*🙏భక్తుడికి కాపలాగా వున్న భగవంతుడు🙏*
*🙏🏹🌹🪷🏹🌹\|/🌹🏹🪷🌹🏹*
*🙏🏹తులసీదాసు శ్రీరాముడికి గొప్ప భక్తుడు. అతని జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. అలాంటి కథే ఇది.*
*🙏🏹ఒకసారి తులసీదాసు ఇంట్లో ఇద్దరు దొంగలు పడ్డారు. ఇంటి వెనుకవైపు గోడకు కన్నం వేసి లోనికి వచ్చారా దొంగలు. పూజ గదిలో వెండి పంచపాత్ర, ఇతర సామగ్రి సంచిలో పెట్టుకున్నారు. ఇంటి లోపలికి వచ్చిన కన్నంలో నుంచే బయటకు వెళ్లడానికి ప్రయత్నించారు.*
*🙏🏹కానీ బయట ఇద్దరు వ్యక్తులు విల్లంబులు పుచ్చుకుని కాపలా ఉండటం కనిపించింది. దీంతో లోపలికి వచ్చేశారు.*
*🙏🏹కాసేపయ్యాక మళ్ళీ బయటకు తొంగి చూస్తే.. ఆ కాపలాదార్లు అక్కడే ఉన్నారు. ఇలా బయటకు వెళ్లాలని చాలాసార్లు విఫలయత్నం చేశారు.*
*🙏🏹ఇంతలో తెల్లారింది. ఎప్పటిలాగే.. తులసీదాసు స్నానాదులు పూర్తి చేసుకుని పూజ గదిలోకి వచ్చాడు.*
*🙏🏹ఇద్దరు దొంగలు బిక్కముఖాలు వేసుకుని అక్కడ కనిపించారు.*
*🙏🏹'ఎవరు నాయనా మీరు?' అని అడిగారు తులసీదాసు.*
*🙏🏹'స్వామీ! మేము దొంగలం. మీ ఇంట్లో దోచుకోవడానికి వచ్చాం. మమ్మల్ని క్షమించండి స్వామీ' అని ప్రాధేయపడ్డారు.*
*🙏🏹వారిని ఊరడించిన తులసీదాసు.. 'దొంగతనం చేసి వెళ్లిపోకుండా తెల్లవార్లూ ఇక్కడే ఉన్నారేం?' అని ప్రశ్నించాడు తులసీదాసు.*
*🙏🏹'ఏం చెప్పమంటారు స్వామీ! ఈ గోడకు ఆవల ఇద్దరు సైనికులు విల్లంబులు ధరించి ఉన్నారు. రాత్రంతా మీ ఇంటికి కాపలా కాశారు. ఒకరేమో నల్లగా ఉన్నారు. మరొకతను ఎర్రగా ఉన్నారు. వారిని చూడగానే భయమేసి లోపలికి వచ్చేశాం. కాసేపయ్యాక వారిని మళ్లీ చూడాలనిపించింది. మళ్లీ బయటకు వెళ్లడానికి ప్రయత్నించాం. మళ్లీ వారిని చూడగానే భయం వేసి లోపలికి వచ్చేశాం. రాత్రంతా ఇదే జరిగింది స్వామీ' అని చెప్పుకొచ్చారిద్దరూ.*
*🙏🏹ఆ ఇద్దరెవరో తులసీదాసుకు అర్థమైంది. రామలక్ష్మణులే తన ఇంటికి కాపలాదార్లుగా వచ్చారని విశ్వసించాడు. ఈ వెండి వస్తువుల కోసం తన దైవం ఒక రాత్రంతా నిద్రలేకుండా ఉండిపోయాడని బాధపడ్డాడు తులసీదాసు. తను నమ్మిన దైవం సేవకుడిగా రావడంతో ఆ భక్తుడి హృదయం తల్లడిల్లిపోయింది. రాముడికి కష్టం కలిగించిన వస్తువులేవీ ఇంట్లో ఉండొద్దనుకున్నాడు. ఆ వెండి వస్తువులతో పాటు ఇంట్లోని విలువైన వస్తువులన్నీ దొంగలకు దానం ఇచ్చి.. అక్కడ్నుంచి పంపించేశారు.*
*🙏🏹ఆయన మాత్రం నిరాడంబరంగా రామసేవలో కాలం వెళ్లదీశాడు.*
సమస్థ లోకాన్ సుఖినోభవంతు ః
No comments:
Post a Comment