే మరణించడం అన్నమాట అనగా మన పంచ శరీరాలు
(26:07) పంచకపాల స్థితికి చేరుకొని ఏకకాలములో ఒకదాని తర్వాత మరొకటి విభేదనము చెందుతూ పరమ శూన్యమునందు ఐక్యం చెందడమే జీవ సమాధి అవుతుంది అనగా యోగ సిద్ధి పొందడం అవుతుంది. దానితో ప్రస్తుతం మాకున్న ప్రారబ్ధ కర్మ నివారణ చేసుకుంటూ అందరికీ మేము చేసిన గోమయ విభూతి అలాగే మేము చేసిన నిమ్మపాల కుంకుమను ఉచితంగా పంచుతూ మాకు ఆకాశ కపాల మోక్ష ప్రాప్తి కోసం ఆకాశ శరీరముతో స్వప్న సాధన కోసమని కాలమును ఈ సూక్ష్మ శరీరముతో నీలి ఆకాశము కేసి చూస్తూ అన్నిటిని సాక్షి భూతముగా చూస్తున్నాను విచిత్రం ఏమిటంటే మా భౌతిక గురుదేవుడు అలాగే మా ప్రధమ శిష్యులైన జిజ్ఞాసి కూడా
(26:50) వారి తల్లి మాయ దగ్గరకు దగ్గర మాకులాగానే తాత్కాలికముగా ఆగిపోవడం జరిగింది. నేను త్రిపురము దగ్గర బోల్తా పడితే జిజ్ఞాస మాత్రం సుందరి రూపము దగ్గర ఇష్ట కోరిక మాయకు స్పందించడం అలాగే ఆదిపరాశక్తి దగ్గర సహన శక్తి మాయ దగ్గర సహన శక్తి కోల్పోవడంతో బోల్తాపడి అప్పుడు సహన శక్తిని కోల్పోకుండా ఉండడానికి నిగ్రహ శక్తి కోసం సాధనను కొనసాగిస్తున్నాడు.
(27:18) అనగా వీరికి సూక్ష్మ కారణ శరీరాలకి మోక్ష ప్రాప్తి అనగా మనోనిశ్చల స్థితి పొందినాయి గాని ఇక సంకల్ప శరీరాలకి మోక్ష ప్రాప్తి గాని ఈ సంవత్సరం అనగా 2019 నవంబర్ 25 కార్తీక సోమవార పర్వదినము నాడు సాయంత్రం 7 గంటలకు తన సంకల్ప శరీరానికి మోక్ష ప్రాప్తి అలాగే మహాస్మశాన క్షేత్రమైన కాశీ యందు ఈ క్షేత్ర గంగా నదిలో ఆస్తిక చితాభస్మము కలిపితే తన స్థూల శరీర మోక్ష ప్రాప్తి పొందడం జరుగుతుంది.
(27:52) అలాగే కాశీ యందు మరణమును పొందితే ఆకాశ శరీరానికి మోక్ష ప్రాప్తి అర్హత పొందడం జరుగుతుంది.

No comments:

Post a Comment