Monday, June 17, 2024

 *మాట...*

బంధాలు కలిపేది మాటే" 
బంధాలు తెంచేది మాటే" 

గాయాలు చేసేది మాటే" 
గాయాలు మానిపేది మాటే" 

ప్రాణం పోసేది మాటే" 
ప్రాణం తీసేది మాటే" 

మాటే నిన్ను గెలిపిస్తుంది.. 
మాటే నిన్ను ఓడిస్తుంది..

మనసులో విషయం నింపుకొని, 
మాటల్లో తేనెను కురిపిస్తూ 
మాయ చేసే మనుషులు నీ చుట్టూ ఉంటారు. 

నోటి నుండి వచ్చే మాట.. 
నర నరాలను మెలిపెడుతుంది

గుండెను చీల్చుతుంది, మనసును గాయపరుస్తుంది" 
మనిషిని జీవత్సవాన్ని చేస్తుంది...

మాటలే మనుషుల జీవితంలో
అమృతాన్ని నింపగలదు.. 
విషాన్ని చిందించగలదు.. 

చెయ్యి జారిన బంధం, 
నోరు జారిన మాట 
ఎప్పటికీ తిరిగి రావు!!

No comments:

Post a Comment