Wednesday, August 19, 2026



ఈ ఫొటోలో మీరు చూస్తున్నది సామాన్యమైన జ్యోతి కాదు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ప్రియ శిష్యుడైన శ్రీ సిద్దయ్య స్వామి వారు స్వయంగా వెలిగించిన అఖండ దివ్య జ్యోతి. గత 300 సంవత్సరాలకు పైగా ఈ అఖండ జ్యోతి సిద్ధయ్య స్వామి వారి మఠంలో నిరంతరం వెలుగుతూనే ఉంది. ఈ పవిత్రమైన మఠంలో సిద్ధయ్య స్వామి వారి జ్యోతితో పాటు, బ్రహ్మంగారి పాదుకలు, యోగ దండం మరియు శిఖాముద్రికలను కూడా మనం దర్శించుకోవచ్చు.

"సిద్దయ్య వంటి శిష్యుడు, బ్రహ్మంగారి వంటి గురువు ఈ లోకాన లేడు" అనేది మనందరికీ తెలిసిన సత్యం. అంతటి గొప్ప చరిత్ర కలిగిన సిద్ధయ్య స్వామి వారి గురించి ఈరోజు ఒక ముఖ్యమైన విషయంపై క్లారిటీ ఇవ్వవలసిన అవసరం ఉంది.

నేను ఫేస్‌బుక్‌లో బ్రహ్మంగారి గురించి గానీ, సనాతన ధర్మం గురించి గానీ ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు, కొంతమంది ఇస్లాం సోదరులు దానిని మతపరమైన కోణంలోకి తీసుకువెళుతూ, "మీరు బ్రహ్మంగారిని నమ్ముతారు కదా, మరి ఆయన ముఖ్య శిష్యుడు సిద్దయ్య ఒక ముస్లిం కదా" అని కామెంట్స్ చేస్తూ ఉంటారు. అలాంటి వారికి స్పష్టమైన సమాధానం ఇది.

సిద్దయ్య స్వామి వారు ఇస్లాం మతానికి చెందిన వ్యక్తి అసలే కాదు. ఆయన జన్మతః ఇస్లాం వ్యవస్థలో భాగమనుకునే 'దూదేకుల' వర్గానికి చెందినవారే కావచ్చు, కానీ ఆయన అప్పటిలోనే బ్రహ్మంగారిని ఆశ్రయించి, ఇస్లాం పద్ధతులను పూర్తిగా వదిలేసి, సనాతన ధర్మాన్ని స్వీకరించి పాటించారు.

దీనికి చరిత్రలో ఒక గొప్ప నిదర్శనం ఉంది. నాటి సిద్ధవటం నవాబు సమక్షంలోనే, తాను మతం మారలేదని, తాను స్వీకరించిన సనాతన ధర్మమే శాశ్వత ధర్మమని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అంతేకాదు, అక్కడ ఉన్న నల్ల రాతి బండకు తన ఎడమ చేతితో నమస్కారం చేయగా, అది ముక్కలు ముక్కలైపోయింది. ఆ విధంగా తన గురువు మహిమ ఏమిటో, తాను నమ్మిన ధర్మం యొక్క శక్తి ఏమిటో నవాబు ముందరే నిరూపించారు.

అంతటి గొప్పగా సనాతన ధర్మాన్ని స్వీకరించి, ఆచరించిన సిద్దయ్య స్వామి వారిని, ఇప్పటికీ కొంతమంది "మా ముస్లిం, మా జాతి" అని చెప్పుకోవడం నిజంగా దౌర్భాగ్యం.

నేను బ్రహ్మంగారిని నమ్మే వ్యక్తిగా వ్యక్తులను ఎప్పుడూ ద్వేషించను, కేవలం విషయపరంగానే మాట్లాడుతాను. కానీ చాలామంది దీనిని అర్థం చేసుకోక, "నీకు ఇస్లాం అంటే ద్వేషం, ముస్లిమ్స్ అంటే పడదు" అని మాట్లాడుతున్నారు. స్పష్టంగా చెబుతున్నాను, నేను సిద్ధాంతాల పరంగా మాట్లాడుతాను తప్ప వ్యక్తుల పరంగా కాదు. ప్రతి మతంలోనూ మంచి వారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. పూర్తిగా మంచివారు ఉన్న మతమూ లేదు, పూర్తిగా చెడ్డవారు ఉన్న మతమూ లేదు అనేది జగమెరిగిన సత్యం.

కానీ, ఈ విషయంలో మూర్ఖంగా వాదించేవారికి నాదొకటే సూటి ప్రశ్న: అన్ని వందల సంవత్సరాల క్రితమే సిద్దయ్య స్వామి వారు ఇస్లాంను వదిలేసి, బ్రహ్మంగారిని ఆశ్రయించి, నవాబు ఎదుటే సవాలు చేసి తాను స్వీకరించిన ధర్మం గొప్పతనాన్ని నిరూపించినప్పుడు... ఆరోజు ఇస్లాం సమాజం గానీ, వారు నమ్మే దైవం గానీ ఏ శక్తిని చూపించగలిగారు? వారు ఏమి చేయగలిగారు?

దీనికి సమాధానం లేదు. కాబట్టి సత్యాన్ని అంగీకరించడం నేర్చుకోవాలి. కొందరు వ్యక్తులు మతం ముసుగు వేసుకొని "మేము నమ్మిందే గొప్పది, మిగతావన్నీ పనికిరానివి" అనే ధోరణి ఎక్కడా పనికిరాదనే విషయాన్ని సిద్ధయ్య స్వామి వారి చరిత్ర ద్వారా మనం గ్రహించాలి.
 
ఇక్కడ మనం సంతోషించదగ్గ మరో విషయం ఏమిటంటే... ఈ రోజుల్లో బ్రహ్మంగారి చరిత్రలో చాలా కల్పితాలను జోడించి ప్రచారం చేస్తున్నారు. కానీ, అదృష్టవశాత్తూ సిద్ధయ్య స్వామి వారి విషయంలో అలాంటి కల్పితాలు అంతగా చోటు చేసుకోలేదు. ఆయన చరిత్ర చాలా వరకు యథార్థంగానే మనకు అందుబాటులో ఉంది.

చివరగా నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే:
 * శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు విశ్వగురువు. ఆయనకు ఏ కులంతోనూ సంబంధం లేదు. కేవలం కొందరు వ్యక్తులు మాత్రమే ఆయనను ఒక కులానికి ఆపాదించుకుంటున్నారు.

 * శ్రీ సిద్ధయ్య స్వామి వారు బ్రహ్మంగారి ప్రియ శిష్యుడు. ఆయనకు సనాతన ధర్మం తప్ప ఏ మతంతోనూ సంబంధం లేదు.

నిజాన్ని నిజంగా, చరిత్రను చరిత్రగా గౌరవిద్దాం
 సర్వం శ్రీ వీరబ్రహ్మేంద్ర దివ్యచరణారవిందార్పణమస్తూ 🙇‍♂️





http://youtube.com/post/UgkxFfho5d9DXmBw1l-y7GA5sreMHA4ajeIF?si=jHFzacsNxaUBWPtP

No comments:

Post a Comment