Thursday, July 7, 2022

కూరగాయల మనోభావాలు..

 🍆🥕🌶️🥒🥦🍄

కూరగాయల మనోభావాలు..

గోంగూరకి ఆహం ఎక్కువ.. ఎందుకంటే తాను గుంటూరు వాసినని...
తోటకూరకి వయ్యారం ఏక్కువ ..
ఏందుకంటే నవనవ లాడతానని ...
పొట్లకాయకి పొగరు ఎక్కువ..
ఎందుకంటే ఐదడుగులు ఎత్తు అని....
చిక్కుడుకు చికాకు ఎక్కువ..
ఎందుకంటే తనని గోరుతో గోకుతారని....
కందకి..వెటకారం ఎక్కువ..
ఎందుకంటే తనకి లేని దురద కత్తిపీటకి వచ్చిందని....
చేమకు చిమచిమలు ఏక్కువ ...
ఏందుకంటే కూర - పులుసు - fri గా ఉపయోగ పడతానని ...
పేండలానికి పేంకితనo ఏక్కువ ....
కత్తిపీటతో తరూగూతారని ...
మునగకాయకి మురిపం ఏక్కువ ...
మగవారికి దివ్య ఔషధం అని ...
వంకాయకి గర్వమెక్కువ ..
కూరగాయలన్నింటికీ తనే రారాజునని....
అరటికాయకి అభిమానం ఏక్కువ ...
శాఖాకూర అయిన తనను మాంసంతో పోల్చి లంకమాంసం అంటారని ..
బెండకాయకి ఆనందమెక్కువ..
తనను మగువల చేతివేళ్ళతో పోలుస్తారని....
దొండకాయకి ఆందోళనెక్కువ..
కాకి ఎక్కడ తనను ముక్కున పెట్టుకుంటదోనని....
కాకరకాయకి శాంతమెక్కువ..
ఎవరూ ఇష్టపడకపోయినా అందరికీ ఆరోగ్యానిస్తుందిగా....
బంగాళాదుంపకి సహనమెక్కువ..
కూరలకైనా,చిరుతిండ్లకైనా, పూరీకైనా,పానీపూరీకైనా అన్నీంటికీ తానే దిక్కు మరి....
గుమ్మడికాయకి గాంభీర్యమెక్కువ.. కూరగాయలన్నీంటినీ కలిపినా కూడా తన బరువుకు తూగలేవుగా....
ఆనపకాయకి ఆనందం ఏక్కువ ...
యేలాగయినా అన్నిరకాలుగా తనని తింటారని ...
ఉల్లిపాయకి టెక్కు ఎక్కున..
తానులేనిదే ఆ కూరగాయలకి రుచి ఎక్కడిదని....
మిర్చికి కోపమెక్కువ..
ముందు నోటినీ,తరువాత కడుపుని మండించేస్తుంది....
కరివేపాకుకి మిడిసిపాటు ఎక్కువ..
తాను కొంచెమైనా కూర సువాసనకి తానే దిక్కుఅని....
బీరకాయకి దిగులెక్కువ..
తనను ఎడాపెడా వాడేస్తారని,పీచుని కూడా వదలరని....
కారెట్ కి బీట్ రూట్ కి హంగామా ఎక్కువ..
తమంతటి రంగు ఎవరికీ లేదని....!!
ఆఖరిగా పనస పొట్టుకి పరువం ఏక్కువ (గ్లామరు హీరోయిను typu)...

😊😊😁😁😆😆😜😜

సేకరణ

No comments:

Post a Comment