Wednesday, April 5, 2023

:::::: శ్వాస మీద ధ్యాస అంటే వర్తమానంలో బస:::::

 *:: శ్వాస మీద ధ్యాస అంటే వర్తమానంలో బస::*

            వర్తమాన అనేది ప్రవాహం.  ఇది ఆగక సాగిపోతూ వుంటుంది 

       వర్తమానాన్ని పట్టు కోవాలంటే మనం కూడా అదే వేగంతో చలిస్తూ వుండాలి.

        శ్వాస అంటే చలనం.
శ్వాసని పట్టు కొంటే చలించే వర్తమానం లో వున్నట్లే.

     వర్తమానం లో అనుభూతే గాని ఆలోచన లేదు.

ఆలోచన అంతం అయనచోట వర్తమానం వుంటుంది.

      కనుక శ్వాస మీద ధ్యాస అంటే ఆలోచనలు లేని, అనుభూతి మాత్రమే వుండే, 
వర్తమానంలో, నివసిస్తూ, జీవిస్తూ వుండటం 

*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment