Tuesday, April 11, 2023

::::వ్యావహారిక vs పరమార్థ సత్యాలు::::

 *వ్యావహారిక  vs  పరమార్థ సత్యాలు*.
      ఇవి రెండూ వేరు వేరు వ్యతిరేక అర్థాలని ఇచ్చినా సత్యాలు అవుతాయి. రెండు స్పరస్పరం   వ్యతిరేక మైనవి సత్యాలు ఎలా అవుతాయి.? చూదాం.
       ఉదా.. మట్టి తో చేసిన కుండని తీసుకుందాం. మట్టి లేకుండా కుండ లేదు. కుండ లేకుండా మట్టి వుండగలదు.
      కనుక మట్టి సారం కలది.
కుండ కి సారం లేదు.  అది మట్టి యొక్క ఆకృతి మాత్రమే.
 సారం లేనిది కనుక పరమార్థం ప్రకారం కుండ లేదు.కుండ తో నీరు నింపుతున్నాము, (మట్టి తో నింపలేము)  కనుక సారం లేనిదైనా కుండ వ్యావహారికంగా వుంది.
     అలాగే 
      మనసు ,శరీరం ఈ రెండు లేకపోతే నేను(భావన) లేదు.
*నేను* లేక పోయినా మనసు శరీరం వుంది.(పశివాడికి *నేను* అన్న భావన లేదు).
  నేను కి సారం మనసు శరీరం.
   కనుక సారం లేనిది కనుక పరమార్థికంగా *నేను* లేదు.
  *నేను* అని వ్యవహరిస్తాము కనుక వ్యవహారిక సత్యం.
*షణ్ముఖానంద 9866699774*

No comments:

Post a Comment