Wednesday, June 26, 2024

****కనిపించని ఏదో ఒక దివ్యశక్తి ఈ ప్రపంచాన్ని శాసిస్తోంది. ఆ శక్తినే దైవశక్తి అంటాం.*

 [26/06, 4:25 pm] pasupulapullarao@gmail.co: *కనిపించని ఏదో ఒక దివ్యశక్తి ఈ ప్రపంచాన్ని శాసిస్తోంది. ఆ శక్తినే దైవశక్తి అంటాం.*

అలాగే కనిపించని ఏదో శక్తి ఈ మనిషి జీవితాన్ని నడిపిస్తోంది. దాన్నే మనసు అంటాం. మనసు ఎక్కడుందో, ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. మన శరీరంలో రక్తం ప్రవహించినంత కాలం ఆ మనసు ఆజ్ఞలు జారీ చేస్తూనే ఉంటుంది.

మనం ఊపిరి తీస్తున్నంత కాలం, ఆ మనసు మనల్ని ఆడిస్తూనే ఉంటుంది. మనసు సముద్రం లాంటిది. సముద్రం అనంతమైనది. అపారమైనది. లోతైనది. సముద్రంలో జలచరాలుంటాయి. జలసంపదలుంటాయి. అమృతం, హాలాహలం అక్కణ్నుంచే పుట్టాయంటాయి పురాణాలు. సముద్రంలోంచి ఉప్పెనలొస్తాయి. సముద్రం అందమైనది కల్లోలమైనది.

చెలియలికట్ట దాటనంత వరకు సముద్రంతో ఏ ప్రమాదం ఉండదు. మనసూ అంతే!

మనసు ప్రపంచాన్ని ఉద్ధరించగలదు. ప్రపంచాన్ని భస్మం చెయ్యగలదు. మనిషిలో సత్వగుణం అమృతం. సత్వగుణం పెంచుకుంటే మనిషి వల్ల సమాజానికెంతో మేలు జరుగుతుంది.

తమోగుణం పెరిగితే జరిగేవన్నీ చెడ్డ పనులే! నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. ప్రపంచంలో విషయాలన్నీ మనసును చేరతాయి. మనిషికి కన్ను, ముక్కు, చెవి,నాలుక, చర్మం అనే పంచేంద్రియాలున్నాయి.

ప్రపంచంలో ప్రతి దృశ్యాన్నీ కన్ను ఆకర్షిస్తుంది. అందమైన వస్తువులన్నీ సొంతం కావాలనుకుంటుంది. చెవి మంచి, చెడు శబ్దాలను వింటుంది. మంచిని మాత్రమే గ్రహించి, చెడును విడిచిపెట్టగలిగితే మనిషి ఉన్నతుడవుతాడు.

ముక్కు సువాసనలే పీలుస్తుంది. దుర్వాసనలను ఎలాగూ పీల్చదు. జిహ్వ రుచులను కోరుతుంది. దీంట్లో తినరానివి తినకూడదని విడనాడితే మనసు నిర్మలమవుతుంది. చర్మం సుఖాన్ని కోరుతుంది. ఇలా పంచేంద్రియాలు మనిషి మనసును, మంచి చెడులవైపు ప్రేరేపిస్తాయి.ఆదిత్యయోగీ..

పంచేంద్రియాల్లో ప్రమాదకరమైనది నోరు. ఇది రెండు పనులు చేస్తుంది - తింటుంది, మాట్లాడుతుంది. రెండూ మితమైనప్పుడే మనసు సత్వ సంపన్నమవుతుంది. అప్పుడే సమాజ సేవ, ఆధ్యాత్మిక చింతన, అరిషడ్వర్గాల అదుపు పెరిగి మానవ జీవితానికి సార్థకత చేకూరుతుంది..
.
రామకృష్ణులు బద్ధజీవులకు తరుణోపాయం చెబుతున్నారు.  
 
సంసారమే జీవితమనుకునే బద్ధజీవులు, సాధుసాంగత్యం చెయ్యాలి.  నిర్జనప్రదేశానికి అప్పుడప్పుడూ వెళ్లి,  దైవచింతన చేయాలి.   విచారణ చేసుకోవాలి.  ‘ భక్తి విశ్వాసాలు తనకు భగవంతునిపై కలిగేటట్లు చెయ్యమని ‘ ఆ భగవంతుడినే వేడుకోవాలి. 

ఒక్కసారి భగవంతునిపై విశ్వాసం కలిగితే చాలు.  విశ్వాసానికి ఎలాంటి శక్తివున్నదో మన పురాణాలలో చెప్పి వున్నారు.   ఉదాహరణకు,  శ్రీరాముడు లంకకు చేరడానికి సేతువు కావలసి వచ్చింది.  అదే శ్రీరామనామం పై విశ్వాసం  వుంచి హనుమంతుడు, ఒక్క ఉదుటున  సముద్రాన్ని లంఘించి లంకకు చేరాడు.  అతడికి సేతువు అవసరం లేకపోయింది. 

ఇంకొకసారి, ఒక వ్యక్తి నీటిని దాటడానికి అవస్థ పడుతుంటే విభీషణుడు ఒక ఆకుమీద రామనామాన్ని వ్రాసి, ఆ వ్యక్తి ఉత్తరీయంలో కట్టి, ' నీవెంట శక్తివంతమైన మంత్రం వున్నది.  విశ్వాసంతో నీటిపై నడిచిపో  '  అని చెప్పాడు.   ఆ వ్యక్తి  ధైర్యంగా, సునాయాసంగా నీటిపై కొంతదూరం నడిచి,  తన ఉత్తరీయంలో ఏమికట్టాడో విభీషణుడు చూద్దామని విప్పిచూస్తే, రామనామం వ్రాసిన ఆకు కనబడింది.   వెంటనే ఆ వ్యక్తి నిరాశకులోనై,  ' అయ్యో !  ఇదేమిటి, వొట్టి రామనామము యిందులో వున్నది. ' అనుకున్నాడు.  ఆ మరుక్షణంలోనే ఆ వ్యక్తి నీటిలో మునిగిపోయాడు.ఆదిత్యయోగీ..

అని చెబుతూ,  అక్కడ వున్నవారికి నరేంద్రుడు ( పెద్దవాడైన తరువాత వివేకానందులు )  ని చూపిస్తూ,  ఈ బాలుడిని చూడండి.   ఇక్కడ యెంతో తుంటరిగా ఉంటాడు, తండ్రి దగ్గర పెద్దమనిషి తరహాలో మెలుగుతాడు.   తోటివారితో ఆడుకునేటప్పుడు, ఇంకో విధంగా ఉంటాడు.   ఇలాంటివారు నిత్యసిద్ధుల కోవకు చెందుతారు.  వీరు సంసార తాపత్రయాలలో ఎన్నటికీ బందీలుకారు.  

ఇలాంటివారికి,  యుక్తవయసు రాగానే అంతరాత్మ చైతన్యం కలుగుతుంది.   తిన్నగా భగవంతునిపై దృష్టి పెడతారు.  ఇతరులకు బోధించడమనే ధ్యేయంతోనే వీరువుంటారు.   లౌకికమైనవి వీరు ఏమీ ఆస్వాదించరు.  కాంతా కనకాల పట్ల అనాసక్తిని ప్రదర్శిస్తారు. 

అని చెబుతూ, రామకృష్ణులు హోమపక్షి అనేదాని ప్రవృత్తిని యిలా వివరిస్తున్నారు : 

‘ వేదాలలో హోమపక్షిని గురించి చెప్పబడింది.   ఆపక్షి ఆకాశంలో యెంతో ఎత్తులో ఎగురుతూ, ఆకాశంలోనే గుడ్లను పెడుతుంది.   ఆ గుడ్డు పక్షినుండి బయటకు రాగానే, నేల మీదకు జారడం మొదలుపెడుతుంది.  అప్పుడు, ఆగుడ్డు ఆకాశంలో యెంతో ఎత్తులో వున్నందువలన,  అది భూమికి చేరడానికి చాలా సమయం పడుతుంది. 

అయితే, దారిలోనే ఆ గుడ్డు పొదగబడి, అందులోనుండి చిన్నపక్షి బయటకు వస్తుంది.  అద్భుతం కదూ !   ఇంకా అద్భుతమైన విషయం ఏమిటంటే…

అది క్రిందకు జారుతుండగానే, దానికళ్ళు తెరుచుకుంటాయి.  రెక్కలు కూడా మొలుస్తాయి.   దానితో పాటు, తాను క్రిందికి జారి భూమిని తాకితే,  నుజ్జునుజ్జు అవుతాననే జ్ఞానం కూడా దానికి వస్తుంది.    అంతే !  క్షణం ఆలశ్యం చెయ్యకుండా ఆ పిల్లపక్షి,  రెక్కలు టపటపా కొట్టుకుంటూ,  రివ్వున పైకెగిరి,  తల్లి పక్షిని చేరుకుంటుంది.   ఆహా ! యెంత ఆశ్చర్యకరమైన, ఆనందకరమైన దృశ్యము. ‘ 

ఒకరోజు, రామకృష్ణులగదికి వుత్తరంవైపువున్న,  చిన్న వసారాలో ఒక అద్భుతం జరుగుతున్నది..
.
వినయానికున్న విలువ

సత్య భామ శ్రీకృష్ణునితో ఒకసారి’ స్వామీ ! రామావతారంలో సీత మీ భార్యకదా! ఆమె నాకంటే అందంగా ఉండేదా’ అని అడిగింది.
ఆ సమయంలో అక్కడే ఉన్న గరుడుడు “ప్రభూ, నాకంటే వేగంగా ఈ ప్రపంచం లో ఎవరైనా ప్రయాణించ గలరా”అన్నాడు. పక్కనే ఉన్న సుదర్శనుడు (సుదర్శన చక్రం) కూడా.. ‘పరంధామా! అనేక యుద్ధాల్లో పాల్గొని మీకు విజయాన్ని తెచ్చి పెట్టాను.నాతో సరితూగు వారెవరు స్వామీ అన్నాడు. ముగ్గురి మాటలూ విన్న నంద గోపాలుడు వారికి గుణపాఠం చెప్పాలను కున్నాడు.

దీర్ఘంగా ఆలోచించిన నారాయణుడు..
సత్యా, నువ్వు సీతగా మారిపో…నేను రాముణ్నవుతాను. గరుడా నువ్వు ఆంజనేయుని దగ్గరికి వెళ్లి సీతారాములు నిన్ను తీసుకు రమ్మన్నారని చెప్పి తోడ్కనిరా. చక్రమా !నా అనుమతి లేనిదే ఎవరూ లోపలికి ప్రవేశించ కుండా చూడు, అంటూ ముగ్గురి కీ మూడు బాధ్యతలు అప్పగించాడు.

గరుత్మంతుడు హనుమంతుని వద్దకు వెళ్లి.. సీతా రాములు రమ్మన్నారని చెప్పాడు. హనుమ ఆనందంతో పుల కించిపోతూ ‘నేను నీ వెనుకే వస్తాను. నువ్వు పద’ అని గరుత్మంతుని సాగనంపుతాడు. ఈ ముసలి వానరం రావడానికి ఎంతకాలమవుతుందో కదా అనుకుంటూ గరుడుడు రివ్వున ఆకాశానికి ఎగురు తాడు. కానీ.. ఆయన కంటే ముందే హనుమ ద్వారక చేరడం తో గరుత్మంతునికి మతి పోతుంది. సిగ్గుతో తలదించు కొని మౌనంగా ఉండి పోతాడు. ఇంతలో..’హనుమా’ అన్నపిలుపుతో పులకించిన ఆంజనేయుడు తన రాముని వైపు చూశాడు. ’లోనికి రావడానికి నిన్నెవరూ అడ్డగించలేదా’అని అడగ్గా..
హనుమ తన నోటి నుండి చక్రాన్ని తీస్తూ ‘ప్రభూ, ఇదిగో ఈయన నన్ను లోపలికి రాకుండా ఆపాడు.ఎన్ని చెప్పినా వినక పోవడంతో ఇక లాభం లేదని భావించి నోట్లో పెట్టుకొని మీ ముందు వచ్చి నిలిచాను’ అన్నాడు.ఆదిత్యయోగీ..

సుదర్శనుడు కూడా గరుడని వలె అవమానంతో నేలచూపులు చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో హనుమంతుని చూపు తన రాముని పక్కన కూర్చున్న స్ర్తీ పై పడి ‘స్వామీ !మీ పక్కనుండ వల్సింది నా తల్లి సీతమ్మ కదా! ఎవరీవిడ ప్రభూ’ అన్న మాటలు విన్నదే తడువుగా సత్యభామకు కూడా గర్వ భంగమై ప్రభువు కాళ్ళ మీద పడింది.
అలా కృష్ణపరమాత్ముడు ముగ్గురిలోనూ మొగ్గతొడిగిన గర్వాన్ని తుంచి వేసి వినయాని కున్న విలువేమిటో తెలియ చెప్పాడు...
.
మానవ జీవితం యొక్క ఉత్కృష్టత మరణం ఆసన్నమైనప్పుడు తెలుస్తుంది జీవితం ఎంత వృధాగా గడిపామో ఏది పొందలేక పోయామో, జీవించి ఉండగా అమృతత్వాన్ని పొందలేక 
 పోయామని అప్పుడు తెలుస్తుంది......*
.

No comments:

Post a Comment