Thursday, April 6, 2023

నేటి జీవిత సత్యాలు

 🍇🇾🇪 నేటి జీవిత సత్యాలు 🇾🇪🍇

అందమే ఆనందం నిజం
ఆనందమే అందం నిజంగా నిజం
అందం ఆనందం ఈ రెండూ కలిసి ఉంటే బ్రహ్మానందం ఇది పక్కా నిజం 

నవ్వడం ఓ యోగం
నవ్వించడం ఓ భోగం
నవ్వలేక పోవడం ఓ రోగం 
ఇది సత్యం

నవ్వితే అందం నవ్విస్తే ఆనందం నవ్వుతూ జీవిస్తే పరమానందం. ఇది మరింత నిజం.

సుఫల స్నేహం,సఫల స్నేహం ,విఫల స్నేహం.

సుఫల స్నేహనికి అర్థం అర్జునుడు శ్రీ కృష్ణుడు .అర్జునుడు ఎవరో శ్రీ కృష్ణుడు కి తెలుసు.శ్రీ కృష్ణుడు ఎవరో అర్జునుడికి తెలియదు. అర్జునుడి ద్వారా శ్రీ కృష్ణుడు ధర్మాన్ని కాపాడాడు ఆయన పరమాత్ముడు అంటే భగవంతుడు కాబట్టి .శ్రీ కృష్ణుడుని అర్జునుడు స్నేహితుడిగా నమ్మాడు బందువుగా అంటే బావగా గౌరవించాడు .అందుకే అది సుఫల స్నేహం అయింది 

ఇక సఫల స్నేహం
దుర్యోధనుడు కర్ణుడు.దుర్యోధనుడు రాజు .ఆయనకు కర్ణుడు లాంటి యోదుడి అవసరం వుంది .కర్ణుడు ఒంటరి వాడు .అందుకే ఆయనకు దుర్యోధనుడి అవసరం వుంది 
ఒకరి అవసరం ఒకరికి వుంది
కావుననే అది సఫల స్నేహం అయింది 

( చివరికి యుద్ధంలో ఇద్దరూ పోయారు గదా అది వేరే విషయం )

ఇక విఫల స్నేహం
ద్రోణుడు ద్రుపదుడు
( దృపదుడు ఒక దేశానికి రాజు
ద్రౌపదికి తండ్రి).ఇద్దరూ బాల్య స్నేహితులు అయితే ఒక సందర్భంలో ద్రోణుడికి పాడి విషయంలో అవసరం బడి స్నేహితుడు కదా అని 
పాడి ఆవులు కావాలని కోరడం జరిగింది .కానీ అది సమయానుకూలంగా లేదు కావచ్చు 

దానికి దృపదుడు రాజు కాబట్టి వేరే పనుల వత్తిడిలో వుండి ఆ పాడి కోరికను నెరవేర్చలేక పోయాడు లేక మర్చి పోయి వుండొచ్చు 

దీన్ని దృష్టిలో వుంచుకుని 
ద్రుపదుడి మీద ద్రోణుడు కక్ష 
పెంచుకుని భారత యుద్ధంలో 
ప్రత్యేక శ్రద్ద తీసుకొని మరీ
ద్రుపదుడి మీద పోరాటం చేసి చివరికి  ఏమైందో అందరికీ తెలుసు

 అందుకే అప్పటినుండి పలానా వారి కక్ష కాటికి పోయినా తీరదు అనే నానుడి పుట్టింది .ఇక్కడ స్నేహం విఫలం అయింది

దీన్నుంచి మనం నేర్చుకోవాల్సింది 
ఎంత స్నేహితుడు అయినా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి సహాయం కోరినా మరీ కక్ష పెంచుకో కూడదు అని భావం

ఈర్ష్యా ద్వేషాలు వ్యక్తిగతంగానూ సమాజ పరంగానూ కూడా నష్టం కలిగిస్తుంది అని అర్దం.

శుభోదయం తో ఒక జ్ఞాన పిపాసి.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🇾🇪🇾🇪🇾🇪🇾🇪🇾🇪🇾🇪🇾🇪🇾🇪🇾🇪🇾🇪🇾🇪
🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇

No comments:

Post a Comment