_*💫 మౌనమే నిరంతర సంభాషణ, అనుగ్రహం !! ⚜️*_
➖➖➖➖➖➖✍️
*_-శ్రీరమణమహర్షి బోధ_*
®®®®®®®®®®®®®®
*_⚡ఒక వ్యక్తి భగవాన్ శ్రీరమణమహర్షిని మీరు గోచీ పెట్టుకుని అరుణాచలము కొండమీద కూర్చుని ఉంటారు. ఎక్కడకూ వెళ్ళరు. మీ వలన లోకమునకు ఏమిటి ప్రయోజనము ? అని అడిగాడు._*
*_అప్పుడు మహర్షి, అన్ని చోట్లకు తిరుగుతూ చేసేది సహాయం అనుకుంటున్నవా అన్నారు. బోధ వినపడుతోంది. కనపడుతుంది. ఆశీస్సులు కనపడవు. మరలా మహర్షి నేను సహాయం చేయడం లేదని నీవు ఏలా నిర్ణయిస్తావు._*
*_నా వలననే కాదు లోకములో ఎప్పుడైనా ఒక గురువు శరీరముతో ఉండడమే ప్రయోజనము. గురువు శరీరముతో ఉన్నాడు కనక మాట్లాడతాడు. ఎప్పటికైనా గురువు నోరు విప్పి మాట్లాడిన మాట అజ్ఞానము అనే చీకటిని తొలగ కొడుతుంది. మౌనమే నిరంతర సంభాషణ, అనుగ్రహం._*
*_తాను శరీరము కాదన్న సత్యము ఆయనకి పూర్తిగా తెలుసు. శరీరము పడిపోతున్నా, ఖేదపడుతున్నా_*
*_సాక్షీ మాత్రముగా చూసి తన కర్తవ్యమును నిష్టతో నిర్వహిస్తాడు. గురువు శరీరము పడిపోతే లోటు ఆయనకి కాదు. ఆయన అనంతత్త్వమును పొంది ఆత్మగా నిలబడతాడు._*
*_గురువు శరీరముతో లేని కారణము చేత జ్ఞానబోధ, అనుగ్రహం ఇచ్చే వ్యక్తి ఇంక శిష్యులకు దొరకడు. శిష్యుల జీవితమునకు ఉన్నతమైన పథము లభించదు. గురువు శరీరముతో ఉండడమే అందరికీ అదృష్టము. ఆయన శరీరము అలసిపోయి రోగగ్రస్తము అవకుండా, డస్సిపోకుండా, శరీరము పడిపోకుండా, రక్షించుకోవడమే శిష్యులు ఆయనకి చేసే శుశ్రూష అని చెప్పారు. శరీరంతో ఉన్న గురువు ముక్తిని ప్రసాదించగలడు._*
*_వివరణ >_*
*_ప్రతి ఒక్కరు పుట్టుక లక్ష్యం, మనం చేయవలసిన పని ఏమిటంటే శరీరం ఉండగనే భగవంతున్ని దర్శించి జన్మరాహిత్యం పొందడం. అంత వరకు మనం భూమి పైకి వస్తూ పోతుంటాము. మనం ఎంత వరకు అందుకు న్యాయం చేస్తున్నామో మనకు మనం ప్రశ్నించుకోవాలి. జన్మ లేకుండా చేసుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. శరీరంతో ఉన్న గురువు లభించాలి. ఆ గురువు దైవకృపతో లభిస్తాడు. దైవకృప లభించాలంటే దైవస్మరణ, పూజ, ఫలితం ఆశించని పుణ్యకర్మల చేత దైవకృప లభిస్తుంది. దైవమే సత్యం, నిత్యం, శాశ్వతం. మనం చేర వలసిన మన నిజనివాసం._*
*_మరి దైవం ముక్తి ఇవ్వలేడా ?_*
*_లేదు. మనం సొంత సాధనలతో కూడా పొందేది కాదు. నీవు చేసే పనుల వలన దైవం సంతృప్తి చెందినవుడే దైవం గురువుగా లభిస్తాడు. గురువు ద్వారానే అది సాధ్యం అవుతుంది._*
*_ఆ గురువు గతజన్మలో లభించి ఉండచ్చు. లేదా ఈ జన్మలోనైనా ఉండచ్చు. గురువు మౌనంగా శక్తిపాతంతో మన కర్మలు, కోరికలు, వాసనలు కొద్దికొద్దిగా తొలగిస్తూ మన మనసును (ఆత్మను) భగవంతుని చెంతకు చేరుస్తాడు. దైవకృప లభిస్తే అత్యంత సులభం. లభించకపోతే అత్యంత దుర్లభం, మహా కష్టం._*
*_శరీరం ఉన్న సద్గురువుతోనే అది సాధ్యం అవుతుంది. గురు సాంగత్యంలో 80 సార్లు వెళ్ళాలి. కొన్ని నిమిషాలు ఉండాలి. అప్పుడే మన జీవితం సంపూర్ణం అవుతుంది._*
*_తెలిసి, తెలియక చేసే అన్నీ ప్రయత్నాల ఫలితమే సాధుసాంగత్యం లభించడం. మనము గురు చెంతకు 40 సార్లు వెళ్ళడం వలన 3, 4 జన్మలు పడుతుంది. 20 సార్లు వెళ్లడం వలన 5, 6 జన్మలు పడుతుంది. చివరికి శరీరం ఆత్మ వేరువేరు అనే అనుభవం పొంది దైవాన్ని చేరుతాము._*
*_ఆశీస్సులు పొందిన వారిని గురువులే పిలిపించుకొంటారు. అటువంటి భగవత్ సాక్షాత్కారం పొంది శరీరంతో ఉన్న సద్గురు లభించకపోతే ఎన్ని జన్మలకు ప్రపంచం, వస్తువులు, మనసు, కోరికలు నుండి బయట పడి శాశ్వతశాంతి పొందుతామో తెలియదు. ఇది ఏ కాలానికైనా, ఏ జన్మకైనా ప్రతిఒక్క ఒక్కరి, సాధకుని మార్గం !!_*
*_🪷 రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయత కూడా నేర్పండి ప్లీజ్..._*
🙏🇮🇳🎊🪴🦚🐍🔱⚜️
No comments:
Post a Comment