Wednesday, April 5, 2023

విత్తనాలు

 *🍁విత్తనాలు🍁*

✍️ మురళీ మోహన్

 👉దేవుడు     ఒక    దుకాణం      తెరిచాడట.     అక్కడికి      ఒక   ఆసామి    వెళ్ళి   'ఇక్కడ  ఏం  దొరుకుతాయి?' అని అడిగాడు.
"ఏది  కావాలంటే    అది      దొరుకుతుంది."  అన్నాడు   దోవుడు.
'అలాగా,  అయితే    డబ్బు  దొరుకుతుందా?'
చెప్పానుగా. దొరుకుతుంది
'మరి మనశ్శాంతి?'
"దొరుకుతుంది"
'ఆరోగ్యం,  సుఖం..  ప్రేమ?'
ఊ...తలూపాడు   దేవుడు.
'సరే  అయితే  గెలుపు  దొరుకుతుందా?'
"చెప్పానుగా  అన్నీ దొరుకుతాయి   నీకేంకావాలో  చెప్పు  ముందు?ఇంకా క్యూలో  చాలామంది    ఉన్నారు"

ఊ ...అయితే  నాకు   సక్సెస్  ఫుల్  లైఫ్   కావాలి.అడిగాడు  ఆసామి
  సరే  తీసుకో   అని  ఒక  గింజను  చేతిలో  పెట్టాడు దేవుడు.
'ఏమిటిది?'  ఆశ్చర్యంగా  అడిగాడు.
"విత్తనం"
'ఎందుకిది?'

"సక్సెస్ ఫుల్  జీవితం కావాలన్నావుగా,.ఇది  ముందు  నాటితేనే కదా ,   పెరిగి    పెద్దదయి   నీకు   ఫలితాన్నిచ్చేది" 
  బుద్దుడికి  చెట్టు  క్రింద      జ్ఞానోదయం     అయినట్టు  ఆ    చెట్టుకి   మూలమైన విత్తనం    చేతిలో   పడగానే  బల్బు        వెలిగింది.  దేవుడి  దుకాణంలో  పండు  దొరకదు   విత్తనం   దొరుకుతుంది.
   🌼  *ఏదీ కష్ట పడకుండా           ఏమీ  చేయకుండా  రాదు.       డబ్బు,  శ్రమ,    ఆలోచన..   ఇంకోటా,..మరోటా...ఏదో  ఒక       పెట్టుబడి పెట్టాలి.  ఏది             నాటితే  అదే  కాస్తుంది .కానీ       ఖచ్చితంగా కాస్తుంది.*
    *ఈ భావాన్ని  మన   పిల్లలలో  నాటితే  వాళ్ళు    గొప్ప  వారు అవుతారు.  ఆ  దేవుడి  దుకాణానికే     విత్తనాలు పంపిస్తారు.*

No comments:

Post a Comment