Saturday, June 22, 2024

****అన్ని సాధనలు ఆలోచనల అదుపుకే...

 🌹గుడ్ మార్నింగ్ 🌹ప్రతి చిన్నవిషయాన్ని ఎక్కువ ఆలోచించకుండా ఉండటం,
అనవసరముగా ఆలోచిస్తున్నాను అన్న ఆలోచనలను ఆపివేయగలగటం, జరిగిపోయిన విషయాలు పదే పదే జ్ఞాపకము వస్తుంటే ఆలోచించకుండా వదలివేయగలగటం,భవిష్యత్తు ఆలోచనలు ఎక్కువగా చేయకుండా ఉండటం, భయము, ఆదుర్దా కలిగించే ఆలోచనలు రాగానే పట్టుకు ముందుకు సాగకుండా ఆ ఆలోచనలు వద్దనుకొని విడిచి పెట్టగలగటం, అవసరమైనా, సుఖమైనా, దుఃఖమైనా, తగు మాత్రముగా ఆలోచించి వెంటనే, వదలివేయటం,--- ఇలా మనకు మనమే ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. పదే పదే వచ్చే ఆలోచనలు, ఆపలేని, అదుపు చేయలేని ఆలోచనలు మనిషిని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. మనం దృఢముగా నిర్ణయించుకొని - ఆలోచనలు గమనిస్తూ - అనవసరమైన వాటిని వెంటనే వదలటము - అవసరమైనవి అంత వరకే ఆలోచించి వదలటం - ముఖ్యముగా ఆలోచన వదలటం నేర్చుకుంటేఆధ్యాత్మికతలో చాలా సాధించినట్టే..ఇవి మనం అనుకుంటూ, గమనిస్తూ ప్రయత్నించి చేస్తూ ఉండాలి.... రోజు కాసేపు ఏ ఆలోచన లేకుండా - ఏ పని లేకుండా ప్రశాంతముగా, విశ్రాంతిగా కూర్చోవటం అలవాటు చేసుకోవాలి.మంచివైనా, చెడ్డవైనా మన పక్కవారి ఆలోచనలు వదలగలిగితే.... మన సొంత ఆలోచనలు కూడా వదలగలిగే అలవాటు అవుతుంది... మన ఆలోచన డాక్టర్ చేతిలోనో, గురువుల చేతిలోనో, దైవం చేతిలోనో లేదు --అది సంపూర్ణముగా మన చేతిలోనే వున్నది... ఆలోచనల అదుపును మించిన సాధన ఆధ్యాత్మికతలో లేదు. అన్ని సాధనలు ఆలోచనల అదుపుకే...🌹god bless you 🌹

No comments:

Post a Comment