Saturday, August 20, 2022

ఆశ మనసులో అలజడి రేపుతోంది, ఆశ స్వరూపం ఏమిటి ? దాన్ని ఎలా అధిగమించాలి !?

     💖💖 "305" 💖💖
💖💖 "శ్రీరమణీయం" 💖💖

"ఆశ మనసులో అలజడి రేపుతోంది, ఆశ స్వరూపం ఏమిటి ? దాన్ని ఎలా అధిగమించాలి !?"


"భగవంతుడు సమకూర్చిన వాటితో ఆగకుండా ఇంకా, ఇంకా కావాలనుకోవటం, మళ్ళీ, మళ్ళీ కావాలనుకోవడం ఆశ లక్షణాలు. ఒక వస్తువు బాగుందని అనుకోవటంలోనే కావాలన్న ఆశ ఇమిడి ఉంది. కనిపించే మార్పే మనకి మళ్ళీ కావాలనిపించేలా చేస్తుంది. అదే దుఃఖహేతువు అవుతుంది. ఆశపడే లక్షణమే కోరికగా మారుతుంది. అదే మనసులో కలిగే అలజడికి కారణం అవుతోంది. తీరని కోరికలు మనసులో ఉప్పెనను రేపుతాయి. అందుబాటులోకి వచ్చిన వాటితో సంతృప్తి చెందిన వాడు మహనీయుడు అవుతాడు. ఇంకా కావాలనుకునేవాడు సామాన్యుడిగా మిగిలిపోతాడు. మనిషి తన అభిరుచికి, ఆచరణకు సంబంధం లేకుండా జీవించడం అసలు సమస్యకు కారణం. ఇంట్లో అందమైన ప్రకృతి చిత్రపటాలు, జంతురాశి ఛాయాచిత్రాలు అమర్చుకుంటాడు. కానీ ప్రకృతిని, ప్రాణులను స్వేచ్ఛగా మాత్రం ఉండనివ్వడు. మనిషిలోని ఆశ తనను ఏ స్థాయికైనా దిగజారుస్తుంది. ఆశ నుండి విడవడగలిగితే అనుక్షణం ధ్యానంలో ఉన్నట్లే ! ఆశలేని ప్రతి ఆలోచన ధ్యానమే !!"

"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"
           

No comments:

Post a Comment