*:::::::::::: మనో కర్మ ::::::::::::*
మనందరికీ ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచన మనస్సు చేస్తుంది కనుక మనో కర్మ అన్నారు(పని). ఈ కర్మ మాట రూపం లో గాని , కాయ (శరీరంతో చేసే పని) రూపంలో కాని మారనంతకాలం అది అంతరంగంలోనే దాని ప్రభావం, పర్యవసానాలు వుంటాయి . బాహ్య ప్రపంచంలో ఎలాంటి మార్పులు చేర్పులు జరగవు. అనగా బాహ్య సంబంధం వుండదు. అనుఉత్పాదం)Non productive)
ఆలోచన అంతరంగంలో వివిధ రూపాల్లో వుంటుంది. ఉదా. ముద్రలు, జ్ఞానం, అభిప్రాయాలు, గుర్తింపులు.
వీటి మధ్య,వీటి సహాయంతో అంతరంగం చర్య చేసుకుంటూ వుంటుంది.వీటిని విడివిడిగా చూసే అంతఃదృష్టి మనకు లేదు. ఈ చర్య, కర్మ పర్యవసానాలే ఉద్వేగాలు.
ఈ ఆలోచన కుశలం అయితే అంతరంగం హాయి గా వుంటుంది. అది వాక్,కాయ కర్మ గా మారినప్పుడు బాహ్య ప్రపంచం హాయి గా వుంటుంది.
అకుశలం అయితే దుఃఖం గా వుంటుంది. ఇదే మానసిక కర్మ సిద్ధాంతం.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment