Friday, June 28, 2024

హృదయ పరివర్తన ముఖ్యం

 *హృదయ పరివర్తన ముఖ్యం* 
                 ➖➖➖

*మనం మన కోరికలను తీర్చుకోవడం కోసం, దుఃఖములను, పాపములను పోగొట్టుకోవడం కోసం గుడికి పోవడం, తీర్థయాత్రలు చేయడం, పుణ్య నదులలో స్నానం చేయడం వంటివి చేస్తుంటాం.*

*అయితే ఇవన్నీ మంచివే, చేయవల్సినవే. కానీ వీటి అసలు అర్థం కోరికలు తీర్చుకోవడము కోసమో, పాపాలు పోగొట్టుకోవడం కోసమో మాత్రం కాదు!*

*ఇవన్ని హృదయ పరివర్తన రావడానికే తప్ప మరొకటి కాదు!! చేదు దోసకాయను తీసుకెళ్ళి పుణ్యనదులలో  ముంచితే దాని చేదు పోతుందా!!? ప్రతినిత్యం అనేక పాపములను చేస్తూ, మనసులో ఉన్న అసుర గుణాలును తొలగించుకోక గుడులు చుట్టూ తిరుగుతూ, పూజలు, పుష్కరాలు చేసేస్తే ఆ పాపాలన్నీ పోతాయా!?  దేవుడు అనుగ్రహిస్తాడా!??*

*ఇవి కాదు, హృదయంలో పరివర్తన ముఖ్యం. ఆ పరివర్తన రానిదే ఎన్ని పూజలు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా ప్రయోజనం ఏమీ లేదు..*
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏

No comments:

Post a Comment