తాజా సర్వే : తిన్న తర్వాత నడక మంచికా.. చెడుకా..!
ఊరికే అలా తిని కూర్చోపోతే.. అలా నాలుగు అడుగులు వేయొచ్చుగా.. తిన్నది అరుగుతుంది.. అనే మాట ఎవరో ఒకరి నోట మనం రోజూ వింటూనే ఉంటాం. తిన్న తర్వాత 100 అడుగులు వేస్తే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుందని ఆరోగ్యంగా ఉంటారని ఆయుర్వేదంలోనూ ఉంది. మరీ అల్లోపతి వైద్యులు ఏమంటున్నారు. తిన్నాక నడవాలా.. వద్దా..
నడక వల్ల ఎన్నో లాభాలున్నాయని ఆరోగ్యానికి నడక మంచిదని మనందరికీ తెలిసిందే. మరి తిన్నాక నడవడం వల్ల కూడా లాభాలు ఉన్నాయా.. అంటే 100 శాతం ఉన్నాయంటున్నారు వైద్యులు. ఆయుర్వేదం ప్రకారం ప్రతి భోజనం తర్వాత 100 అడుగులు వేయాలి.
దీని వల్ల జీర్ణమంట తగ్గిపోతుంది. సరైన భోజన జీర్ణక్రియ ఉంటుంది. జీర్ణవ్యవస్థ గుండా ఆహారం మరింత వేగంగా కదలడానికి సహాయ పడుతుంది. అజీర్ణం ఉబ్బరం నొప్పి వంటి ఎన్నో సమస్యలను నడక పరిష్కరిస్తుంది.
భోజనం చేసిన తర్వాత వంద అడుగులు వేయడం వల్ల చక్కెర స్తాయిలు నియంత్రణలో ఉంటాయని కూడా వైద్యశాస్త్రంలో నిరూపించబడింది. నడక వల్ల కండరాల ద్వారా గ్లూకోజ్ ను ఇంధనంగా ఉపయోగించడానికి సహాయపడుతుంది. ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది కూడా. ఇప్పటికే డయాబెటీస్ ఉన్న వారికి గానీ వచ్చే ప్రమాదం ఉన్న వారికి గానీ నడక ఎంతో ఉపయోగకరం.
అధిక క్యాలరీలను ఖర్చు చేసేందుకు నడక చక్కని మార్గం. భోజనం తరువాత కాసేపు నడిస్తే శరీర బరువు కూడా అదుపులో ఉంచేందుకు సహకరిస్తుంది. నడకతో పాటు తేలికపాటి వ్యాయామం చేస్తే మానసిక స్థితి మెరుగవుతుంది.
ఎండార్ఫిన్లలను విడుదల చేయడానికి సహకరిస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గడం ద్వారా జీర్ణక్రియపై మంచి ప్రభావం పడుతుంది. నడక నిద్రను కూడా మెరుగు పరుస్తుంది. చక్కగా హాయిగా నిద్ర పోయేందుకు సహకరిస్తుంది.
No comments:
Post a Comment