Wednesday, June 26, 2024

****అంతం వుంటే..*_ _*ఆది వుండి తీరవలసిందే !

 _*💫 అంతం వుంటే..*_ 
_*ఆది వుండి తీరవలసిందే ! ⚜️*_
➖➖➖➖➖➖✍️
*_-శ్రీరమణమహర్షి జీవిత చరిత్ర_*
*_-శ్రీరమణ మార్గము_* 
®®®®®®®®®®®®®®
*_⚡ప్రతీదీ కేంద్రాకర్షణ శక్తుల వల్ల, ఆకాశపు హద్దుల్లో వుంచ బడుతుంది. కాని, మంచు కరిగి నీరై, నీరు ఆవిరై, ఆ తర్వాత రూపాలు మాత్రం మారతాయి. సర్వవ్యాపక మైనట్లు, అంతే ! అట్లా వాటి మార్పులు చెందుతూ, సూక్ష్మరూపం పొందుతూ, మూలపదార్థంలో - చిత్"లో ఆత్మ రూపం పొందుతుందే కాని, శూన్యం మాత్రం కాదు. అది శూన్యమైతే, ఈ బ్రహ్మాండం కూడా శూన్యం కావలెను. బ్రహ్మాండం శూన్యమయ్యేదే అయితే, అంతా కావాలి. ఇంక దాన్ని అనంతమని ఎట్లా అనడం ? అంతం వుంటే, ఆది వుండి తీరవలసిందే ! ఆది వుంటే, అది ఎప్పుడో ఒకప్పుడు సృష్టింపబడి వుండాలి. కనుక ఏదీ సూక్ష్మ రూపం ధరించినా, శూన్యం మాత్రం కాదు._*

*_ఈ విశ్వానికి ఒక కారణం లేదు. కారణం వుండి వుంటే, అది ఒకప్పుడు అంతం కావడం నిశ్చయం._*
*_ఎక్కడైతే అంతం వుంటుందో, అక్కడ సరికొత్తది, మనకు తెలియనిది ఆవిర్భవిస్తుంది._*

*_అసలు దీనికంతటికీ మూలం ఏమిటి ? అంటే, “దైవం " చాలామంది చాలా తేలికగా సమాధానం చెపుతారు. జగత్తుకు మూలకారణం భగవంతుడని నిర్ధారణ చేయడానికి గాని, సిద్ధాంతీకరించడానికి గాని వీలులేదు. ఎందుకంటే, ఒక దాని కొకటి పరస్పరాధారం వల్ల ముగింపు లేక అనంతంగా అల్లుకునే గొలుసు మాదిరిగా వుంది జగత్తు. ఆ జగత్తుకు మూలకారణం వుంటుందని భావించడం పొరపాటు._*

*_ఈ విశ్వానికి కారణాలు చెప్పే మతాలు, శాస్త్రజ్ఞులు వారి, ఊహల మీద ఆధారపడి వుంటాయి. వారి సిద్ధాంతాల మీద, వారు, ప్రతి ఒక్కరూ ఈ విశ్వం ఎప్పటికో ఒకప్పటికి అంతం కాక తప్పదంటారు. కాని, వారు ఈ అనంత విశ్వాన్ని ఓ చోటు నుంచి, ఓ కోణం నుంచి వారికి లభ్యమైన టెలిస్కోప్ నుంచి చూసి, పరిమిత జ్ఞానంతో వివరిస్తారు._*

*_ఈ విశ్వమంతా ఓ శక్తిమయం. ఆ శక్తి కంటికి కనుపించేది కాదు. కాని, మనం దాని పర్యవసానాన్ని, ఫలితాన్ని మాత్రం చూడగలం. ఆ విధంగా మనం చూసేదే MATTER పదార్థం. శక్తి ఫలితాలే, పదార్థం, ప్రపంచంగా కనబడుతుంది. కాని, పదార్థాన్ని, శక్తిని విడదీసి చూడ్డం అసాధ్యం, కష్టం. తమలో క్రమం లేనివాళ్ళు, ఈ అనంత విశ్వంలో ఓ క్రమాన్ని ఎట్లా చూడగలరు ? ఆ క్రమాన్ని ఎట్లా తీసుకురాగలరు ? అందరి మాదిరి గానే, ఈ శాస్త్రజ్ఞులు కూడా అపనమ్మకంగా, సంశయంగా వున్నారు._*

*_ప్రతీదీ నిరంతరం మార్పు చెందుతూ వుంటుంది. ప్రతి మార్పుకూ ఒక కారణం వుంటుంది. ఆ కారణం వల్లనే, ఒక పని జరుగుతుంది. ఆ కర్మ, ఫలితాన్ని ఇస్తుంది. అదే ధర్మం-సత్యం, సూత్రం-నియమం శాసనమై ఈ విశ్వాన్నంతా నడుపుతోంది._*

*_అలాగే ప్రపంచం నిరంతరం మార్పు చెందుతూ వుంటుంది. క్షణం, ఓ క్షణంలో మరుక్షణంగా మారుతుంది. అసలు వున్నది అనంతమైన కదలిక మాత్రమే. ఇంకేం లేదు. ఆ కదలిక వల్ల ఈ ప్రపంచం వేరు, వేరు రూపాలు ధరించి, అనేక పేర్లతో విలసిల్లుతోంది. ఆ విధంగా ఈ ప్రపంచం పరిణామం చెందుతోంది. మనిషి నుంచి మేరుపర్వతం వరకు ఆ ధర్మమే పనిచేస్తుంది. ఆ సూత్రం, మాత్రం మారదు. కనుక మార్పులోని ధర్మాన్ని చూడ్డమే, సత్యాన్ని తెలుసుకోవడం._*

*_ఈ విశ్వమంతా ఓ శక్తి సముద్రం. అందుండే చిన్నా, పెద్దా తరంగాల్లోని శక్తి, అసలు సముద్రంలోని శక్తి ఒక్కటే. సముద్రమే ఒక పెద్ద శక్తి తరంగం. “సముద్రం - తరంగం” అనే వాటి నుంచి భిన్నత్వంలోని ఏకత్వాన్ని తెలుసుకోవచ్చు. సముద్రంలో నిరంతరం విరుచుకుపడే తరంగాలు ఎట్లానో, ఈ సృష్టిలో కల్లోలాలు అట్లాను. అవి ఎందుకు కలుగుతాయంటే, జవాబు లేదు._*

*_అవి వస్తాయి, పోతాయి. తరంగాల రాకపోకలు సముద్రంలోనే. తరంగాలు, సముద్రంలో లేచి, సముద్రంలోనే ఆణగుతాయి. అవి అసలు సముద్రానికి భిన్నం కావు. అంతా ఒక టే శక్తి తరంగం. ఆసంగతి అనుభవపూర్వకంగా తెలుసుకుంటే అన్ని ఆందోళనలూ అణగుతాయి. శాంతి కలుగుతుంది._*

*_సమస్త గోళాలూ, లోకాలూ, సౌరమండలాలు, జగములు ఏ ఆధారంపై నిలిచి, చలిస్తున్నాయో పరిభ్రమిస్తున్నాయో - వాటిని నడిపే శక్తి ఏదో వెలిగించే తేజస్సు ఏదో వాటిని అది అవ్యక్తం. ఆ అవ్యక్తం నుంచి, ఈ విశ్వమంతా ఆవిర్భవించింది. అంటే, విశ్వచైతన్యక్షేత్రంలో వ్యక్తమైంది. విశ్వం నిరంతరం ఒక ఘట్టంగా ఈ ప్రపంచం కదులుతోంది. ఆ చలనశక్తినే, “ఆత్మ - బ్రహ్మం - పురుష" అని అంటారు. కాని, ఏ పేరుతోనైనా దాన్ని పిలవవచ్చు._*

*_ఈ చైతన్య సాగరంలో “నేను” అనే ప్రత్యేక తలంపు, కేవలం ఒక నీటిబుడగ మాత్రమే. దాన్నే “జీవుడు లేక, వ్యక్తి అంటారు. ఆ నీటిబుడగ కూడా నీరే. ఆ నీటిలోంచి లేచినదే, ఆ నీటి బుడగ. ఆ బుడగ ఎప్పటికైనా అందు కలసి పోవలసినదే ! కాని అది కాలంలో కొంతకాలం ఒక ప్రత్యేక నీటిబుడగగా నీటిలో తేలి, ఆడుతుంది. దాని జీవితకాలం, అనంతకాలంలో అల్పాతి అల్పము. ఆ బుడగ బద్ధలై, మహా సాగరంలో నామ రూపం లేకుండా కలిసిపోతుంది. ఆ నీటిబుడగ, ఆత్మకు ప్రతిరూపం. నీటిబుడగైన ఆ జీవుడు సుషుప్తి, స్వప్న, జాగ్రత్- మూడు అవస్థల్లోనూ (జ్ఞానపరంగా) ‘వాస్తవం. కాని, అసలు ఏమీ లేనేలేని, యాతనలు, బాధలు పడుతూ, అనేక అనుభవాల్లోంచి నడుస్తూ, ద్వంద్వాల్లో పడి కొట్టుకుంటూ, జనన - మరణ వలయంలో ఇరుక్కుంటాడు జీవుడు. అవన్నీ వాస్తవమనే దృష్టితో.._*

*_ఆ జీవుడు దేహంతో కలిసి, ప్రపంచ విషయాలతో సంబంధం పెట్టుకుని, “నేను - నాది" అనే భావంతో వుంటాడు. నానా యాతనలు పడుతూ, విముక్తీకై చూస్తాడు. దీని కంతకూ కారణం, జీవునికి “తాను అసలు పరబ్రహ్మ నుంచి విడి" అనే భావం కలగడమే._*

*_దేహం, జడం. దాన్ని నడిపేది, ఆత్మశక్తి ఆ శక్తి అన్నింటిలో, అన్ని కాలాల్లో ఒకటిగా, సాక్షిగా వుంది. అసలు వున్నదీ ఆ ఆత్మ ఒక్కటే ! అదే ఈ జగత్తుకు చిద్వస్తువు. అంటే, “సత్, లేక చైతన్యం". ఆ సత్ యొక్క ప్రకాశమే, చిత్. సత్ యొక్క స్వభావం, ఆనందం. ఆ మూడూ కలిసి “సచ్చిదానందం”. కాని, అంతా ఒకటే ఆత్మ. ఆ ఆత్మశక్తి లేకపోతే, దేహం వుత్త అర్థంలేని చట్రం. ఆ దేహం, నాశనమయ్యేది. కాని, ఆ దేహం “నేను” అనదు. అలాగే ఆత్మకూ “నేను” అనవలసిన పని లేదు. అయితే ఈ "నేను" ఏమిటి ? అది ఎట్లా, ఎక్కడ నుంచి పుట్టింది ?" అని యోచిస్తే, చైతన్యశక్తిరూపమైన ఆత్మకూ, జడదేహానికి మధ్య నిరంతరం "నేను - నేను" అంటున్నదే, అహమిక. అదే, అంటే, జీవుడే, అహమన్నమాట._*

*_ఆ అహం' మొదటి నుంచీ మనలో గట్టిగా, లోతుగా పాతుకుని వుంటుంది. అది నిరంతరం శ్రమించి, బాధపడి, నలిగి తనకో ప్రత్యేక స్థానం, తన కాళ్ళపై తాను నిలిచే శక్తి, సామర్థ్యం సంపాదించు కుంటుంది. అనంత చైతన్య సాగరంలోంచి లేచిన జీవుడు, “నీటిబుడగ" అనే అద్దె కొంపలో తాత్కాలికంగా అద్దెకు దిగుతాడు, ఆ జీవుని వెంట, ఎప్పుడూ ఒక నౌకరు వుంటాడు. జడదేహానికి అతడే. "ప్ర్రాణం.” - ఆ ప్రాణం చేతనాపూర్ణం. ‘చైతన్యాన్ని ఇచ్చేది, ఆ ప్రాణమే. ఆ నౌకరు ఇంటినీ రాత్రింబవళ్ళు శ్రద్ధగా, కంటికి రెప్పలాగ క్షణం ఏమరకుండా కావలి కాస్తూ వుంటాడు. నమ్మినబంటు వంటి ప్రాణం, తన ఇంటిని జాగ్రత్తగా, చూసుకుంటున్నడనే ధైర్యంతో, అద్దెకొంపలో చేరిన జీవుడు అనేక ఆటలాడతాడు. అందుచేత ఆ జీవుడు తన జీవిత కాలంలో సగభాగం నిద్రలోనే గడుపుతాడు. జీవుడు ఇంటిని నౌకరైన ప్రాణానికి అప్పగించి నిద్రపోయినట్లు నిద్రపోయి, స్వస్థలం చేరి సుఖంగా వుంటాడు. ప్రాణం ఒక్కటే ఇంటిని (దేహాన్ని) అంటి పెట్టుకుని, కావలి కాస్తూ వుంటుంది. జీవుడు ఎక్కడ ఎట్లా వున్నా ప్రాణం మాత్రం, ఇతరులు ఎవరినీ తన ఇంట్లో ప్రవేశించనీయదు. కాని, ఒక్కోసారి నౌకరు ఏమరపాటున వుంటాడనీ, అటువంటి సమయాల్లో ఇతరులెవరో ఆ ఇంట్లో చొరబడ తారనీ, చొరబడి నానా హంగామా చేస్తారనీ అంటారు._*

*_జీవుడు ప్రస్తుతం వుంటున్న అద్దెకొంప నచ్చకపోతే, ఏదో ఒక వంక చూపి, ఇల్లు ఖాళీ చేసి, ముందు నౌకర్ని బైటికి పంపి, తాను తీరికగా తప్పుకుంటాడు. ఆ అద్దెకొంపలోంచి వెళ్ళిన జీవుడు మహాసాగరంలో నిలవలేక, అలవాటు చొప్పున కాని, పాతవాసనల ఫలితంగా కాని, వేరొక కొంప అద్దెకు తీసుకుంటాడు. అక్కడా అంతే ! ఆ విధంగా జీవుడు అనేక కొంపలు మారి, చివరికి స్వస్థలం చేరుకుంటాడు._*

*_జీవుడు గాఢనిద్రలో హృదయంలోనూ, మెలకువలోనూ, మేధస్సులోనూ వుంటాడంటారు. “నువ్వు పరిమితమైన నీటిబుడగవు కావు, అపరిమితమైన ఆత్మవు" అని గురువు తెలియజెప్పినప్పుడు, జీవుడు గుర్తించి, ప్రత్యేక వ్యక్తిత్వం వైపు మొగ్గడం తగ్గిస్తాడు. ఆ సత్యాన్ని తెలుసుకోవడమే, తాను అదిగా (THAT) వుండటం. అంటే, అసలు పరబ్రహ్మగా విశ్వచైతన్యంగా, శక్తిగా, ఆర్మగా నిలవడం. దాన్నే ఆత్మసాక్షాత్కారమంటారు. అంటే, నువ్వు, నువ్వుగా వుండటం !! -(సూరి నాగమ్మ)._*🕉️🚩🕉️

No comments:

Post a Comment