ఒక శిష్యుడు గురువు దగ్గరకు వెళ్ళి
గురువుగారు నా జీవితంలో సంతోషమే లేదు
అని బాధ పడ్డాడు.
గురువు ఆ శిష్యుడితో ఒక పూలతోటకూ తీసుకెళ్లి
సీతాకొకచిలుకను పట్టుకుని రమ్మన్నాడు.
ఎంత వెంబడించినా సీతాకొక దొరకలేదు.
గురువుగారు ఆ శిష్యుడితో సర్లే మనం తోట అందాన్ని అనుభవిద్దాం అని అన్నారు.
ఇద్దరూ వెళ్ళి తోట మధ్యలో నిలుచిని ఆ పూల పరిమళాన్ని అవి విచ్చుకుంటున్న అందాన్ని అశ్వాదిస్తూ ఉంటే ఒక్క సారిగా అక్కడ ఉన్న సీతాకోక చిలుకలన్ని ఎగిరి వచ్చి వారి భుజాన వాలాయి.
చూసావా సంతోషాన్ని వెతుకుతూ నువ్వు పరిగెత్తడం కాదు.
నువ్వున్న చోట ఉన్న సంతోషాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టు
ఇంకా సంతోషాలన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి.
*ఇదే జీవితం....!!*
No comments:
Post a Comment