Monday, June 17, 2024

అదే ముక్తి.....

 [6/15, 08:43] +91 73963 92086: పుట్టిన ప్రతి జీవికి ప్రారబ్దము తప్పదు. ఈ మాయలో పిడికెడు  ప్రారబ్ధం తో ప్రతిఒక్కరూ వస్తున్నారు. అందులో పుట్టుక మరణం స్థితి గురించి నిర్ధారించి ఉంటుంది. ముఖ్యంగా ఏ ఏ కర్మలను ఆచరించాలి ,అనుభవించాలి, అనేది తెచ్చుకున్న టువంటి కర్మ లో అది ఏర్పడుతుంది .ఈ జన్మలో నీవు కొత్తగా ఏది తీసుకోవు. యేది జరగవలసి వున్నదో అది జరిగి తీరుతుంది. నీవు వద్దన్నా అది ఆగదు, మారదు అయితే నీవు దేహము కాదని .నేనంటే ఆత్మ  జ్ఞానం అని నీవు గుర్తించినప్పుడు, దేహం స్ఫురణ పూర్తిగా కోల్పోయి, నీవు ఆత్మగానే నిలిచి ఉంటావు. ఇక్కడ ప్రారబ్ద కర్మలు మార్చటానికి  ఈ మాయలో నీకు వీలు లేదు. అవకాశమూ లేదు. ఉదాహరణకి దేహము ,తల్లిదండ్రులు ,సంసారం, పరిసరాలు . వీటిని ఎలా మారుస్తారు?  అది ఎట్లా ఉంటుంది అంటే విల్లుని విడిచిన బాణం అలాంటిది. దానికి చికిత్స లేదు .ఎన్ని పూజలు చేసినా, ఎన్ని  వ్రతములు ఆచరించినా, , ఎన్ని క్రతువులు చేసినా మారదు. మారదు మారదు .అయితే నీవు దేహము కాదు .నేనంటే జ్ఞానమని తీవ్ర వైరాగ్యముతో, ఇది అసత్యమని గుర్తించి ,ఆత్మ విచారము చేసినప్పుడు ,అంటే నేను ఎవరిని? అని విచారించినప్పుడు, అక్కడ ఆలోచించే వాడు గానీ, ఆలోచనలు కానీ , ఇతరులు గానీ  మరేదీ కానీ , ప్రపంచము గాని, సంసారము  కానీ  యేదీ ప్రకాశించదు. కారణం అవన్నీ ఆలోచనలు. అన్యత్వం  ఏ ఒక్కటి ప్రకాశించదు. అంతా  అదృశ్యమైపోతుంది .ఆదిత్యయోగీ.నీవు నీవు గా నిలిచి ఉంటావు.  అహం స్ఫురణ గా జ్ఞానమే నిలిచి ప్రకాశిస్తుంది.  ముఖ్యంగా ఇప్పుడు నీవు ఒక పని కొట్టు అనుకున్నప్పుడు ఇది ఎటు పోతే నీకెందుకు ? ఎందుకు నీకు దేహం మీద అభిమానం?  పూర్తిగా అదృశ్యమై పోతుంది.  జనన మరణాలకి అతీతంగా ఉంటావు. అంటే జ్ఞాన స్వరూపము గా  ,నేను అహం స్ఫురణ ప్రకాశిస్తుంది. ఆ ఉన్నాను అన్న ఎరుక  కి ఉదయా స్తమానములు లేవు. .కనుక ప్రతి ఒక్కరూ ఏమంటున్నారు  అంటే, నాకు,  నేను ఏమి అనుకోకపోయినా ఆలోచనలు వస్తూనే ఉన్నాయి ఎందుకు? కారణం నీ మనస్సు లో ఇదంతా నిజము అని, వాటి వెంట పరిగెడుతుంది. ఈ దేహానికి మరణము తప్పదు.  అది నీవు కానప్పుడు ఎందుకు దాని గురించి  యోచన? పుట్టిన దానికి మరణము తప్పదు .సరే గతించిన  దానికి తిరిగి పుట్టక తప్పదు.  అని కూడా కృష్ణ పరమాత్మ చెప్పుడం జరిగింది కదా!  కనుక రమణ మహర్షి వారి చేతి మీద ఒక వ్రణం వచ్చింది. మీరు దీన్ని నయం చేసుకో లేరా? అంటే , చెప్పేవాడు  లేదన్నారు. అటువంటి స్థితిని ఏర్పడటానికి కారణం స్వరూప జ్ఞానం తప్ప మరొకటి లేదు  వారికి. నాయనా నీ ప్రారబ్ధం ని  ఎవరు మార్చలేరు. దాని జోలికి పోవద్దు .నీవు నీవుగా మిగిలి వున్నప్పుడు ,ఆత్మ స్థితిలో  నిలిచి ఉన్నప్పుడు ,ఈ దేహము మనసు జరుగుతున్నటువంటి మార్పులు నిన్ను అంటవు. తెరమీది బొమ్మలలాగా!  రమణ మహర్షుల వారు ఈ సందర్భంలో ఒక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది అదేమిటంటే పరమేశ్వరుడు జీవులను కర్మానుసారముగా ఆడిస్తాడు. ఏది జరగ వలది వుందో  అది జరిగి తీరుతుంది. నీవు ఎంత ప్రయత్నం చేసినా అది ఆగదు. మరి ఏం చేయాలి ? మౌనమే శరణ్యం అని చెప్పుకొచ్చారు .నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యమని గుర్తించు .అంతేగాని ఈ దేహాన్ని ఎ లా నిలబెట్టుకోవాలి?రోగాల నుంచి  ఎలా బయటపడాలి ?  అన్న ఆందోళనపడి ప్రయోజనం లేదు. ఎందుకు అంటే  నీవు దేహం  కాదు. నీవు నీవు గా నిలిచి ఉండ టమే. మౌనమే శరణ్యం...
.
దేవుడు శరీరధారి కాడనే’ వేద విద్వాంసులు అంటారు.
వేదం ఈశ్వరీయం. అది మానవకృతం కాదు. దేవుడు కర్మలు చేయడు, జీవుడు చేస్తాడు. కర్మలు చేసేవారికి ‘శరీరధారణ’ తప్పదు. కర్మల ఫలాలను అనుభవించడానికి జన్మలెత్తాలి, శరీరధారులం కావాలి. శరీరం వల్ల కలిగే లాభం ఏమిటంటే దానితో కర్మలు చేయవచ్చు. వాటి ఫలాలను అనుభవించవచ్చు. దేవునికి కర్మలు చేయవలసిన పని లేదు.

అనుభవించవలసిన పని అంతకన్నా లేదు. కర్మ చేసేవాడిని ‘కర్త’ అంటారు. కర్మఫలాన్ని అనుభవించేవాడిని ‘భోక్త’ అంటారు. కర్తృత్వం ఎవరిదో భోక్తృత్వం కూడా వారిదే. దేవునిలో ‘కర్తృత్వ భోక్తృత్వాలు’ లేవు. వేద విహిత కర్మలనే చేయాలని ఈశ్వరాజ్ఞ. వేద విరుద్ధ కర్మలను చేస్తే దుఃఖం తప్పదు. జీవునికి కర్మ ఫలాలిచ్చేవాడు దేవుడే. అందుకే దేవుడవసరం. కర్మఫలాలను అనుభవించడానికి మొదట జీవునికి శరీరం కావాలి. తర్వాత అన్నం, ఆ పిమ్మట అనువైన ప్రపంచమూ కావాలి. ఇదే, దేవుడు చేసే పని. దేవుడు సృష్టి రచన చేయకపోతే మనం శరీరధారులం కానే కాం. కర్మలు చేయనే చేయం. సుఖదుఃఖాలను అనుభవించే అవకాశం ఉండనే ఉండదు. పాపపుణ్యాల ప్రశ్నే ఉద్భవించదు. కనుక, జీవుని స్వభావం దేవుని కంటే విలక్షణమైంది.

‘కోరిక, ప్రయత్నం, ద్వేషం, సుఖం, దుఃఖం, జ్ఞానం’- ఈ ఆరు గుణాలు జీవుణ్ని ఆశ్రయించి ఉంటాయి. అందుకే, అతడు మాటిమాటికీ శరీరధారి అవుతాడు. ఒక వస్తువు కావాలని కోరడం, లభించకపోతే ద్వేషభావం కలగడం, వస్తు సంపాదనకు ప్రయత్నించడం, సాధించిన దానితో సుఖపడటం లేదా దుఃఖించడం, సామాన్య జ్ఞానాన్ని కలిగి ఉండటం.. వంటివన్నీ జీవుని విషయంలోనే చూస్తాం. దేవుడు, జీవుడు, ప్రకృతి- ఉనికిగల పదార్థాలు. వీటికీ ఎన్నడూ నాశం లేదు. దేవుడు ‘సృష్టి, స్థితి, లయ’లకు కర్త.
[6/15, 08:43] +91 73963 92086: ప్రపంచానికి స్వామి. దేవుడు ప్రపంచాన్ని మించి ఉన్నాడు. జీవుడు ప్రపంచంలో భాగస్వామి మాత్రమే. దేవుడు సర్వవ్యాపకుడు, సార్వదేశికుడు. జీవుడు ఏకదేశి. దేవుడొక్కడే, జీవులనేకం. దేవునిలోనే ఈ విశ్వమంతా ఉంది. అంతటా వ్యాపించి ఉన్న దేవునికి అవయవాలను ఎక్కడినుంచి తెచ్చిపెట్టగలం? కనుక, దేవునికి శరీరం అక్కర్లేదు. ‘సపర్యగాత్‌ శుక్రమకాయ మవ్రణ మస్నావిరం...’ అన్నది ‘ఈశావాస్యోపనిషత్తు’. దీని ప్రకారం దేవునికి జీవుని వలె మూడురకాల శరీరాలు లేవు. ‘కారణ శరీరం’, ‘సూక్ష్మ శరీరం’, ‘స్థూల శరీరం’- ఇవేవీ లేనివాడే దేవుడు. కారణజన్ముడు జీవుడేగాని దేవుడు కాడు. జన్మ ఎత్తడానికి దేవునికి ఏ కారణమూ లేదు. జీవునికి మాత్రమే జన్మ ఎత్తే అధికారం ఉంది.ఆదిత్యయోగీ..

దేవుడు ఎప్పటికప్పుడు జీవుల చేష్టల (కర్మలు)ను గమనిస్తుంటాడు. వాటికి అనుగుణమైన విధంగా ఫలాలిస్తుంటాడు. అందుకుగాను అతడు జీవుల అంతరంగాల్లోను అంతర్యామియై ఉంటాడు. పరమాణువు కంటే సూక్ష్మమైనవాడు. ప్రపంచ పదార్థాలన్నింటా ‘అదృశ్యరూపం’ (అవ్యక్తంగా)లో ఉంటాడు. ‘ఓంకార వాచ్యుడై’ కొలువున్నాడు.
దేవునిలో ‘అసంఖ్యాక ప్రాణుల శిరస్సులు, నేత్రాలు, పాదాలు ఉన్నట్లు’ తెలుస్తున్నది. కానీ, అతనికి శరీరం ఉన్నట్లు లేదు. భూ మండలాన్ని అన్ని వైపుల నుంచి స్పృశిస్తూ, సమస్త జగత్తును మించి ఉన్నాడని తెలుస్తున్నది. అంతటా ఉన్నవాడే మనలోనూ ఉన్నాడు. దేహం లేనివాడే దేహంలో ఉంటాడు. మనం శరీరధారులం కనుక, మన హృదయ కమలాల్లో అంతరాత్మ రూపంలో ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి ఉపాసించి, తరిద్దాం...
.
ఆశ్రమ వేదపాఠశాల కట్టడం పూర్తయ్యాక ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఒకసారి ఆశ్రమ సేవకుడు ఊరికే భవనం పైకి వెళ్ళాడట. ఆ సమయంలో మిద్దె మీద నేలపై భగవాన్ పడుకుని అటూ ఇటూ పొర్లుతున్నారట! ఆశ్రమవాసులు అనుకున్న ఏమిటంటే - వేదపాఠశాల భవనానికి భగవాన్ 'శక్తి ప్రదానం' చేశారని!

  అలాగే ఆశ్రమ ఆఫీసు గది ప్రారంభోత్సవంలో ఎవరూ ఊహించని విధంగా "వేద పారాయణ జరిగేటప్పుడు సమాధిలోకి వెళ్ళి, నిశ్చలంగా కూర్చుండి పోయినట్లుగా - ఆశ్రమ సర్వాధికారి కుర్చీలో కూర్చుని పదిహేను నిమిషాలపాటు అలాగే ఉండిపోయారట" భగవాన్...
.
జ్ఞానంతో కూడిన భక్తే నిజమైన శరణాగతి. 
జ్ఞానం ఎలా లభిస్తుంది? 
తన్ను తాను విచారించుకోవడం చేత. 
కనుక సాధన విచారణతో మొదలై సమర్పణతో ముగుస్తుంది.

సముద్రాన్ని చేరుకున్న నది, తన ప్రవాహాన్ని కోల్పోయి సముద్రంలో కలిసిపోయినట్లే, 
పరమాత్మ గురించి నిరంతరం ధ్యానిస్తూ ఉన్న మనసు కూడా పరమాత్మమయం అయిపోతుంది. 

అదే ముక్తి.....*

No comments:

Post a Comment